GHMC commisioner
-
ఏపీకి ఆమ్రపాలి..బల్దియా కొత్త బాస్ ఎవరు?
సాక్షి,తెలంగాణ: డీవోపీటీ ఉత్తర్వులపై ఐఏఎస్ అధికారులు వాణి ప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రోస్, ఆమ్రపాలిలకు తెలంగాణ హైకోర్టులోనూ ఊరట దక్కలేదు. రిలీవ్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలన్న ఐఏఎస్‌ల పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.హైకోర్టు తీర్పుతో తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే ఐఏఎస్ అధికారుల స్థానంలో కొత్త అధికారుల నియామకంపై తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఐఏఎస్ అధికారి రోనాల్డ్ రాస్ భేటీ అయ్యారు.మరోవైపు ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి ఏపీకి వెళ్లిపోతుండడంతో ఆమె స్థానంలో కొత్త కమిషనర్‌ను నియమించేందుకు సిద్ధమైంది. పలువురి అధికారుల పేర్లను పరిశీలిస్తుంది. మూసీ ప్రక్షాళన, వచ్చే గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కసరత్తు చేస్తుండగా.. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా సీనియర్ ఐఏఎస్‌కు భాద్యతలు అప్పగించే అవకాశం ఉందని సంబంధిత అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఏడాది కాలంలోనే ముగ్గురు జీహెచ్ఎంసీ కమిషనర్ల ప్రభుత్వం మార్చింది. అమ్రపాలి స్థానంలో కొత్త వారిని నియమించాలా? లేదా ఇన్ఛార్జ్ భాద్యతలు ఇవ్వాలా’అని తెలంగాణ సర్కారు సమాలోచనలు చేస్తోంది. -
HYD: నగరంలో రేపు భారీ వర్షాలు: అమ్రపాలి
సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో నిన్నటి నుంచి విపరీతంగా వర్షం కురుస్తోందని, ఎక్కడ సమస్యలు లేకుండా అన్ని విభాగాల సమన్వయంతో చర్యలు తీసుకుంటాన్నామని గ్రేటర్ హైదరాబాద్(జీహెచ్ఎంసీ) కమిషనర్ అమ్రపాలి తెలిపారు. వర్షాలపై ఆమె ఆదివారం(సెప్టెంబర్1) సాక్షి టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. వాటర్ లాగిన్ పాయింట్స్, మూసీ పరివాహక ప్రాంతాలు, హుస్సేన్ సాగర్‌పై నిరంతరం నిఘా పెట్టాం. అన్ని డిపార్ట్మెంట్ల అధికారులను అప్రమత్తం చేశాం. నగరానికి రేపు భారీ వర్ష సూచన ఉన్నందున అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించాం. జీహెచ్ఎంసీ పరిధిలో ఉద్యోగులకు సెలవులను రద్దు చేశాం. జోనల్ కమిషనర్లు 24 గంటలు రోడ్లపైనే ఉంటున్నారు. ప్రాణనష్టం జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం’అని అమ్రపాలి చెప్పారు. -
స్వప్నలోక్ ప్రమాదం: నేడు హైకోర్టులో విచారణ.. సీఎస్ ఏం చెబుతారు?
సాక్షి, సికింద్రాబాద్: స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో పెద్దఎత్తున మంటలు చెలరేగి ఊపిరాడక ఆరుగురు మృతిచెందారు. కాగా, ఈ ఘటనపై నేడు(సోమవారం) తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టనుంది. కాగా, ప్రమాద తీవ్రత, కారణాలను విశ్లేషిస్తూ పత్రికల్లో ప్రచురితమైన కథనాలపై హైకోర్టు సుమోటోగా స్పందించింది. ప్రతివాదులుగా సీఎస్, జీహెచ్ఎంసీ కమిషనర్, డీజీపీ, హైదరాబాద్ సీపీ, అగ్నిమాపక శాఖ డీజీలతో పాటుగా 12 మందిని చేర్చింది. దీనిపై నివేదిక ఇవ్వాలని వారిని కొరింది. అయితే, మార్చి 16వ తేదీన ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మరణించిన వారికి 3 లక్షల ఎక్స్‌గ్రేషియాను సీఎం కేసీఆర్ ప్రకటించారు. -
గంటలోగా వస్తారా, రారా?.. అరగంటలోనే హాజరైన కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ కలెక్టర్ల తీరు పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం బేగంపేట టూరిజం ప్లాజాలో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ (దిశ) కమిటీ సమావేశం ఏర్పాటు చేయగా, కమిటీ చైర్మన్‌గా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హాజరయ్యారు. సమావేశానికి జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్లు రాకపోవడం కేంద్ర మంత్రికి కోపం తెప్పించింది. జిల్లా సమావేశానికి కీలక అధికారులు రాకపోవడమేంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గంట సమయం ఇచ్చి.. ఈలోగా రాకపోతే చర్యలు తీవ్రంగా ఉంటాయని వారికి అల్టిమేటం పంపారు. సమావేశం ప్రారంభించిన అరగంటలోపు జీహెచ్ఎంసీ కమిషనర్, కలెక్టర్ హాజరయ్యా రు. గతంలోనూ కిషన్ రెడ్డికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. హైదరాబాద్ వరదల సమయంలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన కిషన్‌రెడ్డి వెంట కనీసం ఆర్డీవో స్థాయి అధికారులు కూడా హాజరుకాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. మరోమారు అలాంటి అనుభవమే ఎదురుకావడంతో కిషన్ రెడ్డి ఆగ్రహానికి గురయ్యారు. చదవండి: Hyderabad: బుల్లెట్ బండి..పట్నం వస్తోందండీ రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి.. రాజకీయాలకతీతంగా పార్టీలన్నీ హైదరాబాద్ నగరాభివృద్ధికి కృషి చేయాలని సమావేశంలో కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర పథకాల అమలు, లాఅండ్ ఆర్డర్, మహిళా సంక్షేమం, మధ్యాహ్న భోజన పథకం తదితర అంశాలపై చర్చించారు. జాతీయ ఆహార భద్రతా చట్టం, వన్ నేషన్–వన్ రేషన్లపై సమీక్షించారు. జిల్లాకు సంబంధించి కేంద్రం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తామని హామీ ఇచ్చారు. అధికారులు పూర్తి సమాచారంతో రావాలని ఆదేశించారు. -
‘వరద సాయం: మీసేవా కేంద్రాలకు వెళ్లద్దు’
సాక్షి, హైదరాబాద్: నగరంలో వరద సాయం రూ. 10 వేల కోసం బాధితులు సోమవారం ఉదయం నుంచి పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని పలు మీసేవా కేంద్రాల వద్ద బాధితులు బారులు తీరారు. ఈ క్రమంలో తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదంటూ మీసేవా కేంద్రాల నిర్వాహకులు తెలియాజేస్తున్నారు. వరద సాయం బాధితులు భారీగా రావడంతో నిర్వాహకులు మీసేవా కేంద్రాలకు తాళాలు వేశారు. దీంతో పెద్ద సంఖ్యలో మీసేవా కేంద్రాల వద్ద ఆందోళన నేలకొంది. మీసేవా కేంద్రాల వద్ద బాధితుల క్యూ పెరగడంతో జీహెచ్ఎంసీ కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ స్పందించారు. వరద సాయంపై ఆయన కీలక ప్రకటన చేశారు. వరద సాయం కోసం బాధితులు మీ సేవా కేంద్రాలకు వెళ్లవద్దని పేర్కొన్నారు. నగరంలో జీహెచ్ఎంసీ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని వెల్లడించారు. వరద సాయం కోసం బాధితుల వివరాలు సేకరిస్తారని తెలిపారు. బాధితుల వివరాలు, ఆధార్ నంబర్ ధ్రువీకరించిన తర్వాత వరద బాధితుల అకౌంట్లో డబ్బు జమఅవుతాయిని ఆయన వెల్లడించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో నగరంలో వరద బాధిత కుటుంబాలకు అందిస్తున్న సాయాన్ని వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా, సీఎం కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ.. డిసెంబర్ 7 నుంచి అర్హులైనవారందరికీ రూ.10వేల వరద సాయం అందజేస్తామన్న సంగతి తెలిసిందే. -
డంపింగ్ యార్డ్ చెత్త నుంచి విద్యుత్
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్‌లోని డంపింగ్ యార్డ్ నుంచి వెలువడే మీథేన్ వాయువు ఆధారంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్ హైకోర్టుకు చెప్పారు. రెండు నెలల్లో రెండు విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని, ఆ తర్వాత మరో రెండు నెలల్లోగా మరో యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. డంపింగ్ యార్డ్ వల్ల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు దోమలు, దుర్వాసన వంటి పలు సమస్యల్ని ఎదుర్కొనడంపై పత్రికల్లో వచ్చిన వార్తల ప్రతిని జత చేసి నగరానికి చెందిన సీతారాంరాజు రాసిన లేఖను హైకోర్టు ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు లోకేష్ కుమార్ సోమవారం హైకోర్టుకు హాజరయ్యారు. పత్రికల్లో డంపింగ్ యార్డ్ వల్ల సమస్యల గురించి వార్తలు వస్తున్నాయని, దుర్గంధం వల్ల అక్కడి ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతుంటే జీహెచ్ఎంసీ ఎలాంటి నివారణ చర్యలు తీసుకుందని ధర్మాసనం ప్రశ్నించింది. యార్డ్ 337 ఎకరాల్లో చెత్త ఉండేదని, 137 ఎకరాలకు తగ్గించామని, శాస్త్రీయ పద్ధతుల్లో చెత్తపై పాలిథిన్ కవర్లు మట్టిని వేస్తున్నామని, ఇదే మాదిరిగా పలు పొరలుగా వేస్తామని, దీని వల్ల దుర్వాసన బయటకు వెళ్లదని కమిషనర్ వివరించారు. డంపింగ్ యార్డ్‌లో చెత్త వేసే పరిధి తగ్గించవచ్చని, అయితే చెత్త వెలువడే దుర్వాసన తగ్గేలా ఎందుకు చేయలేక పోతున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. ఒకేచోట చెత్త పేరుకుపోయి ఉంటే అందులోని దుర్గంధమైన నీరు భూమిలోకి చేరే ప్రమాదం ఉంటుందని హెచ్చరించింది. చెత్తలో వానపాములు వేసి కొంతవరకూ సమస్యను పరిష్కరిం చేందుకు చర్యలు తీసుకుంటామని, చెత్తను ఎండబెట్టేలా చేసి నివారణ చర్యలు తీసుకుంటామని కమిషనర్ చెప్పారు. విచారణ అనంతరం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కమిషనర్‌ను ఆదేశించిన ధర్మాసనం.. తదుపరి విచారణను ఫిబ్రవరి 7కి వాయిదా వేసింది. -
రాజీనామా చేసి వెళ్లండి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: కాలుష్య నివారణ చర్యలు తీసుకోలేన ప్పుడు పదవికి రాజీనామా చేయడమే ఉత్తమమని జీహెచ్ఎంసీ కమిషనర్‌కు హైకోర్టు సూచించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో కాలుష్య నివారణ చర్యలపై ధర్మాసనం తీవ్రఅసంతృప్తి వ్యక్తం చేసింది. కూకట్పల్లి చెరువు కాలుష్యంపై పత్రికల కథనాన్ని హైకోర్టు సుమోటో గా ప్రజాహితవ్యాజ్యంగా పరిగణించి సోమవారం విచారించింది. కాలుష్యం సమస్య పరి ష్కారానికి జీహెచ్ఎంసీ కమిషనర్ చిత్తశుద్ధితో పనిచేయాలని, లేదంటే ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లా లని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 15 రోజులకోసారి చెరువుల్లో చెత్త తొలగిస్తున్నామని జీహెచ్ఎంసీ కౌంటర్లో పేర్కొనడాన్ని హైకోర్టు ప్రస్తావిస్తూ.. ఏ తేదీల్లో తొలగిస్తున్నారో, ఫొటోలు ఎప్పు డు తీశారో వంటి వివరాలు లేకపోవడాన్ని తప్పుపట్టింది. బెంగళూరులోని చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలోని పలు అంతస్తుల భవనాలను నిర్మించడమే కాకుండా చెరువులోకి రసాయన వ్యర్థాలను వదిలిపెట్టడం వల్ల భూగర్భ జలాలు కలుషితం అయ్యాయని, చిన్న పాటి వర్షానికే కాలుష్య నురగలు జనావాస కాలనీల్లోకి వచ్చాయని హైకోర్టు గుర్తు చేసింది. సమయం ఇస్తే కౌంటర్ దాఖలు చేస్తామని జీహెచ్ఎంసీ తరఫు న్యాయ వాది చెప్పారు. కూకట్పల్లి చెరువులో బతుకమ్మ సమయంలో పూలను, వినాయక చవితి సందర్భం గా విగ్రహాల నిమజ్జనం జరుగుతుందని, చెరువు లో 15 రోజులకోసారి చెత్త తొలగిస్తున్నామని తెలిపారు. విచారణ వచ్చే నెల 7కి వాయిదా పడింది. 27న హాజరుకావాలి..: జవహర్‌నగర్ డంపింగ్ యార్డు సమస్య నివారణకు తీసుకునే చర్యలను వివరించాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఇప్పటివరకు తీసుకున్న నివారణ చర్యలు తెలియజేయాలంది. డంపింగ్ యార్డు వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై 2 నెలల్లో పత్రికల్లో పలు కథనాలు వచ్చాయని, ప్రజల సమస్యలను పట్టించుకోకపోతే ఎలాగని ప్రశ్నించింది. ఈ నెల 27న జరిగే తదుపరి విచారణకు జీహెచ్ఎంసీ కమిషనర్ హాజరుకావాలని ఆదేశించింది. జవహర్‌నగర్ డంపింగ్ యార్డు సమస్యపై పత్రికల్లో వచ్చిన కథన ప్రతిని జత చేస్తూ హైకోర్టుకు కల్నల్ సీతారామరాజు లేఖ రాశారు. ఈ లేఖను పిల్‌గా పరిగణించి చీఫ్ జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. -
త్వరలో రోడ్డు ప్రైవేటీకరణ పనులు ప్రారంభం : జీహెచ్ఎంసీ
సాక్షి, హైదరాబాద్ : నగరంలో రోడ్డు ప్రైవేటీకరణ పనులు త్వరలో ప్రారంభం కానునట్లు జీహెజ్‌ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తెలిపారు. ఈ నెల 10నుంచి 709 కి. మీ మేరకు పనులు మొదలు పెడతామన్నారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్‌ను జనవరిలో ప్రారంభిస్తామన్నారు. ఫిబ్రవరి వరకు లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లను అందించే విధంగా పనులు చేపడుతున్నట్లు, దాదాపు తొమ్మిది వేల వరకు డబుల్ బెడ్ రూం ఇళ్ల పనులు పూర్తి అయ్యాయని తెలిపారు.ప్రధాన రహదారులపై ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు ప్రత్యామన్నాయ రోడ్ల కోసం భూసేకరణ చేస్తున్నామన్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు నేరుగా ఫోన్ లేదా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సమాచారం ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇక ఓపెన్ స్పేస్‌లలో పార్క్‌లను అభివృద్ధి చేస్తామని, మీడియన్.. జంక్షన్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ప్రతి జోన్లో స్కైవాక్ నిర్మించాలన్నారు. రోడ్డు మరమత్తు పనులు పూర్తి అవుతున్నాయని, చెత్త సేకరణ కోసం 60 ట్రాన్స్ఫర్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్ల వెల్లడించారు. సీ అండ్ డీ వేస్ట్ పరిశ్రయ త్వరలోనే మొదలు కానుందని, వీటిని కంపోస్ట్ అలాగే కరెంట్ ఉత్పాదన కోసం ఉపయోగిస్తామన్నారు. మూడు నెలల్లో 284 పనులకు అనుమతులిచ్చామని, వీడీసీసీ రోడ్డు పనులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. -
జీహెచ్ఎంసీ కమిషనర్‌గా లోకేశ్ కుమార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి కలెక్టర్‌గా పని చేస్తున్న లోకేష్ కుమార్‌ను జీహెచ్ఎంసీ కమిషనర్‌గా నియమించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. దానకిషోర్‌ను జలమండలి కమిషనర్‌గా నియామస్తున్నట్టుగా నిర్ణయం తీసుకుంది. ఇక రంగారెడ్డి జాయింట్ కలెక్టర్‌గా పని చేస్తున్న హరీష్ ఇకమీదట రంగారెడ్డి కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కాగా దానకిషోర్ సంవత్సరంపాటు జీహెచ్ఎంసీ కమిషనర్‌గా సేవలందించారు. -
గ్రేటర్లో భవన నిర్మాణ పర్మిషన్ ఇక ఈజీ
సాక్షి, సిటీబ్యూరో: ఇప్పటికే డీపీఎంఎస్ విధానంలో ఆన్లైన్ ద్వారానే భవన నిర్మాణ అనుమతులు, ఓసీలు జారీ చేస్తున్న జీహెచ్ఎంసీ...నిర్మాణ అనుమతుల ప్రక్రియను మరింత సులభతరం చేసింది. ప్రస్తుతం భవన నిర్మాణ అనుమతికి దరఖాస్తు చేసుకుంటున్నవారు ఇతర శాఖల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అవసరమైతే పలు కార్యాలయాల చుట్టూ తిరిగి వాటిని పొందుతున్నారు. ముఖ్యంగా రెవెన్యూ, ఇరిగేషన్, ఫైర్ సర్వీసెస్ తదితర శాఖల నుంచి వీటిని పొందేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఇకపై ఈ శ్రమ లేకుండా ఆన్లైన్లో కామన్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇతర విభాగాల నుంచి క్లియరెన్స్ అవసరమైన పక్షంలో నో అబ్జెక్షన్ కోసం జీహెచ్ఎంసీయే ఆయా విభాగాలకు ఆన్లైన్లో పంపిస్తుంది. ఈమేరకు తగిన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుంది. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా ట్రయల్‌రన్ నిర్వహించారు. ఇది విజయవంతం కావడంతో కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు ఇక ఈ కామన్ అప్లికేషన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవచ్చు. వ్యక్తిగత ఇళ్లు కట్టుకునే వారి నుంచి బహుళ అంతస్తుల వాణిజ్య భవనాలు నిర్మించే వారి వరకు అందరికీ ఇది వర్తిస్తుంది. పరిశ్రమలకు టీఎస్ఐపాస్ తరహాలో జీహెచ్ఎంసీ పరిధిలో భవన నిర్మాణాలకు ఈ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. నోఅబ్జెక్షన్ అవసరమైన రెవెన్యూ, ఇరిగేషన్, ఫైర్సర్వీసెస్, ఫారెస్ట్, ఎలక్ట్రిక్, ఎయిర్పోర్ట్, ట్రాఫిక్,అథారిటీ ఆఫ్ ఇండియా, నేషనల్ మాన్యుమెంట్ అథారిటీలతో జీహెచ్ఎంసీ నెట్వర్క్ అనుసంధానం చేసుకుంది. దరఖాస్తు రాగానే పై వాటిల్లో ఏ శాఖనుంచైనా నో అబ్జెక్షన్ అవసరమైతే ఆన్‌లైన్‌ద్వారా సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు వెళ్తుంది. ఎలాంటి అభ్యంతరం లేనట్లయితే ఓకే చేస్తారు. అభ్యంతరాలుంటే, ఆ విషయాన్నీ తెలియజేస్తారు. ఈ నేపథ్యంలో భవననిర్మాణాలకు దరఖాస్తుచేసుకునే వారికి ఎంతో సమయం, వ్యయం తగ్గుతాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(ఈఓడీబీ)లో భాగంగా జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ విభాగం ఇప్పటికే పలు సంస్కరణలు అమల్లోకి తేవడం తెలిసిందే. శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో టౌన్‌ప్లానింగ్ అధికారులు, బిల్డర్లు, ఫైర్ సర్వీస్, రెవెన్యూ తదితర అధికారులతో జరిగిన సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ ఈ సింగిల్‌విండో అనుమతుల విధానాన్ని ప్రకటించారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో దరఖాస్తుల పరిశీలన త్వరితంగా జరుగుతున్నప్పటికీ, ఇతర శాఖల నుంచి ఎన్ఓసీలు రావడంలో జాప్యం జరిగేదని, ఇక ఈసమస్య ఉండదన్నారు. డీపీఎంఎస్‌లో ఈ కామన్ అప్లికేషన్ విధానాన్ని పొందుపరిచినట్లు తెలిపారు. ఒక్కరోజులోనే అనుమతి.. భవననిర్మాణ అనుమతులు త్వరితంగా జారీ చేసేందుకు ప్రభుత్వం పలు సంస్కరణలు ప్రవేశపెట్టనున్నట్లు దానకిశోర్ తెలిపారు. ముఖ్యంగా 500 గజాల్లోపు స్థలంలో ఇళ్ల నిర్మాణాలకు వచ్చే దరఖాస్తులు నిబంధనల ప్రకారం అన్నీ సవ్యంగా ఉంటే ఒకే రోజులో అనుమతి జారీ చేసే ప్రతిపాదన ఉందని వెల్లడించారు. దీంతోపాటు 200 గజాల్లోపు స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలకు సెల్ఫ్ అప్రూవల్ ప్రతిపాదన కూడా ఉందన్నారు. సమావేశంలో జీహెచ్ఎంసీ చీఫ్‌సిటీప్లానర్ ఎస్.దేవేందర్‌రెడ్డి, ఫైర్సర్వీసెస్ అడిషనల్ డైరెక్టర్ పాపయ్య, డా.సుబ్రహ్మణ్యం (ఆస్కి) పాల్గొన్నారు. అందుబాటులోకి నెట్వర్క్ రెవెన్యూ, ఇరిగేషన్, ఫైర్సర్వీసెస్, ఫారెస్ట్, ఎలక్ట్రికల్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నేషనల్ మాన్యుమెంట్ అథారిటీ శాఖల నుంచి నెట్వర్క్ అందుబాటులోకి వచ్చిందని జీహెచ్ఎంసీ చీఫ్ సిటీప్లానర్ దేవేందర్‌రెడ్డి తెలిపారు. వీటిల్లో నివాస గృహాలకు ముఖ్యంగా యూఎల్సీ, ప్రభుత్వభూమి వంటి సమాచారం కోసం రెవెన్యూతోపాటు ఇరిగేషన్ విభాగాల నుంచి ఎన్ఓసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్)అవసరం అయ్యే అవకాశం ఉందన్నారు. మిగతా శాఖల నుంచి పెద్దగా ఎన్ఓసీ అవసరం ఉండదని, వాణిజ్య, బహుళ అంతస్తుల భవనాలకు మాత్రం మిగతా శాఖలనుంచీ ఎన్ఓసీ అవసరమవుతుందన్నారు. -
అది అమలు చేస్తే జలమండలికి భారం తగ్గుతుంది
సాక్షి, హైదరాబాద్ : విద్యుత్ బిల్లుల తగ్గింపు అమలు చేస్తే జలమండలికి భారం తగ్గుతుందని జీహెచ్ఎంసీ కమిషనర్, జలమండలి ఎండీ దాన కిషోర్ అన్నారు. గురువారం జలమండలిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గణేష్ నిమజ్జనం, మొహరం సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. రూపాయి కనెక్షన్లు 35వేలు ఇచ్చామని, కనెక్షన్లు ఇవ్వటం ప్రస్తుతం ఆపేశామని తెలిపారు. పైపులైన్ వేయడానికి జీహెచ్ఎంసీ పర్మీషన్ అపేసిందని అన్నారు. అక్టోబర్ నుంచి మళ్లీ కనెక్షన్లను ఇస్తామని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న183 గ్రామాలకు జలమండలి ద్వారా నిరందిస్తామని చెప్పారు. తద్వారా జలమండలికి 128 లక్షల రూపాయలు ఆదాయం వస్తోందని అన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు వేస్తున్నామని పేర్కొన్నారు. కొన్నిచోట్ల భూవివాదాలు ఉన్నాయని, వాటి పరిష్కారం కోసం ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. అక్రమ నల్లా కనెక్షన్లపై విజిలెన్స్ దాడులు కొనసాగుతున్నాయని అన్నారు. ఇప్పటికే కేసులు బుక్ చేశామని తెలిపారు. కమర్షియల్ కనెక్షన్లపై దృష్టి పెట్టామని అన్నారు. 30 నుంచి 40 శాతానికి ట్యాంకర్లను తగ్గించామన్నారు. కేశవ పూర్ రిజర్వాయర్ టెండర్ పూర్తయిందని తెలిపారు. -
'ఇప్పటి వరకు 492 అక్రమ కట్టడాలు కూల్చివేత'
హైదరాబాద్ : నగరంలో జీహెచ్ఎంసీ అధికారులు చేపట్టిన అక్రమ కట్టడాల గురువారం నాలుగోరోజుకు చేరుకుంది. అందులోభాగంగా ఈ రోజు వివిధ సర్కిళ్లలోని టౌన్ ప్లానింగ్ అధికారులతో జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ...బఫర్‌జోన్ దాటి చేపట్టిన నిర్మాణాలను తొలగించాలని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే చెరువుల మధ్యలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూడా కూల్చేయాలని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటి వరకు 492 అక్రమ కట్టడాలను కూల్చివేసినట్లు కమిషనర్ వెల్లడించారు. -
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45శాతం ఓటింగ్ నమోదు
హైదరాబాద్ : ఇప్పటివరకూ తమకు అందిన సమాచారం ప్రకారం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45 శాతం పోలింగ్ నమోదు అయినట్లు కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఆయన మంగళవారం సాయంత్రం ప్రెస్మీట్లో మాట్లాడుతూ ఇంకా రెండు లేదా మూడు శాతం ఓటింగ్ పెరిగే అవకాశం ఉందన్నారు. గతంలో కంటే స్వలంగా ఓటింగ్ శాతం పెరిగినట్లు చెప్పారు. 2 వేలకు పైగా పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ పెట్టామని.. లైవ్ వెబ్ కాస్టింగ్ పెట్టడం వల్ల ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగలేదని చెప్పారు. ఎక్కడ ఏ చిన్న సమాచారం వచ్చినా పోలీసులను అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. గ్రేటర్ పరిధిలో ఎక్కడా హింసాత్మక ఘటనలు, పోలింగ్ బూత్‌లను ఆక్రమించడం జరగలేదని కమిషనర్ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. ఈ రోజు ఉదయం పోలింగ్ మొదలైన అరగంటలో కేవలం ఎనిమిది ఈవీఎంలు మొరాయించాయని, అయితే పది నిమిషాల్లోనే వాటిని సరిచేయడం జరిగిందన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రక్రియ బాగానే జరిగిందని, ఒకటి, రెండు చోట్ల మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని ఆయన తెలిపారు. ఎంఐఎం, కాంగ్రెస్ గొడవపై ప్రిసైడింగ్ అధికారి నుంచి వివరాలు తెలుసుకుంటామన్నారు. పూర్తి వివరాలను ఎన్నికల కమిషన్‌కు నివేదిస్తామని కమిషనర్ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.