Turky
-
బాస్ లీవ్ ఇవ్వలేదని.. వీడియో కాల్లో పెళ్లి
పని, పని పని.. కార్పొరేట్ కల్చర్‌లో ఇది ఎక్కువైంది. కార్యాలయాల్లో పని ఒత్తిడి.. ఉద్యోగులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. ముఖ్యమైన అవసరాలకు సైతం సరిగా లీవ్‌లు కూడా ఇవ్వని పరిస్థితి తలెత్తుతోంది. కానీ ఎంత పెద్ద ఉద్యోగమైన, ఎంత పెద్ద పదవిలో ఉన్న జీవితంలో జరిగే పెళ్లికి ప్రతి ఒక్కరూ తప్పక సెలవులు పెడతారు. అయితే టర్కీలో ఓ ఉద్యోగికి తన పెళ్లికి బాస్ లీవ్ ఇవ్వలేదు. దీంతో అతను వర్చువల్‌గా వివాహం చేసుకోవాలసి వచ్చింది.హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ జంట ఆన్లైన్ వీడియో కాల్ సాక్షిగా ఒక్కటైయ్యారు. పెళ్లి కూతురు మండిలో.. పెళ్లి కొడుకు టర్కీలో ఉండి వీడియో కాల్‌లోనే పెళ్లి తంతు పూర్తి చేశారు. బిలాస్పూర్ చెందిన అద్నాన్ ముహమ్మద్ టర్కీలో పని చేస్తున్నాడు. స్వదేశానికి వచ్చి వివాహ చేసుకునేందుకు అతడు లీవ్ కోరగా.. కంపెనీ సెలవు ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో అతను వర్చువల్‌గా ముస్లిం మత సంప్రదాయ ప్రకారం వీడియోకాల్‌లో పెళ్లి చేసుకున్నాడు. అయితే అంత హడావిడీగా పెళ్లి చేసుకోవడానికి కారణం.. వధువు తాత అనారోగ్యంతో ఉండటంతో ఆమెను త్వరగా వివాహం చేసుకోవాలని పట్టుబట్టినట్లు వరుడి కుటుంబ సభ్యులు తెలిపారు.ఆమె పెళ్లి చూడాలని పట్టుపట్టడంతో ఇరు కుటుంబీకులు ఆన్ లైన్ నికాకు అంగీకరించారు. బిలాస్పూర్ నుంచి నవంబర్ 3న ఆదివారం మండికి చేరుకున్నారు. మండీలో నవంబర్ 4న (సోమవారం) వీడియో కాలంలో వారి వివాహం జరిగింది. ఖాజీ వారితో కలిసి ఖుబూల్ హై అని మూడుసార్లు అనిపించారు. ఇదిలా ఉండగా గతేడాది జూలైలో సిమ్లాలో మరో వ్యక్తి కూడా ఇలానే ఆన్ లైన్ పెళ్లి చేసుకున్నాడు. కోట్‌ఘర్‌కు చెందిన ఆశిష్ సింఘా, కులులోని భుంతర్‌కు చెందిన శివాని ఠాకూర్లు కొండచరియలు విరిగిపడటంతో టైంకు వారి పెళ్లింటికి చేరుకోలేక పోయారు. దీంతో వీడియో-కాన్ఫరెన్స్‌లో పెళ్లి చేశారు. -
బొగ్గు గనిలో పేలుడు ఘటన.. 40కి చేరిన మృతుల సంఖ్య
ఇస్తాన్‌బుల్: ఉత్తర టర్కీలోని బొగ్గు గనిలో జరిగిన భారీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 40కి పెరిగింది. ఇప్పటివరకు 58 మందిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. ఇంకా పదుల సంఖ్యలో కార్మికులు గనిలోనే చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. వారిని బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం ఈ పేలుడు జరిగినప్పుడు గనిలో 110 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వారిలో సగం మంది 300 అడుగుల లోతులో ఉన్నట్లు పేర్కొన్నారు. అత్యవసర సిబ్బంది రాత్రంతా రెస్కూ ఆపరేషన్ నిర్వహించి గని లోపల ఉన్నవారిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించినట్లు వివరించారు. ఇంకా 15 మంది గనిలోనే చిక్కుకున్నారు. వారికోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వీరి కోసం కుటుంబసభ్యులు గని వద్ద రోదిస్తున్నారు. అయితే ఈ భారీ పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. బొగ్గు గనులలో పేలుడు మిశ్రమాన్ని ఏర్పరుచుకునే మిథేన్ గ్యాస్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక సమాచారం అందిందని టర్కీ ఇంధన మంత్రి తెలిపారు. చదవండి: పాకిస్తాన్‌పై బైడెన్ సంచలన వ్యాఖ్యలు... ఆ దేశాలతో ముప్పు -
స్జేజీపైనే జుట్టు కత్తిరించుకున్న సింగర్.. వీడియో వైరల్
ఇస్తాన్‌బుల్: హిజాబ్ వ్యతిరేక నిరసనలతో ఇరాన్ అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఆ దేశ మహిళలకు టర్కీ ప్రముఖ సింగర్ మెలెక మొసో మద్దతు తెలిపారు. స్టేజీపైనే జుట్టు కత్తిరించుకుని ఇరాన్ మహిళల పోరాటానికి అండగా నిలిచారు. దీంతో సింగర్ జుట్టు కత్తిరించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Turkish singer @MelekMosso cuts off her hair on stage in solidarity with the Iranian women. Thank you Melek!#MahsaAmini #مهسا_امینی #IranProtests2022 pic.twitter.com/ZjISxjGkAL — Omid Memarian (@Omid_M) September 27, 2022 హిజాబ్ ధరించనందుకు ఇరాన్లో 22 ఏళ్ల యువతి మహస అమీనిని పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆమె మరణించింది. పోలీసులు హింసించడంతోనే ఆమె చనిపోయిందని ఇరాన్లో హిజాబ్ వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తాయి. ప్రభుత్వం వీరిపై ఉక్కుపాదం మోపింది. దీంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య పలు చోట్ల ఘర్షణలు తలెత్తాయి. ఇప్పటివరకు 75 మంది నిరసనకారులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇరాన్‌కు ఇతర దేశాల్లోని ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. షరియా, ఇస్లామిక్ చట్టం ప్రకారం ఏడేళ్లు పైబడిన ముస్లిం అమ్మాయిలు జుట్టు కన్పించకుండా తప్పనిసరిగా హిజాబ్ ధరించాలి. బుర్ఖా లాంటి పొడవైన వస్త్రాలు ధరించాలి. కొన్ని ముస్లిం దేశాలు దీన్ని పాటించకపోయినప్పటికీ ఇరాన్ ఈ నిబంధనను తప్పనిసరి చేసింది. జులై 5న అధికారిక ఆదేశాలు జారీ చేసింది. దీంతో అక్కడి మహిళలతో పాటు వారి కుటుంబసభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. చదవండి: హిజాబ్ ఆందోళనల్లో సోదరుడు మృతి.. జుట్టుకత్తిరించుకున్న యువతి -
టర్కీ డిజైన్‌లో సచివాలయం మసీదులు
సాక్షి, హైదరాబాద్: నూతన సచివాలయంలో కొత్తగా నిర్మించే మసీదుల నమూనాలు ఖరారయ్యాయి. టర్కీ డిజైన్‌లో వీటి నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు చేపట్టినట్లు హోం మంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. ఆయన ఆదివారం తన చాంబర్లో మైనారిటీ వ్యవహారాల సలహాదారుడు ఏకే ఖాన్ తదితరులతో కలిసి మసీదుల డిజైన్లను పరిశీలించారు. పాత సచివాలయంలో మసీదు ఉన్న చోటే వీటిని నిర్మించనున్నారు. నమూనాలపై నిపుణుల సలహాలు తీసుకున్నారు. సచివాలయంలో 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంతో పెద్ద మసీదు, 400 చదరపు అడుగుల విస్తీర్ణంతో చిన్న మసీదులను అత్యంత సుందరంగా నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మహమూద్ అలీ చెప్పారు. పెద్ద మసీదు లోపల 400 మంది, బయట ఆవరణలో సుమారు 1,000 మంది ప్రార్థనలు చేసేలా నిర్మాణాలు ఉంటాయన్నారు. మహిళలు ప్రత్యేకంగా ప్రార్థనలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మొదటి అంతస్తులో వజూఖానా దానిపై ప్రత్యేకంగా ఇమామ్ కోసం నివాస వసతి కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెలాఖరులోగా మసీదు నిర్మాణాలకు శంకుస్థాపన చేసి 9 నెలల్లో పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. వచ్చే మార్చి నాటికి మసీదులను అందుబాటులోకి వచ్చేలా కార్యాచరణ రూపొందించినట్లు వివరించారు. చదవండి: 4 కోట్ల ఆస్తులు: బుక్కెడు బువ్వ పెట్టరూ.. -
‘టర్కిలో అతిపెద్ద సూపర్ స్టార్’
బాలీవుడ్ హీరోల్లో ఆమిర్‌ఖాన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా జరిగిన ఓ సంఘటనతో ఆమిర్‌కు విదేశాల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలుస్తోంది. టర్కి ఎయిర్ పోర్టులో అతన్ని అభిమానులు చుట్టిముట్టి సెల్ఫీలు తీసుకుంటున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమిర్‌ఖాన్, కరీనాకపూర్ జంటగా నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘లాల్‌సింగ్ చద్దా’. ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్‌ను చిత్రం బృందం టర్కిలో ప్లాన్ చేసింది. దీంతో సినిమా షూటింగ్లో పాల్గొనడానికి ఇటీవల అమీర్ టర్కి వెళ్లారు. అక్కడి ఎయిర్ పోర్టులో అభిమానులు సెల్ఫీల కోసం ఆయనపై ఎగబడ్డారు. ఆయన కళ్లజోడు పెట్టుకొని, ముఖానికి మాస్క్ ధరించి కనిపించారు. ‘టర్కీలో ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్’ అని ఓ అభిమాని ట్విటర్లో అమీర్ వీడియోను పొస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక లాక్డౌన్ కారణంగా షూటింగ్‌లు వాయిదా పడిన విషయం తెలిసిందే. షూటింగ్ అనుమతులు ఇచ్చిన అనంతరం విదేశాల్లో షూటింగ్ చేస్తున్న రెండో సినిమా ‘లాల్‌సింగ్ చద్దా’. మొదటి సినిమా అక్షయ్ కుమార్ నటిస్తున్న బెల్ బాటమ్. ఈ మూవీ షూటింగ్ లండన్‌లో జరుగుతోంది. (అమిర్ నాకు పెట్టకుండానే తిన్నారు: దీపిక) Worlds Biggest Superstar AAMIR KHAN in Turkey pic.twitter.com/gLxRKmCxew@aajtak @bombaytimes@filmfare @iFaridoon @HimeshMankad@ians_india @ANI @ndtv @bollywood_life @ETCBollywood @BollywoodGandu @Bollyhungama @Koimoi @pinkvilla @Spotboye @bollyspy @bollywood_life @ZoomTV @ABPNews — Laal Singh Chaddha (@ACEOFHINDOSTAN) August 10, 2020 టామ్‌హ్యాంక్స్ ముఖ్యపాత్రలో నటించిన హాలీవుడ్ చిత్రం ‘ఫారెస్ట్‌గంప్’ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. అద్వైత్ చందన్ దర్శకత్వంలో వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్, ఆమిర్‌ఖాన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాను ఈ ఏడాది కాకుండా వచ్చే ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తున్నట్లు ఇటీవల చిత్రబృందం పేర్కొంది. -
టర్కీ ఫొటోగ్రాఫర్ భావోద్వేగ పోస్ట్..
అంకారా: సోషల్ మీడియాలో టర్కీష్ ఫొటోగ్రాఫర్ ఉగుర్ గాలెన్కు భావోద్వేగ పూరిత ఫోటో సంచలనం రేపుతోంది. ప్రపంచంలో అన్ని దేశాలు ఈ గ్రహంలో నివసిస్తున్నప్పటికీ పాశ్చాత్య దేశాలు, మిగతా దేశాలకు ఉన్న వ్యత్యాసాలను వివరించిన తీరు అద్భుతమని నెటిజన్లు అభినందిస్తున్నారు. గాలెన్కుకు సంబంధించిన ఫొటోను డాక్టర్ సారా హుమర్ ట్విటర్లో పోస్ట్ చేశారు. విశ్వవ్యాప్తంగా నెలకొన్న విభిన్న పరిస్థితులను ఒకే దృశ్యం ద్వారా చిత్రీకరించారని సారా తెలిపారు. ప్రపంచంలో కొన్ని దేశాలు అధిక ఆహారం, అభివృద్ది, సామరస్యతతో వెలుగుతుంటే మరికొన్ని దేశాలు పేదరికం, ఆహార లభ్యత, హింస తదితర అంశాలతో బాధపడుతున్నాయని వీడియో ద్వారా తెలుస్తోంది. పాశ్చాత్య దేశాలలో వినియోగదారులు, నిరుపేద దేశాలలో ప్రజలు ఏ విధంగా నివసిస్తున్నారో ఈ వీడియో ద్వారా అద్భుతంగా వివరించారు. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ..ప్రపంచంలోని కొన్ని దేశాలు మనుషులను చంపడానికి ఉపయోగపడే యంత్రాలను తయారు చేస్తున్నారని..ఈ యంత్రాల వల్ల ప్రజల మధ్య విద్వేషపూరిత వాతావరణం నెలకొంటుందని ఆరిఫ్ ఆయూబ్ అనే నెటిజన్ ట్వీట్ చేశారు. పాశ్చాత్య దేశాలు తమ సైనిక శక్తి, ఆర్థిక ప్రణాళికల ద్వారా వెనకబడిన దేశాలను బానిసలుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారని మహమ్మద్ ఉపాలా అనే మరో నెటిజన్ అభిప్రాయపడ్డాడు. కొన్ని దేశాలు మానవుల హక్కుల గురించి మాట్లాడుతుంటే, మరికొన్ని వాటిని ఉల్లంఘిస్తున్నాయని, ఒకరు న్యాయం గురించి మాట్లాడుతుంటే మరికొందరు అన్యాయాన్ని ఎదుర్కొంటున్నారని ఖాన్ అనే నెటిజన్ తెలిపారు. ఈ భావోద్వేగ అంశాన్ని ప్రపంచానికి చూపించినందుకు మిన్నట్ అలీ అనే నెటిజన్ తన సంతోషాన్ని వ్యక్తపరిచాడు. ఈ వీడియోకు 30 లక్షలపైగా ప్రజలు వీక్షించారని ట్విటర్ అభినందించడం విశేషం. చదవండి: నెమలి ఆర్డర్ చేస్తే టర్కీ కోడి వచ్చింది..! -
తొలిసారి ఎయిర్‌పోర్ట్‌కొచ్చి.. ఆగమాగం!
తొలిసారి విమానం ఎక్కబోతున్నామంటే.. ఎవరికైనా సహజంగా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. విమానం ఎలా ఎక్కాలి? విమానాశ్రయం ఎలా ఉంటుంది? ఇలా ఎన్నో ప్రశ్నలు తలెత్తడం సహజం. అయితే, తొలిసారి అనుభూతి మాత్రం జీవితాంతం గుర్తుంటుంది. కానీ, ఈ మహిళకు మాత్రం తొలిసారి విమానాశ్రయం వెళ్లడం భయానక అనుభవంగా మిగిలిపోయింది. ఆమె తొలిసారి విమానాశ్రయానికి వచ్చారు. అక్కడ లగేజ్ లాక్కెళ్లే.. కన్వేయర్ బెల్ట్‌ను చూసి.. దానిపై నిలబడితే.. నేరుగా జెట్ విమానం దగ్గరికి వెళ్లొచ్చని అనుకున్నారు. అంతే, తన లగేజీ పట్టుకొని.. కదులుతున్న ఆ బెల్ట్‌పైకి దూకేశారు. దాంతో బ్యాలెన్స్ తప్పి దభేలున కిందపడ్డారు. అక్కడే ఉన్న ఎయిర్పోర్ట్ సిబ్బంది ఇది గమనించి.. వెంటనే కన్వేయర్ బెల్ట్‌ను ఆపేయడంతో ఆమెకు పెద్దగా గాయాలు కాలేదు. టర్కీ విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కన్వేయర్ బెల్ట్‌పై నిలబడితే.. విమానం దగ్గరికి వెళ్లొచ్చుని భావించి.. దానిపైకి ఎక్కినట్టు అనంతరం ఆ మహిళ చెప్పారు. ఈ వీడియోపై సోషల్ మీడియాలో ఇప్పుడు సరదా కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. -
టర్కీ పోదాం... చలో చలో
.... అంటూ బ్యాగ్ ప్యాక్చేసుకునే పనిలో ఉన్నారట విశాల్ అండ్ తమన్నా. దాదాపు యాభై రోజులు అక్కడే ఉంటారని కోలీవుడ్ టాక్. సుందర్. సి దర్శకత్వంలో విశాల్, తమన్నా హీరోహీరోయిన్లుగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను టర్కీలో ప్లాన్ చేశారట చిత్రబృందం. అక్కడ జరిగే మేజర్ షూటింగ్లో రెండు పాటలు, మూడు ఫైట్స్‌తో పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. అలాగే ఈ సినిమాలో మలయాళ నటి ఐశ్వర్యాలక్ష్మీ మరో కథానాయికగా నటిస్తారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తారు. ఇంతకుముందు ‘కత్తిసండై’ అనే సినిమాలో జంటగా కనిపించారు తమన్నా, విశాల్. ఇప్పుడు ఈ సినిమాలో మళ్లీ జోడీ కట్టారు. అలాగే ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించనున్న సినిమాలో కూడా తమన్నా, విశాల్ జంటగా కనిపించనున్నారని తెలిసింది. -
యూరియా స్కాంలో 100 కోట్ల జరిమానా!
న్యూఢిల్లీ: 23 ఏళ్లనాటి రూ.133 కోట్ల యూరియా కుంభకోణంలో తీస్ హజారీ ప్రత్యేక సీబీఐ కోర్టు దోషులకు భారీ జరిమానాతోపాటు కఠిన కారాగార శిక్ష విధించింది. ఇద్దరు టర్కీ దేశస్తులకు ఆరేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.100 కోట్ల జరిమానా విధించింది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు బంధువు, మాజీ కేంద్ర మంత్రి తనయుడు సహా ఈ కేసుతో సంబంధమున్న భారతీయులకు భారీ జరిమానా విధించింది. టర్కీ దేశస్తులు టుంకే అలంకుస్, సిహాన్ కరాంచీ (వీరిద్దరూ కర్సాన్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు)లతోపాటు ఆ కంపెనీ భారతీయ ప్రతినిధి ఎం సాంబశివరావు, నేషనల్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ (ఎన్ఎఫ్ఎల్) మాజీ సీఎండీ రామకృష్ణన్, ఎన్ఎఫ్ఎల్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిల్బాగ్ సింగ్ కన్వర్, మల్లేశం గౌడ్, మాజీ కేంద్ర మంత్రి రామ్‌లఖన్ సింగ్ యాదవ్ కుమారుడు ప్రకాశ్ చంద్ర, మాజీ ప్రధాని పీవీ బంధువు సంజీవ రావు ఈ కేసులో దోషులుగా ఉన్నారు. రామకృష్ణ, కన్వర్‌లకు మూడేళ్ల జైలు, రూ.6లక్షల జరిమానా, సాంబశివరావుకు మూడేళ్ల జైలు, రూ.5కోట్ల జరిమానా, మల్లేశం గౌడ్‌కు మూడేళ్ల జైలు, రూ.5కోట్ల జరిమానా, సంజీవరావ్, యాదవ్‌లకు కోటి రూపాయల జరిమానా మూడేళ్ల జైలు శిక్ష విధించారు. కుంభకోణం కేసేంటి? ఈ కేసులో పేర్కొన్న వారంతా నేరపూరిత కుట్రతో ఎన్‌ఎఫ్‌ఎల్‌ను రూ.133 కోట్ల మేర మోసం చేశారంటూ 1996, మే 19న సీబీఐ కేసు నమోదు చేసింది. ‘టర్కీ దేశస్తుడైన అలంకుస్ ఎన్ఎఫ్ఎల్కు యూరియా సరఫరా చేసేందుకు కర్సాన్ లిమిటెడ్ కంపెనీ తరపున ఒప్పందం చేసుకున్నాడు. మెట్రిక్ టన్నుకు 190 డాలర్ల చొప్పున 2లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకోసం ముందుగానే 100% చెల్లించాలని ఒప్పందంలో ఉంది. దీని విలువ దాదాపుగా రూ.133 కోట్లు. నవంబర్ 2, 1995న అలంకుస్కు 3.8లక్షల డాలర్లు బీమా అడ్వాన్స్‌గా చెల్లించారు. మిగిలిన 3.76 కోట్ల డాలర్లను కర్సాన్ కంపెనీ అకౌంట్లోకి 1995లో జమచేశారు. అయితే ఈ కంపెనీ ఎన్ఎఫ్ఎల్కు యూరియాను పంపలేదు. కుంభకోణం నేపథ్యం.. 1995,సెప్టెంబర్: యూరియా సరఫరాకు అంతర్జాతీయ టెండర్ల ఆహ్వానం 1996 మార్చి: టర్కీ కంపెనీ కార్సాన్కు రూ.133 కోట్ల చెల్లింపు 1996 మే: యూరియా సరఫరా చేయకపోవడంపై సీబీఐ విచారణకు ఆదేశం 1996 ఆగస్టు: కంభకోణంలో వెలుగులోకి పీవీ కొడుకు ప్రభాకర్ రావు పేరు 1998 నవంబర్: ప్రభాకర్ రావు అరెస్టు -
‘పాకెట్ హెర్క్యూలెస్’ ఇక లేడు
ఇస్తాంబుల్: ఏడుసార్లు విశ్వవిజేత... వరుసగా మూడుసార్లు ఒలింపిక్ చాంపియన్... టర్కీ దిగ్గజ వెయిట్‌లిఫ్టర్ నైమ్ సులేమాన్‌ఒగ్లు అనారోగ్యంతో కన్నుమూశారు. కేవలం 4.8 అడుగుల ఎత్తుండే సులేమాన్ఒగ్లును వెయిట్‌లిఫ్టింగ్ ప్రపంచంలో ‘ద పాకెట్ హెర్క్యూలెస్’గా పిలుస్తారు. 50 ఏళ్ల సులేమాన్ఒగ్లుకు ఇటీవలే కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స జరిగింది. ఈ చికిత్స తర్వాత ఆయన కోలుకుంటున్నారని వార్తలొచ్చిన నేపథ్యంలో హఠాత్తుగా ఆరోగ్యం విషమించి చనిపోవడంపై క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతికి లోనైంది. 1988 సియోల్ (60 కేజీలు), 1992 బార్సిలోనా (60 కేజీలు), 1996 అట్లాంటా (64 కేజీలు) ఒలింపిక్స్ క్రీడల్లో ఆయన స్వర్ణ పతకాలు గెలిచారు. తన శరీర బరువుకు 2.5 రెట్లు బరువునెత్తిన తొలి, ఏకైక వెయిట్ లిఫ్టర్ ఆయనే కావడం విశేషం. 22 ఏళ్లకే 32 ప్రపంచ రికార్డులు నెలకొల్పిన ఆయన 2000లో సిడ్నీ ఒలింపిక్స్ తర్వాత ఆట నుంచి వీడ్కోలు తీసుకున్నారు. -
అగ్రరాజ్యానికి టర్కీ వార్నింగ్
అంకారా(టర్కీ): టర్కీ జవాన్లపై సిరియా సరిహద్దుల్లో జరిగిన కాల్పులకు ఆ దేశ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. మరోసారి ఇలా జరిగితే ఊరుకోబోమని అగ్రరాజ్యం రష్యాను హెచ్చరించింది. సిరియా, టర్కీ సరిహద్దుల్లోని కుర్దుల ప్రాబల్యంలో ఉన్న ప్రాంతం నుంచి జరిగిన కాల్పుల్లో ఓ టర్కీ జవాను మృతిచెందాడు. దీనిపై టర్కీలోని రష్యా రాయబారిని పిలిపించుకుని హెచ్చరికలు జారీ చేసింది. సిరియాలో ప్రభుత్వం, తీవ్రవాద, ప్రభుత్వ వ్యతిరేక పక్షాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని రష్యానే పర్యవేక్షిస్తోందని, ఈ నేపథ్యంలోనే కాల్పులు జరిగాయని టర్కీ ఆరోపించింది. సిరియాలోని కుర్దుల ఆధీనంలోని ప్రాంతాల్లో రష్యా బలగాలు ఉండటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. స్వతంత్రం కోసం పోరాడుతున్న కుర్దులు రష్యా రాజధాని మాస్కోలో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని మూసివేయాలని కోరింది. -
ఆ నరహంతకుడిని అరెస్ట్ చేశారు
ఇస్తాంబుల్: టర్కీలోని ఇస్తాంబుల్ నైట్ క్లబ్లో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా కాల్పులు జరిపి 39 మందిని పొట్టనపెట్టుకున్న నరహంతకుడిని పోలీసులు పట్టుకున్నారు. పోలీసు ఆపరేషన్‌లో దుండగుడిని అదుపులోకి తీసుకున్నట్టు మంగళవారం ఉదయం టర్కీ మీడియా వెల్లడించింది. ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన పోలీసులు ఎసెన్యుర్ట్ జిల్లాలోని ఓ ఇంట్లో నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు. కిర్జిస్థాన్కు చెందిన ఓ స్నేహితుడు ఇంట్లో ఆశ్రయం పొందినట్టు టర్కీ మీడియా పేర్కొంది. నిందితుడిని ఉజ్బెకిస్థాన్‌కు చెందిన అబ్దుల్ఖదీర్ మషరిపోవ్గా గుర్తించినట్టు వెల్లడించింది. అబ్దుల్ఖదీర్తో పాటు మరో ముగ్గురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలియజేసింది. అతనికి భార్య, ఏడాది కూతురు ఉన్నట్టు పేర్కొంది. కాగా పోలీసులు ఈ విషయాలను అధికారికంగా ప్రకటించలేదు. నిందితుడికి వైద్య పరీక్షలు చేయించిన అనంతరం విచారణ కోసం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు తరలించారు. టర్కీ ఉప ప్రధాని నుమన్ కుర్టుల్మస్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మెవ్లుట్ కవుసోగ్లులు.. నిందితుడి అరెస్ట్ వార్తను ధ్రువీకరించారు. పోలీసులను, ఇంటలిజెన్స్ సంస్థలను అభినందిస్తూ ట్వీట్ చేశారు. జనవరి 1వ తేదీ వేకువజామున కాల్పుల ఘటన జరిగిన తర్వాత ఈ దాడికి తమదే బాధ్యతని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. సిరియాలో టర్కీ మిలటరీ ఆపరేషన్లకు ప్రతీకారంగా ఈ దాడి చేసినట్టు వెల్లడించింది. (ఇస్తాంబుల్ దాడిలో ఇద్దరు భారతీయుల మృతి) -
ఈ హంతకుడు అధ్యక్షుడికి కాపలా కాశాడు
టర్కీ: అంకారాలోని ఓ వేదికపై రష్యా రాయబారిని అతి కిరాతకంగా కాల్చి చంపిన టర్కీ పోలీసు అధికారి మెవ్లత్ మెర్ట్ అల్తింటాస్(22) గతంలో ఎనిమిదిసార్లు టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్‌కు అంగరక్షణ బాధ్యతలు కూడా నిర్వహించాడట.ఈ ఏడాది జూలై 15న టర్కీలో సైనిక తిరుగుబాటు జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎర్డోగన్ కు అతడు మొత్తం ఎనిమిది సందర్భాల్లో రక్షణ బాధ్యతలు నిర్వహించినట్లు ఓ రిపోర్టు బుధవారం తెలిపింది. సోమవారం సాయంత్రం ఆర్ట్ ఎగ్జిబిషన్ సెంటర్ లోని వేదికపై రష్యా రాయబారి ఆండ్రే కర్లోవ్ మాట్లాడుతుండగా అల్తింటాస్ నేరుగా వెళ్లి ఆయనపై తొమ్మిది రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. అయితే, ఈ అల్తింటాస్ కు టర్కీలో సైనిక తిరుగుబాటుకు కారణంగా అనుమానిస్తున్న అమెరికాలోని ముస్లిం మతపెద్ద ఫెతుల్లా గులెన్కు సంబంధాలు ఉన్నట్లు టర్కీ పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో గులెన్ విద్యాసంస్థలు నిర్వహించే కార్యక్రమాలకు కూడా అల్తింటాస్ వెళ్లినట్లు గుర్తించారు. అంతేకాకుండా టర్కీ విదేశాంగ మంత్రి మెవ్లట్ కావ్సోగ్లు అమెరికా విదేశాంగమంత్రి జాన్ కెర్రీతో మంగళవారం సాయంత్రం ఫోన్లో మాట్లాడుతూ ఇదే అనుమానం వ్యక్తం చేశారు. -
తోకముడిచిన సైన్యం!
అంకారా: ప్రజల సంఘటిత శక్తి ముందు సైనిక తిరుగుబాటు వ్యూహం బెడిసికొట్టింది. టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ పిలుపు మేరకు ప్రజలు విధుల్లోకి రావడంతో అధికార కాంక్షతో తెగబడిన సైన్యం తోక ముడిచింది. టర్కీలో సైనిక తిరుగుబాటు విఫలమైంది. అధ్యక్షుడిగా తన పట్టును ఎర్డోగాన్ మరింత బిగించారు. తిరుగుబాటుకు దిగిన సైన్యంపై ఆయన ఉక్కుపాదాన్ని మోపుతున్నట్టు తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. సైన్యం జరిపిన తిరుగుబాటు వల్ల తలెత్తిన హింసలో 90 మంది వరకు చనిపోయారు. టర్కీ వాయవ్య తీరప్రాంతమైన మార్మారీస్‌కు అధ్యక్షుడు ఎర్డోగాన్ విహారయాత్రకు వెళ్లడంతో ఇదే అదనుగా భావించిన సైన్యంలో ఓ చీలిక వర్గం శనివారం తెల్లవారుజామున సైనిక కుట్రకు తెగబడింది. టర్కీలో ప్రధాన నగరాలైన ఇస్తాంబుల్, రాజధాని అంకారాలను తమ అధీనంలోకి తీసుకొనేందుకు సైనిక తిరుగుబాటుదారులు ప్రయత్నించారు. ప్రభుత్వ చానెల్‌ను తమ అధీనంలోకి తీసుకొని దేశంలో సైనిక పాలన విధిస్తున్నట్టు ప్రకటన చేయాలని ఒత్తిడి చేశారు. ఈ నేపథ్యంలో హుటాహుటీన తిరిగివచ్చిన ఎర్డోగాన్ వెంటనే సైనిక తిరుగుబాటును అణచివేసేందుకు చర్యలు తీసుకున్నారు. సైనిక తిరుగుబాటు దేశద్రోహచర్య అని, దీనికి కారకులు తీవ్ర మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. ప్రజలు వీధుల్లోకి వచ్చి సైనిక తిరుగుబాటును తిప్పికొట్టాలని ఎర్డోగాన్ ఇస్తాంబుల్ విమానాశ్రయంలో తన మద్దతుదారులను ఉద్దేశించి పిలుపునిచ్చారు. ఎర్డోగాన్ పిలుపుతో ప్రజలు వీధుల్లోకి రావడం, ఇటు పోలీసులు, ప్రభుత్వ దళాలు సైనిక తిరుగుబాటుదారుల దాడిని దీటుగా తిప్పికొట్టడంతో సైనిక కుట్ర విఫలమైనట్టు భావిస్తున్నారు. పోలీసులు సైనిక తిరుగుబాటుదారులపై ఉక్కుపాదం మోపారు. టర్కీ వ్యాప్తంగా మొత్తం 754 మంది సైనికులను అదుపులోకి తీసుకొన్నారు. తిరుగుబాటు నేపథ్యంలో సైన్యానికి తాత్కాలిక నూతన అధ్యక్షుడిని నియమించినట్టు టర్కీ ప్రధాని బెనాలీ ప్రకటించారు. అంకారాలో కొంతమంది సైనిక తిరుగుబాటుదారులు ప్రతిఘటిస్తున్నారని, వారిని కూడా ఏరివేస్తామని అధ్యక్షుడు ఎర్డోగాన్ మీడియాకు తెలిపారు. టర్కీలో పరిస్థితి పూర్తిగా ప్రజా ప్రభుత్వం నియంత్రణలోనే ఉందని ఆయన స్పష్టం చేశారు. -
అధ్యక్ష భవనంపై బాంబుల వర్షం!
అంకారా: అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్‌కు వ్యతిరేకంగా సైన్యం తిరుగుబాటుకు దిగడంతో టర్కీలో ఒక్కసారిగా యుద్ధ వాతావరణం నెలకొంది. టర్కీలో ప్రధాన నగరాలైన ఇస్తాంబుల్, అంకారాలలో తిరుగుబాటు అనుకూల సైనికులు, ప్రభుత్వ అనుకూల సైనికుల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ ఘర్షణల్లో 17మంది పోలీసు అధికారులు సహా 42 మంది చనిపోయారు. మృతుల్లో పౌరులే అధికంగా ఉన్నారు. ఈ ఘర్షణల్లో తిరుగుబాటు సైనికులదే పైచేయిగా ఉన్నట్టు ప్రాథమిక కథనాలు చాటుతున్నాయి. టర్కీలో సైనిక తిరుగుబాటు లైవ్ అప్ డేట్స్ ఇవి.. టర్కీ పార్లమెంటు భవనం వద్ద రెంబు బాంబు పేళ్లులు, పలువురికి గాయాలు సైనిక తిరుగుబాటుదారుల విమానాన్ని కూల్చేసిన ప్రభుత్వ దళాలు సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి రావాలని ఎర్డోగాన్ పిలుపు.. సైనిక తిరుగుబాటును ధిక్కరిస్తున్న ఎర్డోగాన్ మద్దతుదారులు అంకారాలోని టర్కీ అధ్యక్ష భవనం సమీపంలో బాంబులను విసిరిన జెట్ విమానం టర్కీలో కర్ఫ్యూ, సైనిక పాలన విధించిన మిలిటరీ టర్కీ తీరప్రాంతమైన మార్మారీస్‌కు అధ్యక్షుడు ఎర్డోగాన్ విహాయాత్రకు వెళ్లడంతో ఇదే అదనుగా తిరుగుబాటుకు తెగబడ్డ సైన్యం విహారయాత్ర నుంచి తిరిగొచ్చిన టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌కు ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టులో మద్దతుదారుల ఘనస్వాగతం సైనిక తిరుగుబాటు దేశద్రోహమేనని ప్రకటించిన ఎర్డోగాన్ -
సైన్యంలోని ద్రోహులను ఏరిపారేస్తున్నాం!
అంకరా: తన ప్రభుత్వం కూల్చేందుకు సైన్యం తిరుగుబాటుకు ప్రయత్నించడంపై టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సైనిక తిరుగుబాటులో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరినీ కఠినంగా శిక్షిస్తామని ఆయన హెచ్చరించారు. టర్కీ సైన్యంలోని దేశద్రోహ శక్తులను సమూలంగా ఏరిపారేసే మిషన్ ప్రారంభమైందని ఎర్డోగాన్ తెలిపారు. శనివారం ఉదయం ఇస్తాంబుల్‌లోని అటాటర్క్ విమానాశ్రయం వద్ద మద్దతుదారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆయనను ఓ విమానం ఎయిర్పోర్ట్ వద్ద దిగబెట్టిందని జిన్హుహా వార్తాసంస్థ తెలిపింది. సైనిక తిరుగుబాటుపై టర్కీ ప్రధానమంత్రి బినాలీ యిల్దిరిమ్ కూడా స్పందించారు. ప్రస్తుతం రాజధాని అంకరాలో పరిస్థితి అదుపులోనే ఉందని, తిరుగుబాటుకు దిగిన 120మందిని అదుపులోకి తీసుకున్నామని ప్రధాని తెలిపారు. ప్రధాని ప్రకటన వెలువడిన 15 నిమిషాలకే టర్కీ పార్లమెంటు భవనం బాంబు దాడులతో దద్దరిల్లింది. ఈ దాడుల్లో పలువురు గాయపడ్డట్టు స్థానిక మీడియా తెలిపింది. అంతేకాకుండా అంకరాలో విమానాల రాకపోకలను నిలిపేస్తూ ’నో ప్లై జోన్’ ప్రకటించారు. ఎర్గోగాన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు సైన్యం తిరుగుబాటుకు దిగడంతో ఇప్పటికే 42 మంది ప్రాణాలు కోల్పోయారు. -
ఇస్తాంబుల్‌లో భారీ ఆత్మాహుతి దాడి
-
ఇస్తాంబుల్‌లో భారీ ఆత్మాహుతి దాడి
ఇస్తాంబుల్: ప్రఖ్యాత పర్యాటక ప్రాంతమైన టర్కీలోని ఇస్తాంబుల్ నగరంపై ఉగ్రవాదులు పంజా విసిరారు. ఇస్తాంబుల్‌లో మంగళవారం ఆత్మాహుతి దాడి జరుగడంతో 10 మంది మృతి చెందారు. 15 మంది గాయపడినట్టు సమాచారం. సెంట్రల్ ఇస్తాంబుల్‌లోని చారిత్రక సుల్తాన్హా మెట్ జిల్లాలోని ఓ కూడలి వద్ద సుసైడ్ బాంబర్ తనను తాను పేల్చుకున్నాడు. జనం రద్దీగా ఉన్న ప్రాంతంలో ఈ పేలుడు జరిగినట్టు తెలుస్తోంది. దీంతో పోలీసులు వెంటనే ఈ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. పేలుడు ప్రదేశానికి అంబులెన్సులు తరలించారు. టర్కీలో అత్యంత జనసమ్మర్ద నగరం ఇస్తాంబుల్. ఇక్కడ పర్యాటక ప్రసిద్ధ ప్రాంతంగా పేరొందిన బ్లూ మసీదు, హజియా సోఫియాకు సమీపంలో పేలుడు చోటుచేసుకుంది. పేలుడు ప్రాంతానికి సమీపంలో చారిత్రక స్మృతిచిహ్నమున్న పార్కు కూడా ఉందని స్థానిక టీవీ చానెళ్లు తెలిపాయి. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.