సాక్షి, వరంగల్: సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో గురువారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఐదుగురు అగి్నకి ఆహుతి అయ్యారు. వరంగల్ జిల్లాకు చెందిన ముగ్గురు.. శ్రావణి (22)...వెన్నెల (22), శివ(22) ఉండగా, మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు. ప్రశాంత్(23), ప్రమీల (23)) ఉన్నారు. మృత్యువాతపడిన ముగ్గురు యువతులకు త్వరలో పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. కానీ తాము జీవితంలో స్థిరపడ్డాక చేసుకుంటామని తల్లిదండ్రులకు చెబుతూ వస్తున్నారు. ఇంతలోనే ఘోరం జరిగి అనంతలోకాలకు వెళ్లారు.
కట్నం ఖర్చులు.. సంపాదించిన తర్వాతే పెళ్లంది.. ఇంతలోపే
వరంగల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రానికి చెందిన బానోతు నరసింహ, పద్మ కుమార్తె బానోతు శ్రావణి (22) బీటెక్ పూర్తి చేసింది. ఆరు నెలల క్రితం స్వప్నలోక్ కాంప్లెక్స్‌లోని ఓ కంపెనీ కాల్ సెంటర్‌లో ఉద్యోగం సాధించింది. తల్లిదండ్రులు హైదరాబాద్‌లోనే ఓ హోటల్‌లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పెళ్లి చేస్తామని తల్లిదండ్రులు అంటుండగా ఉద్యోగం చేసి తన కట్నం డబ్బులు సంపాదించి.. జీవితంలో సిరపడ్డాక చేసుకుంటానని చెబుతూ వచి్చంది. కానీ అగ్నిప్రమాదం శ్రావణిని మధ్యలోనే బలితీసుకుంది. కుటుంబానికి ఆసరాగా నిలుస్తుందనుకున్న త్రివేణి మృతితో ఖానాపురంలోని టేకుల తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.
వచ్చే ఏడాది పెళ్లి చేద్దామనుకున్నారు..
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన వంగ రవి, లక్ష్మి దంపతులు కుమార్తె వెన్నెల(22)కు వచ్చే ఏడాది పెళ్లి చేద్దామనుకున్నారు. డిగ్రీ వరకు చదివిన వెన్నల స్వప్నలోక్ కాంప్లెక్స్‌లోని ఈ కామర్స్ సెంటర్‌లో ఉద్యోగం చేస్తోంది. వచ్చే ఏడాది మేనల్లుడికి వెన్నెలను ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకున్నామని, అంతలోనే మాయమైపోయిందని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.
సంబంధాలు చూస్తున్నారు.. అంతలోనే.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఎర్రకుంటతండా శివారు సురే‹Ùనగర్‌కు చెందిన జాటోతు భద్రు, బుజ్జిల కూతురు ప్రమీల (23) స్వప్నలోక్ కాంప్లెక్స్‌లోని క్యూ నెట్ అనే కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఏడాదినుంచి కూతురును పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులు అడుగుతున్నారు. ఈ ఏడాది చేసుకుంటా అని చెప్పడంతో తల్లిదండ్రులు సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఘోరం జరిగిపోయింది.
నిన్ను చూడబుద్ది అయితంది కొడుకా..
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన ఉప్పుల రాజు, రజిత దంపతుల కుమారుడు శివ (22) మూడేళ్ల క్రితం మలి్టలెవల్ మార్కెటింగ్ (ఈకామర్స్ బిజినెస్)లో చేరాడు. ఉద్యోగం చేస్తూనే బీటెక్ చదువుతున్నాడు. ఈ నెల 15న చెల్లి సింధు బర్త్ డే కావడంతో సాయంత్రం ఇంటికి ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పాడు. ‘నిన్ను చూడబుద్ది అయితంది బిడ్డా...జర వీడియో కాల్ చేయరాదూ’ అని తల్లి రజిత అనడంతో కాస్త ఫ్రీ కాగానే చేస్తానని అన్న మాటలే చివరి పలుకులు అయ్యాయంటూ బోరున విలపించింది.
నెల క్రితమే ఉద్యోగంలో చేరిక..
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇంటికన్నె గ్రామానికి చెందిన అమరాజు జనార్దన్, ఉపేంద్రల కుమారుడు ప్రశాంత్(23) నెల క్రితమే రూ.2.60 లక్షలు ఇచ్చి స్వప్నలోక్‌లోని ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ప్రశాంత్ మరణవార్త తెలియడంతో తల్లిదండ్రులు విలపించారు. ‘గురువారం సాయంత్రం ఫోన్ చేసి మాట్లాడాడు. రాత్రి పదింటికి మేము ఫోన్ చేస్తే కలవలేదు’ అని తల్లి ఉపేంద్ర విలపిస్తూ చెప్పింది. కాగా, తన స్నేహితులు కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ప్రయతి్నస్తుండగా, ప్రశాంత్ తన ఉద్యోగం వదిలిపెట్టి రెండునెలల పాటు, గ్రామంలోనే ఉంటూ, వారికి కోచింగ్ ఇచ్చాడని గుర్తు చేసుకున్నారు.
చదవండి: హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం
Comments
Please login to add a commentAdd a comment