mining accident
-
బండరాళ్ల కింద ముగ్గురు సజీవ సమాధి
సాక్షి ప్రతినిధి, విజయవాడ/కంచికచర్ల/జి.కొండూరు: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం దొనబండ శివారులోని ఓ క్వారీలో పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు సోమవారం ఉదయం డ్రిల్లింగ్ చేస్తుండగా బండరాళ్లు దొర్లిపడటంతో వాటికింద చిక్కుకుపోయి దుర్మరణం పాలయ్యారు. మృతుల్ని బత్తుల దుర్గారావు (19), సున్నా బీబీనాయక్ (40), బాగేల్ రాందేవ్ (36)గా గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. టీడీపీ నాయకుడు చింతల రామ్మోహనరావుకు చెందిన పవన్ గ్రానైట్ మెటల్ వర్క్స్ రాతి క్వారీలో ఒడిశాకు చెందిన బీబీ నాయక్, బాగేల్ రాందేవ్, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం చెరువు మాధవరం గ్రామానికి చెందిన బత్తుల దుర్గారావు బ్లాస్టింగ్ చేసిన బండరాళ్లను తొలగించేందుకు కొండపైకి ఎక్కారు.ఒడిశాకు చెందిన కుమారి బోలీ దిగువన ఉన్న బండరాళ్లను పగులకొట్టేందుకు డ్రిల్లింగ్ చేస్తున్నాడు. పైన ఉన్న రాళ్లను తొలగించే క్రమంలో ఒక్కసారిగా భారీ బండరాళ్లు ముగ్గురిపైనా పడటంతో విగతజీవులుగా పడి ఉన్నారు. బోలీ అనే యువకుడు సురక్షితంగానే ఉన్నాడు. మృతదేహాలను 5 గంటలపాటు శ్రమించి జేసీబీల సాయంతో వెలికితీశారు. క్వారీ యజమాని చింతల రామ్మోహనరావు నిర్లక్ష్యమే కార్మికుల పాటి మృత్యుపాశంగా మారింది. రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నా ఆపకుండా పని చేయించటం ముగ్గురు కార్మికులను మృత్యు ఒడికి చేర్చాయి.ఘటనా స్ధలాన్ని జిల్లా మైనింగ్ ఏడీ వీరాస్వామి, నందిగామ సబ్ డివిజన్ ఏసీపీ బి.రవికిరణ్, నందిగామ ఆర్డీఓ ఎ.రవీంద్రరావు, నందిగామ రూరల్ సీఐ పి.చంద్రశేఖర్, ఇంటెలిజెన్స్ సీఐ యువకుమార్, కంచికచర్ల, వీరులపాడు ఎస్ఐలు పీవీఎస్ సుబ్రహ్మణ్యం, హేమలత, తహసీల్దార్ సుస్వాగతం పరిశీలించారు.సేఫ్టీ నిబంధనలకు తిలోదకాలుప్రమాదం జరిగిన క్వారీలో మైనింగ్ సేఫ్టీ నిబంధనల్ని క్వారీ యజమాని తుంగలో తొక్కారు. ఇష్టారాజ్యంగా మైనింగ్ చేయడంతోనే అక్కడ ప్రమాదం జరిగినట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ముఖ్యంగా క్వారీ ప్రాంతంలో ప్రతి 6 మీటర్లకు బెంచ్ ఫార్మేషన్ చేసుకుని ఎప్పటికప్పుడు లూజును తీసివేయాల్సి ఉండగా.. అక్కడ బెంచ్ ఫార్మేషన్ చేయలేదని గుర్తించారు. మైనింగ్ సేఫ్టీకి సంబంధించి క్వారీలో ఓ మేనేజర్‌ను నియమించాల్సి ఉన్నా అలా చేయలేదు.రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఆ సమయంలో కొండ చరియలు విరగటంతోపాటు, అక్కడ ఉన్న లూజు జారి ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిసినా బోల్డర్లను డ్రిల్లింగ్ చేయటమే ప్రమాదానికి కారణమని గుర్తించారు. కాగా.. క్వారీలపై మైనింగ్ అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 801 సర్వే నంబరులో 99 లీజులు ఉన్నప్పటికీ ఏ క్వారీ యజమాని నిబంధనలు పాటించటం లేదు. క్వారీ యజమానులకు అధికార పార్టీ అండదండలు ఉండటంతోపాటు, అధికారులు సైతం మామూళ్లు తీసుకొని, నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారు. దీంతో మైనింగ్ మాఫియాకు అడ్డు అదుపూ లేకుండాపోయింది.మూడు కుటుంబాల్లో విషాదంమృతుల్లో ఒకరైన బీబీ నాయక్ 15 సంవత్సరాల క్రితం ఒడిశా నుంచి వలస వచ్చి జి.కొండూరు మండలం చెవుటూరు బాపూజీ కాలనీలో భార్య, కుమారుడు, కుమార్తెతో కలిసి నివాసం ఉంటున్నాడు. బాగేల్ రాందేవ్ సైతం ఒడిశా నుంచి 20 ఏళ్ల క్రితం వలస వచ్చి భార్య, కుమార్తెతో చెవు టూరు శివారులోని క్వారీ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. పొట్ట కూటి కోసం క్వారీలలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రెండు కుటుంబాలకు పెద్ద దిక్కు కోల్పోవడంతో వారి జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి. ప్రమాదంలో మృతి చెందిన బత్తుల దుర్గారావు చిన్న వయసులోనే మృత్యువాత పడడంతో చెరువు మాధవరంలో విషాదఛాయలు అలుముకున్నాయి.క్వారీ యజమానిపై కేసు నమోదుక్వారీ యజమాని చింతల రామ్మోహనరావుపై కేసు నమోదు చేసినట్టు నందిగామ రూరల్ సీఐ పి.చంద్రశేఖర్ తెలిపారు. మృతుడు దుర్గారావు తండ్రి చంద్రం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. కాగా.. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.8.50 లక్షల చొప్పున క్వారీ యజమాని అందజేశారు.నా కళ్లెదుటే మరణించారుబీబీ నాయక్, రాందేవ్, దుర్గారావు కొండపైకి వెళ్లి రాళ్లను తొలగించే క్రమంలో పైనుంచి భారీ బండరాళ్లు వారిపై పడ్డాయి. దీంతో రాళ్ల మధ్య ఇరుక్కుపోయారు. నా కళ్లెదుటే ముగ్గురూ మరణించారు. – కుమారి బోలీ, సహ కార్మికుడుభద్రతా చర్యలు చేపట్టకపోవడమే కారణంసర్వే నంబర్ 801లో రెండు హెక్టార్ల రాతి క్వారీని చింతల రామ్మోహనరావు పదేళ్లపాటు లీజుకు పొందారు. మైనింగ్ ప్లాన్, సేప్టీ మెజర్మెంట్స్ లేకపోవటం, బెంచీలు ఏర్పాటు చేయకపోవటం, సిస్టమాటిక్ మెజర్మెంట్స్ లేకపోవటం వల్లే ప్రమాదం జరిగింది. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.– వెంకటేశ్వర్లు, డిప్యూటీ డైరెక్టర్, మైనింగ్ -
బొగ్గు గనిలో పేలుడు ఘటన.. 40కి చేరిన మృతుల సంఖ్య
ఇస్తాన్‌బుల్: ఉత్తర టర్కీలోని బొగ్గు గనిలో జరిగిన భారీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 40కి పెరిగింది. ఇప్పటివరకు 58 మందిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. ఇంకా పదుల సంఖ్యలో కార్మికులు గనిలోనే చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. వారిని బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం ఈ పేలుడు జరిగినప్పుడు గనిలో 110 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వారిలో సగం మంది 300 అడుగుల లోతులో ఉన్నట్లు పేర్కొన్నారు. అత్యవసర సిబ్బంది రాత్రంతా రెస్కూ ఆపరేషన్ నిర్వహించి గని లోపల ఉన్నవారిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించినట్లు వివరించారు. ఇంకా 15 మంది గనిలోనే చిక్కుకున్నారు. వారికోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వీరి కోసం కుటుంబసభ్యులు గని వద్ద రోదిస్తున్నారు. అయితే ఈ భారీ పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. బొగ్గు గనులలో పేలుడు మిశ్రమాన్ని ఏర్పరుచుకునే మిథేన్ గ్యాస్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక సమాచారం అందిందని టర్కీ ఇంధన మంత్రి తెలిపారు. చదవండి: పాకిస్తాన్‌పై బైడెన్ సంచలన వ్యాఖ్యలు... ఆ దేశాలతో ముప్పు -
మైనింగ్ జోన్లో విరిగిపడ్డ కొండ చిరియలు.. 20 మంది కార్మికులు గల్లంతు!
చండీఘడ్: రాష్ట్రంలోని మైనింగ్ జోన్లో శనివారం కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 15 నుంచి 20 మంది ఘటనలో చిక్కుకున్నారు. తోషమ్ బ్లాక్‌లోని దాడం మైనింగ్ జోన్లో జిల్లా యంత్రాంగం రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. హర్యానాలోని భివానీ జిల్లాలో ఉన్న మైనింగ్ ఏరియాలో వాహనాల్లో వేరే ప్రాంతాలకు వెళ్తున్న కార్మికులపై కొండచరియలు విరిగిపడటంతో, వాహనాల్లో కార్మికులందరూ చిక్కుకున్నట్లు సమాచారం. త్వరితగతిన రెస్క్యూ ఆపరేషన్లు, క్షతగాత్రులకు తక్షణ సహాయం అందించడానికి జిల్లా యంత్రాంగంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ట్విటర్ వేదికగా తెలిపారు. సంఘటన స్థలాన్ని పర్యవేక్షించేందుకు వ్యవసాయ శాఖ మంత్రి జేపీ దలాల్ హుటాహుటిన చేరుకున్నారు. ఇప్పటివరకు ముగ్గురుని రక్షించి ఆసుపత్రికి తరలించామని, ఇద్దరు మృతి చెందారని, ప్రమాదంలో చిక్కుకున్నవారిని ప్రాణాలతో కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి మీడియాకు తెలిపారు. కాగా దాడం మైనింగ్ ప్రాంతం, ఖనాక్ పహారీలో మైనింగ్ కార్యకలాపాలు పెద్ద ఎత్తున జరుగుతుండేవి. ఐతే కాలుష్యం కారణంగా నేషనల్ గ్నీన్ ట్రిబ్యునల్ విధించిన రెండు నెలలు నిషేధాన్ని గురువారం ఎత్తివేయగా శుక్రవారం నుంచి మైనింగ్ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. నిషేధం తర్వాత కేవలం ఒక్క రోజులోనే ఇంత పెద్ద ప్రమాదం జరడగంతో తాజా సంఘటన చర్చనీయాంశమైంది. చదవండి: ‘తల్లిదండ్రుల అనుమతి లేకుండా పెళ్లిళ్లు చేసుకోవడం వల్లే’ -
వామ్మో.. కాసిపేట గని
సాక్షి, కాసిపేట(ఆదిలాబాద్) : మందమర్రి ఏరియా కాసిపేట గనిలో మంగళవారం ఉదయం షిప్టులో పైకప్పు కూలింది. ఇలా పైకప్పు కూలడం.. ఐ దురోజుల్లో రెండోసారి. గనిలోని 1వ సీం, 10డీప్, 25 లెవెల్లో పనులు నడుస్తున్నాయి. ఎస్‌డీయల్ యంత్రంతో ఆపరేటర్ బొగ్గు తీసుకొ చ్చేందుకు గనిలోకి వెళ్లాడు. అదే సమయంలో జంక్షన్లో ఉన్న పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. ప్రమాదాన్ని గుర్తించిన పుషర్ కార్మికులు ఇద్దరు అక్కడి నుంచి పరుగెత్తడంతో ప్రాణా లు కాపాడుకున్నట్లయ్యింది. ఎస్‌డీయల్ ఆపరేటర్ లోనికి వెళ్లకున్నా.. ఇద్దరు కార్మికులు ఏ మాత్రం ఆదమరిచి ఉన్నా.. ప్రాణనష్టం సభవించేదని కార్మికులు చర్చించుకుంటున్నారు. 1 వ సీంలో ప్రమాదపు అంచున పనిచేస్తున్నట్లు కార్మికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఐదురోజుల్లో రెండుసార్లు కూలిన పైకప్పు గనిలో 1సీంలో పనులపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 5న 1వ సీం 7 డిప్ అఫ్ 25 లెవెల్ జంక్షన్లో పెద్దమొత్తంలో పైకప్పు కూలింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. అది జరిగిన ఐదు రోజులకే తిరిగి 10 డిప్లో ప్రమాదం జరగడంతో రక్షణ చర్యలు, అధికారులు, యూనియన్ నాయకుల తీరుపై కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 7డిప్లో కూలినట్లు కూలితే తమ ప్రాణాలు దక్కేవి కావని, తక్కువ పరిమాణంలో కూలడంతో బతికిపోయామని కార్మికులు అభిప్రాయపడుతున్నారు. జరిగిన ప్రమాదాలను బయటకు రాకుండా సింగరేణి అధికారులు గోప్యంగా ఉంచడం మినహా రక్షణచర్యలు, కార్మికుల ప్రాణాల గురించి పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. మొదటిసారి జరిగిన ప్రమాదంపై రెండురోజుల క్రితం గనిని సందర్శించిన ఉన్నతాధికారులు.. 1సీం పనులపై ఆగ్రహం వ్యక్తం చేవారు. అయినా గని అధికారుల్లో స్పందన లేకుండాపోయింది. దీంతో మరోసారి పైకప్పు కూలడం చర్చనీయాంశంగా మారింది. బొగ్గును టాప్కు వదలడమే సమస్య? గనిలో రూఫ్బోల్ట్ వేసేక్రమంలో బొగ్గును సైతం టాప్కు వదలడమే సమస్య అనే ఆరోపణలున్నాయి. గతంలో రూఫ్‌టాప్ బండకు వేసేవారు. దీంతో రూఫ్ నుంచి నీరు లీకేజీ అవుతుండడంతో పనిస్థలాల్లో ఎస్‌డీయల్ యంత్రాలు నడవడం కష్టమవుతుందని అధికారులు బొగ్గును టాప్కు వదిలి రూఫ్ వేస్తున్నారు. రూఫ్ టచ్ కావలంటే 10 ఫీట్లు అవసరం కాగా.. గనిలో కేవలం ఆరుఫీట్లు మాత్రమే ఉండటంతో బోల్టు మధ్యలో ఉంటున్నట్లు కార్మికులు చెబుతున్నారు. దీంతో రూఫ్‌కు బొగ్గుకు మధ్యలో ఉండే క్లే కు నీరు వచ్చి తడిసి పైకప్పు కూలుతున్నట్లు తెలుస్తోంది. జంక్షన్లో సక్రమంగా రూఫ్‌బోల్టు వేయడం.. బొగ్గును వదిలి బండకు రూఫ్‌బోల్టు వేస్తెనే కూలకుండా ఉంటుందని కార్మికులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికి 1సీంలో ఐదుసార్లు పైకప్పు కూలినప్పటికీ అధికారుల చర్యల్లో మాత్రం మార్పు రావడంలేదు. ప్రస్తుతం జరిగే ప్రమాదాలు పెద్దవి అయినప్పటికీ ప్రాణనష్టం లేకపోవడంతో అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భయాందోళన మధ్య విధులు నిర్వర్తిస్తున్నామని, ఇలాగే నిర్లక్ష్యం వహిస్తే పెను ప్రమాదం తప్పదని, వెంటనె చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. -
అమెరికాలో గని ప్రమాదం.. ఇద్దరి మృతి
అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో జరిగిన గని ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మరణించగా, 20 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగే సమయానికి కార్మికులంతా భూగర్భంలో ఉన్నట్లు ఔరే కౌంటీ ప్రతినిధి మార్టి విట్మోర్ తెలిపారు. ఇప్పటివరకు ఈ ప్రమాదం విషయంలో వస్తున్నవన్నీ ఊహాగానాలే తప్ప ప్రమాదం ఎలా జరిగింది, దానికి కారణం ఏంటన్నది ఇంతవరకు తెలియలేదన్నారు. మొత్తం కార్మికులంతా ఆ సమయానికి ప్రమాదస్థలంలోనే ఉన్నారని యాజమాన్యం చెప్పిందన్నారు. క్షతగాత్రులలో 20 మందిని ఆస్పత్రులకు తీసుకెళ్లారు. ఇద్దరు తప్ప అందరికీ చికిత్సలు చేసి ఇళ్లకు పంపేసినట్లు ఆమె చెప్పారు. ఏదో పొగ రావడం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోందని స్టార్ మైన్ ఆపరేషన్స్ ప్రాజెక్ట్ మేనేజర్ రోరీ విలియమ్స్ తెలిపారు. పొగలో రసాయనాలు కూడా ఉండటం వల్ల కార్మికులు గాయపడ్డారు.