బాస్ లీవ్ ఇవ్వలేదని.. వీడియో కాల్‌లో పెళ్లి | Turkish Boss Denies Indian Man Wedding Leave He Marries Over Video Call | Sakshi
Sakshi News home page

బాస్ లీవ్ ఇవ్వలేదని.. వీడియో కాల్‌లో పెళ్లి

Published Fri, Nov 8 2024 4:06 PM | Last Updated on Fri, Nov 8 2024 4:30 PM

Turkish Boss Denies Indian Man Wedding Leave He Marries Over Video Call

పని, పని పని.. కార్పొరేట్‌ కల్చర్‌లో ఇది ఎక్కువైంది. కార్యాలయాల్లో పని ఒత్తిడి.. ఉద్యోగులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. ముఖ్యమైన అవసరాలకు సైతం సరిగా లీవ్‌లు కూడా ఇవ్వని పరిస్థితి తలెత్తుతోంది. కానీ ఎంత పెద్ద ఉద్యోగమైన, ఎంత పెద్ద పదవిలో ఉన్న జీవితంలో జరిగే పెళ్లికి ప్రతి ఒక్కరూ తప్పక సెలవులు పెడతారు. అయితే టర్కీలో ఓ ఉద్యోగికి తన పెళ్లికి బాస్‌ లీవ్‌ ఇవ్వలేదు. దీంతో అతను వర్చువల్‌గా వివాహం  చేసుకోవాలసి వచ్చింది.

హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ జంట ఆన్‌లైన్ వీడియో కాల్ సాక్షిగా ఒక్కటైయ్యారు. పెళ్లి కూతురు మండిలో.. పెళ్లి కొడుకు టర్కీలో ఉండి వీడియో కాల్‌లోనే  పెళ్లి తంతు పూర్తి చేశారు. బిలాస్‌పూర్ చెందిన అద్నాన్ ముహమ్మద్ టర్కీలో పని చేస్తున్నాడు. స్వదేశానికి వచ్చి వివాహ చేసుకునేందుకు అతడు లీవ్ కోరగా.. కంపెనీ సెలవు ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో అతను వర్చువల్‌గా ముస్లిం మత సంప్రదాయ ప్రకారం వీడియోకాల్లో పెళ్లి చేసుకున్నాడు. అయితే అంత హడావిడీగా పెళ్లి చేసుకోవడానికి కారణం.. వధువు తాత అనారోగ్యంతో  ఉండటంతో ఆమెను త్వరగా వివాహం చేసుకోవాలని పట్టుబట్టినట్లు వరుడి కుటుంబ సభ్యులు తెలిపారు.

ఆమె పెళ్లి చూడాలని పట్టుపట్టడంతో ఇరు కుటుంబీకులు ఆన్ లైన్  నికాకు అంగీకరించారు. బిలాస్‌పూర్ నుంచి నవంబర్ 3న ఆదివారం మండికి చేరుకున్నారు. మండీలో నవంబర్ 4న (సోమవారం) వీడియో కాలంలో వారి వివాహం జరిగింది. ఖాజీ వారితో కలిసి ఖుబూల్ హై అని మూడుసార్లు అనిపించారు. ఇదిలా ఉండగా గతేడాది జూలైలో సిమ్లాలో మరో వ్యక్తి కూడా ఇలానే ఆన్ లైన్ పెళ్లి చేసుకున్నాడు.  కోట్‌ఘర్‌కు చెందిన  ఆశిష్ సింఘా, కులులోని భుంతర్‌కు చెందిన శివాని ఠాకూర్‌లు కొండచరియలు విరిగిపడటంతో టైంకు వారి పెళ్లింటికి చేరుకోలేక పోయారు. దీంతో వీడియో-కాన్ఫరెన్స్‌లో పెళ్లి చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement