హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి దాన కిషోర్
హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయంలో మోడల్ పోలింగ్ కేంద్రాన్ని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ ప్రారంభించారు. అనంతరం దాన కిషోర్ విలేకరులతో మాట్లాడారు. పోలింగ్‌కు సంబంధించి రెండు రోజుల సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎన్నికల నిర్వహణకు 23 వేల సిబ్బంది అవసరమని వివరించారు. కొంతమంది అనారోగ్య కారణాలు చూపుతున్నారని, వాటిని కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఓటర్లు పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోవాలని సూచించారు.
రాజధాని పరిధిలో పదిహేడు వేల మంది దివ్యాంగులైన ఓటర్లు ఉన్నారని, వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, ఈవీఎంలను భద్రపరచడానికి పదిహేను స్ట్రాంగ్ రూమ్‌లు కూడా సిద్ధం చేసినట్లు వెల్లడించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యామని, ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్‌జీఓలు, స్వచ్ఛంధ సంస్థల సహాయం కోరామని తెలిపారు. వీధినాటకాల ద్వారా ఓటర్లలో చైతన్యం తీసుకువస్తామని దాన కిషోర్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment