అత్యాచార కేసులో న్యాయమూర్తులు తీర్పులు ఇచ్చే సమయంలో బాధిత మహిళల పేర్లను వెల్లడించరాదని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది.
జిల్లా న్యాయస్థానం 2013 అక్టోబర్ 21 న ఓ కేసుకు సంబంధించి వెలువరించిన తీర్పులో బాధితురాలి పేరును ప్రస్తావించడాన్ని జస్టిస్ ఎస్ పీ గార్గ్ గుర్తించారు. జిల్లా, ప్రత్యేక న్యాయ స్థానాలు బాధిత మహిళ పేరును వెల్లడించాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది.