త్రీ ఇన్ వన్... స్తంభం
ఒక్క దెబ్బకు మూడు పిట్టలంటే... ఇదే. పర్యావరణ కాలుష్యం తగ్గించాలని అందరూ అనుకుంటున్నారా! ఇంకోపక్క విద్యుత్తుతో నడిచే కార్లు, మోటర్‌బైక్‌ల వాడకమూ కొద్దోగొప్పో పెరుగుతోందా! త్రీజీ, 4జీల అవసరమూ ఎక్కువవుతోందా! అవునండీ అవును... అన్నీ నిజమే. కానీ, ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటున్నారా? అక్కడికే వస్తున్నాం.

నగరాల్లో ఈ మూడు చిక్కుముళ్లను ఠక్కున విడదీసేందుకు మా స్తంభాల్ని వాడండి అంటోంది న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ టోటెమ్! పక్క ఫొటోలో కనిపిస్తున్నవి అవే. ఏంటి దీని ప్రత్యేకత అంటే... స్తంభం పైభాగంలో పువ్వుల రేకుల్లాంటి షేపుంది చూశారూ.... వాటిపైన సోలార్ ప్యానెల్స్ ఉంటాయి. వాటి అడుగున ఉన్న ప్లేస్‌లో శక్తిమంతమైన ఎల్‌ఈడీ లైట్లు ఉంటాయన్నమాట. సోలార్ ప్యానెల్స్ ఉత్పత్తి చేసే విద్యుత్తుతో ఇవి పనిచేస్తాయి. మొత్తం 5 కిలోవాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయగల ప్యానెల్స్ ఉన్నాయి. అవసరానికి మించి విద్యుత్తు ఉత్పత్తి అయ్యిందనుకోండి. దాన్ని కాస్తా స్తంభం లోపల ఉండే 50 కిలోవాట్ల సామర్థ్యమున్న బ్యాటరీల్లో స్టోర్ చేసుకోవచ్చు.
ఇంతే కాదు... ఈ ప్రాంతంలోనే త్రీజీ, 4జీ ఇంటర్నెట్ మొబైల్ సేవలు అందించే పరికరాలను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే... వీధి దీపాలుగా, బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్లుగా, వై–ఫై, మొబైల్ టవర్లుగా ఈ స్తంభాలు పనిచేస్తా యన్నమాట. ఒక్కో స్తంభం నుంచి రెండు విద్యుత్ వాహనాల్ని ఛార్జ్ చేసుకునే వీలుందని కంపెనీ చెబుతోంది. ఎల్‌ఈడీ లైటింగ్ విషయానికొస్తే ఇందులో ఏర్పాటు చేసిన లైటింగ్ సెన్సర్ల కారణంగా వీధి దీపాలను ఆన్/ఆఫ్ చేయడం ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. చీకటిపడ్డా... లేదంటే మేఘాల కారణంగా వెలుతురు తగ్గినా... ఈ సెన్సర్లు గుర్తించి లైట్లు ఆన్ చేసేస్తాయి. వెలుతురు పెరిగినప్పుడు ఆఫ్ చేస్తాయి కూడా!