బీజింగ్: చైనాలోని హెనన్ ప్రావిన్సులోని ఓ అండర్ గ్రౌండ్ బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. బొగ్గు గనిలో సహజంగా ఉత్పత్తయిన గ్యాస్ కారణంగా ఈ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి 10 మంది కార్మికులు మరణించగా మరో ఆరుగురు గల్లంతయ్యారు. ఈ విషయాన్ని చైనా అధికారిక మీడియా సీసీ టీవీ వెల్లడించింది.
పేలుడు జరిగినపుడు బొగ్గుగనిలో 425 మంది కార్మికులు పనిచేస్తున్నారు.పేలుడు తర్వాత బొగ్గుగనిలో అధికారులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. గనుల భద్రతకు సంబంధించి ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఇటీవలి కాలంలో చైనాలోని బొగ్గుగనుల్లో ప్రమాదాలు పెరిగిపోతున్నాయి.
గనులపై ప్రభుత్వానికి సరైన నియంత్రణ లేకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 2022 సంవత్సరంలో చైనా గనుల్లో 168 ప్రమాదాలు జరగగా ఈ ప్రమాదాల్లో మొత్తం 245 మంది మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment