హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అంటు వ్యాధులు, వర్షాకాలపు సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక చేపడతామని జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రత్యేకంగా సుమారు 500 ఆరోగ్య శిబిరాల నిర్వహిస్తామని వెల్లడించారు. జూలై 20వ తేదీలోగా హెల్త్ క్యాంపుల నిర్వహణతో పాటు వ్యాదుల నివారణకు యాంటీ లార్వా ఆపరేషన్ల పూర్తి చేసి.. దోమల నివారణకు స్ప్రే చేసే పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
గ్రేటర్ పరిధిలో ఉన్న దాదాపు ఆరువేలకు పైగా పాఠశాలల్లో సీజనల్ వ్యాధులు, అంటువ్యాధుల నివారణపై చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. బీహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో మెదడువాపు వ్యాధి ప్రబలంగా వ్యాపించడంతో.. హైదరాబాద్‌లో అటువంటి వ్యాదులు వ్యాప్తి చెందకుండా మెదడు వాపు వ్యాధి నివారణకు చర్యలు చేపట్టాలని అదేశించారు. ముఖ్యంగా ఎక్కువగా వ్యాదులు వ్యాప్తిచెందే ప్రాంతాల్లో.. గతంలో ఆధికంగా వ్యాదులు నమోదైన ప్రాంతాల్లో ప్రత్యేక ట్రయల్ చేపట్టాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment