
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిషోర్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి కలెక్టర్‌గా పని చేస్తున్న లోకేష్ కుమార్‌ను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా నియమించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. దానకిషోర్‌ను జలమండలి కమిషనర్‌గా నియామస్తున్నట్టుగా నిర్ణయం తీసుకుంది. ఇక రంగారెడ్డి జాయింట్ కలెక్టర్‌గా పని చేస్తున్న హరీష్ ఇకమీదట రంగారెడ్డి కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కాగా దానకిషోర్ సంవత్సరంపాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా సేవలందించారు.