కొండ చరియలు విరిగిపడ్డ ప్రాంతం
చండీఘడ్: రాష్ట్రంలోని మైనింగ్ జోన్‌లో శనివారం కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 15 నుంచి 20 మంది ఘటనలో చిక్కుకున్నారు. తోషమ్ బ్లాక్‌లోని దాడం మైనింగ్ జోన్‌లో జిల్లా యంత్రాంగం రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. హర్యానాలోని భివానీ జిల్లాలో ఉన్న మైనింగ్ ఏరియాలో వాహనాల్లో వేరే ప్రాంతాలకు వెళ్తున్న కార్మికులపై కొండచరియలు విరిగిపడటంతో, వాహనాల్లో కార్మికులందరూ చిక్కుకున్నట్లు సమాచారం. త్వరితగతిన రెస్క్యూ ఆపరేషన్లు, క్షతగాత్రులకు తక్షణ సహాయం అందించడానికి జిల్లా యంత్రాంగంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ట్విటర్ వేదికగా తెలిపారు. సంఘటన స్థలాన్ని పర్యవేక్షించేందుకు వ్యవసాయ శాఖ మంత్రి జేపీ దలాల్ హుటాహుటిన చేరుకున్నారు. ఇప్పటివరకు ముగ్గురుని రక్షించి ఆసుపత్రికి తరలించామని, ఇద్దరు మృతి చెందారని, ప్రమాదంలో చిక్కుకున్నవారిని ప్రాణాలతో కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి మీడియాకు తెలిపారు.
కాగా దాడం మైనింగ్ ప్రాంతం, ఖనాక్ పహారీలో మైనింగ్ కార్యకలాపాలు పెద్ద ఎత్తున జరుగుతుండేవి. ఐతే కాలుష్యం కారణంగా నేషనల్ గ్నీన్ ట్రిబ్యునల్ విధించిన రెండు నెలలు నిషేధాన్ని గురువారం ఎత్తివేయగా శుక్రవారం నుంచి మైనింగ్ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. నిషేధం తర్వాత కేవలం ఒక్క రోజులోనే ఇంత పెద్ద ప్రమాదం జరడగంతో తాజా సంఘటన చర్చనీయాంశమైంది.
చదవండి: ‘తల్లిదండ్రుల అనుమతి లేకుండా పెళ్లిళ్లు చేసుకోవడం వల్లే’
Comments
Please login to add a commentAdd a comment