
సీవీ ఆనంద్ (ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా పని చేస్తున్న 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ కేంద్ర సర్వీసులోకి వెళ్లారు. ఆయన సీఐఎస్‌ఎఫ్ ఐజీగా అయిదేళ్లపాటు పని చేయనున్నారు. ప్రస్తుతం సీవీ ఆనంద్ పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర సర్వీసులో ఐదేళ్ల పాటు పనిచేయాలన్న నిబంధన కారణంగా సీవీ ఆనంద్ డిప్యూటేషన్‌పై కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లనున్నారు.