
వరంగల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రానికి చెందిన బానోతు నరసింహ, పద్మ అలియాస్ రాంబాయి దంపతుల మొదటి కుమార్తె బానోతు శ్రావణి (22). కోదాడలోని ఓ కళాశాలలో బీటెక్ పూర్తి చేసిన ఆమె ఆర్నెళ్ల క్రితం స్వప్నలోక్ కాంప్లెక్స్‌లోని ఓ కంపెనీ కాల్ సెంటర్‌లో ఉద్యోగం సాధించింది. తల్లిదండ్రులు పెళ్లి చేస్తామంటే ‘ఉద్యోగం చేస్తున్నానని.. జీవితంలో సిరపడ్డాక చేసుకుంటానని’ చెప్పింది.
చిన్న ఇల్లు తప్ప మరేమీ ఆస్తి లేని వీరి కుటుంబం నాలుగేళ్ల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లింది. అక్కడే హోటల్‌లో పని చేసుకుంటూ శ్రావణి కుటుంబం జీవనం సాగిస్తోంది. తమ్ముడు, చెల్ల్లి చదువుల కోసం, కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు శ్రావణి ఉద్యోగం చేస్తూ వస్తోంది. ఈక్రమంలో గురువారం జరిగిన ఘటనలో శ్రావణి మృతితో ఆ కుటుంబంలో, ఖానాపురంలోని టేకులతండాలో విషాదం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment