Swapnalok complex
-
స్వప్నలోక్ ప్రమాదం: నేడు హైకోర్టులో విచారణ.. సీఎస్ ఏం చెబుతారు?
సాక్షి, సికింద్రాబాద్: స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో పెద్దఎత్తున మంటలు చెలరేగి ఊపిరాడక ఆరుగురు మృతిచెందారు. కాగా, ఈ ఘటనపై నేడు(సోమవారం) తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టనుంది. కాగా, ప్రమాద తీవ్రత, కారణాలను విశ్లేషిస్తూ పత్రికల్లో ప్రచురితమైన కథనాలపై హైకోర్టు సుమోటోగా స్పందించింది. ప్రతివాదులుగా సీఎస్, జీహెచ్ఎంసీ కమిషనర్, డీజీపీ, హైదరాబాద్ సీపీ, అగ్నిమాపక శాఖ డీజీలతో పాటుగా 12 మందిని చేర్చింది. దీనిపై నివేదిక ఇవ్వాలని వారిని కొరింది. అయితే, మార్చి 16వ తేదీన ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మరణించిన వారికి 3 లక్షల ఎక్స్‌గ్రేషియాను సీఎం కేసీఆర్ ప్రకటించారు. -
స్వప్నలోక్ ప్రమాదం.. ‘క్యూ–నెట్’పై క్రిమినల్ కేసు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న స్వప్నలోక్ కాంప్లెక్స్‌లోని క్యూ–నెట్ సంస్థ చీకటి దందా మరోసారి తెరపైకి తెచ్చింది. ఆ దుర్ఘటనలో చనిపోయిన ఆరుగురు యువతీయువకులూ మల్టీ లెవల్ మార్కెటింగ్‌కు పాల్పడుతున్న ఈ సంస్థ ఉద్యోగులే. ఫైర్ యాక్సిడెంట్ జరిగిన మర్నాటి నుంచి దీనిపై పోలీసులు దృష్టి పెట్టారు. మాదసి నవీన్ అనే బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మహంకాళి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. స్వప్నలోక్ కాంప్లెక్స్‌లోని ఐదో అంతస్తులో ఉన్న క్యూ–నెట్–విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కార్యాలయం కొనసాగుతోంది. ‘వి–ఎంపైర్’పేరుతోనూ కొనసాగుతున్న ఈ సంస్థలో అనేక మంది పని చేస్తున్నారు. ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకే విక్రయించడం పేరుతో క్యూ–నెట్ సంస్థ మల్టీ లెవల్ మార్కెటింగ్, మనీ సర్క్యులేషన్స్కు తెరలేపడంపై గతంలో సీఐడీ సహా అనేక ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. దాంతో కొన్నాళ్లు మిన్నకుండిపోయిన ఈ సంస్థ ఇటీవలే మళ్లీ తమ కార్యకలాపాలను ప్రారంభించింది. వెస్ట్ మారేడ్‌పల్లి ప్రాంతంలో నివసిస్తున్న వరంగల్ వాసి మాదసి నవీన్, స్వప్నలోక్ అగ్ని ప్రమాదంలో చనిపోయిన బానోత్ శ్రావణి స్నేహితులు. శ్రావణి ద్వారానే నవీన్‌కు ‘వి–ఎంపైర్’సంస్థ కార్యకలాపాలు తెలిశాయి. తమ సంస్థలో చేరితే ప్రతి నెలా రూ.15 వేల నుంచి రూ.60 వేల వరకు ఆర్జించవచ్చని ఆమె చెప్పడంతో నవీన్ గతేడాది ఆక్టోబర్‌లో ‘వి–ఎంపైర్’లో చేరాడు. రూ.1.6 లక్షలు చెల్లించి సభ్యత్వం తీసుకున్న అతనికి ఇద్దరు సభ్యులను చేరిస్తే కమీషన్ల రూపంలో నగదు వస్తుందని సూచించారు. కానీ ఇప్పటివరకు రూపాయి కూడా చెల్లించలేదు. ఈ సంస్థలో చేరాకే నవీన్‌కు వి–ఎంపైర్ అన్నది మలేసియాకు చెందిన క్యూ–నెట్లో భాగమని తెలిసింది. ఇక్కడ విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి కార్యకలాపాలు సాగిస్తోందని తెలుసుకున్నాడు. నిషిద్ధ మనీ సర్క్యులేషన్, మల్టీ లెవల్ మార్కెటింగ్ దందాలు చేస్తున్న ఈ సంస్థను బెంగళూరుకు చెందిన రాజేష్ ఖన్న నిర్వహిస్తున్నాడని నవీన్ గుర్తించాడు. -
‘స్వప్నలోక్’ అగ్నిప్రమాద ఘటన: క్యూనెట్ పాత్రపై సమగ్ర విచారణ జరపాలి
హైదరాబాద్: సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాద ఘటనలో దుర్మార్గపు సంస్థ క్యూనెట్ పాత్రపై సమగ్ర విచారణ జరపాలని సీనియర్ ఐపీఎస్ అధికారి, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అన్నారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి.. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. మోసపూరిత సంస్థల కదలికలపై లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ నిఘా పెట్టాలని చెప్పారు. స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాదంలో క్యూనెట్‌లో పనిచేస్తోన్న ఆరుగురు యువతీ యువకులు మరణించడంపై సజ్జనర్ స్పందించారు. ''స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం జరగడం బాధాకరం. ఈ దుర్ఘటనలో మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ఆరుగురు యువతీయువకులు మృతి చెందడం కలిచివేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. వారి కుటుంబసభ్యులకు ఎల్లవేలలా అండగా నిలుస్తాం." అని సజ్జనర్ అన్నారు. భారీ డబ్బును ఆశచూపి అమాయకులను మోసం చేస్తోన్న క్యూనెట్ బాగోతం ఈ అగ్నిప్రమాదంతో మరోసారి బయటపడిందన్నారు. క్యూనెట్ అమాయకులైన ఆరుగురిని పొట్టనబెట్టుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ కాంప్లెక్స్‌లో బీఎం5 సంస్థ పేరిట కాల్ సెంటర్ నిర్వహిస్తూ తెరవెనక క్యూనెట్ ఎంఎల్ఎం దందా సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని చెప్పారు. దాదాపు 40 మందికిపైగా యువతీయువకులు అక్కడ పనిచేస్తున్నట్లు తెలుస్తోందన్నారు. క్యూనెట్ ఏజెంట్లు ఒక్కొక్కరి దగ్గరి నుంచి రూ.1.50-3 లక్షలు కట్టించుకున్నట్లు మృతుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారని పేర్కొన్నారు. మోసపూరిత క్యూనెట్ పై అనేక కేసులు నమోదు చేసిన, ఈడీ ఆస్తులను జప్తు చేసిన దాని తీరు మారడం లేదన్నారు. ''యువతీయువకుల్లారా! అధిక డబ్బుకు ఆశపడి క్యూనెట్ లాంటి మోసపూరిత ఎంఎల్ఎం సంస్థల మాయలో పడకండి. మీ బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోకండి. ఎంఎల్ఎం సంస్థలు అరచేతిలో వైకుఠం చూపిస్తూ యువతను ఆకర్షిస్తూ బుట్టలో వేసుకుంటున్నాయి. జాగ్రత్తగా ఉండండి.'' అని సజ్జనర్ సూచించారు. మోసపూరిత సంస్థల విషయంలో భవన యాజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆ సంస్థ మోసపూరితమైందా? కాదా? అని ఒక్కటికి ఒక్కటికి రెండు సార్లు నిర్ధారించుకుని అద్దెకివ్వాలని సూచించారు. అధిక అద్దెకు ఆశపడి ఇలాంటి మోసాలకు బాధ్యులు కావొద్దని సజ్జనర్ హితవు పలికారు. #Hyderabad కొండాపూర్ లోని 8వ బెటాలియన్ లో #TSRTC కి చెందిన 166 మంది కానిస్టేబుళ్ల శిక్షణ ముగింపు కార్యక్రమం ఆదివారం సందడిగా జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది. @tsspbnshq @Govardhan_MLA @DrSangramsingh3 pic.twitter.com/GjUbDkNajg — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) March 19, 2023 -
సికింద్రాబాద్ జోన్లోనే వరుస అగ్ని ప్రమాదాలు.. ఇంకెన్నాళ్లు?
