సాక్షి, హైదరాబాద్: జీహెంఎంసీ కమిషనర్ దాన కిషోర్ నగరంలో గురువారం ఉదయం సిబ్బందితో కలసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సికింద్రాబాద్‌లో సెంటెన్స్ పాఠశాల ఎదురుగా రోడ్డుపై భవన నిర్మాణ వ్యర్థాలు వేసిన వాణిజ్య భవనానికి పదివేల రూపాయల జరిమానా విధించారు. బహిరంగ మూత్ర విసర్జన చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నగరంలో ఎక్కడైనా డ్రైనేజ్ లీకేజీ, వాటర్ పైప్ లీకేజ్ ఉంటే వాటికి సంబంధిత జలమండలి అధికారులపై చర్యలు చేపడతామని హెచ్చరించారు.
ఆలుగడ్డ బావి సమీపంలో పబ్లిక్ టాయిలెట్లు పరిశీలించి, టాయిలెట్లలో మరింత పరిశుభ్రత పాటించాలని సూచించారు. నగరంలోని ప్రధాన రహదారులపై నిర్మాణ వ్యర్ధాలు, రాళ్లు తొలగించకపోవడతో జీహెచ్‌ఎంసీ అధికారులపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీల్లో భాగంగా మెట్టుగూడలో ఇరుకైన గల్లీల్లో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణనపై తనిఖీ చేసిన కమిషనర్. ఇంటింటి నుంచి తడి పొడి చెత్తను వేర్వేరుగా స్వచ్ఛ ఆటోలకు అందించాలని నివాసితులకు సూచించారు.
స్వచ్ఛ ఆటోలు వీదుల్లోకి రోజు వస్తున్నాయా, పారిశుధ్య సిబ్బంది స్వీపెంగ్ చేస్తున్నారా అని స్థానికులను అడిగి తెలుసుకున్న కమీషన్. అనంతరం మెట్టుగూడాలోని స్మశాన వాటికను పరిశీలించి శ్మశాన వాటికను శుభ్రంగా ఉంచడంతో పాటు లోపలికి అక్రమంగా ఎవరు వెళ్లకుండా గేట్ను ఏర్పాటు చేసి ప్రహరీ గోడకు కలరింగ్ చేయించాలని అధికారులను ఆదేశించారు. దీంతో సౌత్ జోన్ చార్మినార్లో పారిశుధ్య కార్యక్రమాలు, చార్మినార్ పెడిస్టీరియన్ పనులపై మున్సిపల్ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ కూడా తనిఖీలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment