
సాక్షి, హైదరాబాద్: హెచ్‌ఎండీఏ, రేరా, మెట్రోలో జరిగిన అక్రమాలకు సంబంధిచిన కేసులో అవినితి నిరోధక శాఖ(ఏసీబీ) విచారణ ఎదుర్కొంటున్న శివబాల కృష్ణపై హైదరాబాద్ మెట్రో పాలిటన్ అథారిటీ(HMDA) వేటు వేసింది. శివ బాలకృష్ణను సస్పెండ్ చేస్తూ మంగళవారం హెచ్‌ఎండీఏ కమిషనర్ దాన కిషోర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
ఆదాయనికి మించి ఆస్తుల కేసులో శివబాలకృష్ణ అరెస్ట్ అయ్యారు. ఇక.. ఆయన తన పదవిని అడ్డుపెట్టుకొని రూ. వందల కోట్లు సంపాధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఏసీబీ కేసులో విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో శివ బాలకృష్ణపై సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment