
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ సెంట్రల్ జోన్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న భారతి హొళ్లికేరి మంచిర్యాల కలెక్టర్‌గా బదిలీ కాగా, జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్‌గా ఆమ్రపాలి రానున్నారు. ఈమేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా జీహెచ్‌ఎంసీ నుంచి ఒక మహిళా ఐఏఎస్ అధికారి బదిలీ కాగా..మరో మహిళా ఐఏఎస్ రానున్నారు.