ఇస్తాన్‌బుల్: ఉత్తర టర్కీలోని బొగ్గు గనిలో జరిగిన భారీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 40కి పెరిగింది. ఇప్పటివరకు 58 మందిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. ఇంకా పదుల సంఖ్యలో కార్మికులు గనిలోనే చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. వారిని బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు.
శుక్రవారం ఈ పేలుడు జరిగినప్పుడు గనిలో 110 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వారిలో సగం మంది 300 అడుగుల లోతులో ఉన్నట్లు పేర్కొన్నారు. అత్యవసర సిబ్బంది రాత్రంతా రెస్కూ ఆపరేషన్ నిర్వహించి గని లోపల ఉన్నవారిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించినట్లు వివరించారు. ఇంకా 15 మంది గనిలోనే చిక్కుకున్నారు. వారికోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వీరి కోసం కుటుంబసభ్యులు గని వద్ద రోదిస్తున్నారు.
అయితే ఈ భారీ పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. బొగ్గు గనులలో పేలుడు మిశ్రమాన్ని ఏర్పరుచుకునే మిథేన్ గ్యాస్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక సమాచారం అందిందని టర్కీ ఇంధన మంత్రి తెలిపారు.
చదవండి: పాకిస్తాన్‌పై బైడెన్ సంచలన వ్యాఖ్యలు... ఆ దేశాలతో ముప్పు
Comments
Please login to add a commentAdd a comment