
సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో నిన్నటి నుంచి విపరీతంగా వర్షం కురుస్తోందని, ఎక్కడ సమస్యలు లేకుండా అన్ని విభాగాల సమన్వయంతో చర్యలు తీసుకుంటాన్నామని గ్రేటర్ హైదరాబాద్(జీహెచ్‌ఎంసీ) కమిషనర్ అమ్రపాలి తెలిపారు. వర్షాలపై ఆమె ఆదివారం(సెప్టెంబర్1) సాక్షి టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు.
వాటర్ లాగిన్ పాయింట్స్, మూసీ పరివాహక ప్రాంతాలు, హుస్సేన్ సాగర్‌పై నిరంతరం నిఘా పెట్టాం. అన్ని డిపార్ట్‌మెంట్‌ల అధికారులను అప్రమత్తం చేశాం. నగరానికి రేపు భారీ వర్ష సూచన ఉన్నందున అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించాం. జీహెచ్ఎంసీ పరిధిలో ఉద్యోగులకు సెలవులను రద్దు చేశాం. జోనల్ కమిషనర్లు 24 గంటలు రోడ్లపైనే ఉంటున్నారు. ప్రాణనష్టం జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం’అని అమ్రపాలి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment