Dana Kishore
-
ఫోర్త్‌సిటీకి మెట్రో
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోరైలు రెండోదశ పనులకు ప్రభుత్వం పరిపాలన ఆమోదం తెలిపింది. రెండోదశ ప్రాజెక్టులో భాగంగా రూ.24,269 కోట్ల అంచనా వ్యయంతో 76.4 కిలోమీటర్ల మేర ఐదు కారిడార్ల (పార్ట్–ఏ కింద)ను నిర్మించనున్నారు. పార్ట్–బీలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఫోర్త్ సిటీ (స్కిల్స్ యూనివర్సిటీ)వరకు ఆరో కారిడార్‌ను నిర్మించనున్నారు. దీనికి రూ.8 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. దీనికి సంబంధించిన అలైన్మెంట్, నిర్మాణ వ్యయం ఇతర అంశాలపై సర్వే జరుగుతోంది. ఈ మేరకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. జాయింట్ వెంచర్‌గా నిర్మాణం రెండోదశ మెట్రో ప్రాజెక్టును దేశంలోని ఇతర నగరాల తరహాలో కేంద్ర ప్రభుత్వంతో కలిసి 50:50 జాయింట్ వెంచర్ (జేవీ)గా నిర్మించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుతం నడుస్తున్న 69 కిలోమీటర్ల తొలిదశ మెట్రోరైలు ప్రపంచంలోనే పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) విధానంలో నిర్మించిన అతిపెద్ద ప్రాజెక్టు. ఐదు కారిడార్లలో 76.4 కిలోమీటర్ల రెండోదశ మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణానికి అంచనా వేసిన రూ.24,269 కోట్లలో తెలంగాణ ప్రభుత్వం వాటా రూ. 7,313 కోట్లు (30 శాతం) కాగా, కేంద్ర ప్రభుత్వం వాటా రూ.4,230 కోట్లు (18 శాతం), జపాన్ ఇంటర్నేషన్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా), ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ), న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) మొదలైన ఆర్థిక సంస్థల వాటా రూ.11,693 కోట్లు (48 శాతం), మరో 4 శాతం అంటే రూ.1,033 కోట్లను పీపీపీ విధానం ద్వారా సమీకరిస్తారు. ఫోర్త్‌సిటీ మెట్రో కనెక్టివిటీకి రూ.8 వేల కోట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించిన ఫోర్త్ సిటీ మెట్రో కనెక్టివిటీ లైన్ కోసం అనేక ఆకర్షణీయ ఫీచర్లతో వినూత్న రీతిలో డీపీఆర్ తయారు చేస్తున్నట్లు పురపాలక శాఖ తెలిపింది. ఈ కొత్త లైన్ డీపీఆర్ మినహా మిగిలిన ఐదు కారిడార్లకు సంబంధించిన డీపీఆర్‌ను త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని అధికారులు తెలిపారు. ఫోర్త్ సిటీ మెట్రో కనెక్టివిటీకి సుమారు రూ.8,000 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. దీంతో మొత్తం రెండో దశ ప్రాజెక్ట్ కు అయ్యే వ్యయం దాదాపు రూ.32,237 కోట్లు (రూ.24,237 కోట్లు + రూ. 8,000 కోట్లు)గా అవుతుంది. కొత్త హైకోర్టును కలుపుతూ.. మెట్రో రైల్ రెండో దశ డీపీఆర్‌ల రూపకల్పనపై సీఎం రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితం పురపాలక శాఖ సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మెట్రో రెండో దశ కారిడార్ల అలైన్మెంట్, స్టేషన్లు, ఇతర ముఖ్యమైన ఫీచర్లు తదితర అంశాల గురించి ప్రెజెంటేషన్ ఇచ్చారు. హెచ్ఎండీఏ కోసం సిద్ధం చేస్తున్న సమగ్ర మొబిలిటీ ప్లాన్ (సీఎంపీ) ట్రాఫిక్ అధ్యయన నివేదిక తరువాత డీపీఆర్‌లకు తుదిరూపం ఇచ్చారు. మెట్రో మార్గాల్లో ట్రాఫిక్ అంచనాలను సీఎంపీతో క్రాస్–చెక్ చేయాల్సి ఉంటుంది. కేంద్రానికి డీపీఆర్‌లను సమర్పించడానికి ఈ అధ్యయనం తప్పనిసరి. దీంతో మెట్రో అలైన్మెంట్లు, స్టేషన్లు ఇతర అంశాలపై పూర్తిస్థాయిలో సర్వే చేసి, నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేశారు. ఆ డీపీఆర్‌లకు సీఎం ఆమోదం తెలిపారు. కాగా గతంలో ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశంలో నిర్ణయించిన ప్రకారం ఎయిర్పోర్ట్ మెట్రో అలైన్మెంట్ ను ఇప్పుడు ఆరామ్‌ఘర్, 44వ నెంబర్ జాతీయ రహదారి (బెంగళూరు హైవే)లోని కొత్త హైకోర్టు ప్రాంతం మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకునేలా ఖరారు చేశారు. ఐదు కారిడార్ల అలైన్మెంట్లు ఇలా.. కారిడార్ –4 (ఎయిర్పోర్ట్ మెట్రో కారిడార్): నాగోల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు దాదాపు 36.6 కి.మీ. ఎల్బీ నగర్, కర్మన్‌ఘాట్, ఒవైసీ హాస్పిటల్, డీఆర్డీఓ, చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, ఆరామ్‌ఘర్, న్యూ హైకోర్టు, శంషాబాద్ జంక్షన్ ద్వారా జాతీయ రహదారి మీదుగా ఈ మార్గం ఉంటుంది. ఇది నాగోల్, ఎల్బి నగర్, చంద్రాయన్ గుట్ట వద్ద ఉన్న అన్ని మెట్రోలైన్లకు అనుసంధానం చేయబడుతుంది. 36.6 కి.మీ పొడవులో 35 కి.మీ పిల్లర్ల మీద (ఎలివేటెడ్ ), 1.6 కి.మీ మార్గం భూగర్భంలో వెళ్తుంది. విమానాశ్రయం వద్ద భూగర్భ స్టేషన్ ఉంటుంది. ఈ మార్గంలో మొత్తం 24 స్టేషన్లు ఉంటాయి కారిడార్ 5: రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుంచి కోకాపేట నియోపోలిస్ వరకు వరకు ఈ మార్గం ఉంటుంది. బయోడైవర్సిటీ జంక్షన్, ఖాజాగూడ రోడ్, నానక్ రామ్ గూడ జంక్షన్, విప్రో సర్కిల్, ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్, కోకాపేట నియోపోలిస్ వరకు నిర్మిస్తారు. ఇది మొత్తం పిల్లర్లపైనే ఉండే ఎలివేటెడ్ కారిడార్. ఇందులో 8 స్టేషన్లు ఉంటాయి. కారిడార్ 6 (ఓల్డ్ సిటీ మెట్రో): ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణ గుట్ట వరకు ఇది ఉంటుంది. ప్రస్తుతం జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న గ్రీన్ లైన్ పొడిగింపుగా 7.5 కి. మీ మేర నిర్మించబడుతుంది. ఓల్డ్ సిటీలోని మండి రోడ్, దారుల్షిఫా జంక్షన్, శాలిబండ జంక్షన్, ఫలక్‌నుమా మీదుగా ప్రయాణిస్తుంది. ఈ కారిడార్ సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్ నుంచి 500 మీటర్ల దూరం నుంచి వెళ్తున్నప్పటికీ చారిత్రక ప్రాముఖ్యత కారణంగా ఆ పేర్లనే స్టేషన్లకు పెట్టాలని నిర్ణయించారు. ఈ రూట్లో ఉన్న రోడ్లను విస్తరిస్తారు. రోడ్డు విస్తరణ, మెట్రో అలైన్మెంట్లో దాదాపు 1100 ఆస్తులు ప్రభావితమవుతాయి. ప్రభావితమైన 400 ఆస్తులకు ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ చేశారు. ఈ మార్గంలో దాదాపు 103 మతపరమైన, వారసత్వ, ఇతర సున్నితమైన నిర్మాణాలు ఉన్నాయి. వాటన్నింటికీ తగిన ఇంజినీరింగ్ పరిష్కారాలు చూపుతారు. మెట్రో పిల్లర్ స్థానాల సర్దుబాటు ద్వారా ఆ నిర్మాణాలకు నష్టం కలుగకుండా చూస్తామని అధికారులు తెలిపారు. ఈ కారిడార్ దాదాపు 6 స్టేషన్లతో పూర్తి ఎలివేటెడ్ మెట్రో. కారిడార్ 7: ముంబై హైవేపై రెడ్ లైన్ పొడిగింపుగా నిర్మించబడుతోంది. ప్రస్తుతం ఉన్న మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి పటాన్చెరు వరకున్న 13.4 కి.మీ ఈ మెట్రోలైన్ ఆలి్వన్ క్రాస్ రోడ్, మదీనాగూడ, చందానగర్, బీహెచ్ఈఎల్, ఇక్రిసాట్ మీదుగా వెళ్తుంది. ఇది దాదాపు 10 స్టేషన్లతో ఉండే పూర్తి ఎలివేటెడ్ కారిడార్. కారిడార్ 8: విజయవాడ హైవేపై ఎల్.బి నగర్ నుంచి ప్రస్తుతం ఉన్న రెడ్ లైన్ పొడిగింపుగా హయత్‌నగర్ వరకు 7.1 కి.మీ మేర ఈ లైన్ నిర్మిస్తారు. ఈ లైన్ చింతలకుంట, వనస్థలిపురం, ఆటోనగర్, ఆర్టీసీ కాలనీ మీదుగా వెళుతుంది. ఇది కూడా పూర్తిగా ఎలివేటెడ్ కారిడార్. ఈ లైన్లో 6 స్టేషన్లు ఉంటాయి. -
బలవంతంగా ఖాళీ చేయించం.. ఒప్పించి పంపిస్తాం: రంగనాథ్
సాక్షి, హైదరాబాద్: మూసీ నది రివర్ బెడ్‌తోపాటు బఫర్ జోన్లో 10,600 ఇళ్లు, నిర్మాణాలు ఉన్నట్టు గుర్తించామని.. ఆ ఇళ్లను ఖాళీ చేయించి కుటుంబాలను 23 ప్రాంతాలకు తరలిస్తామని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ తెలిపారు. రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా గుర్తించిన ఇళ్లను ఖాళీ చేయడం తప్పనిసరి అంటూనే.. ఎవరినీ బలవంతంగా ఖాళీ చేయించబోమని, ఇళ్లు కూల్చబోమని చెప్పుకొచ్చారు. రెండు నెలల్లో తరలింపు ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఇక ‘‘జీహెచ్ఎంసీ, ఇతర స్థానిక సంస్థల నుంచి అనుమతి పొంది బఫర్జోన్లలో నిర్మించిన ఇళ్లను నేరుగా కూల్చివేయడం లేదని.. ఆ అనుమతులు రద్దు చేసిన తర్వాతే కూలుస్తున్నామని ‘హైడ్రా’ కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. శనివారం సచివాలయంలో దానకిశోర్, రంగనాథ్ కలసి మీడియాతో మాట్లాడారు. 2026 జూన్ నాటికి మూసీలో మంచినీరు: దానకిశోర్ మూసీ రివర్ ఫ్రంట్‌లో భాగంగా 2026 జూన్ నాటికి మూసీ నదిలో మంచినీరు ప్రవహించాలని సీఎం ఆదేశించారని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ చెప్పారు. ‘‘గోదా వరి నుంచి 5 టీఎంసీల నీటిని మూసీలోకి తరలిస్తాం. దీనికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ కోసం ఏజెన్సీలను పిలుస్తున్నాం. మూడు నెలల క్రితం మూసీ రివర్‌ఫ్రంట్ కార్పొరేషన్ అధికారులు మూసీ నది వెంట 55 కిలోమీటర్ల మేర సర్వే చేశారు. అందులో భాగంగా గుర్తించిన ఇళ్లకు వెళ్లి మార్కింగ్ చేసి, రిలొకేషన్ కోసం ఎంపిక చేసిన ప్రాంతాలకు పంపించే ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల విలువ చేసే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాం. కొత్తగా వెళ్లే ప్రాంతాల్లో అన్ని సౌకర్యాలతోపాటు ఉపాధి లభించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటివరకు 974 ఇళ్లను సర్వే చేసి.. 576 ఇళ్లకు మార్కింగ్ చేశాం. వారిలో 470 కుటుంబాలు ఖాళీ చేసి వెళ్లేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. శుక్రవారం 50 మంది పునరావాస ప్రాంతాలకు తరలివెళ్లగా.. శనివారం 200 కుటుంబాల వరకు వెళ్లాయి. 2 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం. మూసీని ఖాళీ చేసేందుకు అక్కడి కుటుంబాలు సిద్ధంగా ఉన్నాయి..’’