కలెక్టర్ అమ్రపాలి ఆఫీసులో పాము కలకలం
హన్మకొండ: వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి క్యాంపు కార్యాలయంలో నాగుపాము కలకలంరేపింది.
సైలెంట్‌గా లోపలికి వచ్చేసిన పామును చూసి క్యాంపు కార్యాలయ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న రెస్వ్యూ టీమ్ నిమిషాల్లోనే అక్కడికి చేరుకుంది. వారు స్నేక్ సొసైటీ సభ్యులకు ఫోన్ చేశారు.
ఓ స్నేక్ మెజీషియన్ వచ్చి పామును పట్టుకోవడంతో సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం పామును సమీపంలోని అడవిలో వదిలేశారు. రకరకాల పనులపై ప్రతిరోజూ వందలమంది కలెక్టర్ క్యాంప్ ఆఫీసుకు వస్తుంటారు. అయితే ఆదివారం కావడంతో జనసందడి అంతగాలేదు. పాము ప్రవేశించిన సమయంలో కలెక్టర్ అమ్రపాలి కార్యాలయంలో లేరని తెలిసింది.