వరంగల్ కలెక్టర్ క్యాంపు ఆఫీసు (ఇన్‌సెట్‌లో అమ్రపాలి)
సాక్షి, హన్మకొండ అర్బన్ : తన అధికార నివాసంలోని రెండో అంతస్తులో దెయ్యం ఉందని, తనకు దెయ్యాలంటే భయమని స్వయంగా వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి కాట వెల్లడించడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఇటీవల (ఆగస్టు 10న) కలెక్టర్ బంగ్లాకు 133 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కలెక్టర్ ఓ ప్రైవేట్ వెబ్ చానల్‌తో మాట్లాడుతూ.. భవన నిర్మాణం అద్భుతమని, ఆధునిక హంగులు లేకున్నా వసతులు బాగున్నాయని తెలిపారు.
అయితే రెండో అంతస్తులో ఓ బెడ్‌రూం.. సామగ్రి ఉన్నప్పటికీ అక్కడ దెయ్యం ఉందని గతంలో ఉన్న కొందరు కలెక్టర్లు తనకు చెప్పారన్నారు. అయితే కలెక్టర్ భవన నిర్మాణానికి సంబంధించి పలు విధాలుగా పరిశోధనలు చేయించినట్లు తెలిపారు. వాటి ఆధారంగా భవన నిర్మాణానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు తెలిశాయని ఆమె వివరించారు.
‘జార్జ్ పామర్ అనే వ్యక్తి భార్య వరంగల్ కలెక్టరేటు క్యాంపు కార్యాలయానికి శంకుస్థాపన చేశారని తెలిసింది. నిజాం కాలంలో అతడు ఓ ఇంజినీర్ అని తెలుసుకున్నా. చిందరవందరగా ఉన్న రెండో అంతస్తు గదిని శుభ్రం చేయించా. కానీ దెయ్యం ఉందన్న భయంతో ఆ గదిలో పడుకునే సాహసం చేయలేదు’ అంటూ ఆమ్రపాలి నవ్వుతూ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కలెక్టర్ చెప్పడంతో ఆ బంగ్లాలో దెయ్యం విషయం చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment