environment pollutiion
-
India Environment Report – 2024: హిమగిరులకు పెనుముప్పు!
భారతదేశానికి పెట్టని కోటలాగా రక్షణ కవచంగా ఉన్న సుందర హిమాలయాలు కనుమరుగు కానున్నాయా? భూమిపై ఉష్ణోగ్రతల పెరుగుదలను అడ్డుకోకపోతే కచి్చతంగా ఇదే జరుగుతుందని ఇండియా పర్యావరణ నివేదిక–2024 తేలి్చచెప్పింది. 2100 నాటికి హిమాలయ పర్వతాల్లోని 75 శాతం మంచు కరిగిపోయే ప్రమాదం ఉందని స్పష్టంచేసింది. తద్వారా వరదలు, విపత్తులు సంభవిస్తాయని, పర్యావరణం, జీవజాలం, వృక్షజాతులకు ముప్పు సంభవిస్తుందని వెల్లడించింది. ఆసియాలో 200 కోట్ల మంది తీవ్రంగా ప్రభావితం అవుతారని పేర్కొంది. భూగోళంపై అత్యధికంగా మంచు నిల్వ ఉన్న మూడో అతిపెద్ద ప్రాంతం హిమాలయాలే. కాలుష్యం, ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల ఇక్కడి హిమానీనదాలు(గ్లేసియర్స్) వేగంగా కరిగిపోతున్నాయి. ఎగువ హిమాలయాల్లో ఇప్పటికే మంచు చాలావరకు మాయమైంది. 2013 నుంచి 2022 వరకు ఇండియాలో 44 శాతం ప్రకృతి విపత్తులకు హిమగిరుల్లో మంచు కరగడమే కారణమని ఇండియా పర్యావరణ నివేదిక–2024 వివరించింది. ఉత్తరాది రాష్ట్రాల్లో, ప్రధానంగా హిమాలయ రాష్ట్రాల్లో వరదలు, పెను తుఫాన్లు, కొండ చరియలు విరిగిపడడం వంటి విపత్తులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నట్లు ఈ నివేదిక గణాంకాలను బట్టి స్పష్టమవుతోంది. మనమంతా పర్యావరణ సంక్షోభం అంచున ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు. హిమాలయాల్లో మంచు కరిగిపోతుండడంతో విలువైన వృక్ష సంపద అంతరించిపోతున్నట్లు పలు పరిశోధనల్లో తేలింది. ప్రతి పదేళ్లకు 54 మీటర్ల మేర వృక్షాలు కనుమరుగు అవుతున్నట్లు వెల్లడయ్యింది. నిత్యం మంచుతో గడ్డకట్టుకొని ఉండే ప్రాంతాలు సైతం మాయమవుతున్నాయి. ముఖ్యంగా పశి్చమ భాగంలో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. 2004 నుంచి 2020 వరకు 8,340 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మంచు కరిగింది. అదంతా మైదాన ప్రాంతంగా మారిపోయింది. హిమాలయాల్లో 40 శాతం మంచు ఇప్పటికే కరిగిపోయిందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే 2100 నాటికి 75 శాతం మంచు కనిపించకుండా పోతుందని ఇండియా పర్యావరణ నివేదిక హెచ్చరించింది. ఈ మహావిపత్తును నివారించాలంటే వెంటనే కార్యాచరణ ప్రారంభించాలని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెడ్ డెవలప్మెంట్(ఐసీఐఎంఓడీ) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఇజబెల్లా కొజీల్ సూచించారు. అత్యవసర, నిర్ణయాత్మక కార్యాచరణ అవసరమని పేర్కొన్నారు. హిమాలయ పర్యావరణ, జీవావరణ వ్యవస్థపై కోట్ల మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయని గుర్తుచేశారు. మన ప్రభుత్వాలు చురుగ్గా వ్యవహరించాలని, హిమాలయాలను కాపాడుకోకపోతే మానవాళి మనుగడకు ప్రమాదం తప్పదని స్పష్టం చేశారు. ప్రమాదంలో డూమ్స్ డే గ్లేసియర్ అంటార్కిటికా ఖండం పశి్చమ భాగంలోని డూమ్స్ డే హిమానీనదం(థ్వాయిట్స్ గ్లేసియర్) మనుగడ ముప్పును ఎదుర్కొంటోంది. గత 80 ఏళ్లలో ఏకంగా 50 బిలియన్ టన్నుల మంచును కోల్పోయింది. ప్రస్తుతం 130 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ గ్లేసియర్ క్రమంగా కరిగిపోతోంది. కొత్తగా వచి్చచేరే మంచు కంటే కరిగిపోతున్నదే ఎక్కువ. మరికొన్నేళ్లలో పూర్తిగా అంతమైనా అశ్చర్యం లేదని పరిశోధకులు చెబుతున్నారు. ఇటీవలే ఈ హిమానీనదంపై అధ్యయనం చేశారు. నమూనాలు సేకరించి విశ్లేషించారు. ఎల్–నినో ప్రభావం కారణంగా భూమి వేడెక్కుతుండడంతో డూమ్స్‌డే గ్లేసియర్ కరిగిపోతున్నట్లు గుర్తించారు. ఈ పరిణామం 80 సంత్సరాల క్రితం.. 1940వ దశకంలోనే మొదలైందని, 1970వ దశకంలో వేగం పుంజుకుందని తేల్చారు. అంటార్కిటికా ఖండంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో హమానీనదం కరిగిపోయే రేటు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నట్లు సైంటిస్టులు స్పష్టం చేశారు. పశి్చమ అంటార్కిటికాలో మంచు ఫలకాల స్థిరత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఈ అధ్యయనం తోడ్పడుతుందని భావిస్తున్నారు. డూమ్స్ డే గ్లేసియర్ కీలకమైన ప్రదేశంలో ఉంది. ఇది పూర్తిగా కరిగిపోతే పశి్చమ అంటార్కిటికా నుంచి సముద్రంలోకి మరింత నీరు చేరుతుంది. ఫలితంగా సముద్ర మట్టం 65 సెంటీమీటర్ల వరకు పెరిగే ప్రమాదం ఉంది. అదే జరిగితే లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయి. జల విధ్వంసం తప్పదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మైనింగ్ జోన్లో విరిగిపడ్డ కొండ చిరియలు.. 20 మంది కార్మికులు గల్లంతు!
చండీఘడ్: రాష్ట్రంలోని మైనింగ్ జోన్లో శనివారం కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 15 నుంచి 20 మంది ఘటనలో చిక్కుకున్నారు. తోషమ్ బ్లాక్‌లోని దాడం మైనింగ్ జోన్లో జిల్లా యంత్రాంగం రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. హర్యానాలోని భివానీ జిల్లాలో ఉన్న మైనింగ్ ఏరియాలో వాహనాల్లో వేరే ప్రాంతాలకు వెళ్తున్న కార్మికులపై కొండచరియలు విరిగిపడటంతో, వాహనాల్లో కార్మికులందరూ చిక్కుకున్నట్లు సమాచారం. త్వరితగతిన రెస్క్యూ ఆపరేషన్లు, క్షతగాత్రులకు తక్షణ సహాయం అందించడానికి జిల్లా యంత్రాంగంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ట్విటర్ వేదికగా తెలిపారు. సంఘటన స్థలాన్ని పర్యవేక్షించేందుకు వ్యవసాయ శాఖ మంత్రి జేపీ దలాల్ హుటాహుటిన చేరుకున్నారు. ఇప్పటివరకు ముగ్గురుని రక్షించి ఆసుపత్రికి తరలించామని, ఇద్దరు మృతి చెందారని, ప్రమాదంలో చిక్కుకున్నవారిని ప్రాణాలతో కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి మీడియాకు తెలిపారు. కాగా దాడం మైనింగ్ ప్రాంతం, ఖనాక్ పహారీలో మైనింగ్ కార్యకలాపాలు పెద్ద ఎత్తున జరుగుతుండేవి. ఐతే కాలుష్యం కారణంగా నేషనల్ గ్నీన్ ట్రిబ్యునల్ విధించిన రెండు నెలలు నిషేధాన్ని గురువారం ఎత్తివేయగా శుక్రవారం నుంచి మైనింగ్ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. నిషేధం తర్వాత కేవలం ఒక్క రోజులోనే ఇంత పెద్ద ప్రమాదం జరడగంతో తాజా సంఘటన చర్చనీయాంశమైంది. చదవండి: ‘తల్లిదండ్రుల అనుమతి లేకుండా పెళ్లిళ్లు చేసుకోవడం వల్లే’ -
ఢిల్లీకి మళ్లీ కాలుష్యం కాటు
సాక్షి, న్యూఢిల్లీ: వాయు కాలుష్యం దుప్పట్లో దేశ రాజధాని ఢిల్లీ ముసుగేసుకుంది. గాలిలో నాణ్యతా ప్రమాణాలు ప్రమాదకరమైన స్థితికి దిగజారి పోయాయి. గురువారం రాత్రికి రాత్రే వాయు కాలుష్య సూచి 50 పాయింట్లు పెరిగిపోయి 459కి చేరుకుంది. శుక్రవారం రికార్డు స్థాయిలో 599కి చేరుకోవడంతో ఢిల్లీలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకంలో ఏర్పడిన పర్యావరణ కాలుష్య నివారణ, నియంత్రణ మండలి (ఈపీసీఏ) వాయు కాలుష్య సూచీ అత్యంత తీవ్రమైన స్థితికి చేరుకుందని వెల్లడించింది. గత ఏడాది జనవరి తర్వాత గాలిలో నాణ్యతా ప్రమాణాలు ఈ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. పొరుగు రాష్ట్రాల్లో పంటల వ్యర్థాలను కాల్చడం, దీపావళి పండుగ సమయంలో బాణాసంచా పేలుళ్లు, పరిశ్రమలు, వాహన కాలుష్యాలతో రాజధాని ఒక గ్యాస్ చాంబర్‌లా మారిపోయింది. దీంతో ఢిల్లీ పీసీఏ, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పలు చర్యలు ప్రకటించారు. అందులో ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి కూడా ఉంది. ఢిల్లీలో వాయు నాణ్యతను పర్యవేక్షించే 37 స్టేషన్లలో శుక్రవారం తెల్లవారుజాము సమయానికి ప్రమాదకరమైన సూచికలే కనిపించాయి. పొరుగు రాష్ట్రాలదే బాధ్యత: కేజ్రీవాల్ పంజాబ్, హరియాణాలో పంట వ్యర్థాల్ని ఇష్టారాజ్యంగా కాల్చడం వల్లే ఢిల్లీ గ్యాస్ చాంబర్‌లా మారిపోయిందని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మండిపడ్డారు. కాలుష్యం తీవ్రతరం కావడంతో పాఠశాలల పిల్లలకు మాస్క్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాలుష్య నివారణకు చర్యలు తీసుకునేలా మా ఆరోగ్యం గురించి కూడా ఆలోచించండి అంకుల్ అంటూ హరియాణా సీఎంలు అమరీందర్ సింగ్, మనోహర్‌లాల్ ఖట్టర్‌లను ఉద్దేశించి పిల్లలంతా లేఖలు రాయాలని సూచించారు. ఢిల్లీ ప్రభుత్వం మొత్తంగా 50 లక్షల మాస్క్‌లను పంపిణీ చేస్తోంది. మాస్క్ లేకుండా బయటకు రావద్దని రాజధాని వాసులను సీఎం కోరారు. ఢిల్లీలో గాలి నాణ్యతా సూచీ (కాలుష్యం) పాయింట్లు ఎంత ఎక్కువగా ఉన్నాయో చెప్తూ జర్నలిస్ట్ విక్రమ్ చంద్ర ట్వీట్ చేసిన ఫొటో ఇది. -
త్రీ ఇన్ వన్... స్తంభం
ఒక్క దెబ్బకు మూడు పిట్టలంటే... ఇదే. పర్యావరణ కాలుష్యం తగ్గించాలని అందరూ అనుకుంటున్నారా! ఇంకోపక్క విద్యుత్తుతో నడిచే కార్లు, మోటర్‌బైక్‌ల వాడకమూ కొద్దోగొప్పో పెరుగుతోందా! త్రీజీ, 4జీల అవసరమూ ఎక్కువవుతోందా! అవునండీ అవును... అన్నీ నిజమే. కానీ, ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటున్నారా? అక్కడికే వస్తున్నాం. ఒక్క దెబ్బకు మూడు పిట్టలంటే... ఇదే. పర్యావరణ కాలుష్యం తగ్గించాలని అందరూ అనుకుంటున్నారా! ఇంకోపక్క విద్యుత్తుతో నడిచే కార్లు, మోటర్‌బైక్‌ల వాడకమూ కొద్దోగొప్పో పెరుగుతోందా! త్రీజీ, 4జీల అవసరమూ ఎక్కువవుతోందా! అవునండీ అవును... అన్నీ నిజమే. కానీ, ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటున్నారా? అక్కడికే వస్తున్నాం. నగరాల్లో ఈ మూడు చిక్కుముళ్లను ఠక్కున విడదీసేందుకు మా స్తంభాల్ని వాడండి అంటోంది న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ టోటెమ్! పక్క ఫొటోలో కనిపిస్తున్నవి అవే. ఏంటి దీని ప్రత్యేకత అంటే... స్తంభం పైభాగంలో పువ్వుల రేకుల్లాంటి షేపుంది చూశారూ.... వాటిపైన సోలార్ ప్యానెల్స్ ఉంటాయి. వాటి అడుగున ఉన్న ప్లేస్‌లో శక్తిమంతమైన ఎల్ఈడీ లైట్లు ఉంటాయన్నమాట. సోలార్ ప్యానెల్స్ ఉత్పత్తి చేసే విద్యుత్తుతో ఇవి పనిచేస్తాయి. మొత్తం 5 కిలోవాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయగల ప్యానెల్స్ ఉన్నాయి. అవసరానికి మించి విద్యుత్తు ఉత్పత్తి అయ్యిందనుకోండి. దాన్ని కాస్తా స్తంభం లోపల ఉండే 50 కిలోవాట్ల సామర్థ్యమున్న బ్యాటరీల్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇంతే కాదు... ఈ ప్రాంతంలోనే త్రీజీ, 4జీ ఇంటర్నెట్ మొబైల్ సేవలు అందించే పరికరాలను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే... వీధి దీపాలుగా, బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్లుగా, వై–ఫై, మొబైల్ టవర్లుగా ఈ స్తంభాలు పనిచేస్తా యన్నమాట. ఒక్కో స్తంభం నుంచి రెండు విద్యుత్ వాహనాల్ని ఛార్జ్ చేసుకునే వీలుందని కంపెనీ చెబుతోంది. ఎల్ఈడీ లైటింగ్ విషయానికొస్తే ఇందులో ఏర్పాటు చేసిన లైటింగ్ సెన్సర్ల కారణంగా వీధి దీపాలను ఆన్/ఆఫ్ చేయడం ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. చీకటిపడ్డా... లేదంటే మేఘాల కారణంగా వెలుతురు తగ్గినా... ఈ సెన్సర్లు గుర్తించి లైట్లు ఆన్ చేసేస్తాయి. వెలుతురు పెరిగినప్పుడు ఆఫ్ చేస్తాయి కూడా!