HMDA Commissioner
-
Hyderabad: కీలకమైన మూడు పోస్టుల్లో కొత్త బాస్‌లు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు ముఖ్య విభాగాలైన జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, వాటర్ బోర్డుల్లో ఉన్న బాస్‌లు మారారు. వారిస్థానే కొత్త బాస్‌లను నియమించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రేటర్ పరిధిలో భారీ స్థాయిలో అధికారుల బదిలీలు జరగడం ఇదే ప్రథమం. ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచీ ఆయా విభాగాల చీఫ్‌లు మారతారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇప్పటిదాకా జరగలేదు. తాజాగా జరిగిన ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీల్లో భాగంగా నగరంలోని ముగ్గురు చీఫ్‌లతో పాటు మరికొందరు అధికారులను కూడా బదిలీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత బీఆర్ఎస్ హయాంలో కీలకశాఖల్లో ఉన్నవారిని వెంటనే మారుస్తారనుకున్నప్పటికీ, రాజకీయ పరిణామాలు, లోక్‌సభ ఎన్నికలు, ఇతరత్రా కారణాలతో పూర్తిస్థాయిలో బదిలీలు జరగలేదు. పాలనలో, అభివృద్ధిలో తమదైన మార్కు చూపించేందుకు ప్రభుత్వం ఇప్పటికే కొన్ని నిర్ణయాలు తీసుకుంది. వాటిని అమలు చేయడం, నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంతో పాటు ఆయా సంస్థల్లో ప్రక్షాళనలో భాగంగా ఈ బదిలీలు జరిగినట్లు భావిస్తున్నారు. ప్రజా సదుపాయాలు, ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా.. నగరానికి సంబంధించినంత వరకు ఓఆర్ఆర్ వరకు యూనిట్‌గా పనులకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఓఆర్ఆర్ వరకున్న శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కూడా జీహెచ్ఎంసీలో విలీనం చేయడం..ఒకటే పెద్ద కార్పొరేషన్ లేదా మూడు నాలుగు కార్పొరేషన్లుగా చేసే ఆలోచనలున్నాయి. జీహెచ్ఎంసీ, హెచ్‌ఎండీయేల్లో భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి భారీ అవినీతి జరిగిందనే అభిప్రాయాలున్నాయి. వాటిపై ఉన్న ఆ ముద్రను తొలగించడంతోపాటు పౌరులకు సకాలంలో సేవలు, మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ కార్యక్రమాల అమలు ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. అంతేకాకుండా ‘వైబ్రెంట్ హైదరాబాద్’ కోసం మెగా మాస్టర్‌ప్లాన్–2050తో ఆయా పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో ఆరి్థకాభివృద్ధితోపాటు మొబిలిటీ, బ్లూ, గ్రీన్ ఇన్ఫ్రా స్ట్రక్చర్స్ కీలకంగా ఉన్నాయి. ఓవైపు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటంతో పాటు మరోవైపు పెరుగుతున్న జనావాసాలన్నింటికీ సురక్షిత నీరు, వందశాతం మురుగుజలాల శుద్ధి కోసం ఎస్టీపీల పనులు జరుగుతున్నాయి. ఓఆర్ఆర్ వరకు ఎలాంటి విపత్తులు జరిగినా వెంటనే ఆదుకునేలా ఉండేందుకు విపత్తు నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోంది. అందులో భాగంగానే ఈవీడీఎం విభాగంలోని డీఆర్ఎఫ్ టీమ్‌లను పెంచుతున్నారు. ఏడాది గడవకుండానే బదిలీ అయిన రోనాల్డ్‌రాస్ 👉 గత జూలై 5వ తేదీన జీహెచ్ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన రోనాల్డ్‌రాస్‌ను ఇంధనశాఖ సెక్రటరీగా బదిలీ చేశారు. 👉 జీహెచ్ఎంసీ కమిషనర్‌గా హెచ్ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్, మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డీసీఎల్)ఎండీ ఆమ్రపాలికి పూర్తిస్థా యి బాధ్యతలప్పగించారు. 👉 హెచ్ఎండీఏ కమిషనర్‌గా ఈసీలో జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌గా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్‌ను నియమించారు. 👉 çహార్టికల్చర్ డైరెక్టర్ కె.అశోక్‌రెడ్డిని వాటర్‌బోర్డు ఎండీగా నియమించారు. 👉 మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్కు ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం..కొత్తగా జాయింట్ ఎండీ పోస్టును సృష్టించి రాజన్న సిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్ పి.గౌతమిని నియమించింది. నాలుగు జోన్లకు కొత్త కమిషనర్లు.. జీహెచ్ఎంసీ జోన్ల ప్రక్షాళనే లక్ష్యంగా నాలుగు జోన్లలో కొత్త జోనల్ కమిషనర్లను నియమించారు. ఇటీవల ఖాళీ అయిన ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌గా అనురాగ్ జయంతిని, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్‌గా హైదరాబాద్ అడిషనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్‌ను, కూకట్పల్లి జోనల్ కమిషనర్‌గా జోగులాంబ గద్వాల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ అపూర్వ్ చౌహాన్‌ను నియమించారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అడిషనల్ కమిషనర్‌గా ఉన్న పి.ఉపేందర్‌రెడ్డిని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌గా నియమించారు. జోన్లలో అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఈ బదిలీలతో మొత్తం ఆరు జోన్లకు గాను మూడు జోన్లలో ఐఏఎస్ అధికారులున్నారు. ఇప్పటి వరకు శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌తో పాటు రెవెన్యూ, ఐటీ విభాగాల అడిషనల్ కమిషనర్‌గా ఉన్న స్నేహశబరీ ను జడ్సీ పోస్టు నుంచి బదిలీ చేశారు. ఈవీడీఎం ౖడైరెక్టర్‌గా రంగనాథ్ భారీ వర్షాలు, అగి్నప్రమాదాలు వంటి ఘటనలు జరిగినప్పుడు ఎదురవుతున్న విపత్తులను ఎదుర్కొనేందుకు తక్షణ స్పందనతో పనిచేస్తున్న ఈవీడీఎం డైరెక్టర్‌గా ఉన్న ప్రకాశ్‌రెడ్డిని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీగా బదిలీ చేసి, ఆయన స్థానంలో ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్‌ను నియమించారు. డిప్యూటీ కలెక్టర్లు రిలీవ్ ఎన్నికల సందర్భంగా జీహెచ్ఎంసీకి వచి్చన డిప్యూటీ కలెక్టర్లలో ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లు కె. శివకుమార్, డి. శ్రీధర్, ఎన్. విజయలక్షి్మలను ఐఏఎస్‌ల బదిలీ ఉత్తర్వులకు ముందే జీహెచ్ఎంసీ నుంచి రిలీవ్ చేశారు. వీరిలో శివకుమార్ సంతోష్ నగర్ సర్కిల్ డీసీగా పనిచేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలు కూడా ముగిసినందున వీరికి పెద్దగా పనులేమీ లేకపోవడంతో రిలీవ్ చేసినట్లు తెలుస్తోంది. ఆయన స్టైలే వేరు.. కీలకమైన శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌గా పి.ఉపేందర్‌రెడ్డిని నియమించడం జీహెచ్ఎంసీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఆయన పనితీరు, ట్రాక్ రికార్డు ఆధారంగానే ప్రభుత్వం ఆయనను శేరిలింగంపల్లి జడ్సీగా నియమించినట్లు తెలుస్తోంది. గతంలో ఎల్బీనగర్ జడ్సీగా, బోడుప్పల్ కమిషనర్‌గా పనిచేసినప్పుడు ఆయన పలు అవార్డులు, రివార్డులు పొందారు. బోడుప్పల్లో పచ్చదనం పెంపు కార్యక్రమాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల నగదు రివార్డుఅందజేసింది. బోడుప్పల్ మునిసిపల్ కార్పొరేషన్లో ఆయన చేసిన పారిశుధ్య కార్యక్రమాలు చూసే అప్పటి మేయర్ బొంంతు రామ్మోహన్ ఆయన్ను జీహెచ్ఎంసీకి రప్పించారు. ఎల్బీనగర్ జోనల్ కమిషనర్‌గా ఉన్నప్పుడు అక్కడ వరదనివారణకు ఆయన రూపొందించిన ప్రాజెక్టు రిపోర్టుతోనే నగరమంతటికీ ఆ విధానాన్ని వర్తింపచేస్తూ ఎస్ఎన్డీపీ (వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం)కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.టాస్‌్కఫోర్స్ డీసీపీగా సుదీంద్ర ప్రస్తుతం ఏసీబీలో జాయింట్ డైరెక్టర్‌గా విధులు నగర పోలీసు విభాగానికి గుండెకాయ వంటి హైదరాబాద్ కమిషనర్స్ టాస్‌్కఫోర్స్ డీసీపీగా నాన్–క్యాడర్ ఎస్పీ స్థాయి అధికారి వైవీఎస్ సుదీంద్రను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సుదీంద్ర అవినీతి నిరోధక శాఖలో (ఏసీబీ) జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. హైదరాబాద్‌కే చెందిన ఈయన బంజారాహిల్స్‌లోని ముఫకంజా కాలేజీ నుంచి ఇంజినీరింగ్ పట్టా పొందారు. 2012లో గ్రూప్–1 ద్వారా డీఎస్పీగా ఎంపికై పోలీసు విభాగంలోకి అడుగుపెట్టారు. సుదీంద్ర బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ముగ్గురు మహిళా అధికారుల తర్వాత.. గడిచిన తొమ్మిది నెలల కాలంలో టాస్‌్కఫోర్స్‌కు ముగ్గురు మహిళా అధికారులు నేతృత్వం వహించారు. సుదీర్ఘకాలం టాస్‌్కఫోర్స్ డీసీపీగా పని చేసిన పి.రాధాకిషన్‌రావును గత ఏడాది అక్టోబర్‌లో ఎన్నికల సంఘం బదిలీ చేసింది. అప్పట్లో తొలి మహిళా డీసీపీగా ఐపీఎస్ అధికారి నిఖిత పంత్ నియమితులయ్యారు. ఎన్నికల ప్రక్రియ ముగిసి, కొత్త సర్కారు కొలువు తీరిన తర్వాత గత ఏడాది డిసెంబర్లో తొలిసారిగా పోలీసు బదిలీలు జరిగాయి. ఆ నేపథ్యంలో టాస్క్‌ఫోర్స్ డీసీపీగా నిఖిత పంత్ స్థానంలో నాన్–క్యాడర్ ఎస్పీగా ఉన్న శ్రీ బాల దేవి నియమితులయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈమెను బదిలీ చేసిన ప్రభుత్వం సాధన రష్మి పెరుమాల్‌ను నియమించారు. ఇటీవల జరిగిన ఐపీఎస్‌ల బదిలీల్లో భాగంగా ఈమె హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీగా వెళ్లారు. -
ఆమ్రపాలి మన ఆడపడుచే!
ఒంగోలు: ఆమ్రపాలి.. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న ఐఏఎస్‌లలో ఆమె ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు నగర శివారులోని నరసాపురం అగ్రహారం ఆమె స్వగ్రామం. దీనిని స్థానికంగా అగ్రహారం రైల్వే గేటు అని వ్యవహరిస్తారు. రైల్వే గేటు దాటాక రెండు కిలో మీటర్ల దూరంలో ఉంది ఎన్.అగ్రహారం గ్రామం. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (HMDA)లో జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ గా ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఆమ్రపాలి ఒంగోలు వాసికావడం గర్వకారణం. 2010 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆమ్రపాలి 39వ ర్యాంక్ సాధించి, ఐఏఎస్‌లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం ట్రైనీ ఐఏఎస్‌గా, జాయింట్ కలెక్టర్‌గా, నగర కమిషనర్‌గా పనిచేశారు. 2018లో వరంగల్ జిల్లా అర్బన్, రూరల్ కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. తండ్రి కాటా వెంకటరెడ్డి ఫ్రొఫెసర్.. ఎన్.అగ్రహారానికి చెందిన ఆమ్రపాలి తండ్రి కాటా వెంకటరెడ్డి చిన్నతనంలో అగ్రహారంలోనే చదువుకున్నారు. మేనకోడలు పద్మావతిని వివాహం చేసుకున్నారు. పద్మావతి స్వగ్రామం టంగుటూరు మండలం ఆలకూరపాడు గ్రామం. ఆయన చిన్నతనంలో ఎలిమెంటరీ విద్య ఆలకూరపాడు పాఠశాలలోనే జరిగింది. హైస్కూలు విద్య టంగుటూరు, ఇంటర్మీడియేట్, డిగ్రీ సీఎస్ఆర్ శర్మ కళాశాలలో, పీజీ విద్య విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సీటీలో పూర్తి చేశారు. అదే యూనివర్సిటీలో ఎకనమిక్స్ ఫ్రొఫెసర్‌గా ఉద్యోగంలో చేరారు. ఆమ్రపాలి కుటుంబానికి చెందిన సొంత ఇల్లు ఎన్.అగ్రహారంలో ఉంది. కుటుంబమంతా ఉన్నతాధికారులే.. ఆమ్రపాలితో పాటు ఆమె సోదరి కూడా ఐఆర్ఎస్. ఇండియన్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్ఎస్)కు ఎంపికయిన ఆమ్రపాలి సోదరి మానస గంగోత్రి ప్రస్తుతం కర్ణాటక కేడర్‌లో ఇన్‌కంట్యాక్స్ విభాగంలో పనిచేస్తోంది. మానస గంగోత్రి 2007 ఐఆర్ఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారిణి. ఐఆర్ఎస్లో 184వ ర్యాంక్ సాధించింది. ఆమె భర్త ప్రవీణ్ కుమార్ తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఆయన కూడా 2010 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్. తమిళనాడు ఐఏఎస్ కేడర్‌కు చెందిన ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం ఉమెన్ వెల్ఫేర్‌లో డైరెక్టర్‌గా చేస్తున్నారు. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత చనిపోయిన తరువాత జరిగిన ఉపెన్నికకు రెండు సార్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. అమ్రపాలి భర్త ఐపీఎస్ అమ్రపాలికి 2018 ఫిబ్రవరి 18న తేదీన వివాహం జరిగింది. 2011 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన షమీర్ శర్మ జమ్మూ పట్టణానికి చెందిన వ్యక్తి. ప్రస్తుతం ఆయన డామన్ డయ్యూ కేంద్రపాలిత ప్రాంతంలో ఎస్సీగా పనిచేస్తున్నాడు -
‘లింక్’ ప్యాకేజ్... అనుసంధాన రోడ్లకు రూ.2410 కోట్లు
సాక్షి, హైదరాబాద్: నగరంలో ప్రధాన రహదారులతోపాటు లింక్ రోడ్లకు సైతం అధిక ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఆర్డీసీఎల్) ఆధ్వర్యంలో నగరంలో రెండు దశల్లో చేపట్టిన మిస్సింగ్, లింక్ రోడ్లతో ప్రజలకు మంచి ప్రయోజనం కలిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మూడో ఫేజ్‌లో జీహెచ్ఎంసీతోపాటు జీహెచ్ఎంసీని ఆనుకొని ఉన్న 10 యూఎల్బీల్లోనూ ఆయా కారిడార్లలో మిస్సయిన, లింక్ తెగిన ప్రాంతాల్లో మిస్సింగ్, లింక్‌రోడ్ల ఏర్పాటుకు, ఆయా కారిడార్ల అభివృద్ధికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా ఏకంగా 104 కారిడార్లలో (రోడ్లలో) పనులు చేపట్టేందుకు పురపాలనశాఖ రూ.2410 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. వీటిల్లో రూ.1500 కోట్ల అంచనా వ్యయంతో 50 కారిడార్లలో 120.92 కి.మీల మేర పనులను ప్రాధాన్యతాక్రమంలో చేపట్టేందుకు అనుమతినిచ్చింది. ఈ నిధులను హెచ్ఎండీఏ అంతర్గత వనరుల నుంచి కానీ, ఆరి్థక సంస్థల నుంచి రుణాలుగా కానీ సేకరించాలని ఆదేశించింది. ఈ మేరకు హెచ్ఆర్డీసీఎల్ ఎండీ, హెచ్ఎండీఏ కమిషనర్ తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ప్యాకేజీ–1 7 కారిడార్లు 25.20 కి.మీల లింక్ రోడ్లు వ్యయం రూ. 304 కోట్లు. ఈసానది తూర్పువైపు బాపూఘాట్ బ్రిడ్జి నుంచి పీఅండ్‌టీ కాలనీ. కొత్తూరులో రైల్వే క్రాసింగ్ నుంచి కుమ్మరిగూడ జంక్షన్. కొత్తూరు వై జంక్షన్ నుంచి వినాయక స్టీల్ (ఎన్‌హెచ్44)వరకు. శంషాబాద్‌లో ఎన్‌హెచ్ 44 బస్టాప్ నుంచి ఒయాసిస్ ఇంటర్నేషనల్. శంషాబాద్ రైల్వే క్రాసింగ్ నుంచి ధర్మగిరి రోడ్. ఎన్‌హెచ్ తొండుపల్లి జంక్షన్ నుంచి ఓఆర్ఆర్ సరీ్వస్‌రోడ్. గొల్లపల్లి ఎన్‌హెచ్ జంక్షన్–ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్. ప్యాకేజ్ –2 10 కారిడార్లు 27.20 కి.మీల లింక్ రోడ్లు వ్యయం రూ. 330 కోట్లు. ఆర్సీఐ ఎక్స్ రోడ్ నుంచి ఎయిర్పోర్ట్ హోటల్ శ్రీశైలం హైవే వరకు మల్లాపుర్ క్రాస్ రోడ్ నుంచి కుర్మగూడ వరకు కుర్మగూడ నుంచి నాదర్గుల్ వరకు బడంగ్‌పేట మెయిన్ రోడ్ నుంచి తుర్కంజల్ వయా రామయ్య నాదర్గుల్ వరకు అంబేద్కర్ జంక్షన్ నుంచి అక్టోపస్ వరకు ఇంజాపూర్ రోడ్ నుంచి మునుగురు రోడ్ తొర్రూర్ నుంచి నాగార్జున సాగర్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్ టూ డీఎల్ఆర్ఎల్ కాలనీ (వయా టీకేఆర్ కాలేజ్ రోడ్) వనస్థలిపురం రోడ్ టూ ఓల్డ్ హయత్‌నగర్ రోడ్ బడంగ్‌పేట–నాదర్గుల్ మెయిన్ రోడ్ –నాదర్గుల్ రోడ్ ప్యాకేజ్–3 13 కారిడార్లు 33.35 కి.మీల లింక్ రోడ్లువ్యయం రూ. 417 కోట్లు. రోజ్‌గార్డెన్ ఫంక్షన్‌హాల్ దోమల గూడ నుంచి నాగారం రోడ్ కనెక్టింగ్ టూ ఈసీఐఎల్ చేర్యాల జేఎన్ఎన్యూఎం హౌసింగ్ కాలనీ నుంచి అహ్మాద్గూడ ఆర్జీకే వరకు ఫిరంగ్ కట్టా నుంచి ఎనీ్టఆర్ విగ్రహాం రోడ్ వరకు – ఎన్టీఆర్గ్రహంనుంచి దోమలగూడ రోడ్ (మున్సిపల్ పరిధిలో ) వరకు ఎన్టీఆర్ విగ్రహం నుంచి డంపింగ్ యార్డ్ ఎన్టీఆర్ విగ్రహం నుంఇ వంపుగూడ రోడ్ రాంపల్లి ఎక్స్‌రోడ్ నుంచి సర్వే నెంబర్ 421 సర్వే నెంబర్ 421నుంచి యమన్పేట నగరం యూఎల్బీ బౌండ్రీ– చర్లపల్లి నుంచి ఓఆర్ఆర్ సరీ్వస్‌రోడ్ వయా కరీంగూడ యామన్పేట ఫ్లైఓవర్ నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వరకు చర్లపల్లి బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ నుంచి రాంపల్లి జంక్షన్ వరకు యామన్పేట్ నుంచి ఆర్ఆర్ఆర్ సర్వీస్ రోడ్ శివరెడ్డిగూడెం నుంచి మాధవ్‌రెడ్డి బిడ్జ్రి ప్యాకేజ్–4 11 కారిడార్లు 24.64 కి.మీల లింక్ రోడ్లు వ్యయం రూ.297 కోట్లు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నుంచి కోకపేట చెవేళ్ల రోడ్ టూ రాధా రియాల్టీ కార్పొరేషన్ రోడ్ చెవేళ్ల రోడ్ (బాలాజీనగర్)నుంచి రాధా రియాల్టీ కార్పొరేన్ లింక్ రోడ్ నార్సింగ్ అప్పా సర్వీస్ రోడ్ నుంచి చెవేళ్ల –రాధ రియాల్టీ కార్పొరేషన్ రోడ్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ నుంచి చెవేళ్ల రోడ్ వయా కిస్మత్‌పురా వివేకనంద విగ్రహం కిస్మత్‌పురా నుంచి ఆర్అండ్ బీ రోడ్ హనుమాన్ దేవాలయం నుంచి కైసర్ నగర్ నుంచి మైతలి నగర్ జాజుల రామారం అమీన్‌పురా నుంచి హెచ్‌ఎంటీకాలనీ మియాపూర్ వరకు వీఎన్ఆర్ కాలేజీ బాచుపల్లి నుంచి పోట్టి శ్రీరాములు తెలుగుయూనివర్సిటీ నిజాంపేట వరకు ఎన్‌హెచ్ 44 నుంచి ఇండస్ట్రీ ఏరియా రాంరెడ్డినగర్ వయా ఫాక్స్ సాగర్ వరకు ప్యాకేజ్–5 9 కారిడార్లు 10.53 కి.మీల లింక్ రోడ్లు వ్యయం రూ.152 కోట్లు. రాజ్‌భవన్ రోడ్ నుంచి ఆర్అండ్బీ అతిథిగృహాం, లింక్‌రోడ్ బేగం పేట రైల్వేస్టేషన్ ప్రకాశ్‌నగర్ నుంచి బ్రాహా్మణవాడి రైల్వే ట్రాక్ వయా పార్క్ బైరాగి గూడ నుంచి నార్సింగి వరకు దర్గా నుంచి ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి వరకు ఫర్మాయిస్ హోటల్ నుంచి తారమతి బారాదరి వయా కేంద్రీయా విహార్ అపార్ట్మెంట్ కుత్బుల్లాపూర్ రోడ్ నుంచి పైప్లైన్రోడ్ వయా గోదావరి హోస్ కుత్బుల్లాపూర్ రోడ్ నుంచి పైప్‌లైన్ రోడ్ వయా సెయింట్ అంథోని హైసూ్కల్ వెన్నలగడ్డ చెర్వు ఎన్సీసీ జంక్షన్ నుంచి అడిక్‌మెట్ ఫ్లైఓవర్ ఓయూ కంపౌండ్ వాల్ ప్రగతి నగర్ నుంచి మహదేవ్‌పురం పశువుల ఆసుపత్రి వరకు (చదవండి: ప్రకృతి వైద్యానికి కేరాఫ్‌గా హైదరాబాద్) -
అనుమతుల ఆలస్యంతోనే ప్రీలాంచ్ విక్రయాలు!
నెల తర్వాత చేసే ప్రయాణం కోసం ముందుగానే విమాన టికెట్లు బుకింగ్ చేసుకుంటాం. అభిమాన హీరో సినిమా వస్తుందంటే వారం ముందే ఆన్లైన్లో టికెట్లు కొనేస్తాం. ఎందుకు? తీరా టైంకి టికెట్లు దొరకవనో లేక దొరికినా ఎక్కువ రేట్లు ఉంటాయనో కదా. పైగా ముందుగా టికెట్లు బుకింగ్ చేసుకుంటే ధర కూడా కలిసొస్తుంది. మరి, ముందస్తు బుకింగ్స్ రియల్ ఎస్టేట్‌లో చేస్తే తప్పేంటి? సాక్షి, హైదరాబాద్: ప్రీలాంచ్, సాఫ్ట్‌లాంచ్.. పేర్లు ఏవైనా వాటి అర్థం మాత్రం ఒక్కటే. ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందే విక్రయాలను మొదలుపెట్టడం అని! ఈ తరహా విక్రయాలు కొత్తవేం కాదు. ఎప్పటినుంచో ఉన్నవే. ప్రీలాంచ్తో కొనుగోలుదారులకు, డెవలపర్లకు ఇద్దరికీ లాభమే. కస్టమర్లకేమో ఫ్లాట్ తక్కువ ధరకు దొరికితే.. బిల్డర్లకేమో ముందుగానే కొంత సొమ్ము చేతికి అందుతుంది. ఈ సొమ్ము తక్షణమే నిర్మాణాన్ని మొదలుపెట్టడానికో లేక అనుమతుల ఫీజుల కోసమో ఉపయోగపడుతుంది. ప్రీలాంచ్లో డెవలపర్లు 10–15 శాతం వరకు ఫ్లాట్లను విక్రయిస్తుంటారు. కొందరు బిల్డర్లు తెలివిగా ఏం చేస్తారంటే.. మార్కెట్లో తమ కొత్త ప్రాజెక్ట్ తుది ధరను నిర్ణయించడం కోసమే ముందస్తు అమ్మకాలను ప్రకటిస్తుంటారు. ప్రీలాంచ్లో విక్రయాలు ఎందుకంటే.. ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు ల్యాండ్ ఓనర్‌తో అగ్రిమెంట్ చేసుకున్న రోజు నుంచి అనుమతులు వచ్చే వరకు ఏడాదిన్నర కాలం పాటు డెవలపర్ వేచి చూడాలి. ఈలోపు ప్రాజెక్ట్ రుణానికి బ్యాంక్ వడ్డీ డెవలపర్ భరించాల్సిందే. కాంట్రాక్టర్లు, ఉద్యోగుల జీతభత్యాలు, ఆఫీసు నిర్వహణ ఖర్చులు ఇవన్నీ డెవలపర్లకు భారమే. పోనీ, అనుమతుల వరకూ వేచి ఉంటే మార్కెట్ ఎలా ఉంటుందో తెలియదు. ఈలోపు డిమాండ్ అవకాశాలు కోల్పోతామనే పోటీతో డెవలపర్లు ప్రీలాంచ్ విక్రయాలను చేస్తున్నారని ఓ డెవలపర్ తెలిపారు. స్థలానికి సంబంధించిన న్యాయపరమైన అంశాలను నిర్ధారించుకున్నాకే కొనుగోలుదారులు ప్రీలాంచ్లో కొనుగోలుకు సిద్ధం కావాలి. నచ్చిన ప్రాంతం, తక్కువ ధర, పేరున్న బిల్డర్ అయితే కొనుగోలులో సందేహించాల్సిన అవసరం లేదు. సాధారణంగా నిర్మాణం పూర్తి కావడానికి 3–5 ఏళ్ల సమయం పడుతుంది. అందుకే ముందస్తుగానే కొనుగోలు చేస్తే చక్కటి లాభాల్ని అందుకోవచ్చు. అనుమతుల్లో జాప్యం ఎందుకంటే? టీఎస్–బీపాస్‌లో నిర్మాణ అనుమతులు వారం లోపే వస్తున్నాయనేది అధికారులు, లీడర్ల మాట. కానీ, వాస్తవ పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. మున్సిపల్ అనుమతుల నుంచి మొదలుపెడితే రెవెన్యూ, ఇరిగేషన్, ఎన్విరాన్మెంటల్, ఫైర్, పోలీస్, ఎయిర్పోర్ట్ అథారిటీ.. ఇలా సుమారు 15 ప్రభుత్వ విభాగాల నుంచి నిర్మాణ అనుమతులు తీసుకోవాలి. ఆ తర్వాత రెరా కోసం దరఖాస్తు చేసుకోవాలి. వీటి కోసం ఏడాదిన్నర పైనే సమయం పడుతుందని ఓ డెవలపర్ తెలిపారు. హెచ్ఎండీఏకు శాశ్వత కమిషనర్ లేకపోవటం, ఉన్న అధికారులు ఆఫీసులలో అందుబాటులో ఉండకపోవటం అనుమతుల ఆలస్యానికి ప్రధాన కారణాలని చెప్పారు. ఏం చేయాలంటే? హైదరాబాద్‌లో ప్రీలాంచ్లో కొనుగోలు చేసి మోసపోయామనే కస్టమర్లు చాలా తక్కువ. ఏ డెవలపర్ ప్రీలాంచ్లో విక్రయిం చేసి చేతులుదులుపుకోడు. చాలా వరకు డెవలపర్ల మీద కొనుగోలుదారులు చేసే ప్రధానమైన ఫిర్యాదులు.. గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేయడం లేదనే. జీహెచ్ఎంసీతో పోల్చితే హెచ్ఎండీఏ పరిధిలో ప్రీలాంచ్ విక్రయాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే జీహెచ్ఎంసీలో అధికారుల కొరత లేదు. దీంతో ఫీజు కట్టాక నెలన్నర లోపే ప్లానింగ్ అనుమతులు వస్తున్నాయి. అదే హెచ్ఎండీఏ పరిధిలో అయితే ఏడాదిన్నర అయినా గ్యారంటీ లేదు. ► హెచ్ఎండీఏకు శాశ్వత కమిషనర్‌ను, రెరాకు శాశ్వత చైర్మన్‌ను నియమించాలి. మున్సిపల్ శాఖ టౌన్‌ప్లానింగ్ విభాగంలో అధికారుల కొరతను తీర్చాలి. ► పక్క రాష్ట్రంలో లోకల్ బాడీ ఫీజులు కూడా ప్రధాన విభాగమే కలెక్ట్ చేస్తుంది. డెవలపర్లు ప్లానింగ్ అనుమతుల కోసం లోకల్ బాడీకి వెళ్లాల్సిన అవసరం లేదు. దీంతో సమయం, అధికారుల చేతివాటం రెండూ తగ్గుతాయి. -
హెచ్ఎండీఏను వీడని గ్రహణం !
సాక్షి, సిటీబ్యూరో: విశ్వ నగరానికి విధి విధానాలు రూపొందించాల్సిన హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)కు పూర్తిస్థాయి బాధ్యత వహించే నాథుడు కరవయ్యాడు. పది నెలలుగా ఈ సంస్థ తల లేని మొండెంలా తయారైంది. తాజాగా ఆదివారం జరిగిన ఐఏఎస్‌ల బదిలీల్లో హెచ్ఎండీఏకు పూర్తిస్థాయి కమిషనర్‌ను ప్రభుత్వం నియమించక పోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. హెచ్ఎండీఏ పాలనా పగ్గాలను మళ్లీ ఎఫ్ఏసీకే పరిమితం చేయడం ప్రభుత్వ పెద్దల వైఖరికి అద్దంపడుతోందని కొందరు సిబ్బంది బాహాటంగా విమర్శిస్తున్నారు. ప్రజలకు సత్వర సేవలందించడంలో కృషి చేసే అధికారిగా పేరున్న బి. జనార్దన్‌రెడ్డినే హెచ్ఎండీఏకు పూర్తిస్థాయి కమిషనర్‌గా నియమించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రస్తుతం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి కమిషనర్ అండ్ డెరైక్టర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న జనార్దన్‌రెడ్డి నిత్యం సవాలక్ష పనులతో బిజీగా ఉంటున్నారు. ఇప్పుడు హెచ్ఎండీఏ కమిషనర్‌గా అదనపు బాధ్యతలను కూడా ఆయనకు అప్పగించడం వల్ల అత్యవసర ఫైళ్లను క్లియర్ చేయడానికే సమయం సరిపోతుందని, ఇక పాలసీ నిర్ణయాలు తీసుకొనేందుకు ఆయనకు టైం ఉండకపోచ్చని సీనియర్ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవలి వరకు హెచ్ఎండీఏ ఇన్చార్జి కమిషనర్‌గా బాధ్యతలు వహించిన ప్రదీప్ చంద్ర కూడా తగిన సమయం దొరక్క చాలావరకు సచివాలయానికే తెప్పించుకునేవారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఎదురవతుందన్న వాదనలు విన్పిస్తున్నాయి. పూర్తిస్థాయి కమిషనర్‌ను నియమించడం వల్ల నగరాభివృద్ధికి సంబంధించి భవిష్యత్ ప్రణాళికలు రూపొందించి వాటికి ప్రభుత్వం నుంచి ఆమోదం పొందేందుకు గట్టిగా కృషి చేస్తారని, తద్వారా సంస్థకు పూర్వవైభవం వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆఫీసులో కమిషనర్ ఉంటేనే.. సిబ్బందిలో అటెన్షన్ ఉంటుందని, వివిధ పనుల కోసం వచ్చే ప్రజలకు కూడా భరోసా ఉంటుందని రియల్టర్లు, బిల్డర్లు పేర్కొంటున్నారు. వెంటాడుతోన్న శాపం.. గతంలో హెచ్ఎండీఏ కమిషనర్‌గా నీరభ్ కుమార్ ప్రసాద్ పనిచేసిన సమయంలో అనేక అవకతవకలు, అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వానికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందడంతో సీఎం కేసీఆర్ వెంటనే చర్యలు తీసుకుని ఆయన్ని బదిలీ చేశారు. ఆయన నిర్వాకాలే సంస్థకు శాపంగా మారాయని సిబ్బంది వాపోతున్నారు. ఆ తర్వాత ఈ సంస్థలో పలువురు అధికారులు, కిందిస్థాయి సిబ్బందిపై కూడా ఇలాంటి ఫిర్యాదులే రావడంతో సీఎం హెచ్ఎండీఏపై ఏహ్య భావంతో ఉన్నారన్న పుకార్లు వెల్లువెత్తాయి. ఈ తరుణంలో హెచ్ఎండీఏను సంస్కరించేందుకు ఉన్నతాధికారి ప్రదీప్ చంద్రను ఇన్చార్జిగా నియమించారు. అయితే, ఆయన హెచ్ఎండీఏకు సమయం కేటాయించకపోవడంతో అక్రమాలు యథావిధిగానే కొనసాగుతున్నట్లు విజిలెన్స్ నివేదికలు వెల్లడించాయి. ఈ క్రమంలో ఏసీబీ దాడులు చేసి అక్రమార్కులను ఏరివేయండంతో కొంత అలజడి నెలకొంది. ఈ తరుణంలో బి.జనార్దన్‌రెడ్డిని ప్రభుత్వం హెచ్ఎండీఏ ఇన్చార్జి కమిషనర్‌గా పగ్గాలు అప్పగించడం చర్చనీయాంశమైంది.