సాక్షి, హైదరాబాద్: బోయగూడలోని తుక్కు దుకాణం 11 మందిని పొట్టన పెట్టుకుంది. రూబీలాడ్జి ఎనిమిది మంది ఉసురు తీసింది. మినిస్టర్స్ రోడ్‌లోని డెక్కన్ కార్పొరేట్ భవనంలో ముగ్గురు మృతి చెందారు. తాజాగా స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో ఆరుగురు చనిపోయారు. ఇలా నగరంలో నిత్యం ఏదో ఒక చోట అగ్ని ప్రమాదం వెలుగు చూస్తూనే ఉంది. ఎవరో ఒకరు కాలిబూడదవుతూనే ఉన్నారు. సికింద్రాబాద్ జోన్ కేంద్రంగా ఇటీవల వరుస అగ్ని ప్రమాదాలు వెలుగు చూస్తుండటం..పొట్ట చేతపట్టుకుని ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వలస వచ్చిన కార్మికులు, కూలీలు, ఈ అగ్ని ప్రమాదాల్లో చిక్కుకుని మృత్యువాతపడుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ఇంకెన్ని ఘటనలు వెలుగు చూడాలి? ఇంకెంత మంది బతుకులు కూలాలి? అంటూ సిటీజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్వహణ లోపం వల్లే షార్ట్సర్క్యూట్లు 40 ఏళ్ల క్రితం 8 అంతస్తులతో స్వప్నలోక్ కాంప్లెక్స్‌ను నిర్మించారు. ఈ భవనంలో విద్యుత్ లైన్ల నిర్వహణ లోపం కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. ఏళ్ల క్రితం అమర్చిన విద్యుత్ లైన్లే ఇప్పటికీ వాడుతున్నారు. అప్పట్లో పెద్దగా విద్యుత్ వినియోగం ఉండేది కాదు. కేవలం లైట్లు, ఫ్యాన్ల వినియోగం సామర్థ్యం మేరకే కేబుళ్లు వేశారు. తర్వాత క్రమంగా విద్యుత్ వినియోగం రెట్టింపైంది. కానీ దీనికి తగ్గట్లుగా బిల్డింగ్ విద్యుత్ లైన్ల వ్యవస్థలో మార్పులు చేయలేదు. మచ్చుకు కొన్ని ప్రమాదాలు ►ఉస్మాన్‌గంజ్‌లోని కార్తికేయ లాడ్జి గ్రౌండ్ ఫ్లోర్లో శాంతి ఫైర్స్ వర్క్స్ ఉండేది. అప్పట్లో అక్కడ పెద్ద మొత్తంలో బాణసంచాను నిల్వ చేశారు. 2002లో అక్టోబర్ 23న తెల్లవారు జామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకుంది. అప్పటికే లాడ్జిలో 32 మంది నిద్రలో ఉండగా, వీరిలో 12 మంది అగ్నికీలల్లో చిక్కుకుని మృత్యువాతపడ్డారు. ►సికింద్రాబాద్ రూబీ లాడ్జిలో ఇటీవల అగ్ని ప్రమాదం వెలుగు చూసింది. సెల్లార్లో ఉన్న ఎలక్ట్రికల్ బైక్స్ షోరూమ్‌లో షార్ట్‌సర్క్యూట్ తలెత్తి..పైన లాడ్జిలో ఉన్న 12 మంది మృతి చెందగా, మరో పదిమంది క్షతగాత్రులయ్యారు. ►2018లో ఎల్బీనగర్లోని షైన్ చిల్డ్రన్స్ ఆస్పత్రిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఐసీయూల్లోని ఫొటో థెరపీ యూనిట్లపై చికిత్స పొందుతున్న ఐదుగురు చిన్నారులు కాలిబూడిదయ్యారు. ► 2022 మార్చి 23న న్యూ బోయగూడలోని శ్రావణ్ ట్రేడర్స్ పేరుతో ఉన్న ఓ స్క్రాప్ దుకాణంలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం వెలుగు చూసింది. 11 మంది మృత్యువాతపడ్డారు. ► ఇటీవల డెక్కన్ మాల్లో వెలుగు చూసిన అగ్నిప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. ఈ ఘటన తర్వాత అధికారులు ఆగమేఘాల మీద టాస్‌్కఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. రెండు మీటింగ్‌లకు మాత్రమే కమిటీ పరిమితమైంది. ►2017 ఫిబ్రవరి 24న అత్తాపూర్‌లోని ఫిల్లర్ నంబర్ 253 సమీపంలో ఉన్న కూలర్ల తయారీ పరిశ్రమలో అగి్నప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒరిస్సాకు చెందిన ఆరుగురు మృతి చెందారు. ► 2012 నవంబర్ 24న పుప్పాల్‌గూడలోని బాబానివాస్ అపార్ట్మెంట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది చనిపోయారు. ►2006 అక్టోబర్ 21న సోమాజిగూడలోని మీన జ్యూవెలర్స్ భవనం సెల్లార్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పెయింటింగ్ పనుల కోసం వచ్చిన ముగ్గురు చనిపోయారు. ►పురాతన సికింద్రాబాద్ క్లబ్ సహా అనురాధ టింబర్ డిపోల్లో వెలుగు చూసిన అగ్ని ప్రమాదాలకు కూడా ఈ షార్ట్షర్క్యూట్లే కారణమని తెలిసింది. అయితే ఆయా ఘటనల్లో ప్రాణనష్టం లేకపోయినప్పటికీ.. భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. -
జీవితంలో స్థిరపడేలోపే... నిండు ప్రాణాల్ని మింగేసిన అగ్గి
సాక్షి, వరంగల్: సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో గురువారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఐదుగురు అగి్నకి ఆహుతి అయ్యారు. వరంగల్ జిల్లాకు చెందిన ముగ్గురు.. శ్రావణి (22)...వెన్నెల (22), శివ(22) ఉండగా, మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు. ప్రశాంత్(23), ప్రమీల (23)) ఉన్నారు. మృత్యువాతపడిన ముగ్గురు యువతులకు త్వరలో పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. కానీ తాము జీవితంలో స్థిరపడ్డాక చేసుకుంటామని తల్లిదండ్రులకు చెబుతూ వస్తున్నారు. ఇంతలోనే ఘోరం జరిగి అనంతలోకాలకు వెళ్లారు. కట్నం ఖర్చులు.. సంపాదించిన తర్వాతే పెళ్లంది.. ఇంతలోపే వరంగల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రానికి చెందిన బానోతు నరసింహ, పద్మ కుమార్తె బానోతు శ్రావణి (22) బీటెక్ పూర్తి చేసింది. ఆరు నెలల క్రితం స్వప్నలోక్ కాంప్లెక్స్‌లోని ఓ కంపెనీ కాల్ సెంటర్లో ఉద్యోగం సాధించింది. తల్లిదండ్రులు హైదరాబాద్‌లోనే ఓ హోటల్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పెళ్లి చేస్తామని తల్లిదండ్రులు అంటుండగా ఉద్యోగం చేసి తన కట్నం డబ్బులు సంపాదించి.. జీవితంలో సిరపడ్డాక చేసుకుంటానని చెబుతూ వచి్చంది. కానీ అగ్నిప్రమాదం శ్రావణిని మధ్యలోనే బలితీసుకుంది. కుటుంబానికి ఆసరాగా నిలుస్తుందనుకున్న త్రివేణి మృతితో ఖానాపురంలోని టేకుల తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. వచ్చే ఏడాది పెళ్లి చేద్దామనుకున్నారు.. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన వంగ రవి, లక్ష్మి దంపతులు కుమార్తె వెన్నెల(22)కు వచ్చే ఏడాది పెళ్లి చేద్దామనుకున్నారు. డిగ్రీ వరకు చదివిన వెన్నల స్వప్నలోక్ కాంప్లెక్స్‌లోని ఈ కామర్స్ సెంటర్లో ఉద్యోగం చేస్తోంది. వచ్చే ఏడాది మేనల్లుడికి వెన్నెలను ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకున్నామని, అంతలోనే మాయమైపోయిందని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. సంబంధాలు చూస్తున్నారు.. అంతలోనే. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఎర్రకుంటతండా శివారు సురే‹Ùనగర్‌కు చెందిన జాటోతు భద్రు, బుజ్జిల కూతురు ప్రమీల (23) స్వప్నలోక్ కాంప్లెక్స్‌లోని క్యూ నెట్ అనే కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఏడాదినుంచి కూతురును పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులు అడుగుతున్నారు. ఈ ఏడాది చేసుకుంటా అని చెప్పడంతో తల్లిదండ్రులు సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఘోరం జరిగిపోయింది. నిన్ను చూడబుద్ది అయితంది కొడుకా.. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన ఉప్పుల రాజు, రజిత దంపతుల కుమారుడు శివ (22) మూడేళ్ల క్రితం మలి్టలెవల్ మార్కెటింగ్ (ఈకామర్స్ బిజినెస్)లో చేరాడు. ఉద్యోగం చేస్తూనే బీటెక్ చదువుతున్నాడు. ఈ నెల 15న చెల్లి సింధు బర్త్ డే కావడంతో సాయంత్రం ఇంటికి ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పాడు. ‘నిన్ను చూడబుద్ది అయితంది బిడ్డా...జర వీడియో కాల్ చేయరాదూ’ అని తల్లి రజిత అనడంతో కాస్త ఫ్రీ కాగానే చేస్తానని అన్న మాటలే చివరి పలుకులు అయ్యాయంటూ బోరున విలపించింది. నెల క్రితమే ఉద్యోగంలో చేరిక.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇంటికన్నె గ్రామానికి చెందిన అమరాజు జనార్దన్, ఉపేంద్రల కుమారుడు ప్రశాంత్(23) నెల క్రితమే రూ.2.60 లక్షలు ఇచ్చి స్వప్నలోక్లోని ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ప్రశాంత్ మరణవార్త తెలియడంతో తల్లిదండ్రులు విలపించారు. ‘గురువారం సాయంత్రం ఫోన్ చేసి మాట్లాడాడు. రాత్రి పదింటికి మేము ఫోన్ చేస్తే కలవలేదు’ అని తల్లి ఉపేంద్ర విలపిస్తూ చెప్పింది. కాగా, తన స్నేహితులు కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ప్రయతి్నస్తుండగా, ప్రశాంత్ తన ఉద్యోగం వదిలిపెట్టి రెండునెలల పాటు, గ్రామంలోనే ఉంటూ, వారికి కోచింగ్ ఇచ్చాడని గుర్తు చేసుకున్నారు. చదవండి: హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం -
ఎలక్ట్రిక్ డక్ట్‌లో షార్ట్ సర్క్యూట్.. స్వప్నలోక్ అగ్నిప్రమాదానికి కారణమిదే..
సాక్షి, హైదరాబాద్/రామ్‌గోపాల్‌పేట: సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో గురువారం రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదానికి ఎలక్ట్రిక్ వైర్లకు సంబంధించిన డక్ట్‌లో షార్ట్ సర్క్యూటే కారణమని అగి్నమాపక శాఖ అధికారులు తేల్చారు. ఈ మంటలు ఐదో ఫ్లోర్లో బయటకు వచ్చి ఆరు, ఏడు ఆంతస్తులకు వ్యాపించినట్లుగా ఆధారాలు లభించాయి. ఈ ప్రమాదంలో మరణించిన ఆరుగురూ ఒకే కార్యాలయంలో పని చేస్తున్నారని, మంటలకు భయపడి బయటకు రాలేక ప్రాణాలు పోగొట్టుకున్నారని నిర్ధారించారు. శుక్రవారం పోలీసులు, క్లూస్‌టీమ్స్ కాంప్లెక్స్‌లో తనిఖీలు చేసి ఆధారాలు సేకరించాయి. అగి్నమాపక శాఖ డీజీ వై.నాగిరెడ్డి కూడా ఘటనా స్థలాన్ని సందర్శించారు. డక్ట్ నుంచి పైకి వ్యాప్తి.. ఎలక్ట్రిక్ వైర్ల డక్ట్‌లో మొదలైన మంటలు నాలుగో ఫ్లోర్ వరకు లోలోపలే విస్తరించాయి. ఐదో ఫ్లోర్లో డక్ట్ తెరిచి ఉండటంతో పక్కనే ఉన్న ఫ్లాట్ నం.510, 511ల్లో ఉన్న కేడియా ఇన్ఫోటెక్ లిమిటెడ్ అండ్ వికాస్ పేపర్ ఫ్లెక్సో ప్యాకింగ్ లిమిటెడ్, క్యూ నెట్–విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిలెడ్ సంస్థలకు వ్యాపించాయి. ఆరు, ఏడు అంతస్తులకూ ఎగబాకాయి. ఇది దాదాపు రాత్రి 7.15 గంటల సమయంలో చోటు చేసుకుంది. క్యూ నెట్ కార్యాలయం నుంచి ఉద్యోగులు, టెలికాలర్లు ప్రతి రోజూ సాయంత్రం 6–7 గంటల ప్రాంతంలో వెళ్లిపోతారు. ఆ తర్వాత టీమ్ లీడర్లతో పాటు కొందరు మాత్రమే ఉంటారు. గురువారం రాత్రి అగ్నిప్రమాదం జరిగే సమయానికి అందులో దయాకర్, శ్రావణ్, పవన్ (రెస్క్యూ అయ్యారు)లతో పాటు శివ, త్రివేణి, వెన్నెల, ప్రమీల, శ్రావణి, ప్రశాంత్ (అసువులు బాశారు) ఉన్నారు. రాత్రి 7.30 గంటల కు కార్యాలయంలోకి పొగ రావడాన్ని గమనించిన మొదటి ముగ్గురూ వెనుక వైపు ఉన్న కిటికీ పగులకొట్టుకుని సజ్జపైకి దిగారు. అక్కడ నుంచే తమ ఉనికిని కింద ఉన్న అగి్నమాపక, డీఆర్ఎఫ్ అధికారులకు తెలియజేసి ప్రాణాలు దక్కించుకున్నారు. భయంతో బయటకు రాలేక.. మిగిలిన ఆరుగురూ భయంతో కార్యాలయం లోపలకు వరకు వెళ్లిపోయారు. దీనికి సమీపంలో ఉన్న ఒమెగా సంస్థను నిర్వహించే సు«దీర్‌రెడ్డి ఈ విషయం గమనించారు. ధైర్యం చేసిన ఆయన క్యూనెట్ వరకు వెళ్లి అందులో ఉన్న వారిని తనతో రావాల్సిందిగా కోరారు. నలుగురు యువతులు ఆయనతో కలిసి కాస్త ముందుకు వచి్చనా.. అక్కడ దట్టమైన పొగ చూసి భయపడి మళ్లీ తమ కార్యాలయంలోకి వెళ్లిపోయారు. సు«దీర్ మాత్రం భవనం బీ బ్లాక్ ముందు వైపునకు చేరుకుని అక్కడున్న ఖాళీ ప్రదేశంలో, పొగ ప్రభావం ఏమాత్రం లేనిచోట నిలబడ్డారు. సెల్ఫోన్లో లైట్ వెలిగించడం ద్వారా సహాయక సిబ్బంది గుర్తించేలా చేసి బయటపడ్డారు. క్యూ నెట్ కార్యాలయంలో ఉన్న నలుగురు యువతుల్లో ముగ్గురు బాత్రూమ్లోకి వెళ్లి పొగ రాకూడదనే ఉద్దేశంతో తలుపు వేసుకున్నారు. మరో యువతితో పాటు ఇద్దరు యువకులు ఆ సమీపంలోని గదిలో వేర్వేరు చోట్ల ఉండిపోయారు. అలా అక్కడే ఆగిపోయిన ఆరుగురు పొగ పీల్చుకోవడం వల్లే మరణించినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. స్టెయిర్‌కేస్ గ్రిల్స్‌కు తాళం వేయడం వల్లే.. ఈ కాంప్లెక్స్‌లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు అమలు కావట్లేదని, పైపులు ఉన్నా పని చేయట్లేదని అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇటీవలే నోటీసులు జారీ చేశామన్నారు. కాంప్లెక్స్‌కు లిఫ్ట్‌లు ఉండటంతో ఐదో అంతస్తులో ఫ్లోర్‌కు, మెట్లకు మధ్య ఉన్న ఇనుప గ్రిల్స్‌ను లాక్ చేసి ఉంచడం, అక్కడ సామాను పెట్టుకోవడం కూడా ఆరుగురు మృతి చెందడానికి ఓ కారణమైందన్నారు. ఇకపై కాంప్లెక్సుల్లో గ్రిల్స్‌కు ఇలా తాళాలు వేసి ఉంటే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలన్నారు. పలు సెక్షన్ల కింద కేసు అగి్నప్రమాదంపై కాంప్లెక్స్ సూపర్వైజర్ శ్రీనివాస్ మహంకాళి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో స్వప్నలోక్ సూర్యకిరణ్ ఎస్టాబ్లి‹Ùమెంట్ అసోసియేషన్, కేడియా ఇన్ఫోటెక్ లిమిటెడ్ అండ్ వికాస్ పేపర్ ఫ్లెక్సో ప్యాకింగ్ లిమిటెడ్, క్యూ నెట్–విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిలెడ్ సంస్థలపై ఐపీసీలోని 304 పార్ట్ 2, 324, 420 సెక్షన్లతో పాటు పేలుడు పదార్థాల చట్టంలోని సెక్షన్ 9 (బి) కింద కేసు పెట్టిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆరు మృతదేహాలకు గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబీకులకు అప్పగించారు. క్యూ నెట్ వ్యవహారాలపై పూర్తిస్థాయి దర్యాప్తు స్వప్నలోక్‌లో అగ్ని ప్రమాదం క్యూ–నెట్ దందాను మరోసారి తెరపైకి తెచ్చింది. ఈ ఘటనలో చనిపోయిన ఆరుగురూ ఈ సంస్థలో పనిచేస్తున్న వారిగా తేలింది. అయితే ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకే విక్రయించడం పేరుతో క్యూ నెట్ మల్టీ లెవల్ మార్కెటింగ్‌కు తెరలేపడంపై గతంలో సీఐడీ సహా అనేక ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. ఇటీవలే మళ్లీ ఈ సంస్థ తమ కార్యకలాపాలు ప్రారంభించిందని, ప్రచారం కోసం సెలబ్రెటీలను వినియోగించుకుంటోందని ఈ స్కామ్‌ను వెలుగులోకి తెచి్చన సీనియర్ ఐపీఎస్ వీసీ సజ్జనార్ ట్వీట్ చేయడం గమనార్హం. కాగా ప్రమాదానికి సంబంధించి క్యూ నెట్‌పైనా కేసు నమోదైన నేపథ్యంలో దీని వ్యవహారాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని మహంకాళి పోలీసులను ఉన్నతాధికారులు ఆదేశించారు. పేలుడు పదార్థాల చట్టం మొదటిసారి.. స్వప్నలోక్‌లో అగ్నిప్రమాదంపై మహంకాళి పోలీసులు ఐపీసీ 420తో పాటు పేలుడు పదార్థాల చట్టం కింద కేసు నమోదు చేశారు. అగి్నప్రమాదాలకు సంబంధించిన కేసుల్లో ఇలాంటి సెక్షన్లు జోడించడం ఇదే ప్రథమం. అనుమతి లేకుండా గ్యాస్ సిలిండర్లు కలిగి ఉండటం, బాణసంచా నిల్వ చేయడం, పేలుడు పదార్థాలు, రసాయనాలు దాచి ఉంచడం వంటి వాటి వల్లా ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. స్వప్నలోక్ కాంప్లెక్స్‌లోనూ ఇలాంటివి అక్రమంగా నిల్వ చేస్తే మోసం చేసినట్లే. ఈ కారణంగానే ఐపీసీ సెక్షన్ 420తో పాటు పేలుడు పదార్థాల చట్టంలోని సెక్షన్‌ను జోడించారు. ఈ కాంప్లెక్స్‌లో అనేక కార్యాలయాలతో పాటు గోదాములు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అగ్నిమాపక శాఖ, జీహెచ్ఎంసీతో పాటు క్లూస్ టీమ్ ఇచ్చే నివేదిక ఆధారంగా కేసులో తదుపరి చర్యలు తీసుకోనున్నారు. చదవండి: హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం.. -
స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాదం.. ఆదుకుంటున్న ఆడబిడ్డ ఆవిరైంది..
నేలకొండపల్లి: స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదం నింపిన మరో విషాదమిది.. కూలీనాలీ చేస్తూ ఇద్దరు ఆడపిల్లలను చదివించిన ఆ కుటుంబానికి కొడుకులా అండగా నిలుస్తున్న త్రివేణి మంటల్లో కాలిపోయింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సుర్దేపల్లి గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ కుంచం రామారావు, వ్యవసాయ కూలీ రమణ దంపతులు. వీరికి త్రివేణి (22), మమత కుమార్తెలు. ఉన్నంతలో కుమార్తెలిద్దరినీ బాగా చదివించారు. త్రివేణి బీటెక్ పూర్తి చేశాక హైదరాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లోని ఓ కాల్ సెంటర్లో ఉద్యోగం సాధించింది. అదే కార్యాలయంలో ఆమె చెల్లెలు మమత కూడా ఉద్యోగం చేస్తోంది. గురువారం సాయంత్రం పని నిమిత్తం మమత కింది ఫ్లోర్‌కు రాగా.. అక్క వచ్చాక ఇద్దరూ వారుంటున్న రూమ్‌కి వెళ్లాలనుకున్నారు. ఇంతలోనే మంటలు వ్యాపించాయి. దీంతో ఏం చేయాలో పాలుపోక మమత రోదిస్తూ అక్క త్రివేణికి ఫోన్ చేయగా తీయలేదు. చివరకు మంటలు, పొగలో చిక్కుకుని త్రివేణి కన్నుమూసినట్లు తెలియడంతో తల్లిదండ్రులకు చెప్పింది. మృతదేహాన్ని సుర్దేపల్లికి శుక్రవారం తీసుకొచ్చి కన్నీళ్ల నడుమ అంత్యక్రియలు నిర్వహించారు. -
డబ్బు సంపాదించి మీ కష్టాలు తీరుస్తా అన్నది...
గాంధీఆస్పత్రి: సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో సంభవించిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారంతా గ్రామీణ ప్రాంతాలకు చెందిన విధ్యాధికులే. కూలీ, వ్యవసాయ నేపథ్యంగల వారి కుటుంబాలను కదిలిస్తే ప్రతిఒక్కరిదీ వ్యథాభరిత కన్నీటి గాథే. ముదిమి వయసులో చేతికి అందివస్తారనే గంపెడు ఆశతో కాయకష్టం చేసి ఉన్నత చదువులు చదివించి నగరానికి పంపిస్తే విగత జీవులుగా తిరిగి వచ్చారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. పొలం దున్ని, కూలీ పనులు చేసి, అప్పు చేసి లక్షలాది రూపాయలు పెట్టుబడిపెట్టి ‘క్యూ నెట్’ వలలో చిక్కుకున్నామంటూ బోరుమన్నారు. తమ పిల్లల జీవితాలతో చెలగాటం ఆడుకున్న క్యూ నెట్ సంస్థ నిర్వాహకులపై క్రిమినల్ కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలని, వసూలు చేసిన సొమ్మును వడ్డీతో చెల్లించేలా చర్యలు చేపట్టాలని, ప్రభుత్వం తమను అన్నివిధాల ఆదుకోవాలని అభ్యర్ధించారు. సికింద్రాబాద్ గాంధీమార్చురీ వద్ద మృతుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ‘సాక్షి’తో మాట్లాడుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లిన తమ పిల్లల జ్ఞాపకాలను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. రెండు రోజుల్లో స్నేహితురాలి పెళ్లికి వస్తానంది.. రెండు రోజుల్లో జరిగే తన స్నేహితురాలి పెళ్లికి తప్పకుండా ఊరికి వస్తానని మాటిచ్చిన నా బిడ్డ, అందనంత దూరాలకు వెళ్లిపోయిందని మృతురాలు వెన్నెల తల్లితండ్రులు రవి, లక్ష్మిలు బోరుమన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మర్పల్లికి చెందిన వెన్నెల (22) ఏడాదిన్నర క్రితం నగరానికి వచ్చింది. క్యూనెట్ సంస్థలో చేరి రూ.1.50 లక్షలు చెల్లించింది. హాస్టల్ ఖర్చులకు తామే డబ్బు పంపించామని తల్లిదండ్రులు పేర్కొన్నారు. రాత్రికి ఫోన్ చేస్తా అమ్మా అన్నడు గురువారం మధ్యాహ్నం 4 గంటలకు ఫోన్ చేశాడు. ఆఫీసు పని అయ్యాక రాత్రికి ఫోన్ చేస్తా అన్నాడు..ఇప్పటికీ వాడి మాటలు గింగిర్లు తిరుగుతూనే ఉన్నాయంటూ మృతుడు అమరాజు ప్రశాంత్ (23) తల్లిదండ్రులు ఉపేంద్రమ్మ, జనార్ధన్‌లు కన్నీటి పర్యంతమయ్యారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇంటికెన్నె గ్రామానికి చెందిన వీరు వ్యవసాయకూలీలు. ఏడాది క్రితం నగరానికి వచ్చిన ప్రశాంత్ క్యూనెట్ సంస్థలో టీం లీడరుగా పనిచేస్తున్నాడు. డబ్బు సంపాదించి మీ కష్టాలు తీరుస్తా అన్నది... ఎంతో కష్టపడి, అప్పు చేసి మమ్మల్ని చదివించారు. ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించి మిమ్మల్ని సుఖపెట్టాలి..మీ కష్టాలు తీర్చాలి. అదే నా కోరిక అంటూ చెప్పిన త్రివేణి (22) విగతజీవిగా మారిందంటూ హృదయవిదారకంగా రోదించారు తల్లితండ్రులు రామారావు, రమ, సోదరి మమతలు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సుర్దేపల్లికి చెందిన త్రివేణి రూ.3 లక్షలు చెల్లించి క్యూనెట్ సంస్థలో చేరింది. మిమ్మల్ని ఇక్కడికే షిఫ్ట్ చేస్తా అన్నడు మరో ఏడాదిలో బీటెక్ పూర్తవుతుంది, మంచి జాబ్‌లో సెటిల్ అవుతా, మీఅందరినీ ఇక్కడికే షిఫ్ట్ చేస్తా అని చెప్పిన నా బిడ్డ శివ (22)ను ఇక్కడే విగతజీవిగా చూస్తామని కలలో కూడా అనుకోలేదని తల్లితండ్రులు రాజు, రజితలు విలపించారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం చంద్రాయిపల్లికి చెందిన వీరు వ్యవసాయ కూలీలు. రూ.1.60 లక్షలు అప్పుచేసి క్యూనెట్ సంస్థలో శివను చేర్పించారు. భవన నిర్మాణంపై నివేదిక కోరిన జీహెచ్ఎంసీ స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాదం నేపథ్యంలో బహుళ అంతస్తుల భవన సముదాయం నిర్మాణ స్థిరత్వాన్ని పరిశీలించి నివేదిక అందజేయాలని జేఎన్టీయూ హెచ్‌కు జీహెచ్ఎంసీ విజ్ఞప్తి చేసింది. అప్పటివరకు భవన సముదాయం తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ వెల్లడించారు. అదేవిధంగా రక్షణ చర్యలు పరిశీలించి అగ్నిమాపక సేవల విభాగం చర్యలు చేపడుతుందని, జీహెచ్ఎంసీతో సమన్వయంగా పనిచేస్తుందని తెలిపారు. -
స్థిరపడ్డాక పెళ్లి చేసుకుంటానని..
వరంగల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రానికి చెందిన బానోతు నరసింహ, పద్మ అలియాస్ రాంబాయి దంపతుల మొదటి కుమార్తె బానోతు శ్రావణి (22). కోదాడలోని ఓ కళాశాలలో బీటెక్ పూర్తి చేసిన ఆమె ఆర్నెళ్ల క్రితం స్వప్నలోక్ కాంప్లెక్స్‌లోని ఓ కంపెనీ కాల్ సెంటర్లో ఉద్యోగం సాధించింది. తల్లిదండ్రులు పెళ్లి చేస్తామంటే ‘ఉద్యోగం చేస్తున్నానని.. జీవితంలో సిరపడ్డాక చేసుకుంటానని’ చెప్పింది. చిన్న ఇల్లు తప్ప మరేమీ ఆస్తి లేని వీరి కుటుంబం నాలుగేళ్ల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లింది. అక్కడే హోటల్లో పని చేసుకుంటూ శ్రావణి కుటుంబం జీవనం సాగిస్తోంది. తమ్ముడు, చెల్ల్లి చదువుల కోసం, కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు శ్రావణి ఉద్యోగం చేస్తూ వస్తోంది. ఈక్రమంలో గురువారం జరిగిన ఘటనలో శ్రావణి మృతితో ఆ కుటుంబంలో, ఖానాపురంలోని టేకులతండాలో విషాదం నెలకొంది. -
‘నిన్ను చూడబుద్ధి అయితంది బిడ్డా.. జర వీడియో కాల్ చేయరాదు’
నర్సంపేట మండలం చంద్రయ్యపల్లికి చెందిన ఉప్పుల రాజు, రజిత దంపతుల కుమారుడు శివ(22) అగ్ని ప్రమాదానికి ఆహుతయ్యాడు. మేస్త్రిగా పని చేస్తున్న రాజు తనకున్న ఎకరం భూమితో పాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకొని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లిదండ్రుల కష్టాల్ని చిన్నప్పటి నుంచి చూసిన శివకు వారి కోసం ఏదైనా చేయాలని ఉండేది. రూ.1.50 లక్షలు చెల్లిస్తే కమీషన్ల రూపంలో నెలకు రూ.20 వేలు వస్తాయని తెలిసినవారు అతడికి చెప్పారు. అలా మూడేళ్ల క్రితం స్వప్నలోక్ కాంప్లెక్స్‌లోని ఓ మల్టీలెవల్ మార్కెటింగ్ (ఈకామర్స్ బిజినెస్)లో చేరాడు. ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. ఇప్పటి వరకు కమీషన్లు రాలేదు. కానీ.. రెండుసార్లు బెంగళూరు టూర్‌కు తీసుకెళ్లారు. నర్సంపేటలో డిగ్రీ చదువుతున్న శివ చెల్లి సింధు బర్త్ డే ఈనెల 15న బుధవారం ఉండడంతో అదే రోజు శివ ఇంటికి ఫోన్ చేసి చెల్లికి శుభాకాంక్షలు చెప్పాడు. దీంతో సింధు ‘అన్నయ్య ఇంటికి రావొచ్చు కదా’ అంటే.. ‘ఉగాది పండుగకు వస్తాలే’ అని శివ అన్నాడు. పక్కనే ఉన్న తల్లితో.. గంటసేపు మాట్లాడాడు. ‘నిన్ను చూడబుద్ధి అయితంది బిడ్డా.. జర వీడియో కాల్ చేయరాదు’ అని తల్లి రజిత అనడంతో ‘ఫ్రీ అవ్వగానే ఓ గంట తర్వాత చేస్తా’ అని శివ అన్నాడు. అవే అతడి చివరి మాటలయ్యాయని తల్లి రజిత, చెల్లి సింధు విలపించడం కన్నీరు పెట్టించింది. -
స్వప్నలోక్ ప్రమాదం బాధించింది: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాద ఘటనపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఘటనలో ప్రాణాలు పోవడం తనను ఎంతో బాధించిందన్న ఆయన.. బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ.. గాయపడిన వాళ్లు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇక స్వప్నలోక్ కాంప్లెక్స్ ఘటనలో బాధిత కుటుంబాలకు రూ. 2 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి బాధిత కుటుంబాలకు ఆ సాయం అందజేయనున్నట్లు.. అలాగే గాయపడిన వాళ్లకు రూ.50వేల సాయం అందించనున్నట్లు ప్రకటించారు. మరోవైపు ఉత్తర ప్రదేశ్‌లో ఇవాళ ఘోరం జరిగింది. సంబల్‌లోని చందౌసి ప్రాంతంలో బంగాళాదుంప కోల్డ్ స్టోరేజ్ కుప్పకూలి ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన నుంచి మరో పదకొండు మందిని రక్షించారు. ఈ ఘటనపైనా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని, పీఎంఎన్ఆర్ఎఫ్ సాయం ప్రకటించారు. Pained by the loss of lives due to a fire tragedy in Swapnalok Complex, Secunderabad. My thoughts are with the bereaved families. May the injured recover soon: PM @narendramodi — PMO India (@PMOIndia) March 17, 2023 PM @narendramodi has announced an ex-gratia of Rs. 2 lakh from PMNRF to the next of kin of each deceased in the tragedies in Chandausi and Secunderabad. Those injured would be given Rs. 50,000. — PMO India (@PMOIndia) March 17, 2023 -
స్వప్నలోక్ కాంప్లెక్స్ ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన
సాక్షి, హైదరాబాద్: స్వప్నలోక్ కాంప్లెక్స్ ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. స్వప్నలోక్ కాంప్లెక్స్ ఘటన విచారకరం: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాద ఘటనపై విచారణ వ్యక్తం చేశారు. ప్రభుత్వం అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటోంది.. ఫైర్ సేఫ్టీ పాటించాలని వ్యాపార సముదాయ నిర్వాహకులకు చెబుతున్నామని, అయినా ఇలాంటి అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. ఈ ప్రమాదంలో బయటికి రాలేక ఆరుగురు 5 అంతస్తులోనే చిక్కుకుని మరణించిన సంగతి తెలిసిందే. వారంతా క్యూనేట్ అనే సంస్థలో పనిచేస్తున్నట్టు తెలిసిందన్న ఆయన.. ఆ సంస్థపై ఫిర్యాదులు కూడా ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వ సహాయం కాకుండా యూనిట్ నుంచి కూడా బాధితులకు సాయమందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. ఈ అగ్ని ప్రమాదాలు అన్నీ 40 ఏళ్ల నాటివని.. ఈ క్రమంలో పాత బిల్డింగులు ఫైర్ సేఫ్టీ లేని భవనాలు సుమారుగా 30 లక్షల దాకా ఉన్నాయని తెలిపారు. వీటిపై చర్యలు తీసుకునే క్రమంలో ఒక రెవల్యూషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత మాట్లాడుతూ.. ప్రమాద ఘటన పై ఒక కమిటీ వేస్తున్నట్లు తెలిపారు. గతంలో కూడా ఈ పరిధిలో రెండు మూడు ప్రమాదాలు జరిగాయన్న ఆమె..ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
ఫైర్ సెఫ్టీ నిబంధనలు గాలికొదిలేసిన స్వప్నలోక్ కాంప్లెక్స్ యజమాని
-
Swapnalok Fire Accident: మేయర్ ఏం చెప్పారు.. అధికారులు ఏం చేశారు?
సాక్షి, హైదరాబాద్: స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాద ఘటనతో మరోసారి అధికారుల అలసత్వం బయటపడింది. డెక్కన్ మాల్ అగ్నిప్రమాద అనంతరం ఆగమేఘాల మీద టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు చేయగా, రెండు మీటింగ్‌లకు మాత్రమే కమిటీ పరిమితమైంది. అక్రమ గోదాంలను గుర్తించడంలో అధికారుల అలసత్వం వహిస్తున్నారు. నగరంలో వేలల్లో అక్రమ గోదాములు ఉండగా, కనీస ఫైర్ నిబంధనలను భవన యాజమమానులు పాటించడం లేదు. హైదరాబాద్‌లో ఒక్క ఏడాదీలోనే అగ్నిప్రమాదాలకు ముప్పై మందికి పైగా మృతి చెందారు. భవన యజమానులకు కేవలం నోటీసులతోనే పరిమితం చేశారు.. సికింద్రాబాద్‌లో ఏడాది వ్యవధిలో 4 పెద్ద ఫైర్ యాక్సిడెంట్లు సికింద్రాబాద్‌లో ఏడాది వ్యవధిలో 4 భారీ అగ్రి ప్రమాదం జరగగా 4 చోట్ల 28 మంది మృతి చెందారు. జనవరిలో డెక్కన్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం తర్వాత హడావుడి చేసిన ప్రజాప్రతినిధులు, బల్దియా అధికారులు తూతూ మంత్రంగా చర్యలు చేపట్టారు. గతేడాది మార్చి 23న బోయగూడలోని ఓ టింబర్ డిపోలో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది మృతి చెందాగా, సికింద్రాబాద్ రూబీ లాడ్జిలో సెప్టెంబర్ 12న ఫైర్ యాక్సిడెంట్లో 8 మంది మరణించారు. ఆ తర్వాత 4 నెలల్లోనే మరో పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జనవరి 29న డెక్కన్ మాల్లో మంటలు చెలరేగి ముగ్గురు సజీవ దహనమయ్యారు. రెసిడెన్షియల్ ప్రాంతాల్లో ఉన్న గోడౌన్లను ఖాళీ చేయిస్తామని అధికారులు చెప్పారు. కానీ చర్యలు మాత్రం శూన్యం. గోడౌన్లపై సర్వే చేసి మరీ రిపోర్టు అందివ్వాలని అప్పట్లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత రిపోర్టు రాలేదు. చర్యలు తీసుకోలేదు. వరుస ప్రమాదాలు జరిగిన సికింద్రాబాద్ జోన్లలో కూడా చర్యలు తీసుకోలేదు. బిల్డింగ్ ప్రాపర్టీ ట్యాక్స్ క్లియర్‌గా ఉందా? లేదా అని మాత్రమే ఫోకస్ పెట్టారు. టాక్స్ కోసం పలుమార్లు తిరుగుతున్నప్పటికీ.. ఆ బిల్డింగ్ వాడకంపై మాత్రం అధికారులు దృష్టి పెట్టలేదనే విమర్శలు వస్తున్నాయి. కాగా, సికింద్రాబాద్‌లోని ప్రముఖ వ్యాపార సముదాయం స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో గురువారం సంభవించిన భారీ అగ్ని ప్రమాదం ఆరుగురిని పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. అతికష్టమ్మీద గ్రిల్స్ తొలగించి అయిదో అంతస్తులోకి వెళ్లిన అగ్నిమాపక శాఖ అధికారులు అపస్మారక స్థితిలో ఉన్న ఆ అయిదుగురిని బయటికి తీసుకువచ్చారు. వీరికి సీపీఆర్ చేసి ఆస్పత్రికి తరలించారు. అయితే వీరు అప్పటికే మృతి చెందినట్లు గాంధీ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. అదే సమయంలో మరో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రశాంత్ సైతం కన్నుమూశాడు. ఈ ఆరుగురికి కాలిన గాయాలు లేవు. ఊపిరితిత్తుల్లో పొగ చేరడంతోనే చనిపోయారని వైద్యులు తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాదం.. మృతుల వివరాలు ఇవే! -
స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాదం.. మృతుల వివరాలు ఇవే!
సాక్షి సికింద్రాబాద్: ప్రమాదాలు జరిగినపుడు హడావుడి చేసే ప్రజాప్రతినిధులు.. అధికారులు తూతూమంత్రంగా చేపట్టే చర్యలు.. వెరసి అభాగ్యుల ఉసురు తీస్తోంది. గత జనవరిలో డెక్కన్ మాల్ అగ్ని ప్రమాదాన్ని మరువకముందే సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో అలాంటి ఘటనే పునరావృతమైంది. భారీ అగ్ని ప్రమాదం బతుకు దెరువు కోసం ఆ కాంప్లెక్స్‌లో పనిచేస్తున్న ఆరుగురి ప్రాణాలను అనంతవాయువుల్లో కలిపింది. నిండా పాతికేళ్లు కూడా లేని వారి జీవితాలను అర్థాంతరంగా ముగించింది. పని కోసం పట్నం వెళ్లిన తన బిడ్డలు ఎప్పుడు వస్తారా? అని ఎదురుచూసిన తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చింది. సికింద్రాబాద్‌లోని ప్రముఖ వ్యాపార సముదాయం స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో గురువారం సంభవించిన భారీ అగ్ని ప్రమాదం ఆరుగురిని పొట్టనపెట్టుకుంది. అతికష్టమ్మీద గ్రిల్స్ తొలగించి అయిదో అంతస్తులోకి వెళ్లిన అగ్నిమాపక శాఖ అధికారులు అపస్మారక స్థితిలో ఉన్న ఆ అయిదుగురిని బయటికి తీసుకువచ్చారు. వీరికి సీపీఆర్ చేసి ఆస్పత్రికి తరలించారు. అయితే వీరు అప్పటికే మృతి చెందినట్లు గాంధీ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. అదే సమయంలో మరో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రశాంత్ సైతం కన్నుమూశాడు. ఈ ఆరుగురికి కాలిన గాయాలు లేవు. ఊపిరితిత్తుల్లో పొగ చేరడంతోనే చనిపోయారని వైద్యులు తెలిపారు. మృతుల వివరాలు ఇవే.. ►సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో గత రాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సురేష్ నగర్ గ్రామానికి చెందిన కె.ప్రమీల (22) మృతిచెందడంతో సురేష్ నగర్ గ్రామంలో విషాదచయలు అలుముకుంది. ప్రమీల ఈ కామర్స్ సంస్థలో పని చేస్తుంది. ► మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇంటికన్నె గ్రామానికి చెందిన అమరాజు ప్రశాంత్ (23) అనే యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ► వరంగల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రానికి చెందిన బానోత్ శ్రావణి(22) మృతి చెందింది. ఆమె ఈ కామర్స్ సంస్థలో పని చేస్తుంది. కూతురు మరణ వార్త విని ఆ తల్లిందండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. శ్రావణి తల్లిదండ్రులు కూలీ పనులు చేస్తుంటారు. ► వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన వంగ వెన్నెల(22) మృతి చెందింది. స్వప్నలోక్ కాంప్లెక్స్ లోని ఐదవ అంతస్తులో ఉన్న కామర్స్ కాల్ సెంటర్లో వెన్నెల ఉద్యోగం చేస్తుంది. ►అగ్ని ప్రమాదంలో ఉప్పుల శివ (22) ఊపిరి ఆడక మృతి చెందాడు. చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన ఉప్పుల రాజు, రజిత కుమారుడు శివ 2 సంవత్సరాల నుంచి సికింద్రాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. తండ్రి రాజు వ్యవసాయం,తాపీ మేస్త్రి గా పనిచేసుకుంటున్నాడు. ►ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సుర్థేపల్లి గ్రామనికి చెందిన రామారావు కుమార్తె త్రివేణి (22) అగ్ని ప్రమాదంలో మృతి చెందింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
స్వప్నలోక్ కాంప్లెక్స్ లో షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం
-
సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం (ఫొటోలు)
-
సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో గురువారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో 7,8 అంతస్తుల్లో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. చుట్టుపక్కల పరిసరాల్లో పొగ దట్టంగా అలుముకుంది. ఆ కాంప్లెక్స్‌లో 16 మంది వ్యక్తులు చిక్కుకున్నట్లు సమాచారం. దట్టమైన పొగ అలుముకోవడంతో సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. కాంప్టెక్స్ లోపల పలు వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. ఈ మంటలు 7,8 అంతస్తుల్లో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ అగ్నిప్రమాదం లో సుమారు ఆరుగురు మహిళలు చిక్కుకున్నట్లు సమాచారం. విద్యుత్ సరఫరా లేకపోవడంతో లిఫ్టులు పని చేయడం లేదు. అదే సమయంలో చీకట్లో ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితిలో చిక్కుకున్న మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. తమను కాపాడాలంటూ లోపలి నుంచి ఆర్తనాదాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ ఏడుగుర్ని కాపాడగా, మరో తొమ్మిది మంది లోపలే ఉండిపోయారు. వారిని కాపాడేందుకు రెస్క్యూ టీమ్‌గా ముమ్మరంగా ప్రయత్నం చేస్తోంది. చిక్కుకున్న వారితో ఫోన్లో కాంటాక్ట్‌లో ఉన్నాం చిక్కకున్న వారితో ఫోన్లో కాంటాక్ట్‌లో ఉన్నామన్నారు ఘటనా స్థలికి వచ్చిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ‘మంటలు అదుపులోకి వస్తున్నాయి.. చివరి భాగంలో మాత్రమే మంటలు ఉన్నాయి. ఎంత మంది లోపల ఉన్నారు అని తెలియదు. ఏడు మందిని ఫైర్ సిబ్బంది రెస్క్యూ చేశారు. పైన ఉన్నాం అని మంటల్లో చిక్కకున్న బాధితులే సెల్ ఫోన్ లైట్లు వేసి చూపిస్తున్నారు’ అని మంత్రి తెలిపారు. -
కారులో వచ్చి.. కత్తిపోట్లు
హైదరాబాద్: భాగ్యనగరంలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణ హత్యకు గురయ్యాడు. కారులో వచ్చిన ముగ్గురు దుండగులు కత్తులతో పొడిచి చంపి పారిపోయారు. పోలీసులు గస్తీ వాహనంలో వెంబడించినా చిక్కకుండా పరారయ్యారు. సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ వద్ద గురువారం తెల్లవారుజామున నడిరోడ్డుపై ఈ దారుణం చోటుచేసుకుంది. సీసీటీవీల ఆధారంగా ఆ కారు నంబర్‌ను గుర్తించిన పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ వ్యవహారమా లేదా వ్యక్తిగత కక్షలు ఈ హత్యకు దారితీశాయా? అన్న కోణంలో విచారణ చేపట్టారు. అంధ విద్యార్థి పరీక్షకు సాయంగా వెళ్లి.. సికింద్రాబాద్ పార్శిగుట్టకు చెందిన సురేందర్, జయమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. చిన్న కుమారుడు సంజయ్ జుంగే (25) ఈఈఈ పూర్తి చేసి ఏడాది క్రితమే మణికొండలోని సదర్‌ల్యాండ్ గ్లోబల్ సర్వీసెస్ సాఫ్ట్వేర్ సంస్థలో ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఓ అంధ విద్యార్థికి సాయంగా పరీక్ష రాయడానికి వెళ్తున్నానంటూ సంజయ్ బుధవారం ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి వెళ్లాడు. పరీక్ష రాసిన అనంతరం తన సంస్థలో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు రెండో షిప్ట్ డ్యూటీ చేశాడు. తర్వాత సహోద్యోగులు కుశాల్కర్, సిద్ధాంత్లతో కలిసి మియాపూర్‌లోని సిద్ధాంత్ గదికి వెళ్లాడు. ఈ ముగ్గురూ గురువారం తెల్లవారుజాము వరకు మద్యం తాగారు. అనంతరం బైక్‌పై వారంతా పంజగుట్టలోని పీవీఆర్ మాల్ చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడ వాహనం దిగిన సంజయ్.. తాను ఇంటికి వెళ్తానని చెప్పడంతో మిగతా ఇద్దరు స్నేహితులు వెళ్లిపోయారు. అక్కడ్నుంచి సంజయ్ బేగంపేట్‌లో ఉండే స్నేహితుడు భాస్కర్‌కు ఫోన్ చేసి.. క్యాబ్‌లో వస్తానని, ప్యారడైజ్ వద్ద పికప్ చేసుకోవాలని కోరాడు. చివరగా తెల్లవారుజామున 5.13 గంటలకు భాస్కర్ తో మాట్లాడాడు. రెండు నిమిషాల్లోనే ఘాతుకం సంజయ్ నడుచుకుంటూ స్వప్నలోక్ కాంప్లెక్స్ వద్దకు చేరుకోగానే.. ఓ స్విఫ్ట్ డిజైర్ కారు వచ్చింది. సంజయ్ రోడ్డు దిగి పక్కకు జరగ్గా.. కాస్త ముందుకు వెళ్లి కారు ఆగింది. అందులోంచి ముగ్గురు వ్యక్తులు సంజయ్ వద్దకు వచ్చి పెనుగులాడారు. అందులో ఒకరు కత్తితో సంజయ్ ఛాతీపై పొడిచాడు. దీంతో కుప్పకూలిన సంజయ్ అక్కడికక్కడే మరణించాడు. ఉదయం 5.15 గంటల సమయంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ‘హిట్ అండ్ రన్’ అనుకున్న పోలీసులు సంజయ్‌ను హత్య చేసిన దుండగులు అదే కారులో ప్యారడైజ్ వైపు పారిపోతుండగా.. అదే సమయంలో మహంకాళి పోలీసుస్టేషన్‌కు చెందిన పెట్రోలింగ్ వాహనం వీరి వాహనానికి ఎదురు వచ్చింది. కారు అతి వేగంతో దూసుకు వెళ్తుండటం.. కొద్దిదూరంలోనే ఓ వ్యక్తి (సంజయ్) కిందపడి ఉండటాన్ని పోలీసులు గమనించారు. ఆ వ్యక్తిని ఢీకొట్టి పారిపోతున్నారని (హిట్ అండ్ రన్) భావించి ఆ కారును వెంబడించారు. వెనక్కు తిరిగి ప్యారడైజ్ నుంచి ఎంజీ రోడ్ మీదుగా ట్యాంక్‌బండ్ వరకు దుండగుల కారును వెంబడించారు. అయితే దుండగులు 130 నుంచి 140 కి.మీ. స్పీడుతో వెళ్లి పోలీసులకు చిక్కలేదు. అనంతరం ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు హత్య జరిగినట్లు గుర్తించి కారుకు సంబంధించిన ఆచూకీ కనిపెట్టాలంటూ అన్ని పోలీస్స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. అయినా ఫలితం దక్కలేదు. దొరకని కారు..: మిత్రుడితో క్యాబ్‌లో వస్తున్నానని సంజయ్ చెప్పిన నేపథ్యంలో నగరంలోని అన్ని క్యాబ్ సర్వీసుల్లోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. సంజయ్ ఒకవేళ హంతకుల కారులోనే ప్రయాణించాడా? అన్న కోణంలోనూ విచారణ చేస్తున్నారు. హంతకులు పారిపోయిన తెలుపు రంగు కారు నంబర్ ‘8055’ను ‘బాస్’ మోడల్లో రాసినట్లు సీసీ కెమెరాల ఫీడ్ ఆధారంగా గుర్తించారు. నగరంలో ఆ నంబర్‌తో 14 కార్లు ఉండడంతో వాటి యజమానులను ప్రశ్నిస్తున్నారు. సంజయ్ సహోద్యోగులు, స్నేహితులతో పాటు అతడి కాల్ వివరాలు ఆధారంగా విచారణ చేస్తున్నారు. మృతుడి దేహంపై ఉన్న కత్తిగాట్లను పరిశీలించిన పోలీసులు ఈ హత్య ప్రొఫెషనల్స్ పనిగా అనుమానిస్తున్నారు. రక్షించమని అరిచాడు ‘‘హత్య జరిగిన సమయం లో నేను విధుల్లో ఉన్నా. సంజయ్ వెనుక నుంచి కారు తో వచ్చిన దుండగులు హారన్ కొట్టారు. సంజయ్ పక్కకు జరగ్గానే ముగ్గురు బయటకు దిగి అతనితో గొడవ పడ్డారు. అందులో ఒకడు కత్తితో దాడి చేశాడు. సంజయ్ ‘బచావో బచావో’ అంటూ అరిచాడు. అంతలోనే దుండగులు కారులో పరారయ్యారు’’ - మనోహర్, ప్రత్యక్ష సాక్షి (సెక్యూరిటీ గార్డు) -
పట్టపగలు వ్యక్తి దారుణ హత్య
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో పట్టపగలు ఓ యువకుడిని గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేసి హతమార్చారు. ఈ సంఘటన సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ వద్ద జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్వప్నలోక్ కాంప్లెక్స్ వద్ద నిల్చుని ఉన్న ఓ వ్యక్తి వద్దకు ఆటోలో వచ్చిన ఇద్దరు యువకులు కాసేపు మాట్లాడారు. అనంతరం తమతోపాటు తెచ్చిన కత్తితో యువకుడి గొంతు కోసి హత్యచేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతుని వయసు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని, పాత కక్షల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.