వేడుక.. ప్రత్యేకత | special of independence day celebrations | Sakshi
Sakshi News home page

వేడుక.. ప్రత్యేకత

Aug 16 2014 1:01 AM | Updated on Aug 20 2018 9:16 PM

సమైక్యాంధ్రకు కర్నూలు రాజధానిగా ఉన్న సమయంలోని ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలను అందంగా ముస్తాబు చేశారు.

సమైక్యాంధ్రకు కర్నూలు రాజధానిగా ఉన్న సమయంలోని ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలను అందంగా ముస్తాబు చేశారు.

నగరంలోని ప్రధాన కూడళ్లలో జిల్లా స్వాతంత్య్ర సమరయోధులు ఉయ్యలవాడ నరసింహారెడ్డి, గులాం రసూల్‌ఖాన్, ముత్తుకూరి గౌడప్ప, గాడిచర్ల సర్వోత్తమరావు, సర్దార్ నాగప్ప, అమరావతమ్మ తదితరుల చిత్రపటాల ఏర్పాటు ఆకట్టుకుంది.

ఆంధ్రప్రదేశ్ సాంఘిక గురుకుల సంక్షేమ విద్యార్థులు ప్రదర్శించిన ‘భారతీయం’ నృత్యం ఆహూతులను అలరించింది.

వేడుకలకు వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, పౌర సమాచారా శాఖ కమిషనర్ దానకిశోర్ అభినందించారు.

భారత స్వాతంత్రోద్యమం, వీరుల గాథను ఆకట్టుకునేలా వివరించిన ప్రముఖ కథా రచయిత ఇనయతుల్లాకు ప్రత్యేక ప్రశంసలు దక్కాయి. కర్నూలుకు చెందిన ఈయనకు వేడుకల్లో వ్యాఖ్యాతగా వ్యవహరించే అరుదైన అవకాశం దక్కడం విశేషం.

ఎఫ్‌ఎం వ్యాఖ్యాత సునంద వ్యాఖ్యానం ఆద్యంతం ఆకట్టుకుంది. - సాక్షి ప్రతినిధి, కర్నూలు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement