సాక్షి, హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు అధికారులు కేంద్ర సర్వీసులోకి వెళ్లనున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి కార్యాలయంలో విధులు నిర్వహించేందుకు ఓఎస్డీగా ఆమ్రపాలి కాటా, అడిషనల్ పీఎస్‌గా కె.శశికిరణాచారి వెళ్లనున్నారు. ఈమేరకు వారిని కేంద్ర సర్వీసులోకి పంపించాల్సిందిగా రాష్ట్రప్రభుత్వానికి వర్తమానం అందింది. గతంలో వరంగల్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఆమ్రపాలి బదిలీపై జీహెచ్‌ఎంసీకి వచ్చి అడిషనల్ కమిషనర్‌గా కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment