amrapali kata
-
ఏపీకి ఆమ్రపాలి..బల్దియా కొత్త బాస్ ఎవరు?
సాక్షి,తెలంగాణ: డీవోపీటీ ఉత్తర్వులపై ఐఏఎస్ అధికారులు వాణి ప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రోస్, ఆమ్రపాలిలకు తెలంగాణ హైకోర్టులోనూ ఊరట దక్కలేదు. రిలీవ్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలన్న ఐఏఎస్‌ల పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.హైకోర్టు తీర్పుతో తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే ఐఏఎస్ అధికారుల స్థానంలో కొత్త అధికారుల నియామకంపై తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఐఏఎస్ అధికారి రోనాల్డ్ రాస్ భేటీ అయ్యారు.మరోవైపు ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి ఏపీకి వెళ్లిపోతుండడంతో ఆమె స్థానంలో కొత్త కమిషనర్‌ను నియమించేందుకు సిద్ధమైంది. పలువురి అధికారుల పేర్లను పరిశీలిస్తుంది. మూసీ ప్రక్షాళన, వచ్చే గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కసరత్తు చేస్తుండగా.. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా సీనియర్ ఐఏఎస్‌కు భాద్యతలు అప్పగించే అవకాశం ఉందని సంబంధిత అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఏడాది కాలంలోనే ముగ్గురు జీహెచ్ఎంసీ కమిషనర్ల ప్రభుత్వం మార్చింది. అమ్రపాలి స్థానంలో కొత్త వారిని నియమించాలా? లేదా ఇన్ఛార్జ్ భాద్యతలు ఇవ్వాలా’అని తెలంగాణ సర్కారు సమాలోచనలు చేస్తోంది. -
గణేష్ శోభాయాత్ర.. భక్తులకు ఆమ్రపాలి విజ్ఞప్తి
-
HYD: నగరంలో రేపు భారీ వర్షాలు: అమ్రపాలి
సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో నిన్నటి నుంచి విపరీతంగా వర్షం కురుస్తోందని, ఎక్కడ సమస్యలు లేకుండా అన్ని విభాగాల సమన్వయంతో చర్యలు తీసుకుంటాన్నామని గ్రేటర్ హైదరాబాద్(జీహెచ్ఎంసీ) కమిషనర్ అమ్రపాలి తెలిపారు. వర్షాలపై ఆమె ఆదివారం(సెప్టెంబర్1) సాక్షి టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. వాటర్ లాగిన్ పాయింట్స్, మూసీ పరివాహక ప్రాంతాలు, హుస్సేన్ సాగర్‌పై నిరంతరం నిఘా పెట్టాం. అన్ని డిపార్ట్మెంట్ల అధికారులను అప్రమత్తం చేశాం. నగరానికి రేపు భారీ వర్ష సూచన ఉన్నందున అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించాం. జీహెచ్ఎంసీ పరిధిలో ఉద్యోగులకు సెలవులను రద్దు చేశాం. జోనల్ కమిషనర్లు 24 గంటలు రోడ్లపైనే ఉంటున్నారు. ప్రాణనష్టం జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం’అని అమ్రపాలి చెప్పారు. -
ఇక బల్దియాపైనే ఆమ్రపాలి దృష్టి
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఇకనుంచి జీహెచ్ఎంసీపై పూర్తిస్థాయి దృష్టి కేంద్రీకరించనున్నారు. ఇప్పటి వరకు ఆమెకు జీహెచ్ఎంసీ కమిషనర్‌తో పాటు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డీసీఎల్) ఎండీగా, హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఎండీగానూ అదనపు బాధ్యతలున్నాయి. దీంతో పూర్తిస్థాయిలో జీహెచ్ఎంసీపై దృష్టి కేంద్రీకరించలేకపోతున్నారనే అభిప్రాయాలున్నాయి. తాజాగా ఆమెను జీహెచ్ఎంసీ కమిషనర్‌గా నియమిస్తూ ఎంఆర్డీసీఎల్ ఎండీ, హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఎండీగా బాధ్యతల నుంచి రిలీవ్ చేయడంతో రెగ్యులర్ కమిషనర్‌గా ఇక బల్దియాపై పట్టు సాధించనున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి దాకా పలు అంశాల్లో కొందరు అధికారులు ఆమ్రపాలిని తప్పుదారి పట్టించారనే ఆరోపణలు వెలువెత్తాయి. ఇటీవల కొన్ని విభాగాల్లో బదిలీలు, శేరిలింగంపల్లి జోన్లో ఇంజినీర్ల కొట్లాటలో ఒక్కరిపైనే చర్యలు, తదితరమైనవి అందుకు ఊతమిచ్చాయి. ఏళ్ల తరబడిగా సీట్లకు అంటుకుపోయిన వారు కదలకపోవడం.. పేరుకు బదిలీ తప్ప కొందరు అదే ప్రాంతంలో కొనసాగుతుండటం వంటివి అందుకు దృష్టాంతాలు. ఇతర విభాగాల బాధ్యతలున్నందున జీహెచ్ఎంసీలోని అన్ని విభాగాల, అన్ని స్థాయిల అధికారులకు తగినంత సమయమిచ్చేందుకు వీలు కాలేదని చెబుతున్నారు. -
ఆమ్రపాలి.. ఆన్ డ్యూటీ
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమ్రపాలి నగరంలో బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నల్లకుంట శంకర్‌మఠ్ సమీపంలో ఆర్ఎఫ్సీ వాహన డ్రైవర్‌తో మాట్లాడి చెత్త తరలింపు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదే దారిలో తనకు తారసపడిన ఓ విద్యార్థినితో మాట్లాడారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను స్వచ్ఛ ఆటోలకు అందించే విధంగా తోటి విద్యార్థులకు అవగాహన కల్పించి స్వచ్చ హైదరాబాద్ సాధనకు కృషి చేయాలని ఆ విద్యారి్థనికి చెప్పారు. నారాయణగూడ క్రాస్‌రోడ్స్ దగ్గర నిరి్మంచిన మార్కెట్ గదుల కేటాయింపులు పూర్తిచేయాలని జోనల్ కమిషనర్‌కు సూచించారు. కమిషనర్ వెంట తనిఖీలో శానిటేషన్ అడిషనల్ కమిషనర్ రవికిరణ్ పాల్గొన్నారు. కాగా ఐఏఎస్ అధికారులందరూ క్షేత్రస్థాయిలో పర్యటించాలని, కార్యాలయాలకే పరిమితం కారాదని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, సీనియర్ ఐఏఎస్ అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించడం తెలిసిందే. సమావేశానికి సిద్ధం కండి ఈ నెల 6న నిర్వహించనున్న జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశానికి ఆయా విభాగాల అధికారులు పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఉన్నతాధికారులకు సూచించారు. బుధవారం తన చాంబర్లో ఆయా విభాగాల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. 4న జరగనున్న స్టాండింగ్ కమిటీ, 6న జరగనున్న సర్వసభ్య సమావేశం ఎజెండా అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కౌన్సిల్ సమావేశంలో సభ్యుల నుంచి వచ్చే ప్రశ్నలకు సంబంధించి ఆయా విభాగాల అధికారులు సమగ్ర వివరణ ఇచ్చేలా సిద్ధం కావాలన్నారు. సమగ్ర సమాచారంతో సిద్ధంగా ఉండాలన్నారు. ఆయా విభాగాలకు సంబంధించిన పలు అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. -
Hyderabad: కీలకమైన మూడు పోస్టుల్లో కొత్త బాస్‌లు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు ముఖ్య విభాగాలైన జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, వాటర్ బోర్డుల్లో ఉన్న బాస్‌లు మారారు. వారిస్థానే కొత్త బాస్‌లను నియమించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రేటర్ పరిధిలో భారీ స్థాయిలో అధికారుల బదిలీలు జరగడం ఇదే ప్రథమం. ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచీ ఆయా విభాగాల చీఫ్‌లు మారతారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇప్పటిదాకా జరగలేదు. తాజాగా జరిగిన ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీల్లో భాగంగా నగరంలోని ముగ్గురు చీఫ్‌లతో పాటు మరికొందరు అధికారులను కూడా బదిలీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత బీఆర్ఎస్ హయాంలో కీలకశాఖల్లో ఉన్నవారిని వెంటనే మారుస్తారనుకున్నప్పటికీ, రాజకీయ పరిణామాలు, లోక్‌సభ ఎన్నికలు, ఇతరత్రా కారణాలతో పూర్తిస్థాయిలో బదిలీలు జరగలేదు. పాలనలో, అభివృద్ధిలో తమదైన మార్కు చూపించేందుకు ప్రభుత్వం ఇప్పటికే కొన్ని నిర్ణయాలు తీసుకుంది. వాటిని అమలు చేయడం, నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంతో పాటు ఆయా సంస్థల్లో ప్రక్షాళనలో భాగంగా ఈ బదిలీలు జరిగినట్లు భావిస్తున్నారు. ప్రజా సదుపాయాలు, ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా.. నగరానికి సంబంధించినంత వరకు ఓఆర్ఆర్ వరకు యూనిట్‌గా పనులకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఓఆర్ఆర్ వరకున్న శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కూడా జీహెచ్ఎంసీలో విలీనం చేయడం..ఒకటే పెద్ద కార్పొరేషన్ లేదా మూడు నాలుగు కార్పొరేషన్లుగా చేసే ఆలోచనలున్నాయి. జీహెచ్ఎంసీ, హెచ్‌ఎండీయేల్లో భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి భారీ అవినీతి జరిగిందనే అభిప్రాయాలున్నాయి. వాటిపై ఉన్న ఆ ముద్రను తొలగించడంతోపాటు పౌరులకు సకాలంలో సేవలు, మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ కార్యక్రమాల అమలు ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. అంతేకాకుండా ‘వైబ్రెంట్ హైదరాబాద్’ కోసం మెగా మాస్టర్‌ప్లాన్–2050తో ఆయా పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో ఆరి్థకాభివృద్ధితోపాటు మొబిలిటీ, బ్లూ, గ్రీన్ ఇన్ఫ్రా స్ట్రక్చర్స్ కీలకంగా ఉన్నాయి. ఓవైపు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటంతో పాటు మరోవైపు పెరుగుతున్న జనావాసాలన్నింటికీ సురక్షిత నీరు, వందశాతం మురుగుజలాల శుద్ధి కోసం ఎస్టీపీల పనులు జరుగుతున్నాయి. ఓఆర్ఆర్ వరకు ఎలాంటి విపత్తులు జరిగినా వెంటనే ఆదుకునేలా ఉండేందుకు విపత్తు నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోంది. అందులో భాగంగానే ఈవీడీఎం విభాగంలోని డీఆర్ఎఫ్ టీమ్‌లను పెంచుతున్నారు. ఏడాది గడవకుండానే బదిలీ అయిన రోనాల్డ్‌రాస్ 👉 గత జూలై 5వ తేదీన జీహెచ్ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన రోనాల్డ్‌రాస్‌ను ఇంధనశాఖ సెక్రటరీగా బదిలీ చేశారు. 👉 జీహెచ్ఎంసీ కమిషనర్‌గా హెచ్ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్, మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డీసీఎల్)ఎండీ ఆమ్రపాలికి పూర్తిస్థా యి బాధ్యతలప్పగించారు. 👉 హెచ్ఎండీఏ కమిషనర్‌గా ఈసీలో జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌గా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్‌ను నియమించారు. 👉 çహార్టికల్చర్ డైరెక్టర్ కె.అశోక్‌రెడ్డిని వాటర్‌బోర్డు ఎండీగా నియమించారు. 👉 మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్కు ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం..కొత్తగా జాయింట్ ఎండీ పోస్టును సృష్టించి రాజన్న సిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్ పి.గౌతమిని నియమించింది. నాలుగు జోన్లకు కొత్త కమిషనర్లు.. జీహెచ్ఎంసీ జోన్ల ప్రక్షాళనే లక్ష్యంగా నాలుగు జోన్లలో కొత్త జోనల్ కమిషనర్లను నియమించారు. ఇటీవల ఖాళీ అయిన ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌గా అనురాగ్ జయంతిని, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్‌గా హైదరాబాద్ అడిషనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్‌ను, కూకట్పల్లి జోనల్ కమిషనర్‌గా జోగులాంబ గద్వాల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ అపూర్వ్ చౌహాన్‌ను నియమించారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అడిషనల్ కమిషనర్‌గా ఉన్న పి.ఉపేందర్‌రెడ్డిని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌గా నియమించారు. జోన్లలో అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఈ బదిలీలతో మొత్తం ఆరు జోన్లకు గాను మూడు జోన్లలో ఐఏఎస్ అధికారులున్నారు. ఇప్పటి వరకు శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌తో పాటు రెవెన్యూ, ఐటీ విభాగాల అడిషనల్ కమిషనర్‌గా ఉన్న స్నేహశబరీ ను జడ్సీ పోస్టు నుంచి బదిలీ చేశారు. ఈవీడీఎం ౖడైరెక్టర్‌గా రంగనాథ్ భారీ వర్షాలు, అగి్నప్రమాదాలు వంటి ఘటనలు జరిగినప్పుడు ఎదురవుతున్న విపత్తులను ఎదుర్కొనేందుకు తక్షణ స్పందనతో పనిచేస్తున్న ఈవీడీఎం డైరెక్టర్‌గా ఉన్న ప్రకాశ్‌రెడ్డిని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీగా బదిలీ చేసి, ఆయన స్థానంలో ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్‌ను నియమించారు. డిప్యూటీ కలెక్టర్లు రిలీవ్ ఎన్నికల సందర్భంగా జీహెచ్ఎంసీకి వచి్చన డిప్యూటీ కలెక్టర్లలో ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లు కె. శివకుమార్, డి. శ్రీధర్, ఎన్. విజయలక్షి్మలను ఐఏఎస్‌ల బదిలీ ఉత్తర్వులకు ముందే జీహెచ్ఎంసీ నుంచి రిలీవ్ చేశారు. వీరిలో శివకుమార్ సంతోష్ నగర్ సర్కిల్ డీసీగా పనిచేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలు కూడా ముగిసినందున వీరికి పెద్దగా పనులేమీ లేకపోవడంతో రిలీవ్ చేసినట్లు తెలుస్తోంది. ఆయన స్టైలే వేరు.. కీలకమైన శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌గా పి.ఉపేందర్‌రెడ్డిని నియమించడం జీహెచ్ఎంసీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఆయన పనితీరు, ట్రాక్ రికార్డు ఆధారంగానే ప్రభుత్వం ఆయనను శేరిలింగంపల్లి జడ్సీగా నియమించినట్లు తెలుస్తోంది. గతంలో ఎల్బీనగర్ జడ్సీగా, బోడుప్పల్ కమిషనర్‌గా పనిచేసినప్పుడు ఆయన పలు అవార్డులు, రివార్డులు పొందారు. బోడుప్పల్లో పచ్చదనం పెంపు కార్యక్రమాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల నగదు రివార్డుఅందజేసింది. బోడుప్పల్ మునిసిపల్ కార్పొరేషన్లో ఆయన చేసిన పారిశుధ్య కార్యక్రమాలు చూసే అప్పటి మేయర్ బొంంతు రామ్మోహన్ ఆయన్ను జీహెచ్ఎంసీకి రప్పించారు. ఎల్బీనగర్ జోనల్ కమిషనర్‌గా ఉన్నప్పుడు అక్కడ వరదనివారణకు ఆయన రూపొందించిన ప్రాజెక్టు రిపోర్టుతోనే నగరమంతటికీ ఆ విధానాన్ని వర్తింపచేస్తూ ఎస్ఎన్డీపీ (వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం)కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.టాస్‌్కఫోర్స్ డీసీపీగా సుదీంద్ర ప్రస్తుతం ఏసీబీలో జాయింట్ డైరెక్టర్‌గా విధులు నగర పోలీసు విభాగానికి గుండెకాయ వంటి హైదరాబాద్ కమిషనర్స్ టాస్‌్కఫోర్స్ డీసీపీగా నాన్–క్యాడర్ ఎస్పీ స్థాయి అధికారి వైవీఎస్ సుదీంద్రను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సుదీంద్ర అవినీతి నిరోధక శాఖలో (ఏసీబీ) జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. హైదరాబాద్‌కే చెందిన ఈయన బంజారాహిల్స్‌లోని ముఫకంజా కాలేజీ నుంచి ఇంజినీరింగ్ పట్టా పొందారు. 2012లో గ్రూప్–1 ద్వారా డీఎస్పీగా ఎంపికై పోలీసు విభాగంలోకి అడుగుపెట్టారు. సుదీంద్ర బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ముగ్గురు మహిళా అధికారుల తర్వాత.. గడిచిన తొమ్మిది నెలల కాలంలో టాస్‌్కఫోర్స్‌కు ముగ్గురు మహిళా అధికారులు నేతృత్వం వహించారు. సుదీర్ఘకాలం టాస్‌్కఫోర్స్ డీసీపీగా పని చేసిన పి.రాధాకిషన్‌రావును గత ఏడాది అక్టోబర్‌లో ఎన్నికల సంఘం బదిలీ చేసింది. అప్పట్లో తొలి మహిళా డీసీపీగా ఐపీఎస్ అధికారి నిఖిత పంత్ నియమితులయ్యారు. ఎన్నికల ప్రక్రియ ముగిసి, కొత్త సర్కారు కొలువు తీరిన తర్వాత గత ఏడాది డిసెంబర్లో తొలిసారిగా పోలీసు బదిలీలు జరిగాయి. ఆ నేపథ్యంలో టాస్క్‌ఫోర్స్ డీసీపీగా నిఖిత పంత్ స్థానంలో నాన్–క్యాడర్ ఎస్పీగా ఉన్న శ్రీ బాల దేవి నియమితులయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈమెను బదిలీ చేసిన ప్రభుత్వం సాధన రష్మి పెరుమాల్‌ను నియమించారు. ఇటీవల జరిగిన ఐపీఎస్‌ల బదిలీల్లో భాగంగా ఈమె హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీగా వెళ్లారు. -
తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. ఆమ్రపాలికి జీహెచ్ఎంసీ బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. దాదాపు 44 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగానే రొనాల్డ్ రోస్‌ను విద్యుత్ శాఖకు బదిలీ చేస్తూ.. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా కాటా ఆమ్రపాలిను నియమించారు.జీఏడీ ముఖ్య కార్యదర్శిగా సుదర్శన్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్‌లు నియమితులయ్యారు. కార్మిక ఉపాధి శాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్, యువజన సర్వీసులు, పర్యాటక, క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీ ప్రసాద్‌లను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. స్పోర్ట్స్ ఎండీగా బాలాదేవి ఐఎఫ్ఎస్ నియామకంవిద్యుత్ శాఖ సెక్రటరీగా రోనాల్డ్ రోస్ నియామకంవిజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్మెంట్ కమిషనర్‌గా ఏవీ రంగనాథ్ ఐపీఎస్. హెచ్ఎండిఏ కమిషనర్‌గా సర్ఫరాజ్ అహ్మద్ ఆర్ అండ్ బీ స్పెషల్ సెక్రటరీగా హరిచందన టూరిజం ఎండిగా ప్రకాష్ రెడ్డి హౌసింగ్ స్పెషల్ సెక్రటరీగా గౌతమ్ సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సెక్రెటరీగా అలుగు వర్షినివాటర్ బోర్డు ఎండీగా అశోక్ రెడ్డి ఐటీ డిప్యూటీ సెక్రటరీగా భవిష్ మిశ్రా పొల్యూషన్ కంట్రోల్ సెక్రెటరీగా జీ.రవి ఫిషరీస్ డిపార్టుమెంట్ డైరెక్టర్‌గా ప్రియాంకా అలా టూరిజం డైరెక్టర్‌గా త్రిపాఠి డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్‌గా నరసింహారెడ్డి హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ ప్రిన్సిపల్ సెక్రెటరీగా శైలజ రామయ్య ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ ప్రిన్సిపల్ సెక్రెటరీగా అహ్మద్ నదీమ్ ఫైనాన్స్ డిపార్టుమెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీగా సందీప్ కుమార్ సుల్తానియాకమర్షియల్ టాక్స్ ఎక్సైజ్ డిపార్టుమెంట్ సెక్రటరీగా రజ్వీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కమిషనర్‌గా బుద్ధ ప్రకాష్ -
జీహెచ్ఎంసీ ఇన్చార్జి కమిషనర్‌గా ఆమ్రపాలి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ( జీహెచ్ఎంసీ) ఇన్చార్జి కమిషనర్‌గా ఆమ్రపాలిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ మూడు రోజుల పాటు లీవ్‌లో వెళుతున్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఇన్చార్జి కమిషనర్‌గా ఆమ్రపాలికి తెలంగాణ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. -
ఆమ్రపాలి మన ఆడపడుచే!
ఒంగోలు: ఆమ్రపాలి.. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న ఐఏఎస్‌లలో ఆమె ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు నగర శివారులోని నరసాపురం అగ్రహారం ఆమె స్వగ్రామం. దీనిని స్థానికంగా అగ్రహారం రైల్వే గేటు అని వ్యవహరిస్తారు. రైల్వే గేటు దాటాక రెండు కిలో మీటర్ల దూరంలో ఉంది ఎన్.అగ్రహారం గ్రామం. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (HMDA)లో జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ గా ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఆమ్రపాలి ఒంగోలు వాసికావడం గర్వకారణం. 2010 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆమ్రపాలి 39వ ర్యాంక్ సాధించి, ఐఏఎస్‌లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం ట్రైనీ ఐఏఎస్‌గా, జాయింట్ కలెక్టర్‌గా, నగర కమిషనర్‌గా పనిచేశారు. 2018లో వరంగల్ జిల్లా అర్బన్, రూరల్ కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. తండ్రి కాటా వెంకటరెడ్డి ఫ్రొఫెసర్.. ఎన్.అగ్రహారానికి చెందిన ఆమ్రపాలి తండ్రి కాటా వెంకటరెడ్డి చిన్నతనంలో అగ్రహారంలోనే చదువుకున్నారు. మేనకోడలు పద్మావతిని వివాహం చేసుకున్నారు. పద్మావతి స్వగ్రామం టంగుటూరు మండలం ఆలకూరపాడు గ్రామం. ఆయన చిన్నతనంలో ఎలిమెంటరీ విద్య ఆలకూరపాడు పాఠశాలలోనే జరిగింది. హైస్కూలు విద్య టంగుటూరు, ఇంటర్మీడియేట్, డిగ్రీ సీఎస్ఆర్ శర్మ కళాశాలలో, పీజీ విద్య విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సీటీలో పూర్తి చేశారు. అదే యూనివర్సిటీలో ఎకనమిక్స్ ఫ్రొఫెసర్‌గా ఉద్యోగంలో చేరారు. ఆమ్రపాలి కుటుంబానికి చెందిన సొంత ఇల్లు ఎన్.అగ్రహారంలో ఉంది. కుటుంబమంతా ఉన్నతాధికారులే.. ఆమ్రపాలితో పాటు ఆమె సోదరి కూడా ఐఆర్ఎస్. ఇండియన్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్ఎస్)కు ఎంపికయిన ఆమ్రపాలి సోదరి మానస గంగోత్రి ప్రస్తుతం కర్ణాటక కేడర్‌లో ఇన్‌కంట్యాక్స్ విభాగంలో పనిచేస్తోంది. మానస గంగోత్రి 2007 ఐఆర్ఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారిణి. ఐఆర్ఎస్లో 184వ ర్యాంక్ సాధించింది. ఆమె భర్త ప్రవీణ్ కుమార్ తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఆయన కూడా 2010 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్. తమిళనాడు ఐఏఎస్ కేడర్‌కు చెందిన ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం ఉమెన్ వెల్ఫేర్‌లో డైరెక్టర్‌గా చేస్తున్నారు. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత చనిపోయిన తరువాత జరిగిన ఉపెన్నికకు రెండు సార్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. అమ్రపాలి భర్త ఐపీఎస్ అమ్రపాలికి 2018 ఫిబ్రవరి 18న తేదీన వివాహం జరిగింది. 2011 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన షమీర్ శర్మ జమ్మూ పట్టణానికి చెందిన వ్యక్తి. ప్రస్తుతం ఆయన డామన్ డయ్యూ కేంద్రపాలిత ప్రాంతంలో ఎస్సీగా పనిచేస్తున్నాడు -
IAS Amrapali: బాధ్యతలు చేపట్టిన ఆమ్రపాలి
సాక్షి, హైదరాబాద్: డ్యాషింగ్ ఐఏఎస్ ఆఫీసర్‌గా పేరున్న ఆమ్రపాలి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ జాయింట్ కమిషనర్‌గా ఇవాళ సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. బదిలీ ద్వారా పదోన్నతితో హెచ్ఎండీఏకు ఆమె నియమితులైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు అధికారులు ఆమెను అభినందించారు. హెచ్ఎండిఏ ఉద్యోగుల సహకారంతో మరిన్ని కొత్త ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం ప్రభుత్వం తనకు కల్పించిందని ఈ సందర్భంగా ఆమె అన్నారు. ఆపై మూసి రివర్ ఫ్రెంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి)గా ఆమ్రపాలి బాధ్యతలు చేపట్టి కార్పొరేషన్ అధికారులతో ఇంటరాక్ట్ అయ్యారు. హెచ్ఎండీఏకు ఉన్నత పరిపాలనాధికారిగా కమిషనర్ మాత్రమే కొనసాగుతుండగా.. తాజాగా సంయుక్త కమిషనర్‌గా ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలిని నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. 2019 నుంచి హెచ్ఎండీఏకు కమిషనర్‌గా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ కొనసాగుతున్నారు. హెచ్ఎండీఏను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయనున్నట్లు అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీంతో అర్వింద్‌ను హెచ్ఎండీఏలో కొనసాగిస్తారా.. ఆ స్థానంలో నూతన అధికారిని నియమించనున్నారా? అనే దానిపైనా త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
IAS Amrapali Kata: డ్యాషింగ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలిని ఇలా ఎప్పుడైనా చూశారా? (ఫొటోలు)
-
కేంద్ర సర్వీసులోకి.. ఆమ్రపాలి, శశికిరణాచారి
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు అధికారులు కేంద్ర సర్వీసులోకి వెళ్లనున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి కార్యాలయంలో విధులు నిర్వహించేందుకు ఓఎస్డీగా ఆమ్రపాలి కాటా, అడిషనల్ పీఎస్‌గా కె.శశికిరణాచారి వెళ్లనున్నారు. ఈమేరకు వారిని కేంద్ర సర్వీసులోకి పంపించాల్సిందిగా రాష్ట్రప్రభుత్వానికి వర్తమానం అందింది. గతంలో వరంగల్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఆమ్రపాలి బదిలీపై జీహెచ్ఎంసీకి వచ్చి అడిషనల్ కమిషనర్‌గా కొనసాగుతున్నారు. -
కోటి మంది సేవల్లో మహిళా అధికారులు..
సాక్షి,సిటీబ్యూరో: మహానగర జనాభా దాదాపు కోటికి పైనే ఉంది. ఇంతమందికి సేవలందిస్తున్న జీహెచ్ఎంసీలో మహిళా అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. జీహెచ్ఎంసీలోని ముఖ్య విభాగాల్లో వారు సేవలందిస్తున్నారు. వీరిలో అడిషనల్, జోనల్, డిప్యూటీ కమిషనర్లతో పాటు ఇంజినీర్లు ఉన్నారు. నగరంలో అన్ని పనులూ జరిగేది సర్కిళ్ల పరిధిలోనే. ప్రజలకు ఎదురయ్యే ఎలాంటి ఇబ్బందులైనా సర్కిల్ స్థాయిలోని డిప్యూటీ కమిషనర్లే (డీఎంసీ) పరిష్కరిస్తారు. ఇళ్ల నుంచి చెత్త తీసుకెళ్లకపోవడం, వీధిలోని చెత్త, రోడ్లు, డ్రైనేజీ, ఆస్తిపన్ను సమస్యలు అన్నీ పరిష్కరించేది వీరే.. ఈ సేవలతో పాటు వృద్ధులకు అందాల్సిన సేవలు పర్యవేక్షించేదీ వారే. వీటితో పాటు జీహెచ్ఎంసీ చేపట్టే వివిధ కార్యక్రమాల్లో కాలనీ సంక్షేమ సంఘాలు, రెసిడెంట్ వెల్ఫేర్ సంఘాలు, ఎన్జీఓలను భాగస్వాములను చేస్తూ విజయవంతం చేయాల్సిందీ వీరే. ఓటరు జాబితాలో పేరు లేకున్నా ప్రజలు ఫిర్యాదు చేసేది వీరికే. ఇంతటి బాధ్యతలున్న డిప్యూటీ కమిషనర్లలో ఏడుగురు మహిళలే. సంతోష్‌నగర్ సర్కిల్ డీఎంసీగా ఎ.మంగతాయారు, చార్మినార్‌కు సరళమ్మ, గోషామహల్ కు రిచాగుప్తా, ఖైరతాబాద్‌కు గీతారాధిక, ముషీరాబాద్‌కు ఉమాప్రకాశ్, బేగంపేటకు నళిని పద్మావతి, మూసాపేటకు వి.మమత డీఎంసీలుగా సేవలు అందిస్తున్నారు. సర్కిళ్ల స్థానిక సమస్యల పరిష్కారంతో పాటు జోనల్ కమిషనర్లు, కమిషనర్ నిర్వహించే వివిధ సమావేశాలకు హాజరు కావాల్సిన వీరికి ఖాళీ అంటూ ఉండదు. ఇక జీహెచ్ఎంసీలోని ఆరు జోన్లలో నగరంలోనే ఎంతో ప్రాధాన్యమున్న, సంపన్న ప్రాంతమైన, రియల్ రంగం జోరున్న, ఐటీ ఉద్యోగులెక్కువగా ఉన్న శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌గా ఐఏఎస్ అధికారి దాసరి హరిచందన విధులు నిర్వహిస్తున్నారు. జోనల్ స్థాయిలోని సాధారణ సమస్యలతో పాటు నగరవ్యాప్తంగా ఉపకరించే కొత్త కొత్త స్కీంలను రూపొందించడం ద్వారా ఈమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ’(సీఎస్సార్) ద్వారా ఆయా పథకాలకు నిధుల సేకరణ, జీవవైవిధ్య విభాగం అడిషనల్ కమిషనర్‌గాను అదనపు బాధ్యతలు అందిస్తున్నారీమె. నగరంలో శునకాలకు ఓ ప్రత్యేక పార్కు ఉండాలని, ఆకలిగొన్న వారిని ఆదుకునేందుకు ‘ఫుడ్ ఫర్ ద నీడ్’ వంటి పథకాలు హరిచందన ఆలోచనల్లో నుంచి కార్యరూపం దాల్చినవే. ఎన్నికల ‘స్వీప్’ నోడల్ అధికారిగా వ్యవహరించిన ఈమె దివ్యాంగుల కోసం ‘వాదా’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చి దివ్యాంగుల పోలింగ్ శాతం పెరిగేందుకు కృషి చేశారు. జీహెచ్ఎంసీ అడిషినల్ కమిషనర్ (యూసీడీ)గా ఉన్న ఆమ్రపాలి కాటా చీఫ్ జాయింట్ ఎలక్షన్ కమిషనర్‌గానూ సేవలందిస్తున్నారు. జీహెచ్ఎంసీలో వివిధ విభాగాల నిర్వహణ ఒక ఎత్తు. పారిశుధ్యం బాధ్యతలు నిర్వహించడం మరో ఎత్తు. అంతటి కీలకమైన పారిశుధ్యంతో పాటు రవాణా, ఎంటమాలజీ, చెత్త నుంచి విద్యుత్, సీ అండ్ డీ వేస్ట్ తదితర విభాగాల బాధ్యతలు మరో ఐఏఎస్ అధికారి శ్రుతిఓజా తీసుకున్నారు. జీహెచ్ఎంసీలోని దాదాపు ఏడువేల మంది రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించిన పరిపాలన విభాగం బాధ్యతలు నిర్వహించే అడిషనల్ కమిషనర్(పరిపాలన)గా విజయలక్ష్మి, జాయింట్ కమిషనర్‌గా సరోజ, ఎస్టేట్స్ ఆఫీసర్‌గా శైలజ విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నికల విభాగంలో కీలకం.. ఎన్నికల విధులు అన్ని జిల్లాల్లో ఒక ఎత్తు. హైదరాబాద్ మహానగరంలో ఒక ఎత్తు. వందల మంది వీఐపీలతో పాటు అన్ని పార్టీల ముఖ్యనేతలు ఉండే నగరంలో ఓటర్ల జాబితా ఫిర్యాదుల పరంపరకు కొదవే లేదు. జాబితాలో పేర్ల గల్లంతు నుంచి మొదలు డూప్లికేట్ ఓటర్ల వరకు నిత్యం ఫిర్యాదులే. దీంతో పాటు హైకోర్టు కేసులు తదితరమైనవి సరేసరి. ఎంతో పనిఒత్తిడి ఉన్న జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగం జాయింట్ కమిషనర్‌గా ఎస్.పంకజ విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారి నిర్వహించే ఎన్నికల సమావేశాల సమన్వయం, సీఈఓ కార్యాలయం నుంచి అందే ఆదేశాల అమలు, హైదరాబాద్ జిల్లాలోని అందరు ఎన్నికల అధికారులతో సమన్వయం, వారి సందేహాల నివృత్తి, ఎప్పటికప్పుడు పూర్తిచేయాల్సిన పనులు, ఓటర్ల జాబితాలు.. సవరణలు.. ప్రస్తుత ఎన్నికల తరుణంలో నిత్యం పనుల ఒత్తిడితో సతమతమయ్యే ఈ విభాగం జాయింట్ కమిషనర్‌గా పంకజ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బిల్లుల చెల్లింపులోనూ.. కోట్ల రూపాయల బడ్జెట్ కలిగిన జీహెచ్ఎంసీలో ప్రతి పనికీ, ప్రతి కాంట్రాక్టర్‌కూ బిల్లుల చెల్లింపుల్లో ఏ మాత్రం తేడా వచ్చినా భారీగా లెక్కలు తారుమారవుతాయి. బిల్లుల లెక్కలు, చెల్లింపులు పక్కాగా పర్యవేక్షించాల్సిన చీఫ్ ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్‌గా సీహెచ్ ద్రాక్షామణి ఉన్నారు. ఇంజినీరింగ్ విభాగంలో.. జీహెచ్ఎంసీలోని ఇంజినీరింగ్ విభాగంలో సూపరింటెండింగ్ ఇంజినీర్ సరోజారాణి, ఐదుగురు ఈఈలు సహా దాదాపు 160 మంది మహిళా ఇంజినీర్లు వివిధ విభాగాల్లో సేవలందిస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఎస్సార్డీపీ ప్రాజెక్టులతో పాటు మెయింటనెన్స్ విభాగంలో పనిచేస్తున్నారు. ఐటీ విభాగం చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌గా శ్వేత కొనసాగుతున్నారు. జీహెచ్ఎంసీకి వివిధ యాప్‌ల రూపకల్పన, ఈ–ఆఫీస్ తదితర విధులు నిర్వహిస్తున్నారు. ఆరోగ్యం–పారిశుధ్యం విభాగంలో ఆరుగురు మహిళా డాక్టర్లు ఏఎంఓహెచ్‌లుగా సేవలందిస్తున్నారు. ఇలా జీహెచ్ఎంసీలోని పలు కీలకవిభాగాల బాధ్యతలు నిర్వహిస్తున్న మహిళలు తాము ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు. మేడ్చల్‌లో మహిళా శక్తి సాక్షి,మేడ్చల్ జిల్లా: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో మహిళలకు ప్రముఖ స్థానం ఉంది. అన్నీ రంగాల్లో పురుషుల కంటే తామేమి తక్కువేమీ కాదని అధికార, రాజకీయ రంగాల్లో రాణిస్తున్నారు. జిల్లాలో 12 మంది మహిళలు జిల్లా అధికారుల స్థాయిలో ఉత్తమ సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు చూరగొంటున్నారు. సీపీఓగా సౌమ్యారెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారిగా విజయకుమారి, ఐసీడీఎస్ అధికారిగా స్వరూపరాణి, మైనార్టీ జిల్లా అధికారిగా విజయకుమారి, పౌరసంబంధాల శాఖ డీడీగా సరస్వతి, భూగర్భజల వనరుల అధికారిగా రేవతి, ఇరిగేషన్ జిల్లా అధికారిగా మంజుల, జిల్లా ఉపాధి కల్పనాశాఖ అధికారిగా నిర్మల, ఆర్డబ్ల్యూఎస్ అధికారిగా జ్యోతి, సివిల్ సప్లై జిల్లా మేనేజర్‌గా సరితారాణి, డీఎస్‌ఓగా పద్మ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా ఈశ్వరి, కలెక్టరేట్ ఏఓగా విజయలక్ష్మి విధులు నిర్వహిస్తున్నారు. అలాగే, జిల్లాలోని మొత్తం 14 మండలాల్లో ఏడింటికి తహసీల్దార్లుగా మహిళా అధికారులే ఉన్నారు. జిల్లాలో ఐదుగురు ఎంపీడీఓలకు ఐదుగురు మహిళా అధికారులే ఉన్నారు. ఘట్కేసర్ ఎంపీడీఓగా అరుణ, శామీర్‌పేట్ ఎంపీడీఓగా జ్యోతి, మేడ్చల్ ఎంపీడీఓగా పద్మ, కీసర ఎంపీడీఓగా శశిరేఖ విధులు నిర్వహిస్తూనే... కుత్బుల్లాపూర్ మండల ఎంపీడీఓగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. -
అధికారుల సహకారంతోనే అభివృద్ధి
ఖిలా వరంగల్ : ప్రజల భాగస్వామ్యం, అధికా రుల సహకారంతోనే అర్బన్ జిల్లాను అభివృద్ధిలో ముందుంచామని కలెక్టర్ అమ్రపాలి కాట అన్నారు. జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్‌గా బదిలీ అయిన ఆమెకు ఖిలావరంగల్ మధ్యకోటలోని ఏకశిల చిల్డ్రన్స్ పార్కులో గురువారం రాత్రి అత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. పర్యాటకశాఖ జిల్లా అధికారి డీఎస్.జగన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జెడ్పీ సీఈఓ విజయగోపాల్, డీఆర్డీఓ అధికారి రాము, డీఆర్ఓ డేవిడ్‌రాజు, సీఓ శ్రవణ్, జేసీ దయానంద్, ఆర్డీఓ బుచ్చిరెడ్డి, డీఎంహెచ్ఓ హరీష్‌రాజు, ఇతర శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు. ముందుగా అమ్రపాలికి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆమ్రపాలి కాట మాట్లాడుతూ తాను అనుకున్న లక్ష్యానికి సులభంగా చేరుకున్నాని చెప్పారు. తాను విధులు నిర్వర్తించిన 22 నెలల 15 రోజుల కాలం గొప్ప అనుభూతిని అందించిందన్నారు. జీవితంలో గుర్తుండేలా జీవిత భాగస్వామిని అందించిన నేలను ఎప్పటికీ గుర్తుంచుకుంటానన్నారు. కోట అందాలు మరింత ఆకర్షణగా నిలవాలంటే మరో రెండు సంవత్సరాల కాలం పడుతుందని.. ప్రపంచ పర్యాటకులను ఆహ్వానించేలా పక్కా ప్రణాళికలతో అభివృద్ధికి చర్యలు చేపట్టామని గుర్తు చేశారు. మహా నగరపాలక సంస్థ ద్వారా నగరాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు రూపకల్పన చేశామని, అండర్ డ్రెయినేజీ, రోడ్ల విస్తరణ, గార్డెనింగ్స్, సెంటర్ లైటింగ్స్, గ్రీనరీ, జంక్షన్ల అభివృద్ధి జరగనున్నాయన్నారు. జిల్లాల విభజన తర్వాత చారిత్రక వరంగల్‌లో మొదటిసారిగా కలెక్టర్ బాధ్యతలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేయడం అనందంగా ఉందన్నారు. ప్రజల భాగస్వామ్యం మరువలేనిదని, తనకు సహాయసహకారాలు అందించిన ఉద్యోగులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంతకు ముందు తెలం గాణ సాంస్కృతిక కళాకారుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి. మిమిక్రీ కళాకారుడు వెంకి హాస్యం ఆహూతులను కడుపుబ్బా నవ్వించింది. సమావేశంలో జిల్లాలోని రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
రాక– పోక
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ సెంట్రల్ జోన్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న భారతి హొళ్లికేరి మంచిర్యాల కలెక్టర్‌గా బదిలీ కాగా, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్‌గా ఆమ్రపాలి రానున్నారు. ఈమేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా జీహెచ్ఎంసీ నుంచి ఒక మహిళా ఐఏఎస్ అధికారి బదిలీ కాగా..మరో మహిళా ఐఏఎస్ రానున్నారు. -
దసరా నాటికి ‘భగీరథ’ నీళ్లు
హన్మకొండ అర్బన్ : జిల్లాలో మిషన్ భగీరథ ఇంట్రావిలేజ్ పనులు మొత్తం సెప్టెంబర్ ఆఖరు నాటికి పూర్తి చేసి దసరా పండగ నుంచి ప్రతి ఇంటికీ తాగునీరు అందించేందుకు అధికారులు సిద్దం కావాలని జిల్లా కలెక్టర్ అమ్రపాలి కాట సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సుబేదారి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ మిషన్ భగీరథ పనుల్లో వేగం పెంచాలన్నారు. పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి అధికారులు అలసత్వం లేకుండా పనిచేయాలని ఆదేశించారు. అదేవిధంగా ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా ఉన్నందున జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖలూ.. హరితహారం లక్ష్యం చేరుకోవాలన్నారు. ఎన్ఆర్ఈజీఎస్లో నాటిన మొక్కలకు సంబంధించి బిల్లుల చెల్లింపులు చేయడంతోపాటు ప్రతి మొక్కనూ జియోట్యాగింగ్ చేయాలన్నారు. ఎంపీడీఓల స్థాయిలో ప్రతి వారం లక్ష మొక్కలు నాటేలా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలన్నారు. నిర్ధేశించిన నర్సరీల నుంచి మొక్కలు తెప్పించుకోవాలన్నారు. అదేవిధంగా వచ్చే సంవత్సరం నాటేందుకు కావాల్సిన మొక్కల పెంపకం కోసం నర్సరీలు సిద్ధం చేసుకోవాలన్నారు. ‘కుడా’ ఆధ్వర్యంలో 75లక్షలు, కార్పొరేషన్ ఆధ్వర్యంలో 60లక్షలు, డీఆర్డీఓ ద్వారా 60లక్షలు, అటవీ శాఖ ద్వారా 23లక్షల మొక్కలు పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా ఈ సంవత్సరం నిర్ధేశించిన 62లక్షల మొక్కల లక్ష్యాన్ని అధిగమించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. డీఎఫ్ఓ అర్పణ, డీఆర్డీఓ రాము, అర్డబ్ల్యూఎస్ ఈఈ మల్లేష్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మా ఇంట్లో దెయ్యం ఉంది..!
-
నాకు దెయ్యాలంటే చాలా భయం : అమ్రపాలి
సాక్షి, హన్మకొండ అర్బన్ : తన అధికార నివాసంలోని రెండో అంతస్తులో దెయ్యం ఉందని, తనకు దెయ్యాలంటే భయమని స్వయంగా వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి కాట వెల్లడించడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఇటీవల (ఆగస్టు 10న) కలెక్టర్ బంగ్లాకు 133 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కలెక్టర్ ఓ ప్రైవేట్ వెబ్ చానల్‌తో మాట్లాడుతూ.. భవన నిర్మాణం అద్భుతమని, ఆధునిక హంగులు లేకున్నా వసతులు బాగున్నాయని తెలిపారు. అయితే రెండో అంతస్తులో ఓ బెడ్రూం.. సామగ్రి ఉన్నప్పటికీ అక్కడ దెయ్యం ఉందని గతంలో ఉన్న కొందరు కలెక్టర్లు తనకు చెప్పారన్నారు. అయితే కలెక్టర్ భవన నిర్మాణానికి సంబంధించి పలు విధాలుగా పరిశోధనలు చేయించినట్లు తెలిపారు. వాటి ఆధారంగా భవన నిర్మాణానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు తెలిశాయని ఆమె వివరించారు. ‘జార్జ్ పామర్ అనే వ్యక్తి భార్య వరంగల్ కలెక్టరేటు క్యాంపు కార్యాలయానికి శంకుస్థాపన చేశారని తెలిసింది. నిజాం కాలంలో అతడు ఓ ఇంజినీర్ అని తెలుసుకున్నా. చిందరవందరగా ఉన్న రెండో అంతస్తు గదిని శుభ్రం చేయించా. కానీ దెయ్యం ఉందన్న భయంతో ఆ గదిలో పడుకునే సాహసం చేయలేదు’ అంటూ ఆమ్రపాలి నవ్వుతూ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కలెక్టర్ చెప్పడంతో ఆ బంగ్లాలో దెయ్యం విషయం చర్చనీయాంశంగా మారింది. -
కలెక్టర్ అమ్రపాలి ఆఫీసులో పాము కలకలం
-
కలెక్టర్ అమ్రపాలి ఆఫీసులో పాము కలకలం
హన్మకొండ: వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి క్యాంపు కార్యాలయంలో నాగుపాము కలకలంరేపింది. సైలెంట్‌గా లోపలికి వచ్చేసిన పామును చూసి క్యాంపు కార్యాలయ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న రెస్వ్యూ టీమ్ నిమిషాల్లోనే అక్కడికి చేరుకుంది. వారు స్నేక్ సొసైటీ సభ్యులకు ఫోన్ చేశారు. ఓ స్నేక్ మెజీషియన్ వచ్చి పామును పట్టుకోవడంతో సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం పామును సమీపంలోని అడవిలో వదిలేశారు. రకరకాల పనులపై ప్రతిరోజూ వందలమంది కలెక్టర్ క్యాంప్ ఆఫీసుకు వస్తుంటారు. అయితే ఆదివారం కావడంతో జనసందడి అంతగాలేదు. పాము ప్రవేశించిన సమయంలో కలెక్టర్ అమ్రపాలి కార్యాలయంలో లేరని తెలిసింది. -
వైరల్: బాహుబలి-2 టికెట్ల కోసం అమ్రపాలి
- 350 టికెట్లు బుక్ చేయించిన వరంగల్ అర్బన్ కలెక్టర్ - సోషల్ మీడియాలో వైరల్ హన్మకొండ: విడుదల తేదీ దగ్గరపడుతున్నకొద్దీ ప్రేక్షకులను బాహుబలి ఫీవర్ ఉర్రూతలూగిస్తోంది. ఏప్రిల్ 28న రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం ఇప్పటికే ఆన్ లైన్ టిక్కెట్లను జోరుగా కొనుగోలు చేయగా.. థియేటర్ల ముందు ప్రేక్షకులు భారీగా బారులు తీరారు. ఈ తరుణంలోనే వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి కాటా ఒక్కరే 350 టికెట్లు బుక్ చేయించడం చర్చనీయంశమైంది. వరంగల్ ఆర్డీవో ద్వారా బాహుబలి-2 సినిమాటికెట్లు బుక్ చేయించారామె. ఇన్ని టికెట్లు ఎందుకు? అని ఆరా తీయగా ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి.. గత కొద్ది రోజులుగా వరంగల్ నగరంలో సుందరీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అధికారులు, ఉద్యోగులు, ఆర్టిస్టులు అంతా కలుపుకొని సుమారు 300 మంది సుందరీకరణ పనుల్లో భాగం పంచుకుంటున్నారు. వారికి కాస్త ఆటవిడుపుగా ఉంటుందనే ఉద్దేశంతోనే కలెక్టర్ అమ్రపాలి.. అందరికీ కలిపి బాహుబలి-2 టికెట్లు బుక్ చేయించారు. హన్మకొండలోని ఏసియన్ మాల్లో 28న వారంతా ఫస్ట్ షో చూడనున్నారు. సమర్థురాలైన అధికారణిగా ప్రశంసలు పొందిన అమ్రపాలి మరోసారి ఇలా వార్తల్లో నిలిచారు. (బాహుబలి-2 తొలి రోజే రికార్డులు సృష్టించనుందా?) (ప్రతిభకు మారుపేరు అమ్రపాలి) -
ప్రతి వివాహానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి
హన్మకొండ: గ్రామ పంచాయతీ కార్యదర్శులు తమ పరిధిలో జరిగే ప్రతి వివాహాన్ని తప్పనిసరిగా వివాహాల రిజిస్ట్రేషన్ చట్టం–202 కింద రిజిష్టర్ చేయాలని జిల్లా కలెక్టర్ అమ్రపాలి కాట సూచించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో వివాహాల రిజిస్ట్రేషన్, బాల్యవివాహాలు, పిల్లల దత్తత అంశంపై ఉదయం నుంచి సాయంత్రం వరకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వివాహాల రిజిస్ట్రేషన్ చట్టంలో నిబంధనలు అధికారులు తప్పనిసరిగా పాటిస్తూ రిజిస్ట్రేషన్ చేసి ధ్రువీకరణ పత్రం జారీ చేయాలని అన్నారు. సర్టిఫికెట్ జారీ కోసం అధికారులు గ్రామ పంచాయతీ నిధులు వాడుకోవాలన్నారు. వివాహ అధికారులుగా నియామకమైన పంచాయతీ కార్యదర్శులు సంబంధిత నివేదికలు వీఓఆర్డీలకు అక్కడి నుంచి డీపీఓకు పంపాలని అన్నారు. సమగ్ర నివేదికను ఐసీడీఎస్ ఆధ్వర్యంలో రూపొందించాలని అన్నారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ శైలజ, డీపీఓ మహమూది, జెడ్పీ సీఈఓ విజయ్‌గోపాల్, తరుణి ప్రతినిధి మమతరఘువీర్, అనితారెడ్డి, డీఎంఅండ్‌హెచ్‌ఓ రామ్మోహన్, జిల్లా బాలల పరిరక్షణ విభగం ప్రతినిధి సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రచార పోస్టర్లు కలెక్టర్ ఆవిష్కరించారు.