Victims Name
-
డైవర్ట్ చేయొద్దు.. గుర్లలో YS జగన్ పరామర్శ..
-
అండగా నేనున్నా
సాక్షి తిరుపతి: అధైర్యపడొద్దు.. అండగా నేనున్నానంటూ తుపాను బాధితులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా కల్పించారు. మిచాంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం తిరుపతి, బాపట్ల జిల్లాల్లో పర్యటించి బాధితులను స్వయంగా కలుసుకుని పరామర్శించారు. పంట చేతికొచ్చే సమయంలో రైతన్నకు జరిగిన అపార నష్టాన్ని చూసి సీఎం జగన్ చలించిపోయారు. ఖరీఫ్ సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని, పంట నష్టపోయిన రైతులకు 80% రాయితీతో శనగ విత్తనాలను సరఫరా చేస్తామన్నారు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తీసుకొచ్చిన వాలంటీర్లు, సచివాలయాల వ్యవస్థ ద్వారా పారదర్శకంగా అందరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. విపత్తు వేళ అధికార యంత్రాంగం వెంటనే అప్రమత్తమై బాధిత ప్రాంతాల్లో విద్యుత్తు పునరుద్ధరణకు చర్యలు తీసుకుందన్నారు. గన్నవరం నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్ తొలుత తిరుపతి, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిలాల్లోని తుపాన్ బాధిత ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం కోట మండలం విద్యానగర్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన వాకాడు మండలం బాలిరెడ్డిపాళెం గ్రామానికి చేరుకుని కోతకు గురైన స్వర్ణముఖి నది, వరి పంటలను పరిశీలించారు. స్వర్ణముఖి కోతకు గురి కావటానికి కారణాలను ఆరా తీశారు. బాలిరెడ్డిపాళెంలో తుపాను బాధితులతో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. చెప్పలేనంత బాధగా ఉంది.. 'ఈ ప్రాంతంలో కురిసిన వర్షాలు జిల్లా మొత్తం సగటుతో పోల్చుకుంటే అందులో సగం ఈ నాలుగైదు రోజుల్లోనే కురిసింది. దాదాపు 40 – 60 సెంటీమీటర్ల వర్షం కురిసిన పరిస్థితి. మనందరికీ జరిగిన ఈ నష్టం, కష్టం చెప్పడానికి కూడా సాధ్యపడనంత బాధ కలిగిస్తున్నాయి. ఇక్కడ దాదాపు 92 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసి 8,364 మందిని తరలించాం. 25 కిలోల రేషన్ బియ్యం, కేజీ కందిపప్పు, బంగాళాదుంపలు, ఉల్లిగడ్డలు, లీటరు పామాయిల్ చొప్పున దాదాపు 60 వేల మందికి పైగా బాధితులకు అందచేశాం. ఏ రాష్ట్రంలోనూ లేని వ్యవస్థ మన రాష్ట్రంలో ఒకటి ఉంది. అది.. వలంటీర్ వ్యవస్థ, సచివాలయాల వ్యవస్థ. అందువల్ల ఎవరికి ఎక్కడ ఏ నష్టం జరిగినా ఆందోళన చెందాల్సిన పనిలేదు.' అని సీఎం జగన్ తెలిపారు. 'ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని ప్రతి ఒక్కరికీ భరోసా ఇచ్చి చెబుతున్నా. నాకు నష్టం జరిగింది.. కానీ ఎదుటివాడికి మాత్రమే సాయం వచ్చింది.. నాకు రాలేదని అనుకోవాల్సిన పని లేదు. ఏ ఒక్కరినీ నష్ట పోనివ్వం. ప్రతి ఒక్కరికీ మంచి చేసే కార్యక్రమం జరుగుతుంది. పంపిణీ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. 62 వేల కుటుంబాలకు రేషన్ కిట్లు పంపిణీ చేస్తున్నాం. ప్రతి ఇంటికీ రూ.2,500 చొప్పున డబ్బులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. దానివల్ల ఇళ్లలోకి నీళ్లు వచి్చన వారికి, సామాన్లకు నష్టం జరిగిన వారికి, ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి కాస్తో కూస్తో ఉపశమనం కలుగుతుంది. ఇవాళ మొదలు పెడితే మరో నాలుగు రోజుల్లో ప్రతి ఇంటికీ వలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది వచ్చి ప్రతి ఇంట్లోనూ రూ.2,500 చొప్పున డబ్బులిచ్చే కార్యక్రమాన్ని చేసుకుంటూ వెళతారు. ఈ జిల్లాల్లో స్టాండింగ్ క్రాప్ లేదు కాబట్టి కాస్తో కూస్తో ఊరట. పంటలు వేసి నష్టపోయిన వారికి 80 శాతం సబ్సిడీతో విత్తనాలను అందచేస్తాం. అన్నీ దగ్గరుండి కలెక్టర్లు పర్యవేక్షిస్తారు. ఈ రోజు నుంచి వారంలోగా ప్రతి ఒక్కరికీ జరగాల్సిన మంచి జరుగుతుంది.' అని సీఎం జగన్ చెప్పారు. రెట్టించిన వేగంతో యంత్రాంగం 'తుపాన్ ప్రాంతాల్లో విద్యుత్తును చాలా వేగంగా పునరుద్ధరించారు. యంత్రాంగం అంతా ఇక్కడే నిమగ్నమై రెట్టించిన వేగంతో పని చేస్తున్నారు. ఇంకా కొన్ని కాలనీల్లో విద్యుత్తు లేని పరిస్థితి ఉంటే వలంటీర్ల ద్వారా వివరాలను సేకరించి కలెక్టర్లు సమస్యను పరిష్కరిస్తారు. ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటుందని మరోసారి చెబుతున్నా. ' అని అన్నారు. పాల్గొన్న మంత్రులు, ప్రజా ప్రతినిధులు సీఎం పర్యటనలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, కాకాణి గోవర్థన్‌రెడ్డి, తానేటి వనిత, తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, ఎమ్మెల్యేలు వరప్రసాద్, కిలివేటి సంజీవయ్య, మేకపాటి విక్రమ్‌రెడ్డి, కోనేటి ఆదిమూలం, ఎమ్మెల్సీలు చంద్రశేఖరరెడ్డి, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మేరిగ మురళీధర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, నెల్లూరు జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, స్వచ్ఛాంధ్ర రాష్ట్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ, దామోదర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం మీదే.. 'ఇక్కడికి రాకముందు స్వర్ణముఖి నదిలో కోత కారణంగా ఎలాంటి నష్టం జరిగిందో స్వయంగా చూశా. దానికి శాశ్వత పరిష్కారం వెతకాలని చెప్పా. హైలెవల్ బ్రిడ్జి కడితే బాగుంటుందని, అందుకోసం రూ.30 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. ఈ సమస్యను తీరుస్తూ హైలెవల్ బ్రిడ్జిని శాంక్షన్ చేస్తున్నా. జిల్లాలో 110 చెరువులు ఉండగా కొన్ని చోట్ల కోతకు గురయ్యాయి. రోడ్లు మరమ్మతులు, పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుడతాం. రోడ్లు, ఆర్డబ్ల్యూఎస్, ఆర్అండ్బీ రోడ్ల మరమ్మతుల కోసం రూ.32 కోట్ల ప్రతిపాదనలు అందాయి. యుద్ధ ప్రాతిపదికన దీన్ని చేపట్టే కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ప్రభుత్వం మీది అనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి. ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికీ మంచే జరుగుతుంది. అంతేకానీ చెడు అనేది ఎప్పుడూ జరగదు. ఏ చిన్న సమస్యైనా, వాళ్లకు రావాల్సింది రాని పరిస్థితి ఎక్కడైనా ఎవరికైనా ఉంటే వెంటనే ‘జగనన్నకు చెబుదాం’ 1902 నంబర్‌కు ఫోన్ కొట్టండి. నా ఆఫీస్‌కే ఫోన్ వస్తుంది. తుపాన్ బాధిత ప్రాంతాల్లో అందరికీ అన్నీ అందించే బాధ్యతను కలెక్టర్ తీసుకుంటారు. నాలుగైదు రోజుల్లో వారి దగ్గర నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటా.' అని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ఆ పత్రికలు చదవొద్దు.. అపోహలు నమ్మొద్దు: సీఎం జగన్ -
కుక్క కాటు.. ఒక్కో పంటి గాటుకు రూ.10వేల పరిహారం!
చండీగఢ్: కుక్క కాటు కేసులపై హర్యానా-పంజాబ్ హైకోర్టులు సంచలన తీర్పు వెలువరించింది. కుక్క కాటుపై రాష్ట్ర ప్రభుత్వాలే ప్రధాన బాధ్యత వహించాలని ధర్మాసనం తెలిపింది. కుక్క కాటు కేసుల్లో ఒక్కో పంటి గాటుకు రూ.10,000 నష్టపరిహారం చెల్లించాలని తీర్పు వెలువరించింది. కుక్క కాటు ఘటనల్లో 0.2 సెంటీమీటర్ల కోత పడితే రూ.20,000 బాధితునికి చెల్లించాలని ఆదేశించింది. కుక్క కాటు కేసులో దాఖలైన 193 కేసుల్లో న్యాయస్థానం విచారణ చేపట్టింది. వీధికుక్కల బెడదపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ తీర్పు వెలువడింది. వాఘ్ బక్రీ టీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ 49 ఏళ్ల పరాగ్ దేశాయ్ అక్టోబర్‌లో వీది కుక్కలు వెంబడించిన ఘటనలో మరణించారు. వీధికుక్కలు ఆయన్ని వెంబడించగా పడిపోవడంతో తీవ్ర రక్తస్రావం అయిందని.. ఆ కారణంగా దేశాయ్ మరణించారని సంబంధిత ఆసుపత్రి ఇటీవల ప్రకటనలో పేర్కొంది. ఈ విషాద ఘటన అనంతరం సోషల్ మీడియాలో వీధి కుక్కల సమస్యను పరిష్కరించాలని పెద్ద ఎత్తున చర్చ సాగింది. పంజాబ్, హర్యానా, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌లలో నమోదైన కుక్క కాటు కేసులపై ఒక కమిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టు కోరింది. జంతువుల దాడి కేసుల్లో చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని నిర్ణయించాలని తీర్పులో స్పష్టం చేసింది. అయితే.. వీది కుక్కలతో పాటు ఆవులు, ఎద్దులు, గాడిదలు, గేదెలు, అడవి, పెంపుడు జంతువులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఇదీ చదవండి: Liquor Sale In Delhi: ‘దీపావళి మద్యం’తో ఢిల్లీ సర్కారుకు భారీ ఆదాయం! -
జీవితంలో స్థిరపడేలోపే... నిండు ప్రాణాల్ని మింగేసిన అగ్గి
సాక్షి, వరంగల్: సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో గురువారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఐదుగురు అగి్నకి ఆహుతి అయ్యారు. వరంగల్ జిల్లాకు చెందిన ముగ్గురు.. శ్రావణి (22)...వెన్నెల (22), శివ(22) ఉండగా, మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు. ప్రశాంత్(23), ప్రమీల (23)) ఉన్నారు. మృత్యువాతపడిన ముగ్గురు యువతులకు త్వరలో పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. కానీ తాము జీవితంలో స్థిరపడ్డాక చేసుకుంటామని తల్లిదండ్రులకు చెబుతూ వస్తున్నారు. ఇంతలోనే ఘోరం జరిగి అనంతలోకాలకు వెళ్లారు. కట్నం ఖర్చులు.. సంపాదించిన తర్వాతే పెళ్లంది.. ఇంతలోపే వరంగల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రానికి చెందిన బానోతు నరసింహ, పద్మ కుమార్తె బానోతు శ్రావణి (22) బీటెక్ పూర్తి చేసింది. ఆరు నెలల క్రితం స్వప్నలోక్ కాంప్లెక్స్‌లోని ఓ కంపెనీ కాల్ సెంటర్లో ఉద్యోగం సాధించింది. తల్లిదండ్రులు హైదరాబాద్‌లోనే ఓ హోటల్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పెళ్లి చేస్తామని తల్లిదండ్రులు అంటుండగా ఉద్యోగం చేసి తన కట్నం డబ్బులు సంపాదించి.. జీవితంలో సిరపడ్డాక చేసుకుంటానని చెబుతూ వచి్చంది. కానీ అగ్నిప్రమాదం శ్రావణిని మధ్యలోనే బలితీసుకుంది. కుటుంబానికి ఆసరాగా నిలుస్తుందనుకున్న త్రివేణి మృతితో ఖానాపురంలోని టేకుల తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. వచ్చే ఏడాది పెళ్లి చేద్దామనుకున్నారు.. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన వంగ రవి, లక్ష్మి దంపతులు కుమార్తె వెన్నెల(22)కు వచ్చే ఏడాది పెళ్లి చేద్దామనుకున్నారు. డిగ్రీ వరకు చదివిన వెన్నల స్వప్నలోక్ కాంప్లెక్స్‌లోని ఈ కామర్స్ సెంటర్లో ఉద్యోగం చేస్తోంది. వచ్చే ఏడాది మేనల్లుడికి వెన్నెలను ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకున్నామని, అంతలోనే మాయమైపోయిందని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. సంబంధాలు చూస్తున్నారు.. అంతలోనే. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఎర్రకుంటతండా శివారు సురే‹Ùనగర్‌కు చెందిన జాటోతు భద్రు, బుజ్జిల కూతురు ప్రమీల (23) స్వప్నలోక్ కాంప్లెక్స్‌లోని క్యూ నెట్ అనే కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఏడాదినుంచి కూతురును పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులు అడుగుతున్నారు. ఈ ఏడాది చేసుకుంటా అని చెప్పడంతో తల్లిదండ్రులు సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఘోరం జరిగిపోయింది. నిన్ను చూడబుద్ది అయితంది కొడుకా.. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన ఉప్పుల రాజు, రజిత దంపతుల కుమారుడు శివ (22) మూడేళ్ల క్రితం మలి్టలెవల్ మార్కెటింగ్ (ఈకామర్స్ బిజినెస్)లో చేరాడు. ఉద్యోగం చేస్తూనే బీటెక్ చదువుతున్నాడు. ఈ నెల 15న చెల్లి సింధు బర్త్ డే కావడంతో సాయంత్రం ఇంటికి ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పాడు. ‘నిన్ను చూడబుద్ది అయితంది బిడ్డా...జర వీడియో కాల్ చేయరాదూ’ అని తల్లి రజిత అనడంతో కాస్త ఫ్రీ కాగానే చేస్తానని అన్న మాటలే చివరి పలుకులు అయ్యాయంటూ బోరున విలపించింది. నెల క్రితమే ఉద్యోగంలో చేరిక.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇంటికన్నె గ్రామానికి చెందిన అమరాజు జనార్దన్, ఉపేంద్రల కుమారుడు ప్రశాంత్(23) నెల క్రితమే రూ.2.60 లక్షలు ఇచ్చి స్వప్నలోక్లోని ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ప్రశాంత్ మరణవార్త తెలియడంతో తల్లిదండ్రులు విలపించారు. ‘గురువారం సాయంత్రం ఫోన్ చేసి మాట్లాడాడు. రాత్రి పదింటికి మేము ఫోన్ చేస్తే కలవలేదు’ అని తల్లి ఉపేంద్ర విలపిస్తూ చెప్పింది. కాగా, తన స్నేహితులు కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ప్రయతి్నస్తుండగా, ప్రశాంత్ తన ఉద్యోగం వదిలిపెట్టి రెండునెలల పాటు, గ్రామంలోనే ఉంటూ, వారికి కోచింగ్ ఇచ్చాడని గుర్తు చేసుకున్నారు. చదవండి: హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం -
రేప్ కేసుల్లో బాధితుల పేర్లు వెల్లడిస్తే..
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్ రేప్ కేసులో దళిత యువతి పేరు బహిర్గతం కావడం పట్ల కూడా వివాదం చెలరేగుతోన్న విషయం తెల్సిందే. ఈ విషయంలో పేరు బహిర్గతం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్, దళిత పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. మహిళలపై అత్యాచారానికి సంబంధించి భారతీయ శిక్షాస్మృతిలోని 376, 376 ఏ, 376 బీ, 376 సీ, 376 డీ సెక్షన్ల కింద నమోదయ్యే కేసుల్లో బాధితురాళ్ల పేర్లు బహిర్గతం చేయడం ఐపీసీలోని 228 ఏ సెక్షన్ కింద నేరం. ఈ నేరానికి పాల్పడినవారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష, జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధించవచ్చు. ఈ విషయంలో సుప్రీం కోర్టు కూడా పలు సార్లు మార్గదర్శకాలను విడుదల చేసింది. (ఇందిర గుర్తొస్తోంది : ఐరన్ లేడీ ఈజ్ బ్యాక్) బాధితుల అనుమతి లేకుండా వారి పేర్లను బహిర్గతం చేయరాదు. బాధితురాలి ముందస్తు అనుమతితో బహిర్గతం చేయవచ్చు. బాధితులు మరణించిన పక్షంలో కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన స్వచ్ఛంద సంక్షేమ సంఘం నుంచి లిఖిత పూర్వక అనుమతితోపాటు బాధితుల సమీప బంధువుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందన్నది సుప్రీం కోర్టు మార్గదర్శకాల సారాంశం. ఈ విషయంలో వార్తా పత్రికలు, ఆడియో, విజువల్ మీడియాలు కచ్చితంగా మార్గదర్శకాలను పాలించాలని కూడా సుప్రీం కోర్టు సూచించింది. -
ఆ తీర్పుల్లో మహిళల పేర్లు వెల్లడించరాదు
న్యూఢిల్లీ: అత్యాచార కేసులో న్యాయమూర్తులు తీర్పులు ఇచ్చే సమయంలో బాధిత మహిళల పేర్లను వెల్లడించరాదని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. ఇది సమాజంలో వారి ఆత్మగౌరవంపై ప్రభావం చూపుతుందని తెలిపింది. జిల్లా న్యాయస్థానం 2013 అక్టోబర్ 21 న ఓ కేసుకు సంబంధించి వెలువరించిన తీర్పులో బాధితురాలి పేరును ప్రస్తావించడాన్ని జస్టిస్ ఎస్ పీ గార్గ్ గుర్తించారు. జిల్లా, ప్రత్యేక న్యాయ స్థానాలు బాధిత మహిళ పేరును వెల్లడించాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది.