టర్కీ పోదాం... చలో చలో | Tamanna,Vishal movie scheduled to shoot in Turkey | Sakshi
Sakshi News home page

టర్కీ పోదాం... చలో చలో

Published Wed, Mar 27 2019 12:28 AM | Last Updated on Wed, Mar 27 2019 12:28 AM

Tamanna,Vishal movie scheduled to shoot in Turkey - Sakshi

విశాల్, తమన్నా

.... అంటూ బ్యాగ్‌ ప్యాక్‌చేసుకునే పనిలో ఉన్నారట విశాల్‌ అండ్‌ తమన్నా. దాదాపు యాభై రోజులు అక్కడే ఉంటారని కోలీవుడ్‌ టాక్‌. సుందర్‌. సి దర్శకత్వంలో విశాల్, తమన్నా హీరోహీరోయిన్లుగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను టర్కీలో ప్లాన్‌ చేశారట చిత్రబృందం.

అక్కడ జరిగే మేజర్‌ షూటింగ్‌లో రెండు పాటలు, మూడు ఫైట్స్‌తో పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. అలాగే ఈ సినిమాలో మలయాళ నటి ఐశ్వర్యాలక్ష్మీ మరో కథానాయికగా నటిస్తారు. ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తారు. ఇంతకుముందు ‘కత్తిసండై’ అనే సినిమాలో జంటగా కనిపించారు తమన్నా, విశాల్‌. ఇప్పుడు ఈ సినిమాలో మళ్లీ జోడీ కట్టారు. అలాగే ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించనున్న సినిమాలో కూడా తమన్నా, విశాల్‌ జంటగా కనిపించనున్నారని తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement