
ఎన్.అగ్రహారంలోని ఆమ్రపాలి కుటుంబానికి చెందిన ఇల్లు, ఆమ్రపాలి తండ్రి కాటా వెంకటరెడ్డి
ఒంగోలు: ఆమ్రపాలి.. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న ఐఏఎస్‌లలో ఆమె ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు నగర శివారులోని నరసాపురం అగ్రహారం ఆమె స్వగ్రామం. దీనిని స్థానికంగా అగ్రహారం రైల్వే గేటు అని వ్యవహరిస్తారు. రైల్వే గేటు దాటాక రెండు కిలో మీటర్ల దూరంలో ఉంది ఎన్.అగ్రహారం గ్రామం.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (HMDA)లో జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ గా ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఆమ్రపాలి ఒంగోలు వాసికావడం గర్వకారణం. 2010 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆమ్రపాలి 39వ ర్యాంక్ సాధించి, ఐఏఎస్‌లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం ట్రైనీ ఐఏఎస్‌గా, జాయింట్ కలెక్టర్‌గా, నగర కమిషనర్‌గా పనిచేశారు. 2018లో వరంగల్ జిల్లా అర్బన్, రూరల్ కలెక్టర్‌గా విధులు నిర్వహించారు.
తండ్రి కాటా వెంకటరెడ్డి ఫ్రొఫెసర్..
ఎన్.అగ్రహారానికి చెందిన ఆమ్రపాలి తండ్రి కాటా వెంకటరెడ్డి చిన్నతనంలో అగ్రహారంలోనే చదువుకున్నారు. మేనకోడలు పద్మావతిని వివాహం చేసుకున్నారు. పద్మావతి స్వగ్రామం టంగుటూరు మండలం ఆలకూరపాడు గ్రామం. ఆయన చిన్నతనంలో ఎలిమెంటరీ విద్య ఆలకూరపాడు పాఠశాలలోనే జరిగింది. హైస్కూలు విద్య టంగుటూరు, ఇంటర్మీడియేట్, డిగ్రీ సీఎస్‌ఆర్ శర్మ కళాశాలలో, పీజీ విద్య విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సీటీలో పూర్తి చేశారు. అదే యూనివర్సిటీలో ఎకనమిక్స్ ఫ్రొఫెసర్‌గా ఉద్యోగంలో చేరారు. ఆమ్రపాలి కుటుంబానికి చెందిన సొంత ఇల్లు ఎన్.అగ్రహారంలో ఉంది.
కుటుంబమంతా ఉన్నతాధికారులే..
ఆమ్రపాలితో పాటు ఆమె సోదరి కూడా ఐఆర్‌ఎస్. ఇండియన్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్‌ఎస్)కు ఎంపికయిన ఆమ్రపాలి సోదరి మానస గంగోత్రి ప్రస్తుతం కర్ణాటక కేడర్‌లో ఇన్‌కంట్యాక్స్ విభాగంలో పనిచేస్తోంది. మానస గంగోత్రి 2007 ఐఆర్‌ఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారిణి. ఐఆర్‌ఎస్‌లో 184వ ర్యాంక్ సాధించింది. ఆమె భర్త ప్రవీణ్ కుమార్ తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఆయన కూడా 2010 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్. తమిళనాడు ఐఏఎస్ కేడర్‌కు చెందిన ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం ఉమెన్ వెల్ఫేర్‌లో డైరెక్టర్‌గా చేస్తున్నారు. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత చనిపోయిన తరువాత జరిగిన ఉపెన్నికకు రెండు సార్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.
అమ్రపాలి భర్త ఐపీఎస్
అమ్రపాలికి 2018 ఫిబ్రవరి 18న తేదీన వివాహం జరిగింది. 2011 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన షమీర్ శర్మ జమ్మూ పట్టణానికి చెందిన వ్యక్తి. ప్రస్తుతం ఆయన డామన్ డయ్యూ కేంద్రపాలిత ప్రాంతంలో ఎస్సీగా పనిచేస్తున్నాడు
Comments
Please login to add a commentAdd a comment