
భారతదేశంలో హోలీని ఎంతబాగా సెలబ్రేట్ చేసుకుంటారో అందరికి తెలుసు. ఈ పండుగను దృష్టిలో ఉంచుకుని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సెలవు కూడా మంజూరు చేస్తాయి. అయితే ఓ కంపెనీ బాస్ మాత్రం హోలీకి ఉద్యోగులకు సెలవు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. అంతే కాకుండా కొన్ని రూల్స్ కూడా పాస్ చేశారు.
ఒక ఉద్యోగి తన బాస్ పంపిన సందేశాన్ని రెడ్డిట్‌లో పోస్ట్ చేశారు. దీంతో అది నెట్టింట్లో వైరల్ అయింది. లీవ్ ఇవ్వకపోవడం మాత్రమే కాకుండా.. ఆఫీసుకు కూడా రంగులు తీసుకురాకూడదని రూల్ పాస్ చేశారు. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగింది, కంపెనీ పేరు ఏమిటనేది వెల్లడికాలేదు.

హోలీ రోజు చెప్పకుండా సెలవు తీసుకుంటే లేదా అనుమతి లేకుండా సెలవు తీసుకుంటే.. అనుమతించనని, జీతం కూడా కట్ చేస్తామని బాస్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవ్వడంతో నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఉద్యోగులందరూ రాజీనామా చేయండి అని ఒకరు చెబితే.. కంపెనీ పేరు చెప్పి, బాస్ సిగ్గుపడేలా చేయాలసింది అని మరొకరు అన్నారు. భారత ప్రభుత్వం తన శ్రామిక శక్తిని రక్షించుకోవడంలో పూర్తిగా విఫలమైంది. మొత్తం మీద ఉద్యోగులు దోపిడీకి గురవుతున్నారని ఇంకొకరు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment