కేంద్ర సర్వీసులకు కలెక్టర్‌ జానకి | IAS Janaki for central services? | Sakshi
Sakshi News home page

కేంద్ర సర్వీసులకు కలెక్టర్‌ జానకి

Published Thu, Jul 21 2016 6:28 PM | Last Updated on Thu, Sep 27 2018 3:19 PM

కేంద్ర సర్వీసులకు కలెక్టర్‌ జానకి - Sakshi

కేంద్ర సర్వీసులకు కలెక్టర్‌ జానకి

 
  • –వెంకయ్యనాయుడు వ్యక్తిగత కార్యదర్శిగా నియామకం?  
సాక్షి ప్రతినిధి– నెల్లూరు 
 జిల్లా కలెక్టర్‌ ఎం. జానకి డిప్యుటేషన్‌ మీద కేంద్ర సర్వీసులకు వెళ్లనున్నారు.  విశాఖపట్నం గ్రేటర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో అదనపు కమిషనర్‌గా పనిచేసిన జానకి 2014 నవంబరులో జిల్లా కలెక్టర్‌గా వచ్చారు. ఆమె భర్త యువరాజ్‌ విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ ఇద్దరు ఐఏఎస్‌ అధికారులు డిప్యుటేషన్‌ మీద  కేంద్ర సర్వీసులకు వెళ్లడానికి కొంత కాలంగా ప్రయత్నిస్తున్నారు. కలెక్టర్‌ జానకి కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడుకు వ్యక్తిగత కార్యదర్శిగా వెళ్లేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి మరో రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని అధికార వర్గాల ద్వారా విశ్వసనీయంగా తెలిసింది. 
 
కలెక్టర్‌ ఫొటో
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement