హన్మకొండ అర్బన్ : జిల్లా కలెక్టర్ అమ్రపాలి రెండు రోజుల సెలవులో వెళ్తున్నారు. వ్యక్తిగత కారణాలతో శని, ఆదివారం సెలవుపెట్టారు. శనివారం జరిగే మార్కెట్ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రులు హాజరుకానున్నందున ఆ కార్యక్రమాలు చూడాలని జాయింట్ కలెక్టర్ దేవానంద్‌ను కలెక్టర్ ఆదేశించారు. ఆమె తిరిగి సోమవారం విధుల్లో చేరనున్నట్లు సమాచారం.