అని దానకిశోర్ వెల్లడించారు. అయితే కొన్ని సమస్యలు ఉన్నాయని.. వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళతామని చెప్పారు. మూసీ రివర్‌బెడ్‌లో నివసిస్తున్న ఇంటి యజమానులతోపాటు కిరాయిదారులకు పునరావాసం, ఉమ్మడి కుటుంబం కాకుండా వారి వారసులకు ఇళ్లు కేటాయించే అంశం కూడా పరిశీలనకు వచ్చిందని తెలిపారు. అయితే ప్రస్తుతం ఓనర్లకు మాత్రమే ఇళ్లు కేటాయిస్తున్నామని వివరించారు. మూసీలో నిర్మించిన ఎంజీబీఎస్ బస్‌స్టేషన్, మెట్రో రైల్వేస్టేషన్ అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. అనుమతులు రద్దయ్యాకే ఇళ్లు కూల్చేశాం: రంగనాథ్ జీహెచ్ఎంసీ, ఇతర పట్టణ స్థానిక సంస్థలు అనుమతులు ఇచ్చిన ఇళ్లను తాము కూల్చలేదని ‘హైడ్రా’కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. బఫర్జోన్లలో నిర్మాణాలకు ఇచ్చిన అనుమతులను మున్సిపాలిటీలు రద్దు చేసిన తరువాతే కూల్చివేశామని చెప్పారు. ఇప్పటివరకు కూల్చినవన్నీ అనుమతులు లేని నిర్మాణాలు, లేదా అనుమతులు రద్దయిన నిర్మాణాలేనని తెలిపారు. ‘‘బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్యకు హైడ్రాకు సంబంధం లేదు. హైడ్రా బూచి కాదు. భరోసా. హైడ్రా సైలెంట్‌గా లేదు. తన పని తాను చేస్తుంది. ధనవంతుల ఇళ్లు, ఫామ్‌హౌస్‌లు, కట్టడాల జోలికి వెళ్లడం లేదనేది వాస్తవం కాదు. వారి ఆక్రమణల కూల్చివేతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నాం. జన్వాడ ఫామ్‌హౌస్ 111 జీవో పరిధిలో ఉంది. 111 జీవో హైడ్రా పరిధిలోకి రాదు. ఒవైసీ, మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డికి చెందిన కాలేజీలపై వచ్చిన ఫిర్యాదుల విషయంలో.. విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోతారనే చర్యలు తీసుకోలేదు. ఓఆర్ఆర్ లోపల 565 చెరువులను గుర్తించాం. ఇందులో 136 చెరువుల బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ పరిధిని గుర్తించాం. మిగతావి కూడా గుర్తించాక అన్ని వివరాలు వెబ్సైట్లో పెడతాం..’’అని రంగనాథ్ తెలిపారు. -
మూసీ నిర్వాసితులను ఆదుకుంటాం
సాక్షి, హైదరాబాద్: మూసీ ప్రాజెక్టు కింద నిర్వాసితులయ్యే కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ దాన కిషోర్ చెప్పారు. శుక్రవారం మాసబ్‌ట్యాంక్‌లోని కార్యాలయంలో మూసీ పౌర సంస్థల ప్రతినిధులతో సుదీర్ఘంగా నిర్వహించిన సమావేశంలో సలహాలు, సూచనలు స్వీకరించారు. అనంతరం మాట్లాడారు. హైదరాబాద్ నగర భవిష్యత్తును కాపాడాలంటే.. మూసీ నదిని పునరుద్ధరించాల్సిందేనని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఏకపక్షంగా కాకుండా.. ఎన్జీవోలు, నిర్వాసిత కుటుంబాలతో చర్చించి, తరలింపు, పునరావాస కార్యక్రమాలను చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రతి నిర్వాసిత కుటుంబానికి జీవనోపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. పట్టా ఉంటే పరిహారం, ప్రయోజనాలు త్వరలోనే బఫర్ జోన్లో నిర్మాణాల సర్వే, మార్కింగ్ ప్రక్రియ చేపడతామని దాన కిశోర్ తెలిపారు. వారికి పునరావాస చట్టం ప్రకారం.. పరిహారం, ప్రయోజనాలు అందిస్తామని, ఆ తర్వాతే నిర్మాణాలను తొలగిస్తామని చెప్పారు. నిర్వాసిత కుటుంబాల్లోని విద్యార్థుల చదువు దెబ్బతినకుండా.. వారిని తరలించిన ప్రాంతంలోని పాఠశాలల్లో ప్రవేశాలు కల్పిస్తామని వెల్లడించారు. ఆసక్తి ఉన్న వారిని గురుకులాల్లో కూడా చేర్పిస్తామన్నారు. మూసీ పునరావాస ప్రక్రియ సజావుగా జరిగేందుకు ఉన్నతాధికారులతో హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. -
ప్రపంచంలో అత్యుత్తమంగా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరాన్ని భారతదేశంలోనే కాకుండా, ప్రపంచ వేదికపై అత్యుత్తమ నగరంగా నిలపాలని సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యంగా నిర్దేశించుకున్నారని రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిశోర్ చెప్పారు. లక్ష్యానికి అనుగుణంగా ఇంధన రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రణాళికలు తయారు చేశామన్నారు. ఇంధన సామర్థ్య సాధన ద్వారా ప్రపంచంలోనే పెట్టుబడులకు సురక్షిత నగరంగా హైదరాబాద్ త్వరలో రూపాంతరం చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రణాళికాబద్ధంగా మూసీ నది పునరుజ్జీవనానికి తీసుకుంటున్న చర్యలు ఇందులో భాగమని స్పష్టం చేశారు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ)తో కలిసి హైదరాబాద్‌లో మిషన్ లైఫ్ (లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్) పోస్టర్‌ను గురువారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..రివర్ ఫ్రంట్ అభివృద్ధితో పాటు, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం, నగర సామాజిక, ఆర్థిక, పర్యావరణ వ్యవస్థల్ని మెరుగుపరచడం కూడా ప్రభుత్వ లక్ష్యమని దానకిశోర్ చెప్పారు. ఇవన్నీ పూర్తయితే లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఈసీబీసీతో విస్తృత ప్రయోజనాలు తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల సంస్థ (టీఎస్ రెడ్కో), బీఈఈ సంయుక్త భాగస్వామ్యంతో ఇంధన శక్తి సామర్థ్య నిర్వహణ, పర్యావరణ లక్ష్యాల్ని అందుకునేందుకు దానకిశోర్ నేతృత్వంలో చర్చించి, పలు నిర్ణయాల అమలుకు కృషి చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. నగరంలో ఇకపై ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీసీ)కు అనుగుణంగానే కొత్త ప్రభుత్వ భవనాలను నిర్మించనున్నారు. బీఈఈ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈసీబీసీ ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణకు దోహదపడటంతో పాటు ఆర్థిక, తదిత విస్తృత ప్రయోజనాలను అందిస్తుందని భావిస్తున్నారు. బీఈఈ కార్యదర్శి మిలింద్ దేవ్రా, బీఈఈ డైరెక్టర్లు సౌరభ్ దీదీ, ఎస్కే వర్ణా, బీఈఈ దక్షిణాది రాష్ట్రాల మీడియా సలహాదారు ఎ.చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
HMDA: శివ బాలకృష్ణపై సస్పెన్షన్ వేటు
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ, రేరా, మెట్రోలో జరిగిన అక్రమాలకు సంబంధిచిన కేసులో అవినితి నిరోధక శాఖ(ఏసీబీ) విచారణ ఎదుర్కొంటున్న శివబాల కృష్ణపై హైదరాబాద్ మెట్రో పాలిటన్ అథారిటీ(HMDA) వేటు వేసింది. శివ బాలకృష్ణను సస్పెండ్ చేస్తూ మంగళవారం హెచ్ఎండీఏ కమిషనర్ దాన కిషోర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఆదాయనికి మించి ఆస్తుల కేసులో శివబాలకృష్ణ అరెస్ట్ అయ్యారు. ఇక.. ఆయన తన పదవిని అడ్డుపెట్టుకొని రూ. వందల కోట్లు సంపాధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఏసీబీ కేసులో విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో శివ బాలకృష్ణపై సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలుస్తోంది. చదవండి: ఏసీబీ కస్టడీకి హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ -
నేటి నుంచి వార్డుల్లో ప్రజాపాలన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నుంచి అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డుల వారీగా ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ అన్ని పురపాలికల కమిషనర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ప్రజల నుంచి జనవరి 6వ తేదీ వరకు ఆరు గ్యారంటీలకు సంబంధించిన అభయహస్తం దరఖాస్తులను స్వీకరించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహాలక్ష్మి, రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేకంగా అధికారులు, సిబ్బందిని నియమించారు. ఒక్కోరోజు ఒక్కో బస్తీ చొప్పున నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలకు స్థానిక కార్పొరేటర్లను ఆహ్వానించాల్సిందిగా పేర్కొంటూ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం వీటిల్లో పాల్గొననున్నారు. పట్టణాల్లో జరిగే ప్రజాపాలనలో మునిసిపల్, రెవెన్యూ, పౌరసరఫరాలు, వైద్య, ఆరోగ్య శాఖలతో పాటు విద్య, విద్యుత్ విభాగాలకు చెందిన ఉద్యోగులు కూడా పాల్గొంటారు. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన తర్వాత వాటిని ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. -
మరో 40 ఏళ్లు తాగునీటికి కొదవ లేదు
సనత్‌నగర్: రాబోయే 40 ఏళ్లు హైదరాబాద్ నగరంలో తాగునీటికి ఎలాంటి కొదవ ఉండదని జలమండలి ఎండీ దానకిషోర్ అన్నారు. కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) తెలంగాణ ఆధ్వర్యంలో ‘తెలంగాణ ఇన్ఫ్రా సమ్మిట్–2022’ సదస్సు శుక్రవారం బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్లో జరిగింది. ఈ సందర్భంగా ‘ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రియాల్టీ–ప్రాస్పెక్టస్ అండ్ ఛాలెంజెస్’ అనే అంశంపై జరిగిన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన దానకిషోర్ మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగ ప్రాజెక్టులలో పెట్టుబడులు ప్రైవేటు రంగం ద్వారానే జరుగుతున్నాయన్నారు. మౌలిక సదుపాయాల కల్పనతోనే రియాల్టీ రంగం అభివృద్ధి చెందుతుందన్నారు. ఆక్స్ఫర్డ్ నగరాల నివేదిక ప్రకారం 2030 నాటికి ప్రపంచంలో అత్యధికంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో భారతదేశంలో 17 నగరాలు ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. అలాగే హైదరాబాద్ 85 బిలియన్ల జీడీపీని అధిగమించగలదన్నారు. సీఐఐ తెలంగాణ ఇన్ఫ్రా అండ్ రియల్ ఎస్టేట్ ప్యానెల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఎం.గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ విమానాశ్రయం, ఔటర్ రింగ్‌రోడ్డు, నీటి ప్రాజెక్టులు, మెట్రోరైల్ వంటి మెరుగైన మౌలిక సదుపాయాలపరంగా తెలంగాణ రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. సమారు 30 ఏళ్లుగా 80 శాతం ప్రయాణికులు రైల్వేల ద్వారా ప్రయాణిస్తున్నారని, అయితే ఇప్పుడు రోడ్డు నెట్వర్క్, మారుతున్న మౌలిక సదుపాయాల రంగం కారణంగా 70 శాతం మంది రోడ్డు మార్గంలో ప్రయాణిస్తున్నారన్నారు. కార్యక్రమంలో సీఐఐ చైర్మన్ వాగీష్దీక్షిత్, వైస్ చైర్మన్ శేఖర్‌రెడ్డి, షేక్ సమీవుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
హుస్సేన్ సాగర్ ఉగ్రరూపం..
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో గ్రేటర్ హైదరాబాద్ రోడ్లు నదులను తలపిస్తున్నాయి. ట్యాంక్‌బండ్ వద్ద హుస్సేన్ సాగర్ ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. వరద నీటిని చూసేందుకు స్థానికులు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ మహ్మద్ బాబా ఫసియుద్దీన్‌లు బుధవారం ట్యాంక్ బండ్‌ను సందర్శించి వరద పరిస్థితులను పరిశీలించారు. వరద నీటి దృష్ట్యా నగర వాసులంతా బయటకు రావొద్దని ఇళ్లలోని సురక్షితంగా ఉండాలంటూ ప్రజలను విజ్ఞప్తి చేశారు. (చదవండి: వరద బీభత్సానికి అద్దం పడుతున్న దృశ్యం) అదే విధంగా జలమండలి ఎండీ దాన కిషోర్ హిమాయత్ సాగర్‌ను సందర్శించారు. వరద పరిస్థితిపై అధికారులతో సమావేశమయ్యారు. జలాశయం దిగువన ఉన్న ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిచాలని ఆదేశించారు. మరోవైపు హైదరాబాద్ మహాత్మగాంధీ బస్‌స్టాండ్‌లోకి వరద నీరు భారీగా రావడంతో వచ్చిపోయే బస్సులకు ఆటంకం కలిగి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. (చదవండి: తెలంగాణలో ఇవాళ, రేపు సెలవులు) -
జీహెచ్ఎంసీ కమిషనర్‌గా లోకేష్ కుమార్
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) కమిషనర్‌గా డీఎస్ లోకేష్‌కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుతంజీహెచ్ఎంసీ కమిషనర్‌గా, జలమండలి ఎండీగా పూర్తిస్థాయి అదనపుబాధ్యతలు నిర్వర్తిస్తున్నఎం.దానకిశోర్‌ను జలమండలి ఎండీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దానకిశోర్ స్థానంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న లోకేష్‌కుమార్‌ను బదిలీ చేసింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన లోకేష్‌కుమార్ గతంలో కృష్ణా జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌గా, పాడేరు సబ్ కలెక్టర్‌గా, హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ ఆఫీసర్‌గా, నేషనల్ రూరల్ హెల్త్‌మిషన్ డైరెక్టర్గాపనిచేయడంతోపాటు ఖమ్మం, అనంతపురం జిల్లాలకలెక్టర్గా కూడా పనిచేశారు. పనిచేసిన అన్నిచోట్లా మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. బల్దియాలో దానకిశోర్ ముద్ర జీహెచ్ఎంసీ కమిషనర్‌గా గత సంవత్సరం ఆగస్ట్ 25న బాధ్యతలు చేపట్టిన దానకిశోర్ సరిగ్గా సంవత్సరం పూర్తయ్యాక బదిలీ కావడం యాధృచ్ఛికమే అయినా ఏడాది కాలంలో ఆయన చేయగలిగినన్ని పనులు చేయడంతోపాటు పలు వినూత్న కార్యక్రమాలతోనూ తనదైన ముద్ర వేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్‌కే ఎన్నికల విధులు కూడా ఉండటంతో ఆయన వచ్చినప్పటి నుంచి అసెంబ్లీ, లోక్‌సభలతో సహ వివిధ ఎన్నికలు రావడంతో జిల్లా ఎన్నికల అధికారి బాధ్యతలతోపాటు జీహెచ్ఎంసీ కమిషనర్‌గానూ సమాంతరంగా పనులు చేశారు. ఓటర్ల జాబితాల నుంచి ఎన్నికల అధికారుల శిక్షణ దాకా ఎన్నో పనులున్నప్పటికీ, నగర ప్రజల సమస్యలకే తొలిప్రాధాన్యతనిచ్చారు. ఇల్లు బాగుండాలంటే ఇల్లాలితోనే సాధ్యమన్నట్లుగా నగర సమస్యల పరిష్కారంలోనూ మహిళలు కీలకపోత్ర పోషించాలని భావించారు. సెల్ఫ్‌హెల్ప్‌గ్రూపులకు ఎంతో ప్రాధాన్యతనిచ్చి అన్ని కార్యక్రమాల్లోనూ వారి భాగస్వామ్యం పెంచడంతోపాటు వారిద్వారా అందే ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం లభించాలని ఆశించారు. సాధారణంగా అధికారులు తమకంటే ముందున్న అధికారులు ప్రవేశపెట్టిన పథకాలను అటకెక్కించడం రివాజు అయినప్పటికీ, దానకిశోర్ మాత్రం గత కమిషనర్ జనార్దన్‌రెడ్డి ప్రారంభించిన కార్యక్రమాలను కొనసాగిస్తూనే తనదైన శైలిలో మరిన్ని కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నగరంలో రోడ్లు, డ్రైనేజీ, ట్రాఫిక్ తదితర సమ్యలకు సంబంధిత విభాగాలన్నీ పరస్పర సమన్వయంతో పనిచేసినప్పుడే సమస్యలు పరిష్కారమవుతాయని గ్రహించి ఆ దిశగా కృషి చేశారు. స్వచ్ఛ నగరం కోసం గత కమిషనర్లు కూడా కృషి చేసినప్పటికీ, ‘సాఫ్‌హైదరాబాద్–షాన్‌దార్ హైదరాబాద్’ పేరిట వార్డు స్థాయి వరకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి పనులు చేపట్టారు. వానొస్తే నగర రోడ్లు చెరువులుగా మారుతున్న దుస్థితిని తప్పించేందుకు క్షేత్రస్థాయిలో ఇంజినీర్లతో కలిసి పర్యటించి సమస్య పరిష్కార చర్యల్లో భాగంగా ఇంజెక్షన్ బోర్‌వెల్స్ నిర్మాణం ప్రారంభించారు. చెత్త సమస్యల పరిష్కారంలో భాగంగా సాయంత్రం వేళల్లోనూ చెత్త తరలించేందుకు అదనపు వాహనాలను సమకూర్చారు. నిర్మాణ వ్యర్థాల తొలగింపునకు ప్రత్యేక వాహనాలను కేటాయించడంతో పాటు వీధివ్యాపారులు తప్పనిసరిగా రెండు చెత్తడబ్బాలు ఏర్పాటుచేసుకునేలా చర్యలు చేపట్టారు. పారిశుధ్యకార్మికులందరికీ బీమా సదుపాయం కల్పించారు. ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న జీహెచ్ఎంసీ రెగ్యులర్ ఉద్యోగులకుహెల్త్కార్డుల చొరవ చూపడంతో త్వరలోనే అవి జారీ అయ్యే దశకు వచ్చాయి. ప్రజావాణికి అధికారులు హాజరుకాని పరిస్థితినుంచి తప్పనిసరిగా హాజరయ్యేలా చర్యలు తీసుకున్నారు. తాను కూడా హాజరవుతూ ప్రజల సమస్యలకు ప్రాధాన్యం ఇచ్చారు. సాయంత్రం వేళల్లోనూ సందర్శకుల ఫిర్యాదులకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి వారు వరండాల్లో నిలబడకుండా కూర్చునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి, స్వయంగా దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభించారు. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యతనిచ్చేందుకు ఎప్పటికప్పుడు అధికారులను హెచ్చరించేవారు. ఇటీవలి భారీవర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు తక్షణ మరమ్మతులు చేయించగలిగారు.దోమల నివారణకు రికార్డుస్థాయిలో ఇప్పటికే 1100 మెడికల్ క్యాంపులు నిర్వహించడంతోపాటు మరో 600 క్యాంపులకు ప్రణాళికలు సిద్ధం చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా పనిచేయడం సంతృప్తినిచ్చిందని, నగరంలో చేపట్టిన కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసించిందని దానకిశోర్ పేర్కొన్నారు. -
జీహెచ్ఎంసీ కమిషనర్‌గా లోకేశ్ కుమార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి కలెక్టర్‌గా పని చేస్తున్న లోకేష్ కుమార్‌ను జీహెచ్ఎంసీ కమిషనర్‌గా నియమించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. దానకిషోర్‌ను జలమండలి కమిషనర్‌గా నియామస్తున్నట్టుగా నిర్ణయం తీసుకుంది. ఇక రంగారెడ్డి జాయింట్ కలెక్టర్‌గా పని చేస్తున్న హరీష్ ఇకమీదట రంగారెడ్డి కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కాగా దానకిషోర్ సంవత్సరంపాటు జీహెచ్ఎంసీ కమిషనర్‌గా సేవలందించారు. -
అక్రమ వధ!
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ ప్రజల అవసరాలకు సరిపడా ఆధునిక స్లాటర్ హౌస్‌లు జీహెచ్ఎంసీలో లేవు. ఉన్నవి సక్రమంగా పనిచేయడం లేదు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ గురువారం అంబర్‌పేట స్లాటర్‌హౌస్ ఆకస్మిక తనిఖీ చేయగా ఈ విషయం వెలుగు చూసింది. అక్కడ ఆధునిక స్లాటర్‌హౌస్ ఉన్నప్పటికీ, వెలుపల అశాస్త్రీయంగా జంతు వధ జరుగుతోంది. అంతేకాదు.. సదరు స్లాటర్‌హౌస్ నిర్వహణకు తీసుకున్న ఏజెన్సీ కొంతకాలంగా జీహెచ్ఎంసీకి రాయల్టీగా చెల్లించాల్సిన మొత్తం కూడా చెల్లించడం లేదని తేలింది. ఈ వ్యవహారం కోర్టు వివాదంలో ఉండగా, వివాదం ముగిసేంత వరకు 25 శాతమైనా చెల్లించాలి. ఆ చెల్లింపుల పేరిట ఇచ్చిన చెక్కులు కూడా బౌన్సయ్యాయి. అయినా సంబంధిత అధికారులు కోర్టు వివాదం పరిష్కరించడంలో శ్రద్ధ చూపలేదని, స్లాటర్ హౌస్ వెలుపల వధ జరుగుతున్నా పట్టించుకోలేదనే విషయాలు వెలుగు చూశాయి. నగరంలోని మిగతా స్లాటర్‌హౌస్‌లపై కూడా జీహెచ్ఎంసీ అధికారులు శ్రద్ధ చూపకపోవడంతో వాటిలో ఆధునిక పద్ధతిలో జరగాల్సిన వధ.. ఆరుబయట విచ్చలవిడిగా జరిగుతుందని తేలింది. బయటి వ్యాపారులకు జీహెచ్ఎంసీ అధికారులకు మధ్య లోపాయికారీ సంబంధాలు ఉండటం వల్లే ఈ పరిస్థితి నెలకొందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతా ఆరుబయటే.. నగర జనాభాలో దాదాపు 70 శాతం మంది మాంసాహారులే. నిబంధనల మేరకు జీహెచ్ఎంసీ ధ్రువీకరించి స్టాంప్ వేసిన మాంసాన్నే విక్రయించాలి. కానీ, నగరంలో ఉన్న స్లాటర్ హౌస్‌లలో కాకుండా బయటే ఈ తతంగం జరుగుతోంది. అయినా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోరు. దీంతో ప్రజలకు శుభ్రమైన మాంసం అందక పోగా జీహెచ్ఎంసీకి రావాల్సిన ఆదాయమూ రావడం లేదు. అంబర్‌పేటతో పాటు రామ్నాస్పురా స్లాటర్‌హౌస్ వద్ద కూడా ఆధునిక యంత్రాలతో కాకుండా నేలపైనే పురాతన పద్ధతుల్లోనే వధిస్తున్నా అధికారులు పట్టించుకుంటున్నది లేదు. అక్కడ రోజుకు దాదాపు 600 జంతు వధ జరుగుతుండగా, దాదాపు 100 మాత్రమే స్లాటర్‌హౌస్‌లో వధిస్తున్నారు. మిగతావి బయటే అశాస్త్రీయంగా వధిస్తున్నారు. తొలుత దీనిని ఒక ప్రైవేటు ఏజెన్సీకి నిర్వహణకిచ్చారు. కాంట్రాక్టు మేరకు జీహెచ్ఎంసీకి ఏటా రూ.5.20 కోట్లు రావాలి. రూ.అరకోటి కూడా చెల్లించకపోవడంతో కాంట్రాక్టు రద్దుచేసి, జీహెచ్ఎంసీయే నిర్వహిస్తోంది. ఒక్కో జంతువుకు రూ.100 చొప్పున జీహెచ్ఎంసీకి కేవలం దాదాపు రూ.10 వేలు మాత్రమే వస్తుండగా, బయట వధిస్తున్నవారికి మాత్రం అంతకు ఎన్నోరెట్లు అధికంగా వస్తోంది. అక్కడ కేవలం గొడ్లను వధించే యంత్రాలు మాత్రమే ఉండగా, అంబర్‌పేట, బోయిగూడల్లో గొడ్లతో పాటు మేకలు, గొర్రెలు వధించే యంత్రాలున్నాయి. ఈ ఆధునిక కేంద్రాలకు కూడా మాంసం వ్యాపారులు రావాల్సినంత మంది రావడం లేదు. దానివెనుకా ప్రైవేట్ హస్తమే ఉందనే ఆరోపణలున్నాయి. ఎక్కడ పడితే అక్కడ వధ జరుగుతుండటంతో, మాంసాన్ని నేలపై ఉంచడం వల్ల బాక్టీరియా పెరుగుతుందని వెటర్నరీ వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతటా ఉల్లంఘనే.. నిబంధనల మేరకు స్లాటర్‌హౌస్‌లలో వెటర్నరీ అధికారులు ఉండి వధకు వచ్చే జంతువులు ఆరోగ్యంగా ఉన్నట్లు ధ్రువీకరించాలి. కానీ ఎక్కడా ఆ పని జరగడం లేదు. దీంతో దిగువస్థాయి సిబ్బంది ఆడింది ఆటగా సాగుతోంది. జియాగూడతో సహా నగరంలోని వివిధ ప్రాంతాల్లో సంప్రదాయ పద్ధతిలోనే వధిస్తున్నారు. ఒక్క జియాగూడలోనే రోజుకు దాదాపు 4 వేలకు పైగా జీవాలను వధిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులతో కోట్ల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన ఆధునిక స్లాటర్‌హౌస్‌లు అలంకార ప్రాయంగానే మిగిలాయి. ♦ అంబర్‌పేట స్లాటర్ హౌస్‌లో రోజుకు 2000 మేకలు/గొర్రెలతో పాటు 300 గొడ్లను వధించే సామర్థ్యం ఉంది. కానీ కేవలం 300 మేకలు/గొర్రెలు, 150 గొడ్ల వధ మత్రమే జరుగుతోంది. మిగతావి ఆరుబయట చేస్తున్నారు. ఇక్కడి నుంచి జీహెచ్ఎంసీకి రూ.10.30 కోట్ల రాయల్టీ రావాలి. ♦ న్యూబోయిగూడ స్లాటర్ హౌస్‌లో కూడా రోజుకు 2000 మేకలు/గొర్రెలతో పాటు 200 గొడ్లను వధించవచ్చు. కానీ 150 మేకలు/గొర్రెలు, 60 గొడ్ల వధ మాత్రమే జరుగుతోంది. ఇక్కడి నుంచి బల్దియాకు రూ.9.30 కోట్లు రావల్సి ఉంది. ♦ రామ్నాస్పురాలో గల ఆధనిక జంతు వధశాలలో 100 గొడ్లను వధించే సామర్థ్యం ఉంది. ఇక్కడి నుంచి రూ.5.20 కోట్లు రాయల్టీ రావాలి. -
హైదరాబాద్‌లో నీటికి ఢోకా లేదు..
సాక్షి, హైదరాబాద్ : చెన్నై, ఇతర నగరాల మాదిరిగా హైదరాబాద్‌లో నీటి సమస్య అంతగా లేదని జలమండలి ఎండీ దాన కిశోర్ తెలిపారు. ఆగస్టు చివరి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు నగరానికి వస్తాయని వెల్లడించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేశవాపురం, దేవులమ్మ నాగరం రిజర్వాయర్ పనులు త్వరగా పూర్తి చేస్తామన్నారు. ప్రస్తుతం గోదావరి నుంచి 172 ఎమ్‌జీడీ, కృష్ణా నుంచి 270ఎమ్జీడీల నీళ్లు ఇస్తున్నామని తెలిపారు. సాగర్‌లో నీటి మట్టం తగ్గినా.. ఇంకా అయిదేళ్ల వరకు హైదరాబాద్‌లో నీటికి ఢోకా లేదన్నారు. భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో వాటర్ ట్యాంకర్స్‌కు డిమాండ్ పెరిగిందని వెల్లడించారు. నగరంలో సరఫరా చేస్తున్న నీటిలో 50 ఎమ్‌జీడీ నీళ్లు వృధా అవుతున్నాయన్నారు. నీటిని వృధా చేస్తే ఫైన్ వేస్తామని హెచ్చరించారు. 56 రిజర్వాయర్లు పూర్తి అయ్యాయని, వాటి ద్వారా శివారు ప్రాంతాల్లో నీటిని ఇస్తున్నామని పేర్కొన్నారు. మొత్తం 154 రిజర్వాయర్లు డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని వెల్లడించారు. గ్రేటెడ్ కమ్యూనిటీల నీటి కష్టాలను త్వరలో తీర్చబోతున్నామన్నారు. ఓఆర్ఆర్ లోపల మొత్తం జలమండలి నుంచే నీళ్లు ఇస్తామని తెలిపారు. జలమండలి ప్రాజెక్ట్స్ కోసం హడ్కో రూ. 200 కోట్ల నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. కంటోన్మెంట్ నీటి సమస్య తీరిందని, రింగ్ మెయిన్ వస్తే 150 కిలోమీటర్ల మేర నీటి సమస్య తీరుతుందని అన్నారు. షా ఏజెన్సీ ద్వారా డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేస్తున్నామని తెలిపారు. 54 ఎస్టీపీలు కడుతున్నామని, కూకట్ పల్లి చెరువును సుందరంగా చేస్తామన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో వరద ముంపు ప్రాంతాల్లో 50 ఇంజక్షన్ బోర్ వేల్స్ వేస్తున్నామని, దీని ద్వారా రోడ్లపై నీళ్లు నిలవకుండా ఉండటమే కాకుండా భూగర్భ జలాలు పెరుగుతాయని వెల్లడించారు. -
గ్రేటర్ పరిధిలో హెల్త్ క్యాంపుల నిర్వహణ
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అంటు వ్యాధులు, వర్షాకాలపు సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక చేపడతామని జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రత్యేకంగా సుమారు 500 ఆరోగ్య శిబిరాల నిర్వహిస్తామని వెల్లడించారు. జూలై 20వ తేదీలోగా హెల్త్ క్యాంపుల నిర్వహణతో పాటు వ్యాదుల నివారణకు యాంటీ లార్వా ఆపరేషన్ల పూర్తి చేసి.. దోమల నివారణకు స్ప్రే చేసే పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రేటర్ పరిధిలో ఉన్న దాదాపు ఆరువేలకు పైగా పాఠశాలల్లో సీజనల్ వ్యాధులు, అంటువ్యాధుల నివారణపై చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. బీహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో మెదడువాపు వ్యాధి ప్రబలంగా వ్యాపించడంతో.. హైదరాబాద్‌లో అటువంటి వ్యాదులు వ్యాప్తి చెందకుండా మెదడు వాపు వ్యాధి నివారణకు చర్యలు చేపట్టాలని అదేశించారు. ముఖ్యంగా ఎక్కువగా వ్యాదులు వ్యాప్తిచెందే ప్రాంతాల్లో.. గతంలో ఆధికంగా వ్యాదులు నమోదైన ప్రాంతాల్లో ప్రత్యేక ట్రయల్ చేపట్టాలని పేర్కొన్నారు. -
పోలీసుల ‘పోస్టర్’ వర్సెస్ గ్రేటర్ ‘చలాన్’
సాక్షి, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీ కమిషనర్ వినియోగించే వాహనం పరిమితికి మించిన వేగంతో ప్రయాణించడంతో ట్రాఫిక్ పోలీసులు రూ.6,210 జరిమానా విధించారు. బోనాలకు వస్తున్న భక్తులకు స్వాగతం పలుకుతూ గోల్కొండ ప్రాంతంలోని ప్రభుత్వ గోడలపై పోస్టర్లు అంటించిన పోలీసులకు ‘గ్రేటర్’ రూ.10 వేల ఫైన్ వేసింది. సరిగ్గా వారం రోజుల వ్యవధిలో జరిగిన ఈ రెండూ వ్యవహారాలు దెబ్బకు దెబ్బ అన్నట్లు ఉన్నాయని కొందరు పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు. జరిమానా విధించడంలో జీహెచ్ఎంసీ వ్యవహారశైలి కూడా ‘నిబంధనల్ని ఉల్లంఘిచినట్లే’ ఉందని కొందరు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్ వినియోగించే వాహనం సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ ట్రాఫిక్ నిఘా కెమెరాలకు చిక్కింది. దీంతో గత ఏడాది ఆగస్టు 8 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 30 మధ్య ఆరు ఈ–చలాన్లు జారీ అయ్యాయి. దీనికి సంబంధించిన జరిమానా మొత్తం రూ.6,210 పెండింగ్‌లో ఉన్నట్లు గత గురువారం మొహిత్ పటేల్ అనే నెటిజనుడు ట్వీట్ చేశాడు. ఇది సోషల్‌మీడియాతో పాటు మీడియాలోనూ హల్చల్ చేయడంతో జీహెచ్ఎంసీ స్పందించింది. కమిషనర్ దాన కిషోర్ వినియోగించే కారుపై (టీఎస్ 09 ఎఫ్ఏ 4248) ఉన్న ఆరు చలాన్లకు సంబంధించిన మొత్తాన్ని చెల్లించింది.ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తూ వాహనాన్ని నడిపిన డ్రైవర్లను కమిషనర్ దానకిషోర్ తీవ్రంగా మందలించారనీ ప్రకటించింది. ఇది జరిగిన వారం రోజులకు జీహెచ్ఎంసీ అధికారులు తమ ‘కక్ష’ తీర్చుకున్నారు. తమకు రూ.6210 జరిమానా విధించిన పోలీసులకు రూ.10 వేల ఫైన్ వేశారు. గోల్కొండ బోనాల నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేసిన పోలీసు విభాగం ఆ భక్తులకు స్వాగతం పలకాలని భావించింది. దీనికోసం రాష్ట్ర డీజీపీ నుంచి స్థానిక గోల్కొండ అదనపు ఇన్స్పెక్టర్ వరకు ఆరుగురి ఫొటోలతో పోస్టర్లను ముద్రించారు. గోల్కొండ పోలీసుస్టేషన్ పేరుతో ముద్రించిన వీటి ద్వారా బోనాలకు వస్తున్న భక్తులకు స్వాగతం పలుకుతూ అనేకచోట్ల అతికించారు. వీటిని చూసిన జీహెచ్ఎంసీ అధికారులు..సదరు పోస్టర్లు తమ అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటయ్యాయంటూ గురువారం రూ.10 వేల చలాన్ జారీ చేశారు. ప్రభుత్వ విభాగమైన పోలీసు శాఖ ఇలాంటి అతిక్రమణలకు పాల్పడకూడదని జీహెచ్ఎంసీ అధికారులు అంటుండగా... ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా పోస్టర్లు ఏర్పాటు చేశామని, సదరు పోస్టర్ అంటించిన గోడ జీహెచ్ఎంసీకి చెందిన కాదని పేర్కొంటున్నారు. ప్రైవేట్ వ్యక్తులో, వాణిజ్య అవసరాల కోసమే ఇలా చేస్తే జరిమానా విధించాలి తప్ప ప్రభుత్వం విభాగం, ఎలాంటి వ్యక్తిగత స్వార్థం లేకుండా అంటిస్తే ఎలా విధిస్తారని ప్రశ్నిస్తున్నారు. సదరు గోడపై పోస్టర్ అతికించి పోలీసు విభాగం తప్పు చేస్తే... దానిపై తీసుకున్న చర్య ద్వారా జీహెచ్ఎంసీ కూడా తప్పు చేసిందని అధికారులు అంటున్నారు. ఆ పోస్టర్లు గోల్కొండ పోలీసులు ముద్రించినట్లు వాటిని చూస్తేనే అర్థం అవుతోంది. జీహెచ్ఎంసీ చెబుతున్నట్లు అవి నిబంధనలకు విరుద్ధమైతే నేరుగా ఠాణాకు వెళ్ళి స్టేషన్ హౌస్ ఆఫీసర్ అయిన ఇన్స్పెక్టర్కు చలాన్ అందించవచ్చని, అయితే అలా చేయని జీహెచ్ఎంసీ అధికారులు ఆ పోస్టర్ పక్కనే చలాన్ అతికించారని చెబుతున్నారు. పోలీసులు పోస్టర్ అతికించడం తప్పయితే... చలాన్ అతికించడం ఒప్పు ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. ట్రాఫిక్ విభాగంలో ఈ–చలాన్ల జారీ మొత్తం సాంకేతికంగా వాహనం నెంబర్ ఆధారంగా జరుగుతుందని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడా సదరు వాహనం ఎవరిది అనేది ట్రాఫిక్ పోలీసులకు తెలిసే అవకాశం లేదు. జీహెచ్ఎంసీ కమిషనర్ వాడుతున్న వాహనంపై ఈ–చలాన్లు ఉన్న విషయం ఓ నెటిజనుడు ట్వీట్ చేయడంతో బయటకు వచ్చిందని, దీనికి సంబంధించి పోలీసులపై జీహెచ్ఎంసీ ‘కక్ష’ కట్టడం సాధ్యం కాదని వ్యాఖ్యానిస్తున్నారు. -
‘కక్ష’ తీర్చుకున్న జీహెచ్ఎంసీ అధికారులు
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ కమిషనర్ వినియోగించే వాహనం పరిమితికి మించిన వేగంతో ప్రయాణించడంతో ట్రాఫిక్ పోలీసులు రూ.6,210 జరిమానా విధించారు. బోనాలకు వస్తున్న భక్తులకు స్వాగతం పలుకుతూ గోల్కొండ ప్రాంతంలోని ప్రభుత్వ గోడలపై పోస్టర్లు అంటించిన పోలీసులకు ‘గ్రేటర్’ రూ.10 వేల ఫైన్ వేసింది. సరిగ్గా వారం రోజుల వ్యవధిలో జరిగిన ఈ రెండూ వ్యవహారాలు దెబ్బకు దెబ్బ అన్నట్లు ఉన్నాయని కొందరు పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు. జరిమానా విధించడంలో జీహెచ్ఎంసీ వ్యవహారశైలి కూడా ‘నిబంధనల్ని ఉల్లంఘిచినట్లే’ ఉందని కొందరు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్ వినియోగించే వాహనం సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ ట్రాఫిక్ నిఘా కెమెరాలకు చిక్కింది. దీంతో గత ఏడాది ఆగస్టు 8 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 30 మధ్య ఆరు ఈ–చలాన్లు జారీ అయ్యాయి. దీనికి సంబంధించిన జరిమానా మొత్తం రూ.6,210 పెండింగ్‌లో ఉన్నట్లు గత గురువారం మొహిత్ పటేల్ అనే నెటిజనుడు ట్వీట్ చేశాడు. ఇది సోషల్‌మీడియాతో పాటు మీడియాలోనూ హల్చల్ చేయడంతో జీహెచ్ఎంసీ స్పందించింది. కమిషనర్ దాన కిషోర్ వినియోగించే కారుపై (టీఎస్ 09 ఎఫ్ఏ 4248) ఉన్న ఆరు చలాన్లకు సంబంధించిన మొత్తాన్ని చెల్లించింది. ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తూ వాహనాన్ని నడిపిన డ్రైవర్లను కమిషనర్ దానకిషోర్ తీవ్రంగా మందలించారనీ ప్రకటించింది. ఇది జరిగిన వారం రోజులకు జీహెచ్ఎంసీ అధికారులు తమ ‘కక్ష’ తీర్చుకున్నారు. తమకు రూ.6210 జరిమానా విధించిన పోలీసులకు రూ.10 వేల ఫైన్ వేశారు. గోల్కొండ బోనాల నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేసిన పోలీసు విభాగం ఆ భక్తులకు స్వాగతం పలకాలని భావించింది. దీనికోసం రాష్ట్ర డీజీపీ నుంచి స్థానిక గోల్కొండ అదనపు ఇన్స్పెక్టర్ వరకు ఆరుగురి ఫొటోలతో పోస్టర్లను ముద్రించారు. గోల్కొండ పోలీసుస్టేషన్ పేరుతో ముద్రించిన వీటి ద్వారా బోనాలకు వస్తున్న భక్తులకు స్వాగతం పలుకుతూ అనేకచోట్ల అతికించారు. వీటిని చూసిన జీహెచ్ఎంసీ అధికారులు..సదరు పోస్టర్లు తమ అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటయ్యాయంటూ గురువారం రూ.10 వేల చలాన్ జారీ చేశారు. ప్రభుత్వ విభాగమైన పోలీసు శాఖ ఇలాంటి అతిక్రమణలకు పాల్పడకూడదని జీహెచ్ఎంసీ అధికారులు అంటుండగా... ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా పోస్టర్లు ఏర్పాటు చేశామని, సదరు పోస్టర్ అంటించిన గోడ జీహెచ్ఎంసీకి చెందిన కాదని పేర్కొంటున్నారు. ప్రైవేట్ వ్యక్తులో, వాణిజ్య అవసరాల కోసమే ఇలా చేస్తే జరిమానా విధించాలి తప్ప ప్రభుత్వం విభాగం, ఎలాంటి వ్యక్తిగత స్వార్థం లేకుండా అంటిస్తే ఎలా విధిస్తారని ప్రశ్నిస్తున్నారు. సదరు గోడపై పోస్టర్ అతికించి పోలీసు విభాగం తప్పు చేస్తే... దానిపై తీసుకున్న చర్య ద్వారా జీహెచ్ఎంసీ కూడా తప్పు చేసిందని అధికారులు అంటున్నారు. ఆ పోస్టర్లు గోల్కొండ పోలీసులు ముద్రించినట్లు వాటిని చూస్తేనే అర్థం అవుతోంది. జీహెచ్ఎంసీ చెబుతున్నట్లు అవి నిబంధనలకు విరుద్ధమైతే నేరుగా ఠాణాకు వెళ్ళి స్టేషన్ హౌస్ ఆఫీసర్ అయిన ఇన్స్పెక్టర్కు చలాన్ అందించవచ్చని, అయితే అలా చేయని జీహెచ్ఎంసీ అధికారులు ఆ పోస్టర్ పక్కనే చలాన్ అతికించారని చెబుతున్నారు. పోలీసులు పోస్టర్ అతికించడం తప్పయితే... చలాన్ అతికించడం ఒప్పు ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. ట్రాఫిక్ విభాగంలో ఈ–చలాన్ల జారీ మొత్తం సాంకేతికంగా వాహనం నెంబర్ ఆధారంగా జరుగుతుందని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడా సదరు వాహనం ఎవరిది అనేది ట్రాఫిక్ పోలీసులకు తెలిసే అవకాశం లేదు. జీహెచ్ఎంసీ కమిషనర్ వాడుతున్న వాహనంపై ఈ–చలాన్లు ఉన్న విషయం ఓ నెటిజనుడు ట్వీట్ చేయడంతో బయటకు వచ్చిందని, దీనికి సంబంధించి పోలీసులపై జీహెచ్ఎంసీ ‘కక్ష’ కట్టడం సాధ్యం కాదని వ్యాఖ్యానిస్తున్నారు. -
గ్రేటర్‌కు మూడు కోట్ల మొక్కలతో ‘హరితహారం’
సాక్షి, హైదరబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘హరితహారం’ కార్యక్రమం ఐదో విడత ఈ నెలలో చేపట్టనున్నారు. గత నాలుగు విడతల్లో ఈ కార్యక్రమం ద్వారా కోట్లాది మొక్కలను నాటిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఈ ఏడాది హరిత హారంలో భాగంగా 83.30 కోట్ల మొక్కలను నాటాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది. ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌లోనే మూడు కోట్ల మొక్కలను నాటేందుకు వీలుగా జీహెచ్ఎంసి కమిషనర్ దాన కిషోర్, అడిషనల్ కమిషనర్లు అమ్రపాలి కాటా, కృష్ణలు భారీ ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా మొక్కలను పెంచడానికి రాజేంద్రనగర్, కొంగరకలాన్‌లోని నర్సరీలకు అప్పగించి వాటి పని తీరును పర్యవేక్షిస్తున్నామని ఆయన తెలిపారు. అయితే ప్రస్తుతానికి కోటి మొక్కలు అందుబాటులో ఉన్నాయని, మిగిలిన కోటిన్నర మొక్కలను ప్రైవేటు నర్సరీలకు ఇవ్వాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం టెండర్లు వేసి అందులో ఎంపికైన ప్రైవేటు నర్సరీలకు మొక్కల పెంపకాన్ని అప్పగించి.. మరో పది రోజుల్లో కోటిన్నర మొక్కలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యకు కొత్త పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యపై సైబరాబాద్ కమిషనరేట్‌లో సమన్వయ సమావేశం జరిగింది. ఈ భేటీలో జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్, సైబరాబాద్ సీపీ సజ్జన్నార్, ఐటీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. వర్షం కారణంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. వర్షాలు పడినప్పుడు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా విడతలవారీగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు బయటకు రావాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ ప్రతిపాదనకు ఐటీ ప్రతినిధులు అంగీకరించినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ వెల్లడించారు. వర్షం పడినప్పుడు ఒకేసారి కాకుండా వేర్వేరు సమయాల్లో ఉద్యోగులను ఇళ్లకు పంపడానికి ఐటీ కంపెనీలు ఒప్పుకున్నాయని, ఆయా కంపెనీల పనివేళలకు నష్టం కలుగకుండా ఉద్యోగులను బయటకు పంపనున్నాయని ఆయన వివరించారు. ట్రాఫిక్ విభాగం నుంచి ఈ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు సీపీ సజ్జన్నార్ తెలిపారు. 24 గంటల ముందే వర్షాలకు సంబంధించి హెచ్చరికలు జారీచేస్తామని, ట్రాఫిక్ పోలీసులు వివిధ ప్రాంతాల్లో రద్దీ గురించి అలర్ట్ చేస్తారని తెలిపారు. విడుతలవారీగా ఐటీ ఉద్యోగులు కంపెనీల నుంచి బయటకు రావడం వల్ల పెద్దగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఇంటికి చేరే అవకాశం ఉంటుందని చెప్పారు. ఐటీ కారిడార్‌లో ఇప్పుడు 5 లక్షలు మంది ఉద్యోగులు ఉన్నారని, ఒకేసారి మూడున్నర లక్షల కార్లు బయటకు వస్తుండటంతో రోడ్లు అన్ని ట్రాఫిక్ స్తంభించిపోతున్నాయని, అందుకే ఈ మేరకు పరిష్కార చర్యలు తీసుకున్నామని తెలిపారు. -
గ్రేటర్లో భవన నిర్మాణ పర్మిషన్ ఇక ఈజీ
సాక్షి, సిటీబ్యూరో: ఇప్పటికే డీపీఎంఎస్ విధానంలో ఆన్లైన్ ద్వారానే భవన నిర్మాణ అనుమతులు, ఓసీలు జారీ చేస్తున్న జీహెచ్ఎంసీ...నిర్మాణ అనుమతుల ప్రక్రియను మరింత సులభతరం చేసింది. ప్రస్తుతం భవన నిర్మాణ అనుమతికి దరఖాస్తు చేసుకుంటున్నవారు ఇతర శాఖల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అవసరమైతే పలు కార్యాలయాల చుట్టూ తిరిగి వాటిని పొందుతున్నారు. ముఖ్యంగా రెవెన్యూ, ఇరిగేషన్, ఫైర్ సర్వీసెస్ తదితర శాఖల నుంచి వీటిని పొందేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఇకపై ఈ శ్రమ లేకుండా ఆన్లైన్లో కామన్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇతర విభాగాల నుంచి క్లియరెన్స్ అవసరమైన పక్షంలో నో అబ్జెక్షన్ కోసం జీహెచ్ఎంసీయే ఆయా విభాగాలకు ఆన్లైన్లో పంపిస్తుంది. ఈమేరకు తగిన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుంది. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా ట్రయల్‌రన్ నిర్వహించారు. ఇది విజయవంతం కావడంతో కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు ఇక ఈ కామన్ అప్లికేషన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవచ్చు. వ్యక్తిగత ఇళ్లు కట్టుకునే వారి నుంచి బహుళ అంతస్తుల వాణిజ్య భవనాలు నిర్మించే వారి వరకు అందరికీ ఇది వర్తిస్తుంది. పరిశ్రమలకు టీఎస్ఐపాస్ తరహాలో జీహెచ్ఎంసీ పరిధిలో భవన నిర్మాణాలకు ఈ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. నోఅబ్జెక్షన్ అవసరమైన రెవెన్యూ, ఇరిగేషన్, ఫైర్సర్వీసెస్, ఫారెస్ట్, ఎలక్ట్రిక్, ఎయిర్పోర్ట్, ట్రాఫిక్,అథారిటీ ఆఫ్ ఇండియా, నేషనల్ మాన్యుమెంట్ అథారిటీలతో జీహెచ్ఎంసీ నెట్వర్క్ అనుసంధానం చేసుకుంది. దరఖాస్తు రాగానే పై వాటిల్లో ఏ శాఖనుంచైనా నో అబ్జెక్షన్ అవసరమైతే ఆన్‌లైన్‌ద్వారా సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు వెళ్తుంది. ఎలాంటి అభ్యంతరం లేనట్లయితే ఓకే చేస్తారు. అభ్యంతరాలుంటే, ఆ విషయాన్నీ తెలియజేస్తారు. ఈ నేపథ్యంలో భవననిర్మాణాలకు దరఖాస్తుచేసుకునే వారికి ఎంతో సమయం, వ్యయం తగ్గుతాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(ఈఓడీబీ)లో భాగంగా జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ విభాగం ఇప్పటికే పలు సంస్కరణలు అమల్లోకి తేవడం తెలిసిందే. శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో టౌన్‌ప్లానింగ్ అధికారులు, బిల్డర్లు, ఫైర్ సర్వీస్, రెవెన్యూ తదితర అధికారులతో జరిగిన సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ ఈ సింగిల్‌విండో అనుమతుల విధానాన్ని ప్రకటించారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో దరఖాస్తుల పరిశీలన త్వరితంగా జరుగుతున్నప్పటికీ, ఇతర శాఖల నుంచి ఎన్ఓసీలు రావడంలో జాప్యం జరిగేదని, ఇక ఈసమస్య ఉండదన్నారు. డీపీఎంఎస్‌లో ఈ కామన్ అప్లికేషన్ విధానాన్ని పొందుపరిచినట్లు తెలిపారు. ఒక్కరోజులోనే అనుమతి.. భవననిర్మాణ అనుమతులు త్వరితంగా జారీ చేసేందుకు ప్రభుత్వం పలు సంస్కరణలు ప్రవేశపెట్టనున్నట్లు దానకిశోర్ తెలిపారు. ముఖ్యంగా 500 గజాల్లోపు స్థలంలో ఇళ్ల నిర్మాణాలకు వచ్చే దరఖాస్తులు నిబంధనల ప్రకారం అన్నీ సవ్యంగా ఉంటే ఒకే రోజులో అనుమతి జారీ చేసే ప్రతిపాదన ఉందని వెల్లడించారు. దీంతోపాటు 200 గజాల్లోపు స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలకు సెల్ఫ్ అప్రూవల్ ప్రతిపాదన కూడా ఉందన్నారు. సమావేశంలో జీహెచ్ఎంసీ చీఫ్‌సిటీప్లానర్ ఎస్.దేవేందర్‌రెడ్డి, ఫైర్సర్వీసెస్ అడిషనల్ డైరెక్టర్ పాపయ్య, డా.సుబ్రహ్మణ్యం (ఆస్కి) పాల్గొన్నారు. అందుబాటులోకి నెట్వర్క్ రెవెన్యూ, ఇరిగేషన్, ఫైర్సర్వీసెస్, ఫారెస్ట్, ఎలక్ట్రికల్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నేషనల్ మాన్యుమెంట్ అథారిటీ శాఖల నుంచి నెట్వర్క్ అందుబాటులోకి వచ్చిందని జీహెచ్ఎంసీ చీఫ్ సిటీప్లానర్ దేవేందర్‌రెడ్డి తెలిపారు. వీటిల్లో నివాస గృహాలకు ముఖ్యంగా యూఎల్సీ, ప్రభుత్వభూమి వంటి సమాచారం కోసం రెవెన్యూతోపాటు ఇరిగేషన్ విభాగాల నుంచి ఎన్ఓసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్)అవసరం అయ్యే అవకాశం ఉందన్నారు. మిగతా శాఖల నుంచి పెద్దగా ఎన్ఓసీ అవసరం ఉండదని, వాణిజ్య, బహుళ అంతస్తుల భవనాలకు మాత్రం మిగతా శాఖలనుంచీ ఎన్ఓసీ అవసరమవుతుందన్నారు. -
‘ఆపరేషన్’ రెయిన్!
సాక్షి, సిటీబ్యూరో: ఈ సీజన్లో కురిసిన తొలి వర్షానికే ఐటీ కారిడార్‌లో పరిస్థితి అతలాకుతలంగా మారడంతో..ఇక ముందు అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు జీహెచ్ఎంసీ అధికారులు తగిన కార్యాచరణ రూపొందించారు. ఒక్క వర్షానికే హైటెక్‌సిటీ జీవనం కకావికలం కావడంతో, అందుకు కారణాలు, పరిష్కార మార్గాలపై సమీక్షలు నిర్వహించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ హరిచందన దాసరి, చీఫ్ ఇంజినీర్ జియాఉద్దీన్, జేఎన్టీయూ నిపుణులు శని, ఆదివారాల్లో నీటిముంపు ప్రాంతాలను పరిశీలించారు. ఆదివారం సైబరాబాద్ పోలీస్ కార్యాలయంలో వీరితో పాటు విద్యుత్ అధికారులు, తదితరులతో సమీక్ష నిర్వహించారు. సమీక్షలు, క్షేత్రస్థాయి తనిఖీల పరిస్థితులతో వర్ష సమస్యల పరిష్కారానికి తగు నిర్ణయాలు తీసుకున్నారు. నగరంలో మొత్తం 197 ప్రాంతాల్ని నీటి ముంపు సమస్య ప్రాంతాలుగా గుర్తించారు. వీటిల్లో 37 ప్రాంతాలకు ఇప్పటికే శాశ్వత పరిష్కారం చేయగా, ఇవి పోను మిగతా 160 ప్రాంతాలను సమస్య తీవ్రతను బట్టి ఏ,బీ,సీ కేటగిరీలుగా విభజించారు. వీటిల్లో ఏ కేటగిరీలో సీజన్ ముగిసేంత వరకు నీటిని తోడే భారీ మోటార్ పంపులను, సిబ్బందిని శాశ్వతంగా 24 గంటల పాటు అందుబాటులో ఉంచుతారు. వర్షం పడగానే వారు రంగంలోకి దిగుతారు. మిగతా ప్రాంతాల్లో దగ్గర్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, షాపులు, వంటి ప్రాంతాల్లో 3 హెచ్‌పీ, 5 హెచ్‌పీ సామర్ధ్యం కలిగిన మోటార్ పంపులను ఉంచుతారు. వర్షం పడుతుందనే వాతావరణశాఖ సూచనలతో లేదా వర్షం పడ్డ వెంటనే తోడేందుకు మనుషులు అక్కడకు వెళ్తారు. ఇరవైనాలుగు గంటల్లో ఎప్పుడైనా వెంటనే సన్నద్ధంగా ఉంటారు. ప్రత్యేక యాక్షన్ ప్లాన్.. శేరిలింగంపల్లి, గచ్చిబౌలి ప్రాంతాల్లోని 12 లొకేషన్లలో సమస్య పరిష్కారానికి ప్రత్యేకంగా యాక్షన్‌ప్లాన్ రూపొందించారు. అక్కడి పరిస్థితుల్ని బట్టి దేనికదిగా వేర్వేరుగా ఈ యాక్షన్‌ప్లాన్ రూపొందించారు. జేఎన్టీయూ ప్రొఫెసర్ లక్ష్మణ్‌రావు సూచనల మేరకు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఎక్కడికక్కడే వరదనీరు సమీపంలోని ఒక ప్రాంతానికి చేరి నిల్వ ఉండేలా పర్కొలేషన్ట్యాంక్స్ (నీటి కుంటలు) 30 ్ఠ 20 అడుగులతో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దుర్గం చెరువు, నెక్టర్‌గార్డెన్, శిల్పారామం తదితర ప్రాంతాల్లోని ఖాలీస్థలాల్లో ఈ నీటికుంటలు ఏర్పాటు చేసి వరదనీరు వాటిల్లోకి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తారు. శిల్పారామం వంటి ప్రాంతాల నుంచి తూము పొంగుతున్నా పక్కనే ఉన్న చెరువులోకి నీరు వెళ్లేందుకు దారి లేదు. ఇలాంటి సమస్యలనూ పరిష్కరించాలని నిర్ణయించారు. అవసరమైన ప్రాంతాల్లో 1. 2 డయామీటర్ పైపుల్ని వెంటనే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్( హెచ్ఆర్డీసీఎల్) ప్రాంతాల్లో అది సంబంధిత పనుల్ని చేస్తుంది. మైండ్‌స్పేస్ వద్ద సమస్య సరిష్కారానికి టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో నీరు రోడ్డుకు ఇటు నుంచి అటు వెళ్లేందుకు పైప్‌లైన్‌ను మూడు రోజుల్లో వేయనున్నారు. సీఓడీ, సాఫ్టెల్ సిగ్నల్ జంక్షన్ల వద్ద అభివృద్ధి పనులకు జోనల్ కమిషనర్ వెంటనే టెండర్లు పిలవనున్నారు. పలు ప్రాంతాల్లో వరదకాలువల్లో ఉన్న విద్యుత్ లైన్లు, ఫైబర్ కేబుళ్లు తదితరమైన వాటితో సమస్య పెరుగుతుండటంతో . వీటిని వెంటనే తొలగించనున్నారు. పలు ప్రాంతాల్లో వరదకాలువల్లో ఉన్న విద్యుత్ లైన్లు, ఫైబర్ కేబుళ్లు తదితరమైన వాటితో సమస్య పెరుగుతుండటంతో . వీటిని వెంటనే తొలగించనున్నారు. ఫుట్‌పాత్‌ల దగ్గర నీరు సాఫీగా వెళ్లేందుకు వీలుగా అవకాశమున్న అన్ని ప్రాంతాల్లో వెంట్లను పెద్దగా ఏర్పాటు చేస్తారు. జీహెచ్ఎంసీ వర్షాకాల విపత్తు బృందాలు, డీఆర్ఎఫ్ టీమ్స్ తదితరమైనవి కలిపి దాదాపు 500 వర్షాకాల బృందాలు సేవలందించేందుకు సిద్ధంగా ఉంటాయి. ప్రస్తుతం 8 డీఆర్ఎప్ టీమ్‌లుండగా, మరో 8 ఏర్పాటు చేయనున్నారు. ఎస్సార్డీపీ (వ్యూహాత్మక రహదారుల పథకం) పనులు జరుగుతున్న ప్రాంతాల్లో నిర్మాణ సామాగ్రి, ఇసుక, తదితరమైన వాటివల్ల నీరు నిలిచిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని దానకిశోర్ ఆదేశించారు. పనులు జరిగే ప్రాంతాల్లో తప్పనిసరిగా సైన్‌బోర్డులు ఏర్పాటు చేయడంతో వర్షాల వల్ల ప్రమాదాలు జరగకుండా అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్ల వెంబడి, నాలాల్లో నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాలు (సీఅండ్‌డీ వేస్ట్), ప్లాస్టిక్స్, చెత్త వేసేవారికి భారీ జరిమానాలు విధించాల్సిందిగా సూచించారు. వర్షం కురుస్తున్నప్పుడు ప్రజలు బయటకు రావద్దని కమిషనర్ సూచించారు. అప్పటికే రోడ్ల మీద వున్నవారు సాఫీగా ఇంటికి చేరుకునేందుకు అవకాశమివ్వాలన్నారు. అందరూ రోడ్లపైకి వస్తే ట్రాఫిక సమస్యలు ఎదురవుతాయన్నారు. ఐటీ కారిడార్‌లోని 5 లక్షలమంది ఒకేసారి బయటకు వస్తే ఇబ్బందులుంటాయని, విడతల వారీగా అయితే ట్రాఫిక్ చిక్కులుండవని పేర్కొన్నారు. వర్షం వచ్చాక గంట సేపటి వరకు బయటకు రాకపోవడం శ్రేయస్కరమని చెప్పారు. -
నల్లా.. గుల్ల
సాక్షి, సిటీబ్యూరో: అక్రమ నల్లాలు పలు అపార్ట్మెంట్ వాసుల పాలిట శాపంగా మారుతున్నాయి. తెలిసీ తెలియక ఫ్లాట్స్కొనుగోలు చేసి..తీరా జలమండలి విజిలెన్స్ పోలీసుల తనిఖీల్లో అక్రమ నల్లాలు బయటపడితే సదరు బహుళ అంతస్తుల భవంతిలో నివసిస్తున్న అందరు ఫ్లాట్స్ ఓనర్లపై క్రిమినల్ కేసులు నమోదవుతున్నాయి. ఇటీవలఒకటి కాదు..రెండు కాదు ఏకంగా 150 మంది వినియోగదారులు ఈ జాబితాలో చిక్కుకొని విలవిల్లాడుతున్నారు. కొనుగోలుకు ముందే సదరు భవనానికి జీహెచ్ఎంసీ నుంచి అన్నిరకాల నిర్మాణ అనుమతులు, జలమండలి నల్లా కనెక్షన్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకుంటే ఈ చిక్కులు తప్పుతాయని జలమండలి అధికారులు స్పష్టం చేస్తున్నారు. అక్రమ నల్లాల దందా ఇలా... గ్రేటర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో శరవేగంగా అపార్ట్మెంట్ల నిర్మాణం జరుగుతోంది. ఆయా ప్రాంతాల్లో నిర్మితమౌతున్న బహుళ భవంతులకు నిర్మాణ విస్తీర్ణం, అంతస్తులు, ఫ్లాట్స్ సంఖ్య ఆధారంగా కనెక్షన్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. జలమండలికి నిబంధనల మేరకు కనెక్షన్ చార్జీలు చెల్లించాలంటే రూ.8–10 లక్షల మధ్యన ఖర్చు అవుతుంది. అయితే కొందరు బిల్డర్లు కక్కుర్తిగా వ్యవహరించి క్షేత్రస్థాయి సిబ్బంది సహకారంతో సదరు భవనానికి అక్రమ నల్లాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. మరికొందరు బిల్డర్లు 50 ఫ్లాట్స్ ఉన్న భవంతికి సైతం కేవలం గృహవినియోగ నల్లా 15 ఎంఎం కనెక్షన్ మాత్రమే అధికారికంగా తీసుకొని అనధికారికంగా 40 ఎంఎం నల్లాను ఏర్పాటుచేసుకుంటున్నారు. ఈ భాగోతాలన్నీ ఇటీవల జలమండలి విజిలెన్స్ పోలీసుల తనిఖీల్లో గుట్టలుగా బయటపడుతున్నాయి. కేసులపాలవుతున్నారిలా.. గ్రేటర్ పరిధిలోని 20 నిర్వహణ డివిజన్ల పరిధిలో జలమండలికి 9.80 లక్షల నల్లా కనెక్షన్లున్నాయి. ఇవి కాకుండా మహానగరంలో అక్రమనల్లాలు సుమారు లక్షకు పైగానే ఉన్నట్లు బోర్డు వర్గాల్లో బహిరంగ రహస్యమే. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది సహకారంతో భూమి లోపలున్న అక్రమ నల్లాల గుట్టు తవ్విచూసినప్పుడే రట్టవుతోంది. జలమండలి సరఫరా చేస్తున్న విలువైన తాగునీటిలో సరఫరా, చౌర్యం తదితర నష్టాలు 40 శాతం మేర ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అయితే అక్రమ నల్లాలున్న వినియోగదారులపై ఇటీవల జలమండలి విజిలెన్స్ పోలీసులు ఐపీసీ 430,379,269 సెక్షన్ల కింద సమీప పోలీస్స్టేషన్లలో క్రిమినల్ కేసులు నమోదుచేస్తున్నారు. అక్రమార్కులకు భారీగా జరిమానా విధించడతోపాటు నేరం రుజువైన పక్షంలో ఐదేళ్ల వరకు జైలుశిక్ష పడుతుందని విజిలెన్స్ పోలీసులు స్పష్టంచేస్తున్నారు. ఇటీవలికాలంలో సుమారు 150 మంది వినియోగదారులపై ఇలాంటి కేసులు నమోదైనట్లు తెలిపారు. క్రమబద్ధీకరణ ఇలా... అక్రమనల్లాలు ఇప్పటికీ గుట్టుచప్పుడుగా కొనసాగుతున్న భవంతుల యజమానులు ఇప్పటికైనా కళ్లు తెరిచి జలమండలి నిర్దేశించిన రెట్టింపు కనెక్షన్ చార్జీలు(నిర్మాణ విస్తీర్ణాన్ని బట్టి), మూడేళ్లపాటు సరాసరి కనీస నీటిబిల్లును వాటర్‌బోర్డుకు చెల్లించి తమ అక్రమనల్లాలను క్రమబద్ధీకరించుకోవాలని జలమండలి అధికారులు సూచిస్తున్నారు. తాజాగా మరో గుట్టు రట్టు.. షాపూర్ నగర్‌లోని నెహ్రూనగర్‌కు చెందిన ఇంటినెంబర్– 66 భవనానికి అధికారుల అనుమతి లేకుండా అక్రమంగా నల్లా కనెక్షన్ ఉన్నట్లు సోమవారం జలమండలి విజిలెన్స్ అధికారుల తనిఖీలో గుర్తించారు. సదరు భవనానికి అక్రమ నల్లా కనెక్షన్ తొలగించడంతో పాటు సంబంధిత భవన యాజమాని జి. ప్రమీలపై జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఐపీసీ 269,430, 379 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిగ్గు తేలుస్తాం జలమండలి ఆదాయాని భారీగా గండికొడుతూ..గ్రేటర్ పరిధిలో పలు భవంతులకున్న అక్రమనల్లాల నిగ్గు తేల్చాలని బోర్డు విజిలెన్స్ పోలీసులకు స్పష్టమైన ఆదేశాలిచ్చాం. అక్రమార్కులు దారికొచ్చేవరకు వరుస తనిఖీలు నిర్వహిస్తాం. వినియోగదారులు సైతం ఫ్లాట్స్ కొనుగోలుకు ముందు జీహెచ్ఎంసీ నుంచి భవన నిర్మాణ అనుమతులు, జలమండలి నల్లా కనెక్షన్ వివరాలు తనిఖీ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయాలి. – ఎం.దానకిశోర్, జలమండలి ఎండీ -
మూణ్నెళ్లలో ముగించాలి
సాక్షి, సిటీబ్యూరో: ఎల్బీనగర్–బైరామల్‌గూడ మార్గంలో నిర్మిస్తున్న అండర్‌పాస్ పనులను మూడు నెలల్లో పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ ప్రాజెక్టు విభాగం ఇంజినీర్లను ఆదేశించారు. అండర్‌పాస్ పనులను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. జోనల్ కమిషనర్ ఎస్.శ్రీనివాసరెడ్డితో కలిసి పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అండర్‌పాస్ నిర్మాణంతో ఎల్బీనగర్ జంక్షన్లో దాదాపు 90శాతం ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోతాయన్నారు. నిర్మాణానికి అవసరమైన భూసేకరణను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎల్బీనగర్ జంక్షన్లో రూ.44.74 కోట్లతో ఎస్సార్డీపీ పనులు జరుగుతున్నాయని తెలిపారు. 520 మీటర్ల పొడవుండే ఈ అండర్‌పాస్‌లో ఎల్బీనగర్ ఎడమ వైపు నిర్మాణంలో 17 రాఫ్ట్‌లు, 76 రిటైనింగ్ లిఫ్ట్‌లు, 111 ప్రీకాస్ట్ బాక్స్‌వాల్ సెగ్మెంట్లు, 49 బాక్స్ ప్రీ స్లాబ్ ప్లాంక్‌ల నిర్మాణం పూర్తయిందని వివరించారు. పనులు పూర్తయ్యేందుకు నాలుగు నెలలు పడుతుందని ఇంజినీర్లు కమిషనర్‌కు వివరించగా... పనుల్లో వేగం పెంచి మూడు నెలల్లోనే పూర్తి చేయా లని సూచించారు. ఎస్సార్డీపీ పనులకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. జనరల్ ఫండ్ నుంచి ఇటీవల రూ.42 కోట్లు ఎస్సార్డీపీ బిల్లులకు చెల్లించినట్లు పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఎస్సార్డీపీ పనులకు ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకుంటామని చెప్పారు. ‘డబుల్’ కాలనీల్లో బస్తీ దవాఖానాలు.. నగరంలో నిర్మిస్తున్న లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాలనీల్లో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసే యోచన ఉందని కమిషనర్ తెలిపారు. వనస్థలిపురంలో రూ.28కోట్ల వ్యయంతో చేపట్టిన 324 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం దాదాపు 70శాతం పూర్తయిందని జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి కమిషనర్‌కు వివరించారు. డ్రైనేజీ, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టిన నాలాల పూడికతీత తొలిదశ పనులన్నింటినీ మే చివరి వరకు పూర్తి చేయాలన్నారు. లేని పక్షంలో ఇంజినీర్లపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. ఎల్బీనగర్ జోనల్ కార్యాలయంలో ఇంజినీరింగ్ పనులపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ... నాలాల్లో పూడిక తీస్తున్న ప్రాంతాల్లో ఆయా పనుల సమాచారాన్ని తెలిపే బోర్డులు ప్రదర్శించాలని సూచించారు. బోర్డులపై పనుల విలువ, పూర్తయ్యే తేదీ, ఇన్చార్జి అధికారి పేరు తదితర వివరాలు ఉండాలన్నారు. టెండర్లు దక్కించుకున్నప్పటికీ ఇప్పటి వరకు పీపీఎం రోడ్ల పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను రద్దు చేసి, మళ్లీ టెండర్లు పిలిచే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఇతర జోన్లతో పోలిస్తే ఎల్బీనగర్లో ఇంజినీరింగ్ పనులు పురోగతిలో ఉండడంపై అధికారులను అభినందించారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, ఇన్చార్జి చీఫ్ ఇంజినీర్ అశ్విన్‌కుమార్, ఎస్ఈ శంకర్‌లాల్ తదితరులు పాల్గొన్నారు. -
జీహెచ్ఎంసీ కమిషనర్‌తో సాక్షి ‘ఫోన్ ఇన్’
విశ్వనగరంగా ఎదుగుతోన్న హైదరాబాద్ వివిధ రంగాల్లో ముందంజలో ఉంటున్నప్పటికీ, కొన్ని అంశాల్లో వెనుకబడి ఉంది. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు వినియోగించుకోవడంలోనూ ప్రజలకు పలు ఇబ్బందులెదురవుతున్నాయి. స్వచ్ఛ ర్యాంకింగ్‌లో నగరానికి మెరుగైన స్థానం లభిస్తున్నా క్షేత్ర స్థాయి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రజలు తమకెదురవుతున్న వివిధ సమస్యలను నేరుగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ దృష్టికి తెచ్చి పరిష్కరించుకునేందుకు ‘సాక్షి’ ఫోన్–ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందుకు మీరు చేయాల్సింది ఒక్క ఫోన్ కాల్. ఓటరు జాబితాలో పేరు నమోదు.. పొరపాట్ల సవరణ, స్వచ్ఛ హైదరాబాద్, పారిశుధ్యం, పచ్చదనం, ట్రాఫిక్, నగర సుందరీకరణ, భవన నిర్మాణ వ్యర్థాలు, రోడ్లు, నాలాలు, మ్యాన్‌హోళ్లు, ఫుట్‌పాత్‌లు, నిర్మాణ అనుమతులు, ఆస్తిపన్ను ఫిర్యాదులు తదితర సమస్యలను కమిషనర్‌కు తెలియజేయవచ్చు. మెరుగైన సదుపాయాల కల్పనకు తగిన సూచనలూ చేయవచ్చు. తేదీ: 21-2-2019 (గురువారం) సమయం: మధ్యాహ్నం 3 గంటల నుంచి సా.4 వరకు ఫోన్ చేయాల్సిన నంబర్లు: 04023222018, 23261330 అంశం: నగరంలో పౌర సమస్యలు -
పార్లమెంట్ ఎన్నికలకు మేం సిద్ధం
సాక్షి, సిటీబ్యూరో: త్వరలో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్ జిల్లాలో తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ పేర్కొన్నారు. జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల ఏర్పాట్లపై నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, పోలీసు, రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులతో మంగళవారం జీహెచ్ఎంసీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ దానకిశోర్ మాట్లాడుతూ, ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్నందున ఇప్పటి నుంచే ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను చేపట్టాలని సూచించారు. సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్, హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారని తెలిపారు. ప్రతి అసెంబ్లీ సిగ్మెంట్‌కు డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, ఆర్డీఓలను సహాయ రిటర్నింగ్ అధికారులుగా నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ముషీరాబాద్, అంబర్పేట్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, నాంపల్లి, సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గాలున్నాయని, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మలక్‌పేట్, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, బహదూర్‌పురా అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయని తెలిపారు. కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ మాత్రం మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఉందని స్పష్టం చేశారు. 2019 ఫిబ్రవరి 10వ తేదీ నాటికి సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలో 19,14,954 మంది ఓటర్లుండగా, 706 భవనాల్లో 1,809 పోలింగ్ కేంద్రాలున్నాయని, అలాగే హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో 19,32,926 మంది ఓటర్లు ఉండగా 770 భవనాల్లో 1,935 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లా పరిధిలో 1,404 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు, 552 క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లొకేషన్లు ఉన్నాయని తెలిపారు. ఓటర్ల తుది జాబితా ఈనెల 22వ తేదీన ప్రకటిస్తున్నందున ఓటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన సమస్యలు తిరిగి పునరావృతం కాకుండా పకడ్బందీచర్యలు చేపట్టాలని ఆదేశించారు. వారికి ఎన్నికల విధుల్లేవ్.. 2019 మే 31వ తేదీకి నాటికి హైదరాబాద్ నగరంలో వరుసగా మూడేళ్లు పనిచేసిన వారిని, హైదరాబాద్ సొంతజిల్లా అయిన అధికారులను ఈ ఎన్నికల విధుల్లో నియమించడంలేదని స్పష్టం చేశారు. నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మాట్లాడుతూ హైదరాబాద్ జిల్లా పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లకు ఏసీపీ స్థాయి అధికారులను పోలీసు నోడల్ అధికారులుగా నియమిస్తున్నామని తెలిపారు. ఎన్నికల కేసుల్లో ఉన్న వ్యక్తులను బైండోవర్ చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలోఇన్ఛార్జి కలెక్టర్ రవి, డీసీపీలు రమేష్, అంబర్ కిషోర్ జా పాల్గొన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా ఓటర్లు.. గత సంవత్సరం డిసెంబర్ 26వ తేదీనవెలువరించిన ముసాయిదా ఓటర్ల జాబితా తర్వాత కొత్తగా ఓటర్లుగా నమోదైన వారు, తొలగించిన ఓటర్లను పరిగణనలోకి తీసుకుంటే ఫిబ్రవరి 10వ తేదీ నాటికి ఓటర్ల సంఖ్య ఇలా ఉంది. -
మై డ్రీమ్ విజన్ విశ్వనగర్
సాక్షి,సిటీబ్యూరో: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక.. ‘విశ్వనగర విజన్’ సాకారం చేసేందుకు శ్రమిస్తున్నామని బల్దియా బాస్ దానకిశోర్ అన్నారు. గ్రేటర్ వాసులకు స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేస్తామన్నారు. అందుకోసం కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల నుంచి మరో 20 టీఎంసీల నీటిని తరలించనున్నట్టు తెలిపారు. మహానగర వ్యాప్తంగా ట్రాఫిక్ అవస్థలు లేని బహుళ వరుసల రహదారులు తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. అంతేకాదు.. ఉప్పొంగే మురుగు సమస్యల నివారణకు సీవరేజీ మాస్టర్‌ప్లాన్ అమలు, మూడుకోట్ల మొక్కలు నాటి నగరాన్ని ‘గ్రీన్ సిటీ’గా తీర్చిదిద్దడం తమ ప్రాధాన్య అంశాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం మేరకు గ్రేటర్ పరిధిలో బల్దియా, జలమండలి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో చేపట్టనున్న నూతన ప్రాజెక్టులు, పథకాల వివరాలను శుక్రవారం ఆయన ‘సాక్షి’ దినపత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సమగ్రంగా వివరించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. మహానగరం దాహార్తిని మరో వందేళ్ల వరకు దూరం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు కేశవాపూర్‌లో 10 టీఎంసీల గోదావరి జలాలు, నగర శివార్లలోని దేవులమ్మ నాగారం వద్ద మరో 10 టీఎంసీల కృష్ణాజలాల నిల్వకు సరికొత్త ప్రాజెక్టులకు చేపడుతున్నాం. ముందుగా రూ.4700 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న కేశవాపూర్ తాగునీటి పథకం పనులు ప్రారంభించి రెండేళ్లలోగా పూర్తిచేస్తాం. నగరం నలుమూలలకు గోదావరి, కృష్ణా జలాల సరఫరాకు వీలుగా రూ.4 వేల కోట్ల వ్యయంతో ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ జలహారం(వాటర్‌గ్రిడ్) ఏర్పాటు చేయనున్నాం. పాతనగరంలో నూతన రిజర్వాయర్ల నిర్మాణం, తాగునీటి సరఫరా వ్యవస్థ విస్తరణకు రూ.500 కోట్లు వెచ్చించనున్నాం. ప్రధాన నగరంలో పురాతన పైపులైన్ల స్థానంలో నూతన పైపులైన్ల ఏర్పాటు, రోజూ నీటి సరఫరా, లీకేజీల నివారణకు మరో వెయ్యి కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేశాం. ఓఆర్ఆర్కు ఆనుకొని ఉన్న గేటెడ్ కమ్యూనిటీల్లో తాగునీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటుకు మరో రూ.500 కోట్లు వెచ్చిస్తాం. భూగర్భ జలాలను విచక్షణా రహితంగా తోడేస్తున్న ప్రైవేట్ ట్యాంకర్లను నియంత్రించేందుకు జలమండలి ఫిల్లింగ్ కేంద్రాల ద్వారా వాటికి నీటిని సరఫరా చేసే అంశాన్ని పరిశీలిస్తున్నాం. పేదలకు ఉచితంగా సరఫరా చేసే మంచినీటి ట్యాంకర్లు పక్కదారి పట్టకుండా వాటికి జీపీఆర్ఎస్ వ్యవస్థను అమర్చి పర్యవేక్షిస్తాం. మురుగు నివారణకు సీవరేజీ మాస్టర్‌ప్లాన్ గ్రేటర్ చాలాచోట్ల మురుగు పొంగి పొర్లుతుంది. ఇకపై ఆ సమస్యలు లేకుండా సమగ్ర సీవరేజీ మాస్టర్‌ప్లాన్ అమలు చేయనున్నాం. ఇందులో రూ.5 వేల కోట్ల వ్యయంతో నగరం నలుమూలల్లో 50 మురుగుశుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. వాటి ద్వారా మరో 1500 మిలియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధి చేసే అవకాశం ఉంది. సిటీలో ప్రధాన నాలాలు, మూసీ, ఇతర చెరువుల్లో మురుగు నీరు చేరకుండా వీటిని నిర్మిస్తాం. వీటిలో మురుగు నీటిని మూడు దశల్లో సమూలంగా శుద్ధిచేసి భవన నిర్మాణాలు, గార్డెనింగ్, ఫ్లోర్ క్లీనింగ్ వంటి అవసరాలకు వినియోగించుకోవచ్చు. మరో నెలరోజుల్లో దీనికి సంబంధించిన మాస్టర్‌ప్లాన్‌ను షా కన్సల్టెన్సీ సిద్ధం చేయనుంది. మరో రూ.10 వేల కోట్లతో ప్రధాన నగరంతో పాటు శివార్లలో మురుగునీటి పారుదల వ్యవస్థకు సంబంధించిన పైపులైన్లు ఏర్పాటు చేస్తాం. మురుగు నీటి శుద్ధి, పునర్వినియోగంపై యాస్కీ సంస్థ విధానపత్రాన్ని సిద్ధం చేస్తోంది. ఇప్పటికే దేశంలో ఏ నగరంలోనూ లేనివిధంగా ఎస్టీపీల్లో ఫేకల్ స్లడ్జ్ ఆనవాళ్లు లేకుండా శుద్ధిచేస్తున్న చేస్తున్న సిటీగా గుర్తింపు సాధించాం. గ్రేటర్ ఇక గ్రీన్ సిటీ.. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సూచనల మేరకు నూతనంగా భవనాలు నిర్మించుకునేవారు గృహ అవసరాలకు వినియోగించే విద్యుత్‌లో కొంత మొత్తాన్ని ఇంటిపై సౌరఫలకాల ఏర్పాటు ద్వారా సొంతంగా ఉత్పత్తి చేసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. జలమండలిలో ప్రస్తుతం 30 మెగావాట్లు, రాబోయే రోజుల్లో మరో వంద మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు రూపొందించాం. ప్రస్తుతం చెత్త నుంచి 20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి వీలుగా ప్రాజెక్టు సిద్ధమవుతోంది. వచ్చే నాలుగేళ్లలో మరో 98 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధనే లక్ష్యం నిర్దేశించాం. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి, సౌరవిద్యుత్ ఉత్పత్తి, ప్రతీ ఇంటికి మొక్కల పంపిణీతో పాటు హరితహారంలో మూడుకోట్ల మొక్కల పెంపకమే లక్ష్యం. తద్వారా గ్రేటర్ నగరాన్ని హరితనగరంగా మారుతుంది. మురికివాడలకు మౌలిక వసతులు నగరంలోని నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం ప్రాజెక్టును వేగవంతం చేశాం. మురికివాడల్లో మౌలిక వసతుల కల్పన, ఇంటింటికీ నల్లాల ఏర్పాటు, సోలార్ పవర్‌తో వీధిదీపాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇతర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మరింత మెరుగైన ర్యాంకును సాధించేందుకు ప్రయత్నిస్తాం. ఎస్ఆర్డీపీతో బహుళ వరుసల దారులు ఎస్ఆర్డీపీ పథకంలో భాగంగా రూ.22,500 కోట్లతో చేపట్టనున్న పనులను త్వరలో పూర్తిచేయనున్నాం. నగరంలో ఇప్పటికే పలు చోట్ల పనులు పురోగతిలో ఉన్నాయి. మిగతా పనులు టెండర్ల దశలో ఉన్నాయి. ఇప్పటికే చేపట్టిన పనులను ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతాయి. జంక్షన్ల అభివృద్ధితో డల్లాస్ తరహాలో తీరైన రహదారులను తీర్చిదిద్దుతాం. సిబ్బందికి అత్యుత్తమ శిక్షణ జీహెచ్ఎంసీలో సుమారు 38 వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిందరికీ దశలవారీగా ప్రజలకు మరింత సేవలందించేందుకు, సామర్థ్యం, నైపుణ్యం పెంచేందుకు అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ ఇస్తాం. అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు చారిత్రక భాగ్యనగరంలో చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపదను కాపాడుతూనే ఇస్తాంబుల్ తరహాలో పాతనగరాన్ని.. డల్లాస్ తరహాలో ప్రధాన నగరాన్ని తీర్చిదిద్దేందుకు బృహత్తర ప్రణాళికలు రూపొందించాం. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్, జైకా, హడ్కో, ఎస్బీఐ తదితర బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణ సదుపాయం పొందేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇండియా క్రెడిట్, సెబీలు ఇప్పటికే జీహెచ్ఎంసీకి ‘ఏఏ’ క్రెడిట్ రేటింగ్ ఇచ్చాయి. ఈ రేటింగ్‌తో ఆయా ఆర్థికసంస్థల నుంచి ఒకేసారి ఏకమొత్తంగా సుమారు రూ.10 వేల కోట్ల రుణం పొందే అవకాశం ఉంది. నిధుల వెల్లువతో గ్రేటర్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడం ద్వారా సీఎం కేసీఆర్ కలలను సాకారం చేస్తాం. ఇన్నాళ్లు సిటీజన్లకు ఉన్న అన్ని రకాలా అవస్థలను దూరం చేస్తాం. ఇక ట్రాఫిక్ అవస్థలకు చరమగీతం లీ అసోసియేట్స్ అందజేసిన మాస్టర్‌ప్లాన్ ప్రకారం నగరంలో అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థ, జంక్షన్ల విస్తరణ, ట్రాఫిక్ ఇక్కట్లు లేకుండా తీర్చిదిద్దే ఏర్పాట్లు రెడీ చేశాం. తక్షణం రూ.200 కోట్లతో ఈ పనులు చేపట్టనున్నాం. జలాశయాలకు మహర్దశ గ్రేటర్ పరిధిలోని 185 చెరువులను తక్షణం ప్రక్షాళన చేయడంతో పాటు వాటిని సుందరీకరిస్తాం. ఇప్పటికే 18 చెరువుల ప్రక్షాళన పనులు మొదలయ్యాయి. జలాశయాలను కాపాడేందుకు లేక్ పోలీసులను ఏర్పాటు చేశాం. వాటిని కలుషితం చేస్తున్నవారిపై నిఘా పెట్టేందుకు సీసీటీవీలు సైతం ఏర్పాటు చేస్తాం. భవన నిర్మాణ అనుమతులు సరళతరం గ్రేటర్లో భవన నిర్మాణాల అనుమతులను మరింత సరళతరం చేయనున్నాం. ఇందుకోసం ‘డీపీఎంఎస్’ విధానంలో సరికొత్త సంస్కరణలు ప్రవేశపెడతాం. హరిత భవనాల నిర్మాణాలపై సిటీజన్లకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నెలలో ఒకరోజు ప్రత్యేకంగా అవగాహన తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. 500 చదరపు అడుగుల విస్తీర్ణానికి లోబడి ఇళ్లు నిర్మించుకునేవారి సౌకర్యార్థం జీహెచ్ఎంసీ వెబ్సైట్లో ఎలాంటి వాస్తు ఫిర్యాదులు లేకుండా సుమారు మూడువేల ఇళ్ల నిర్మాణాల ప్లాన్లు అందరికీ అందుబాటులో పెట్టనున్నాం. ఇంటి నిర్మాణ అనుమతికి దరఖాస్తు చేసుకునేవారికి తమ దరఖాస్తు ఏ స్థాయిలో ఉందో తెలుసుకునే అవకాశం కల్పిస్తాం. బల్దియా అందించే ప్రతీసేవను నిర్ణీత గడువులోగా పొందేందుకు వీలుగా సిటిజన్ చార్టర్‌ను పక్కాగా అమలుచేస్తాం. డిప్యూటీ కమిషనర్ స్థాయిలో వివిధ రకాల సమస్యల పరిష్కారానికి డాష్‌బోర్డ్‌లను ఏర్పాటు చేస్తాం. -
అందుబాటు గృహాలపై దృష్టి పెట్టండి!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ డెవలపర్లు ఎగువ మధ్య తరగతి ప్రజల గృహ నిర్మాణాలపై చూపించినంత శ్రద్ధ.. అందుబాటు గృహాల నిర్మాణంలో చూపించట్లేదని జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిశోర్ తెలిపారు. ప్రధాన్‌మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం వినియోగంలో హైదరాబాద్ అత్యంత వెనకబడి ఉందని.. ఈ పథకం కింద అఫడబుల్ గృహాల నిర్మాణంలో ముంబై నగరం బెటరని చెప్పారు. హైదరాబాద్‌లో 2 బీహెచ్‌కే గృహాల నిర్మాణాలను ప్రభుత్వమే చేస్తుందని, ప్రైవేట్ నిర్మాణ సంస్థలు కూడా పేదలు, దిగువ మధ్య తరగతికి అవసరమైన అఫడబుల్ గృహాలను నిర్మించాల్సిన అవసరముందని ఆయన సూచించారు. కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (క్రెడాయ్) సమావేశంలో ముఖ్య అతిథిగా కిశోర్ పాల్గొన్నారు. గ్రీన్ సిటీగా మాదాపూర్.. చైనా, సౌత్ కొరియా వంటి దేశాల్లో లాగా హైదరాబాద్ నిర్మాణ రంగంలోనూ టెక్నాలజీని వినియోగించాలి. దీంతో నిర్మాణ రంగంలో వేగంతో పాటూ అంతర్జాతీయ డిజైన్లు, నాణ్యత బాగుంటుంది. గ్రీన్ టెక్నాలజీ వినియోగంలో డెవలపర్లు ఆసక్తి చూపించాలి. వచ్చే ఏడాది నుంచి నగరంలోని ప్రతి భవనం గ్రీన్ ఎనర్జీ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని.. మాదాపూర్, హైటెక్ సిటీలను గ్రీన్ సిటీలుగా మార్చాలి. ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు.. వచ్చే ఐదేళ్లలో హైదరాబాద్‌లో రహదారులు, మంచి నీటి వంటి మౌలిక వసతుల కోసం రూ.50 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. కేశపురం, దేవుల నాగారం ప్రాంతాల్లో రెండు రిజర్వాయర్లను నిర్మించనున్నాం. వీటి సామర్థ్యం 20 టీఎంసీలు. ఇప్పటికే 29 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా 49 టీఎంసీల నీటితో భవిష్యత్తులో నగరానికి నీటి కొరతే ఉండదని ధీమావ్యక్తం చేశారు. నగరంలో మెట్రో రైల్‌తో పాటు మరొక ట్రాఫిక్ సొల్యూషన్ అవసరముందని తెలిపారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదక ప్రకారం.. వరల్డ్ డైనమిక్ నగరాల జాబితాలో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. వచ్చే ఏడాది కాలంలో బెంగళూరును కిందికి నెట్టేసి మొదటి స్థానంలో నిలవటం ఖాయమని ధీమావ్యక్తం చేశారు. అందుకు తగ్గట్టుగానే నగరంలో వనరులు, పాలసీలు, విధానాలు, నాయకత్వం అన్ని అంశాలూ ఉన్నాయని తెలిపారు. క్రెడాయ్ ప్రాపర్టీ షో.. వచ్చే నెల ఫిబ్రవరి 15–17 తేదీల్లో మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో క్రెడాయ్ 7వ ప్రాపర్టీ షో జరగనుంది. జంట నగరాల్లోని సుమారు వందకు పైగా నిర్మాణ సంస్థలు షోలో పాల్గొంటున్నాయని.. రూ.25 లక్షల నుంచి రూ.10 కోట్ల వరకు ప్రాపర్టీల వరకూ ప్రదర్శనలో ఉంటాయని క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ ఎస్ రాంరెడ్డి తెలిపారు. మూడు రోజుల ఈ ప్రాపర్టీ షోకు సుమారు 70 వేల మంది నగరంతో పాటూ ఇతర జిల్లాలు, పక్క రాష్ట్రాల నుంచి కూడా సందర్శకులు వస్తారని అంచనా. 20 శాతం ధరల వృద్ధి.. గత ఏడాది కాలంలో స్థిరాస్తి ధరలు 15–20 శాతం వరకు పెరిగాయని.. వచ్చే ఏడాది కాలంలో కూడా మరో 20 శాతం వరకూ ధరలు పెరుగుతాయని రాంరెడ్డి అంచనా వేశారు. రియల్టీ ధరలు, పన్నులు, ఫీజులు, స్థల ధరలు పెరిగినంత స్థాయిలో కొనుగోలుదారుల ఆదాయం మాత్రం పెరగట్లేదని అందుకే ప్రాపర్టీ కొనేందుకు ఇదే సరైన, చివరి అవకాశమని సూచించారు.