
జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణా తేదీలను భారత ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్‌లో బ్యానర్లు, పోస్టర్లను వెంటనే తొలగించాలని జోనల్, డిప్యూటీ కమిషనర్లను జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎం. దానకిషోర్ ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చినందున ప్రభుత్వ భవనాలపై, రహదారుల పక్కనున్న కటౌట్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణతో పాటు నాలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను ఈ రోజు(శనివారం) ప్రకటించి సంగతి తెల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment