
విశాల్
విశాల్ చేజింగ్ రాంగ్ ట్రాక్‌లో వెళ్లింది. దీంతో ఆయన గాయపడ్డారు. విశాల్ హీరోగా సుందర్. సి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో తమన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం టర్కీలో జరుగుతోంది. దాదాపు నెల రోజుల పాటు ఈ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. అయితే ఓ యాక్షన్ సన్నివేశంలో భాగంగా విశాల్ నడుపుతున్న ఏటీవీ బైక్ అదుపు తప్పింది. దీంతో విశాల్ గాయపడ్డారు. వెంటనే చిత్రబృందం ఆయనకు చికిత్స చేయించారు అనుకోని ఈ ప్రమాదం వల్ల అనుకున్న సమయానికన్నా ఈ షెడ్యూల్ కాస్త లేట్ కావొచ్చట.
Comments
Please login to add a commentAdd a comment