తెలుగులో బిగ్‌బాస్ ప్రస్తుతం ఎనిమిదో వారం నడుస్తోంది. గతవారంలోనే మణికంఠ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇకపోతే సోమ, మంగళ వారాల్లో నామినేషన్స్ గొడవలతో ఓ రేంజ్‌లో సాగింది. ఈ వారంలో ఈ వారం నిఖిల్, ప్రేరణ, పృథ్వీ, విష్ణుప్రియ, మెహబూబ్, నయని పావని నామినేషన్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా తాజాగా ఇవాల్టి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో రిలీజైంది. నామినేషన్స్ ప్రక్రియ ముగియడంతో ఇక టాస్కుల గోల మొదలు కానుంది. అయితే ఈ సారి హౌస్‌లో ఊహించని సంఘటన జరిగింది. హౌస్‌మేట్స్‌ను నిద్రపోకుండా చేసేలా పెద్ద స్కెచ్ వేశారు. ముగ్గురు కలిసి హౌస్‌మేట్స్‌ను వణికించేశారు. అదేంటో తెలుసుకుందాం.
హౌస్‌లో ఉన్న గంగవ్వ అర్ధరాత్రి కేకలు వేస్తూ కనిపించింది. దీంతో అందరూ ఒక్కసారిగా లేచి బయటకు పరిగెత్తారు. ఇంతకీ ఏం జరుగుతోంది అంటూ అంతా భయపడిపోయారు. గంగవ్వను చూసిన హౌస్‌మేట్స్ ఓ రేంజ్‌లో వణికిపోయారు. ఆ తర్వాత అవ్వను ధైర్యంతో మెల్లగా గదిలోకి తీసుకెళ్లిన టేస్టీ తేజ తన బెడ్‌పై నిద్రపుచ్చారు. ఆ తర్వాత అంతా కలిసి దెయ్యం పట్టిందేమో అంటూ చర్చ మొదలెట్టేశారు. నాకైతే నిద్ర కూడా రావడం లేదంటూ రోహిణి, హరితేజ తెగ చర్చించుకున్నారు.
అయితే ఆ తర్వాత ఫ్రాంక్ అని తెలిసిపోయింది. టేస్టీ తేజ, ముక్కు అవినాశ్, గంగవ్వ ముగ్గురు కలిసి మాట్లాడుకుని ఫ్రాంక్ చేశారు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా వీళ్లు ముగ్గురు కలిసి ఇదంతా చేసినట్లు తెలుస్తోంది. ఇంకా హౌస్‌లో ఏం జరిగిందో తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment