
జీహెచ్‌ఎంసీ కమిషనర్, జలమండలి ఎండీ దాన కిషోర్
సాక్షి, హైదరాబాద్ : విద్యుత్ బిల్లుల తగ్గింపు అమలు చేస్తే జలమండలికి భారం తగ్గుతుందని జీహెచ్‌ఎంసీ కమిషనర్, జలమండలి ఎండీ దాన కిషోర్ అన్నారు. గురువారం జలమండలిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గణేష్ నిమజ్జనం, మొహరం సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. రూపాయి కనెక్షన్‌లు 35వేలు ఇచ్చామని, కనెక్షన్లు ఇవ్వటం ప్రస్తుతం ఆపేశామని తెలిపారు. పైపులైన్ వేయడానికి జీహెచ్‌ఎంసీ పర్మీషన్ అపేసిందని అన్నారు. అక్టోబర్ నుంచి మళ్లీ కనెక్షన్‌లను ఇస్తామని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న183 గ్రామాలకు జలమండలి ద్వారా నిరందిస్తామని చెప్పారు.
తద్వారా జలమండలికి 128 లక్షల రూపాయలు ఆదాయం వస్తోందని అన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు వేస్తున్నామని పేర్కొన్నారు. కొన్నిచోట్ల భూవివాదాలు ఉన్నాయని, వాటి పరిష్కారం కోసం ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. అక్రమ నల్లా కనెక్షన్లపై విజిలెన్స్ దాడులు కొనసాగుతున్నాయని అన్నారు. ఇప్పటికే కేసులు బుక్ చేశామని తెలిపారు. కమర్షియల్ కనెక్షన్లపై దృష్టి పెట్టామని అన్నారు. 30 నుంచి 40 శాతానికి ట్యాంకర్లను తగ్గించామన్నారు. కేశవ పూర్ రిజర్వాయర్ టెండర్ పూర్తయిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment