central services
-
సెంట్రల్ సర్వీసులోకి వెళ్లేందుకు IAS స్మితా సబర్వాల్ దరఖాస్తు
-
కేంద్ర సర్వీసులకు కాటా అమ్రపాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారిణి కాటా అమ్రపాలి కేంద్ర సర్వీసులకు వెళ్లనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సిఫారసుల మేరకు నాలుగేళ్ల పాటు కేంద్ర సర్వీసుల్లో డిప్యుటేషన్‌పై పని చేసేందుకు అనుమతిస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర సర్వీసుల్లో డిప్యూటీ సెక్రటరీగా పనిచేసేందుకు ఆమెను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. -
కేంద్ర సర్వీసులోకి.. ఆమ్రపాలి, శశికిరణాచారి
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు అధికారులు కేంద్ర సర్వీసులోకి వెళ్లనున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి కార్యాలయంలో విధులు నిర్వహించేందుకు ఓఎస్డీగా ఆమ్రపాలి కాటా, అడిషనల్ పీఎస్‌గా కె.శశికిరణాచారి వెళ్లనున్నారు. ఈమేరకు వారిని కేంద్ర సర్వీసులోకి పంపించాల్సిందిగా రాష్ట్రప్రభుత్వానికి వర్తమానం అందింది. గతంలో వరంగల్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఆమ్రపాలి బదిలీపై జీహెచ్ఎంసీకి వచ్చి అడిషనల్ కమిషనర్‌గా కొనసాగుతున్నారు. -
‘ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో కేంద్ర సర్వీసులు’
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర సర్వీసుల్లో ఆర్ఎస్ఎస్ ఇష్టానుసారంగా అధికారులను నియమించుకునేలా మోదీ సర్కార్ యూపీఎస్సీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. కేంద్రం తీరుతో విద్యార్థుల భవితవ్యం ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రతిపాదనకు సంబంధించిన లేఖను కూడా ట్విటర్లో పోస్ట్ చేసిన రాహుల్ విద్యార్థులు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. అభ్యర్థుల హక్కును కాలరాస్తూ కేంద్ర సర్వీసుల్లోకి ఆర్ఎస్ఎస్కు నచ్చిన వారిని ఎంపిక చేసుకునేలా ప్రధాని ప్రయత్నిస్తున్నారని రాహుల్ వ్యాఖ్యానించారు. పరీక్ష ర్యాంకులను పక్కనపెట్టి సబ్జెక్టు ప్రాతిపదికన మెరిట్ జాబితాను తారుమారు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. విద్యార్థుల భవితవ్యాన్ని దెబ్బతీసే ఈ ప్రతిపాదన పట్ల గొంతెత్తాలని రాహుల్ పిలుపు ఇచ్చారు. ఆర్ఎస్ఎస్ తనకు నచ్చిన అధికారులను ఎంచుకునేలా మోదీ వ్యవహరిస్తున్నారని రాహుల్ తన ట్వీట్లో ఆరోపించారు. సివిల్ సర్వీస్ పరీక్షల ఆధారంగా ప్రస్తుతం అభ్యర్థులకు సర్వీసులను కేటాయిస్తుండగా, తాజాగా పరీక్ష అనంతరం ఫౌండేషన్ కోర్సు ముగిసిన తర్వాత నియామకాలు చేపట్టడాన్ని పరిశీలించాల్సిందిగా ప్రధాని కార్యాలయం (పీఎంఓ) సిబ్బంది శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖను కోరింది. Rise up students, your future is at risk! RSS wants what’s rightfully yours. The letter below reveals the PM’s plan to appoint officers of RSS’s choice into the Central Services, by manipulating the merit list using subjective criteria, instead of exam rankings. #ByeByeUPSC pic.twitter.com/VSElwErKqe — Rahul Gandhi (@RahulGandhi) May 22, 2018 -
కేంద్ర సర్వీసుల్లోకి ఇద్దరు ఐపీఎస్‌లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పనిచేస్తున్న ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లనున్నారు. 1991 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ ప్రస్తుతం సివిల్ సప్లయ్ శాఖ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు అనుమతివ్వాలని రెండేళ్లుగా ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు ఆనంద్ పేరును సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో డిప్యుటేషన్ అండ్ అలాట్మెంట్స్ కమిటీ ఆనంద్ నియామకంపై ఆమోదముద్ర వేసింది. కేంద్ర పోలీస్ విభాగాల్లో ఒకటైన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్)లో ఇన్స్పెక్టర్ జనరల్(ఐజీ)గా ఐదేళ్లు పనిచేసేందుకు శుక్రవారం ఉత్తర్వులు వెలువరించింది. అదే విధంగా 1996 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారిణి చారుసిన్హా సైతం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్)లో ఐజీగా ఐదేళ్లు పనిచేసేందుకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు వెలువరించింది. వీరిద్దరిని త్వరితగతిన రిలీవ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. -
కేంద్ర సర్వీసులకు సీవీ ఆనంద్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా పని చేస్తున్న 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ కేంద్ర సర్వీసులోకి వెళ్లారు. ఆయన సీఐఎస్ఎఫ్ ఐజీగా అయిదేళ్లపాటు పని చేయనున్నారు. ప్రస్తుతం సీవీ ఆనంద్ పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర సర్వీసులో ఐదేళ్ల పాటు పనిచేయాలన్న నిబంధన కారణంగా సీవీ ఆనంద్ డిప్యూటేషన్‌పై కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లనున్నారు. -
హస్తినకు పంపించరూ..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పనిచేస్తున్న పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఐపీఎస్ అయిన అధికారులు కచ్చితంగా రెండేళ్లపాటు కేంద్ర సర్వీసుల్లో పనిచేయాల్సి ఉంటుంది. లేనిపక్షంలో రాష్ట్రంలోనూ, కేంద్ర సర్వీసుల్లోనూ కొన్ని కీలకమైన పోస్టులకు ప్యానల్ జాబితాలో చోటు దొరకకుండాపోయే ప్రమాదం ఏర్పడుతుంది. దీనితో తమని కేంద్ర సర్వీసుల్లోకి పంపాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వరుసలో ఐదుగురు సివిల్ సప్లయిస్ కమిషనర్‌గా ఉన్న సీవీ ఆనంద్ కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లాలని రెండేళ్ల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించడంతో ఆగిపోయారు. డిప్యుటేషన్లోకి రావాలని ఇటీవలే కేంద్ర హోంశాఖ మరోసారి ఆయనకు ఆఫర్ ఇచ్చింది. అదే విధంగా ఐజీ చారుసిన్హా సైతం కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చారుసిన్హా శిక్షణ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. రెండురోజుల క్రితమే ఐజీ హోదా నుంచి అదనపు డీజీపీగా పదోన్నతి పొందిన సైబరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్య సైతం కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. డీఐజీగా పదోన్నతి పొందిన రాచకొండ జాయింట్ కమిషనర్ తరుణ్‌జోషి సైతం కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఇంటర్ కేడర్ డిప్యుటేషన్ లేదా కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు సీఐడీ ఐజీ సౌమ్యామిశ్రా సైతం ప్రభుత్వానికి విజ్ఞప్తి పెట్టుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆనంద్‌కే అవకాశం... అదనపు డీజీపీ సీవీ ఆనంద్‌కే కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు అవకాశాలున్నట్టు తెలుస్తోంది. మిగతా అధికారుల విషయంలో ప్రభుత్వం ఒప్పుకోకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలే రాష్ట్రంలో అధికారుల కొరత ఉండటం, పైగా ఎన్నికల ఏడాది సమీపిస్తుండటంతో ఐపీఎస్ అధికారులను కేంద్ర సర్వీసుల్లోకి పంపితే ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉన్నట్టు భావిస్తోంది. పైగా రాష్ట్ర కేడర్‌కు చెందిన 9మంది సీనియర్ ఐపీఎస్‌లు కేంద్ర సర్వీసుల్లోనే ఉన్నారు. వారంతా ఇప్పట్లో తిరిగి వచ్చేలా కనిపించడం లేదని, అందువల్లే ఆనంద్ మినహా మిగతావారికి అవకాశం ఉండకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
కేంద్ర సర్వీసులకు కలెక్టర్ జానకి
–వెంకయ్యనాయుడు వ్యక్తిగత కార్యదర్శిగా నియామకం? సాక్షి ప్రతినిధి– నెల్లూరు జిల్లా కలెక్టర్ ఎం. జానకి డిప్యుటేషన్ మీద కేంద్ర సర్వీసులకు వెళ్లనున్నారు. విశాఖపట్నం గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లో అదనపు కమిషనర్‌గా పనిచేసిన జానకి 2014 నవంబరులో జిల్లా కలెక్టర్‌గా వచ్చారు. ఆమె భర్త యువరాజ్ విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ ఇద్దరు ఐఏఎస్ అధికారులు డిప్యుటేషన్ మీద కేంద్ర సర్వీసులకు వెళ్లడానికి కొంత కాలంగా ప్రయత్నిస్తున్నారు. కలెక్టర్ జానకి కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడుకు వ్యక్తిగత కార్యదర్శిగా వెళ్లేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి మరో రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని అధికార వర్గాల ద్వారా విశ్వసనీయంగా తెలిసింది. కలెక్టర్ ఫొటో