విశ్వనగరంగా ఎదుగుతోన్న హైదరాబాద్ వివిధ రంగాల్లో ముందంజలో ఉంటున్నప్పటికీ, కొన్ని అంశాల్లో వెనుకబడి ఉంది. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు వినియోగించుకోవడంలోనూ ప్రజలకు పలు ఇబ్బందులెదురవుతున్నాయి. స్వచ్ఛ ర్యాంకింగ్‌లో నగరానికి మెరుగైన స్థానం లభిస్తున్నా క్షేత్ర స్థాయి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రజలు తమకెదురవుతున్న వివిధ సమస్యలను నేరుగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ దృష్టికి తెచ్చి పరిష్కరించుకునేందుకు ‘సాక్షి’ ఫోన్–ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందుకు మీరు చేయాల్సింది ఒక్క ఫోన్ కాల్. ఓటరు జాబితాలో పేరు నమోదు.. పొరపాట్ల సవరణ, స్వచ్ఛ హైదరాబాద్, పారిశుధ్యం, పచ్చదనం, ట్రాఫిక్, నగర సుందరీకరణ, భవన నిర్మాణ వ్యర్థాలు, రోడ్లు, నాలాలు, మ్యాన్‌హోళ్లు, ఫుట్‌పాత్‌లు, నిర్మాణ అనుమతులు, ఆస్తిపన్ను ఫిర్యాదులు తదితర సమస్యలను కమిషనర్‌కు తెలియజేయవచ్చు. మెరుగైన సదుపాయాల కల్పనకు తగిన సూచనలూ చేయవచ్చు.
తేదీ: 21-2-2019 (గురువారం)
సమయం: మధ్యాహ్నం 3 గంటల నుంచి సా.4 వరకు
ఫోన్ చేయాల్సిన నంబర్లు: 04023222018, 23261330
అంశం: నగరంలో పౌర సమస్యలు
Comments
Please login to add a commentAdd a comment