మూసీ రివర్ ఫ్రంట్ ఎండీ దాన కిషోర్
డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వడంతోపాటు ఉపాధి కల్పనకు చర్యలు తీసుకుంటాం
కొత్త ప్రాంతాల్లోని స్కూళ్లలో నిర్వాసితుల పిల్లలకు ప్రవేశాలు కల్పిస్తాం
అవసరమైతే గురుకులాలఓ చేర్చేందుకూ ప్రయతి్నస్తామని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: మూసీ ప్రాజెక్టు కింద నిర్వాసితులయ్యే కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ దాన కిషోర్ చెప్పారు. శుక్రవారం మాసబ్‌ట్యాంక్‌లోని కార్యాలయంలో మూసీ పౌర సంస్థల ప్రతినిధులతో సుదీర్ఘంగా నిర్వహించిన సమావేశంలో సలహాలు, సూచనలు స్వీకరించారు. అనంతరం మాట్లాడారు. హైదరాబాద్ నగర భవిష్యత్తును కాపాడాలంటే.. మూసీ నదిని పునరుద్ధరించాల్సిందేనని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఏకపక్షంగా కాకుండా.. ఎన్జీవోలు, నిర్వాసిత కుటుంబాలతో చర్చించి, తరలింపు, పునరావాస కార్యక్రమాలను చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రతి నిర్వాసిత కుటుంబానికి జీవనోపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
పట్టా ఉంటే పరిహారం, ప్రయోజనాలు
త్వరలోనే బఫర్ జోన్‌లో నిర్మాణాల సర్వే, మార్కింగ్ ప్రక్రియ చేపడతామని దాన కిశోర్ తెలిపారు. వారికి పునరావాస చట్టం ప్రకారం.. పరిహారం, ప్రయోజనాలు అందిస్తామని, ఆ తర్వాతే నిర్మాణాలను తొలగిస్తామని చెప్పారు. నిర్వాసిత కుటుంబాల్లోని విద్యార్థుల చదువు దెబ్బతినకుండా.. వారిని తరలించిన ప్రాంతంలోని పాఠశాలల్లో ప్రవేశాలు కల్పిస్తామని వెల్లడించారు. ఆసక్తి ఉన్న వారిని గురుకులాల్లో కూడా చేర్పిస్తామన్నారు. మూసీ పునరావాస ప్రక్రియ సజావుగా జరిగేందుకు ఉన్నతాధికారులతో హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment