సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో గురువారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో 7,8 అంతస్తుల్లో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి.
చుట్టుపక్కల పరిసరాల్లో పొగ దట్టంగా అలుముకుంది. ఆ కాంప్లెక్స్‌లో 16 మంది వ్యక్తులు చిక్కుకున్నట్లు సమాచారం. దట్టమైన పొగ అలుముకోవడంతో సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. కాంప్టెక్స్ లోపల పలు వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. ఈ మంటలు 7,8 అంతస్తుల్లో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ అగ్నిప్రమాదం లో సుమారు ఆరుగురు మహిళలు చిక్కుకున్నట్లు సమాచారం.
విద్యుత్ సరఫరా లేకపోవడంతో లిఫ్టులు పని చేయడం లేదు. అదే సమయంలో చీకట్లో ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితిలో చిక్కుకున్న మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. తమను కాపాడాలంటూ లోపలి నుంచి ఆర్తనాదాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ ఏడుగుర్ని కాపాడగా, మరో తొమ్మిది మంది లోపలే ఉండిపోయారు. వారిని కాపాడేందుకు రెస్క్యూ టీమ్‌గా ముమ్మరంగా ప్రయత్నం చేస్తోంది.
చిక్కుకున్న వారితో ఫోన్‌లో కాంటాక్ట్‌లో ఉన్నాం
చిక్కకున్న వారితో ఫోన్‌లో కాంటాక్ట్‌లో ఉన్నామన్నారు ఘటనా స్థలికి వచ్చిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ‘మంటలు అదుపులోకి వస్తున్నాయి.. చివరి భాగంలో మాత్రమే మంటలు ఉన్నాయి. ఎంత మంది లోపల ఉన్నారు అని తెలియదు. ఏడు మందిని ఫైర్ సిబ్బంది రెస్క్యూ చేశారు. పైన ఉన్నాం అని మంటల్లో చిక్కకున్న బాధితులే సెల్ ఫోన్ లైట్లు వేసి చూపిస్తున్నారు’ అని మంత్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment