warangal urban district collector
-
మా ఇంట్లో దెయ్యం ఉంది..!
-
నాకు దెయ్యాలంటే చాలా భయం : అమ్రపాలి
సాక్షి, హన్మకొండ అర్బన్ : తన అధికార నివాసంలోని రెండో అంతస్తులో దెయ్యం ఉందని, తనకు దెయ్యాలంటే భయమని స్వయంగా వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి కాట వెల్లడించడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఇటీవల (ఆగస్టు 10న) కలెక్టర్ బంగ్లాకు 133 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కలెక్టర్ ఓ ప్రైవేట్ వెబ్ చానల్‌తో మాట్లాడుతూ.. భవన నిర్మాణం అద్భుతమని, ఆధునిక హంగులు లేకున్నా వసతులు బాగున్నాయని తెలిపారు. అయితే రెండో అంతస్తులో ఓ బెడ్రూం.. సామగ్రి ఉన్నప్పటికీ అక్కడ దెయ్యం ఉందని గతంలో ఉన్న కొందరు కలెక్టర్లు తనకు చెప్పారన్నారు. అయితే కలెక్టర్ భవన నిర్మాణానికి సంబంధించి పలు విధాలుగా పరిశోధనలు చేయించినట్లు తెలిపారు. వాటి ఆధారంగా భవన నిర్మాణానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు తెలిశాయని ఆమె వివరించారు. ‘జార్జ్ పామర్ అనే వ్యక్తి భార్య వరంగల్ కలెక్టరేటు క్యాంపు కార్యాలయానికి శంకుస్థాపన చేశారని తెలిసింది. నిజాం కాలంలో అతడు ఓ ఇంజినీర్ అని తెలుసుకున్నా. చిందరవందరగా ఉన్న రెండో అంతస్తు గదిని శుభ్రం చేయించా. కానీ దెయ్యం ఉందన్న భయంతో ఆ గదిలో పడుకునే సాహసం చేయలేదు’ అంటూ ఆమ్రపాలి నవ్వుతూ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కలెక్టర్ చెప్పడంతో ఆ బంగ్లాలో దెయ్యం విషయం చర్చనీయాంశంగా మారింది. -
వరంగల్‌లో అక్రమ కట్టడాల కూల్చివేత
వరంగల్: వరంగల్ నగరంలోని నాలాలపై నిర్మించిన అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి ఆదేశించారు. ఎమ్మెల్యేలు, ప్రజాపతినిధులను సైతం మినహాయించొద్దని ఆమె ఆదేశాలు జారీచేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఆదివారం తెల్లవారుజాము నుంచి నాలాలపై నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. -
విద్య, వైద్యమే ప్రాధాన్యం
రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పాఠశాలలు, పీహెచ్సీలో ఆకస్మిక తనిఖీలు పాఠశాలలోనే భోజనం.. నాణ్యత లేమిపై అసంతృప్తి ప్రహరీ నిర్మాణంపై కాంట్రాక్టర్‌కు ఆదేశాలు నెక్కొండ : నూతనంగా ఏర్పడిన వరంగల్ రూరల్ జిల్లాలో పరిపాలన పరంగా విద్య, వైద్యానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ స్పష్టం చేశారు. నెక్కొండ మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల, జెడ్పీ హైస్కూల్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను గుర్తించిన ఆయన అక్కడికక్కడే తగిన సూచనలు చేశారు. ఇకనైనా తీరు మార్చుకోవాలని బాధ్యులకు హితవు పలికారు. పనుల విషయంలో కాంట్రాక్టర్లపై వెంట వెంటనే ఫోన్లో ఆదేశాలు ఇవ్వడం విశేషం. పథకాలను చేరువ చేయాలి తనిఖీల సందర్భంగా కలెక్టర్ జీవన్ ప్రశాంత్ పాటిల్ మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ సేవలు, పథకాలు చేరువయ్యేలా అధికారులు పాటుపడాలని సూచించారు. ప్రజలందరినీ చైతన్యం చేయడంతో యువకులు, ప్రజాప్రతినిధులు, మేధావులు కృషి చేసి మెరుగైన సమాజానికి తోడ్పాటునందించాలని కోరారు. అనంతరం పాఠశాలల్లో విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్ వారి సమస్యలను తెలుసుకున్నారు. సాంఘిక సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో రికార్డులను పరిశీలించిన ఆయన ప్రహరీ విషయమై కాంట్రాక్టర్‌కు ఫోన్ చేసి త్వరగా పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. అనంతరం నెక్కొండ హైస్కూల్లో ఉపాధ్యాయుల సమయపాలన, బోధన తీరుపై విద్యార్థులతో మాట్లాడారు. అక్కడే మధ్యాహ్నం భోజనం చేసిన కలెక్టర్.. నాణ్యత లేదని గుర్తించి నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హైస్కూల్లో మరుగుదొడ్ల సమస్యను ఎంపీపీ గటిక అజయ్‌కుమార్ చెప్పగా.. స్పందించిన కలెక్టర్ నెల రోజుల్లో నిధులు మంజూరు చేరుుస్తానని తెలిపారు. ఆ తర్వాత నెక్కొండ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ పాటిల్ రోగులతో మాట్లాడారు. ప్రజలకు సేవలందించడంలో ప్రభుత్వ ఆస్పత్రులు ముందు నిలిచేలా వైద్యులు కృషి చేయాలని సూచించారు. కాగా, తొలిసారి నె క్కొండకు వచ్చిన కలెక్టర్‌కు ఎంపీపీ అజయ్, జిల్లా కోఆప్షన్ సభ్యుడు షేక్ అబ్దుల్ నబీ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నర్సంపేట ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, నెక్కొండ తహసీల్దార్ కె. శ్రీనివాస్, ఎంపీడీఓ గోల్కొండ కృష్ణప్రసాద్, ఏ ఎస్సై కట్టమల్లు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ జి.సోమయ్య, వైఎస్ ఎంపీపీ డి.సారంగపాణి, నాయకులు టి.శివకుమార్, వి.రాజ్‌కుమార్, లింగ్యానాయక్, వాగ్యానాయక్, సూరం రాజిరెడ్డి, సంగని సూరయ్య, చల్లా వినయ్‌రెడ్డి పాల్గొన్నారు. -
రెండు రోజుల సెలవులో కలెక్టర్
హన్మకొండ అర్బన్ : జిల్లా కలెక్టర్ అమ్రపాలి రెండు రోజుల సెలవులో వెళ్తున్నారు. వ్యక్తిగత కారణాలతో శని, ఆదివారం సెలవుపెట్టారు. శనివారం జరిగే మార్కెట్ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రులు హాజరుకానున్నందున ఆ కార్యక్రమాలు చూడాలని జాయింట్ కలెక్టర్ దేవానంద్‌ను కలెక్టర్ ఆదేశించారు. ఆమె తిరిగి సోమవారం విధుల్లో చేరనున్నట్లు సమాచారం. -
ఫ(బె)స్ట్ ఆఫీసర్
ప్రతిభకు మారుపేరు అమ్రపాలి వారానికి ఓ పుస్తకం చదవాల్సిందే చూడకుండానే స్మార్ట్‌ఫోన్ టైపింగ్ మారథాన్‌లో ఉత్తమ ప్రతిభ వరంగల్ అభివృద్ధికి సరికొత్త ప్రణాళికలు అమ్రపాలి కాట... వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరు. పేరులాగే కొత్త తరానికి ప్రతినిధి. లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, నిరంతర శ్రమతో సాధించడం... ఇవే అమ్రపాలికి తెలిసినవి. టెక్నాలజీని బాగా వినియోగించే అమ్రపాలి... అభివృద్ధి కార్యక్రమాల్లో దీన్ని వినియోగించేందుకు ప్రయత్నిస్తానని అంటున్నారు. చారిత్రక వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్‌గా పనిచేయడం గొప్ప అవకాశమని చెబుతున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలితో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ అంశాలు ఆమె మాటల్లోనే... మద్రాస్ ఐఐటీలో బీటెక్, బెంగళూరు ఐఐఎంలో ఎంబీఏ పూర్తి చేశా. మొదట ముంబైలో ఆర్బీఎస్ బహుళజాతి సంస్థలో ఉద్యోగం చేశాను. నాకు నచ్చిన పని చేయడంలోనే నాకు ఆనందంగా ఉంది. సివిల్స్‌లో 39వ ర్యాంకు సాధించా. సైకాలజీ, ఇంగ్లీష్ లిటరేచర్ మెయిన్స్ ఆప్షనల్స్ సబ్జెక్టులుగా ఎంపిక చేసుకొని సివిల్స్ రాశా. తొలి ప్రయత్నంలోనే ఐఏఎస్ సాధించాను. నాది 2010 ఐఏఎస్ బ్యాచ్. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా ఫస్ట్ పోస్టింగ్. తర్వాత మహిళా, శిశుసంక్షేమ శాఖ డెరైక్టరుగా పనిచేశా. మొన్నటి వరకు రంగారెడ్డి జిల్లా జారుుంట్ కలెక్టరుగా ఉన్నా. జిల్లాల పునర్విభజనతో వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్‌గా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. వరంగల్ కలెక్టర్‌గా పోస్టింగ్ రావడం గర్వంగా ఫీలవుతున్నా. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ పాత్ర విభిన్నమైనది. ఈ జిల్లాకు పోస్టింగ్ రావడం గొప్ప అవకాశంగా భావిస్తున్నా. నగర, గ్రామీణ ప్రాంతాల కలబోతగా అర్బన్ జిల్లా ఉంది. కలెక్టరుగా... అన్ని శాఖల పనితీరు మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తా. తల్లిదండ్రులే స్ఫూర్తి... జీవితంలో స్ఫూర్తినిచ్చినవారు అమ్మ..న్నాన్నలే. నాకు సంబంధించిన అన్ని అంశాల్లో వారు అండగా నిలిచారు. నన్ను జీవితంలో నిలబడేలా చేశారు. విశాఖపట్నంలోని సత్యసారుు పాఠశాలలో స్కూల్ ఎడ్యుకేషన్ సాగింది. తండ్రి వెంకట్‌రెడ్డి హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ ఎకనామిక్, సోషల్ స్టడీస్(సెస్)లో ఎకనామిక్ ప్రొఫెసర్. అమ్మ పద్మావతి ఉన్నత విద్యావంతురాలు, గృహిణి. సోదరి గంగోత్రి చెన్నైలో ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ అధికారిగా పనిచేస్తున్నారు. ఆమె భర్త తమిళనాడు సర్వీసు ఐఏఎస్ అధికారి. చదువకుండా ఉండను... చదవడం నాకు ఇష్టం. చదవకుండా ఉండలేను. ఇంగ్లీష్ లిటరేచర్ అంటే చిన్నప్పటి నుంచే ఎంతో ఇష్టం. మహాభారత్, ఎస్ మినిస్టర్, ఎస్ ప్రైమ్ మినిస్టర్(కామిక్ బుక్), అగస్టా వంటి ఇంగ్లీషు పుస్తకాలు, నవలలు చదివాను. వారానికి ఒక పుస్తకం చదవాలని 2016 సంవత్సరం ఆరంభంలో గట్టిగా నిర్ణయించుకున్నా. ఇలా ఏడాదిలో 52 పుస్తకాలు చదవాలని నిర్ణయించుకున్నా. ఇప్పటికి 29 పుస్తకాలు మాత్రమే చదివా. సినిమాలు చూస్తా. హైస్పీడ్ ఇంటర్నెట్ వినియోగిస్తా. స్కీన్ర్ చూడకుండానే వ్యాట్సాప్‌లో టైప్ చేస్తా. నడక అంటే ఇష్టం. సైక్లింగ్, రన్నింగ్, స్విమ్మింగ్, హార్స్ రైడింగ్, సివిల్స్ శిక్షణలో హాఫ్ మారథాన్‌లో 21 కిలోమీటర్ల పరుగులో గోల్డ్‌మెడల్ సాధించా. బెస్ట్ ఫిమేల్ అథ్లెట్‌గా నిలిచాను. పాఠశాల, కళాశాల స్థారుులో ఎన్నో బహుమతులు పొందాను. హైదరాబాద్‌లో ఆగస్టులో 21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్ పూర్తిచేశా. నవంబరులో మరో హాఫ్ మారథాన్ కోసం ప్రయత్నిస్తున్నా. వరంగల్‌లో ఉర్దు నేర్చుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నా. వీలైనంత సాయం... ప్రస్తుత పరిస్థితుల్లో టెక్నాలజీ పాత్ర ఎంతో ఉంది. ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ వినియోగించడంపై దృష్టి పెడతా. మహిళా సాధికరత కోసం అన్ని చర్యలు తీసుకుంటా. ఐఏఎస్ అధికారికి సహనం ఎక్కువగా ఉండాలని భావిస్తా. ప్రజల సమస్యలను, బాధలను ఓపికగా విని అర్ధం చేసుకోవాలి. సమస్యలకు పరిష్కారాలు ఆలోచించి సత్వరం నిర్ణయాలు తీసుకోవాలి. యువత ఉపాధి అవకాశాలను పెంచేందుకు ప్రయత్నిస్తా. కష్టపడేతత్వం. పారదర్శకంగా పనిచేయడం, సుపరిపాలన అందించడం, అందరికీ న్యాయం... నా పరిధిలో వీలైనంత మేరకు సహాయం చేయడం సంతృప్తినిస్తాయి. ఇప్పటి యువతీయువకులు... ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. లక్ష్యసాధన దిశగా నిరంతరం శ్రమించాలి.