
సాక్షి, సికింద్రాబాద్: స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో పెద్దఎత్తున మంటలు చెలరేగి ఊపిరాడక ఆరుగురు మృతిచెందారు. కాగా, ఈ ఘటనపై నేడు(సోమవారం) తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టనుంది.
కాగా, ప్రమాద తీవ్రత, కారణాలను విశ్లేషిస్తూ పత్రికల్లో ప్రచురితమైన కథనాలపై హైకోర్టు సుమోటోగా స్పందించింది. ప్రతివాదులుగా సీఎస్, జీహెచ్‌ఎంసీ కమిషనర్, డీజీపీ, హైదరాబాద్ సీపీ, అగ్నిమాపక శాఖ డీజీలతో పాటుగా 12 మందిని చేర్చింది. దీనిపై నివేదిక ఇవ్వాలని వారిని కొరింది. అయితే, మార్చి 16వ తేదీన ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మరణించిన వారికి 3 లక్షల ఎక్స్‌గ్రేషియాను సీఎం కేసీఆర్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment