lokesh kumar
-
జీహెచ్ఎంసీ అడ్డగోలు నోటీసులు}
సాక్షి, సిటీబ్యూరో: ‘తిమ్మిని బమ్మి చేసే సత్తా వారి సొంతం. వారు తల్చుకుంటే లక్షల రూపాయల ఆస్తిపన్ను వేలల్లోనే వస్తుంది. వందల్లో రావాల్సింది వేలల్లో కూడా అవుతుంది’.. జీహెచ్ఎంసీ బిల్కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్ల గురించి సామాన్య జనానికి ఉన్న అభిప్రాయం ఇది. ఈ పరిస్థితిని నివారించేందుకే గతంలో ఆస్తిపన్ను అసెస్మెంట్ల కోసం ప్రజల ఇళ్ల వద్దకు ట్యాక్స్ సిబ్బంది వెళ్లవద్దని అప్పటి కమిషనర్ లోకేశ్‌కుమార్ ఆదేశించారు. ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాల్సిందిగా ప్రజలకు సూచించారు. ఆ విధానం వల్ల ఏ డాక్యుమెంట్లు పెట్టినా ఆస్తిపన్ను గుర్తింపు నంబరు(పీటీఐఎన్) జనరేట్ కావడంతో పాటు చివరకు జీహెచ్ఎంసీ భవనాలను సైతం ఎవరైనా తమ ఆస్తిగా చూపించుకునే అవకాశం ఏర్పడటంతో దానికి స్వస్తి పలికారు. మరోవైపు.. జీహెచ్ఎంసీకి వస్తున్న ఆదాయానికి, ఖర్చులకు హస్తిమశకాంతరం వ్యత్యాసం ఉండటంతో.. ఆదాయం పెంచుకునే చర్యల్లో భాగంగా తిరిగి అసెస్మెంట్ను ట్యాక్స్ సిబ్బంది ‘సుమోటో’గానే చేసేందుకు గత జూలైలో ఆదేశించారు. దీంతో ఎంతోకాలం చేతులు కట్టిపడేసినట్లున్న ట్యాక్స్ సిబ్బందికి ఒక్కసారిగా వెయ్యేనుగుల బలం వచ్చినట్లయింది. ఇంకేముంది? అసెస్మెంట్ చేసుకోవాల్సిందిగా కొత్త భవనాల వద్దకు, అసెస్మెంట్లలో వ్యత్యాసాలున్నాయంటూ అన్ని భవనాల ప్రజల వద్దకు వెళ్తున్నారు. వారి వైఖరికి ఆసరానిస్తూ సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు నోటీసులు జారీ చేస్తున్నారు. చెప్పిందొకటి.. చేస్తున్నదొకటి ఆస్తిపన్ను ద్వారా ఆదాయం పెంచుకునే చర్యల్లో భాగంగా.. తేడాలున్నట్లు గుర్తించిన వాణిజ్య భవనాలను, అదనపు అంతస్తులు వెలసిన ఇతరత్రా భవనాలను గుర్తించి నిజమైన ఆస్తి పన్ను విధించాల్సిందిగా సంబంధిత ఉన్నతాధికారులు సూచించారు. ట్యాక్స్ సిబ్బంది మాత్రం నివాస, వాణిజ్య భవనం అన్న తేడా లేకుండా.. అదనపు అంతస్తులు నిర్మించినా, నిర్మించకున్నా జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 213 కింద నోటీసులిచ్చేస్తున్నారు. సదరు సెక్షన్ మేరకు సరైన ఆస్తిపన్ను నిర్ధారించేందుకు జీహెచ్ఎంసీ కోరిన వివరాల్ని భవన యజమానులు లేదా ఆక్యుపైయర్లు తెలియజేయాలి. లక్ష్యం ఒకటి.. పని మరొకటి నిజమైన ఆస్తిపన్ను కట్టకుండా లక్షలు, కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తున్నవారి నుంచి సరైన ఆస్తిపన్ను వసూలు చేయడం, ఇప్పటికే ఉన్న భవనాల మీద కొత్తగా నిర్మించిన అదనపు అంతస్తులను ఆస్తిపన్ను పరిధిలోకి తేవడం ద్వారా ఆస్తిపన్ను ఆదాయం పెంచుకోవాలనేది ఉన్నతాధికారుల లక్ష్యం. దీంతోపాటు దశాబ్దం క్రితం జరిగిన కంప్యూటరీకరణ సందర్భంగా చాలా ఇళ్ల ప్లింత్ ఏరియా ఎంత ఉందో నమోదు చేయలేదు. అలాంటి వాటి ప్లింత్ ఏరియాను ఆన్లైన్లో నమోదు చేసేందుకు వివరాలు సేకరించాల్సి ఉండగా.. అన్ని ఇళ్లనూ ఒకే గాటన కట్టి నోటీసులిస్తూ సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఎక్కువ ఆస్తిపన్నును తక్కువ చేస్తామంటూ ట్యాక్స్ సిబ్బంది జేబులు నింపుకొంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లేని పక్షంలో ఎక్కువ ఆస్తిపన్ను కట్టాలంటూ బెదరగొడుతున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నోటీసులిలా.. భవనం లేదా స్థలం.. యజమానులు కానీ ఆక్యుపైయర్లు కానీ ఏడు రోజుల్లోగా దిగువ పత్రాలు, సమాచారం అందజేయాలని నోటీసుల్లో పేర్కొంటున్నారు. 1. సేల్ డీడ్ 2. లింక్ డాక్యుమెంట్ (ఏదైనా ఉంటే) 3. మంజూరు ప్లాన్/అనుమతి కాపీ 4. ఎప్పటి నుంచి ఉంటున్నారు ? 5.ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ 6. టాక్స్ రసీదు 7. రిజిస్టర్డ్ లీజ్ డీడ్(ఏదైనా ఉంటే) లేదా రెంటల్ అగ్రిమెంట్ 8. భవనం కలర్ ఫొటో దశాబ్దాల క్రితం నిర్మాణ అనుమతులు పొందిన వారిలో చాలామంది వద్ద పైన పేర్కొన్న డాక్యుమెంట్లన్నీ అందుబాటులో లేవు. కొన్ని భవనాలు చాలామంది చేతులు మారాయి. వాటన్నింటినీ ఇప్పుడెలా తేవాలో తెలియక వారు ఆందోళనకు గురవుతున్నారు. -
నాలుగేళ్లుగా ఫుడ్ డెలివరీ చేస్తున్నా! ఇప్పుడిలా వరల్డ్‌కప్ జట్టు క్యాంపులో..
ICC ODI World Cup 2023: ‘‘నా కెరీర్లో అత్యంత విలువైన క్షణాలు ఇవే. నేనింత వరకు కనీసం.. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ థర్డ్ డివిజన్ లీగ్‌లో కూడా ఆడలేదు. నాలుగేళ్లపాటు ఐదో డివిజన్లో ఆడాడు. ఈసారి నాలుగో డివిజన్లో ఆడేందుకు రిజిస్టర్ చేసుకున్నాను. నెదర్లాండ్స్ నెట్ బౌలర్‌గా ఎంపికయ్యానని తెలియగానే.. ఎట్టకేలకు నా ప్రతిభను గుర్తించే వాళ్లు కూడా ఉన్నారనే భావన కలిగింది’’ అని తమిళనాడుకు చెందిన లోకేశ్ కుమార్ భావోద్వేగానికి లోనయ్యాడు. సాధారణ కుటుంబంలో జన్మించిన లోకేశ్‌కు క్రికెటర్‌గా ఎదగాలని ఆశయం. వేలాది మందిలో నలుగురు.. అందులో ఒక్కడు ఈ క్రమంలో ఎనిమిదేళ్ల క్రితం పేసర్‌గా తన ప్రయాణం మొదలుపెట్టాడతడు. అయితే, కాలక్రమంలో చైనామన్ స్పిన్నర్‌గా మారాడు. తన నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరచుకుంటున్న లోకేశ్‌కు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడాలనేది చిరకాల కోరిక. అక్కడ ప్రతిభ నిరూపించుకుంటే.. అదృష్టం కలిసివస్తే ఏదో ఒకరోజు టీమిండియాకు కూడా ఆడొచ్చనే ఆశ. ఈ క్రమంలో.. వన్డే వరల్డ్‌కప్-2023 ప్రాక్టీసులో భాగంగా తమకు భారత నెట్ బౌలర్లు కావాలని నెదర్లాండ్స్ క్రికెట్ బోర్డు ఇచ్చిన ప్రకటన అతడిలో ఉత్సాహాన్ని నింపింది. ఈ క్రమంలో తన అర్హతలను జోడిస్తూ అప్లికేషన్ పెట్టుకోగా.. వేలాది మందిలో నలుగురు ఫైనలిస్టులలో ఒకడిగా ఎంపికయ్యాడు. ఆటగాళ్లకు పరిచయం చేస్తూ హైదరాబాదీ రాజమణి ప్రసాద్, రాజస్తాన్ హైకోర్టు ఉద్యోగి హేమంత్ కుమార్, హర్యానాకు చెందిన హర్ష్ శర్మలతో పాటు నెదర్లాండ్స్ క్యాంపులో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా మొదటి ట్రెయినింగ్ సెషన్లో భాగంగా.. ఈ నలుగురిని తమ ఆటగాళ్లకు పరిచయం చేసింది మేనేజ్మెంట్. కాగా పొట్టకూటి కోసం లోకేశ్ కుమార్ స్విగ్గీలో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. ఓవైపు ఉద్యోగం చేసుకుంటూనే తన కలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఈ నేపథ్యంలో నెదర్లాండ్స్ ఇచ్చిన ఆఫర్ గురించి టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ఆత్మీయ స్వాగతం పలికారు.. డచ్ ఫ్యామిలీలో ఒకడినని ‘‘నెదర్లాండ్స్ జట్టు సభ్యులు నన్ను తమలో ఒకడిగా భావించి ఆత్మీయ స్వాగతం పలికారు. నెట్ బౌలర్ల పరిచయ కార్యక్రమం కూడా నిర్వహించారు. ఇది మీ జట్టు.. ఇక్కడ మీరు స్వేచ్ఛగా ఆడవచ్చు అని మమ్మల్ని ప్రోత్సహించారు. నాకైతే ఇప్పుడే డచ్ ఫ్యామిలీలో సభ్యుడినయ్యానన్న భావన కలిగింది’’ అని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ‘‘కాలేజీ చదువు తర్వాత నా దృష్టి మొత్తం క్రికెట్ మీదే పెట్టాను. నాలుగేళ్లపాటు మొత్తం అంతా క్రికెట్ కోసమే. అయితే, 2018లో ఏదైనా ఉద్యోగం చేయాలని భావించాను. గత నాలుగేళ్లుగా స్విగ్గీలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాను. అలా నాకు కావాల్సిన డబ్బు నేను సంపాదించుకుంటున్నాను. ఇది తప్ప నాకు మరో ఆదాయ వనరు లేదు. వీకెండ్స్‌లో మ్యాచ్‌లు ఉంటాయి కాబట్టి వీక్‌డేస్‌లోనే పనిచేస్తాను’’ అంటూ తన ఆర్థిక స్థితి గురించి లోకేశ్ చెప్పుకొచ్చాడు. నెదర్లాండ్స్ క్రికెట్‌పై నెటిజన్ల ప్రశంసలు కాగా ఐదోసారి వన్డే ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించిన నెదర్లాండ్స్ జట్టు.. ప్రస్తుతం బెంగళూరులోని ఆలూరులో ట్రెయినింగ్ క్యాంపు నిర్వహిస్తోంది. మెరుగైన స్థితిలో నిలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న డచ్ టీమ్.. సెప్టెంబరు 29న పాకిస్తాన్‌తో తొలి వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఈ క్రమంలో భారత నెట్ బౌలర్లను నియమించుకుని కావాల్సినంత ప్రాక్టీస్ చేస్తోంది. ఈ నేపథ్యంలో లోకేశ్ లాంటి ఆశావహులకు ఛాన్స్ ఇచ్చిన నెదర్లాండ్స్ మేనేజ్మెంట్పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా నెట్ బౌలర్‌కే ఇంత హైప్ అవసరమా అంటే.. కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ వంటి ఆటగాళ్ల ప్రయాణాన్ని ఒక్కసారి గుర్తుతెచ్చుకోవచ్చు. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో నెట్ బౌలర్‌గా ఎంట్రీ ఇచ్చి.. ప్రతిభ నిరూపించుకుని టీమిండియాకు ఎంపికై సత్తా చాటిన అతడు లోకేశ్ లాంటి వాళ్లకు ఆదర్శం. చదవండి: నెక్ట్స్ సూపర్‌స్టార్.. మరో కోహ్లి కావాలనుకుంటున్నాడు: సురేశ్ రైనా Our first training session in India for the #CWC23 began with a small induction ceremony for our four new net bowlers from different parts of India. 🙌 pic.twitter.com/ug0gHb73tn — Cricket🏏Netherlands (@KNCBcricket) September 20, 2023 -
WC: స్విగ్గీ డెలివరీ బాయ్, హైకోర్టు ఉద్యోగి.. నెదర్లాండ్స్ నెట్‌బౌలర్లుగా మనోళ్లు
ICC ODI WC 2023- Netherlands Net Bowlers: ‘‘మాకు భారత నెట్ బౌలర్లు కావాలి.. ఈ అర్హతలు ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు..’’ వన్డే వరల్డ్‌కప్-2023 సన్నాహకాల్లో భాగంగా భారత్‌లో అడుగుపెట్టిన నెదర్లాండ్స్ జట్టు ఇచ్చిన ఈ ప్రకటన గుర్తుండే ఉంటుంది. భారత పౌరుడై.. 18 ఏళ్లకు పైబడి గంటకు 120 కిలోమీటర్ల వేగంలో బౌలింగ్ చేయగల పేసర్లు.. గంటకు 80 కి.మీ వేగంతో బంతిని విసరగల స్పిన్నర్లకు పెద్దపీట వేస్తామని పేర్కొంది. సోషల్ మీడియా వేదికగా డచ్ క్రికెట్ బోర్డు ఇచ్చిన ఈ ప్రకటనకు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఈ విషయంపై హర్షం వ్యక్తం చేసిన నెదర్లాండ్స్ క్రికెట్ జట్టు.. దరఖాస్తులన్నింటినీ పరిశీలించి అర్హులైన నలుగురిని తమ నెట్ బౌలర్లుగా ఎంచుకుంది. తమ అవసరాలకు అనుగుణంగా ఇద్దరు లెఫ్టార్మ్ పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లను సెలక్ట్ చేసుకుంది. ఇందులో స్విగ్గీ డెలివరీ బాయ్ కూడా ఉన్నాడు. ఆ నలుగురి వివరాలివే! 1. రాజమణి ప్రసాద్.. లెఫ్టార్మ్ పేసర్ ►హైదరాబాద్, తెలంగాణ ►హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున ఆడిన అనుభవం ►ప్రస్తుతం చెన్నై సూపర్‌కింగ్స్ నెట్ బౌలర్‌గా ఉన్నాడు. 2. హేమంత్ కుమార్- లెఫ్టార్మ్ పేసర్ ►చురు, రాజస్తాన్ ►రాజస్తాన్ హైకోర్టులో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ►2022, 2023 సీజన్లలో రాజస్తాన్ రాయల్స్ అతడిని నెట్‌బౌలర్‌గా నియమించుకుంది. 3. హర్ష్ శర్మ.. లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ ►కురుక్షేత్ర, హర్యానా ►నార్త్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ చాంపియన్‌షిప్ విజేత.. ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ చాంపియన్‌షిప్ రన్నరప్ ►2022లో ఆర్సీబీ క్యాంపులో నెట్‌బౌలర్‌గా సేవలు అందించాడు. 4. లోకేశ్ కుమార్- మిస్టరీ బౌలర్ ►చెన్నై, తమిళనాడు ►జీవనోపాధి కోసం పగలంతా స్విగ్గీలో లోకేశ్ పని ►ఐపీఎల్లో ఆడాలనే ఆశయం ►ఎనిమిదేళ్ల క్రితం పేసర్‌గా మొదలైన లోకేశ్ ప్రస్తుతం మిస్టరీ స్పిన్నర్‌గా మారాడు. ఇదిలా ఉంటే... హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో పాకిస్తాన్‌తో సెప్టెంబరు 29న నెదర్లాండ్స్ తమ తొలి వార్మప్ మ్యాచ్ ఆడనుంది. చదవండి: నెక్ట్స్ సూపర్‌స్టార్.. మరో కోహ్లి కావాలనుకుంటున్నాడు: సురేశ్ రైనా Thank you for the overwhelming response to our net bowlers hunt, India. Here the 4 names who will be part of the team's #CWC23 preparations. 🙌 @ludimos pic.twitter.com/arLmtzICYH — Cricket🏏Netherlands (@KNCBcricket) September 19, 2023 Our first training session in India for the #CWC23 began with a small induction ceremony for our four new net bowlers from different parts of India. 🙌 pic.twitter.com/ug0gHb73tn — Cricket🏏Netherlands (@KNCBcricket) September 20, 2023 -
తెలంగాణ ఎన్నికల అదనపు కమిషనర్‌గా లోకేష్ కుమార్ బదిలీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లో ఖాళీగా ఉన్న ప్రధాన పోస్టుల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా సీఈసీ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ అదనపు కేంద్ర ఎన్నికల ప్రధానాధికారిగా లోకేష్ కుమార్‌ను నియమించింది. తాజాగా దీనికి సంబంధించి తెలంగాణ గవర్నర్ తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, లోకేష్ కుమార్ ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కొత్త కమిషనర్‌గా 2006 బ్యాచ్‌కు చెందిన IAS అధికారి రోనాల్డ్ రోస్ నియమితులయ్యారు. అలాగే ఎక్సైజ్ శాఖ కమిషనర్‌గా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్‌ను సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారిగా నియమితులయ్యారు. 2014 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి Md. ముషారఫ్ అలీ ఫరూఖీకి ప్రొహిబిషన్ & ఎక్సైజ్ డైరెక్టర్ పదవిని కేటాయించారు. చదవండి: తెలంగాణ బీజేపీ చీఫ్ పదవికి బండి సంజయ్ రాజీనామా -
లోకేశ్‌కుమార్ బదిలీ.. జీహెచ్ఎంసీ నెక్ట్స్ బాస్ ఎవరో?
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేశ్‌కుమార్ అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌గా వెళ్లనుండటంతో కొత్త కమిషనర్ ఎవరన్నది చర్చనీయాంశంగా మారింది. లోకేశ్‌కుమార్ జీహెచ్ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించి మూడున్నరేళ్లు దాటింది. మరో రెండు నెలలైతే నాలుగేళ్లు పూర్తయ్యేవి. రాష్ట్ర అసెంబ్లీకి మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో బదిలీలు అనివార్యంగా మారాయి. కొత్త కమిషనర్‌గా ఆర్థికశాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందనరావు, ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, వాటర్‌బోర్డు ఎండీ దానకిశోర్, మేడ్చ ల్ జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక పేర్లు వినిపిస్తున్నాయి. వీరితో పాటు గతంలో జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్‌గా పని చేసిన హరిచందన పేరు కూడా ప్రచారంలో ఉంది. ఏ పేర్లు వినబడినప్పటికీ, అన్నీ ఊహాగానాలే తప్ప నియామకం జరిగేంతదాకా చెప్పలేమని ప్రభుత్వ తీరు తెలిసిన వారు చెబుతున్నారు. జీహెచ్ఎంసీ చరిత్రలోనే ఎక్కువ కాలం జీహెచ్ఎంసీ చరిత్రలోనే అత్యధిక కాలం కమిషనర్‌గా ఉన్న డీఎస్ లోకేశ్‌కుమార్ తన పనేమిటో తాను.. అన్నట్లుగా పనులు చేసుకుంటూ పోయారు. బయట హడావుడి, హంగామా లేకుండా అంతర్గతంగా పనులు చేయించడంలో తనదైన ముద్ర వేశారు. తరచూ ఫోన్ కాన్ఫరెన్స్‌లు, గూగుల్ మీట్ వంటి వాటితో ఎప్పటికప్పుడు పనులు చేయించేవారు. ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినా జీహెచ్ఎంసీలో నెలనెలా జీతాలకు ఇబ్బందులెదురైనప్పటికీ, నయానో భయానో ట్యాక్స్ సిబ్బందితో, ఇతరత్రా పన్నుల వసూళ్లు జరిగేలా చూసేవారు. ఎస్సార్డీపీతో సహా వివిధ ప్రాజెక్టుల పనులు కుంటుపడకుండా చేయగలిగారు. ఎవరెన్నివిమర్శలు చేసినా, క్షేత్రస్థాయిలో తిరగరనే ఆరోపణలున్నా పట్టించుకునేవారు కాదు. ఎలాంటి హడావుడి లేకుండానే నగరంలో క్షేత్రస్థాయి పరిస్థితులు పరిశీలించేవారు. ప్రభుత్వం నుంచి, పైఅధికారుల నుంచి అందిన ఆదేశాలకనుగుణంగా పనులు చేసేవారని చెబుతారు. ఎలాంటి సమాచారం, ప్రచారం లేకుండానే నిశ్శబ్దంగా తాను చేయాల్సిన పనులేవో చేసుకుంటూపోయేవారు. చదవండి: అంతర్గత విబేధాలు.. సైలెంట్ మోడ్‌లోకి ఎమ్మెల్యే రఘునందన్ రావు -
తెలంగాణ: సమీపిస్తున్న ఎన్నికలు.. కీలక పోస్టులకు సీఈసీ నియామకాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లో ఖాళీగా ఉన్న రెండు ప్రధాన పోస్టుల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. దీర్ఘకాలిక సెలవులో ఉన్న టీ రవికిరణ్ స్థానంలో డీఎస్ లోకేష్ కుమార్‌ను అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌గా, మరో సీనియర్ IAS అధికారి సర్ఫరాజ్ అహ్మద్‌ను జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌గా నియమిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ మేరకు తెలంగాణ సీఎస్‌కు బుధవారం లేఖ రాసింది. కాగా, లోకేష్ కుమార్ ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అదే విధంగా తెలంగాణ ప్రొహిబిషన్, ఎక్సైజ్ కమిషనర్ బాధ్యతల్లో ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారిగా ఐఏఎస్ వికాస్ రాజ్ కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా.. ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణలో రాజకీయ కలాహలం కనిపిస్తోంది. దీంతో ఎన్నికల ప్రక్రియను ప్రారంభించేందుకు, నోటిఫికేషన్ విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఎన్నికల సన్నద్దతపై వారం రోజుల క్రితం కేంద్ర ఎన్నికల ఉన్నతాధికారులు రాష్ట్రంలో పర్యటించి సీఎస్, డీజీపీ, కలెక్టర్లతో సమావేశమయ్యారు. ఈ ఏడాది అక్టోబర్‌లో తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. -
హైదరాబాద్‌లో మరో ఫ్లైఓవర్.. ఎయిర్‌పోర్ట్‌కు సాఫీగా జర్నీ
సాక్షి, హైదరాబాద్: శిల్ప లేఅవుట్ ఫ్లైఓవర్ పనులు పూర్తయ్యాయని, తుది మెరుగులు దిద్ది ఈ నెలాఖరులో ప్రారంభానికి సిద్ధం చేయనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చాక ఐటీ ప్రాంతానికి రాకపోకలు మరింత సులభం కానున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు, ఔటర్ రింగు రోడ్డు ద్వారా గచ్చిబౌలి వరకు ఎలాంటి సమస్యలు లేకపోగా, కొత్త ఫ్లై ఓవర్ అక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు సైతం సాఫీ ప్రయాణం సాధ్యం కానుందని పేర్కొన్నారు. (క్లిక్ చేయండి: కదిలే ఇల్లు! ధర తక్కువ...ఎక్కడికైనా తీసుకుపోవచ్చు) దీనివల్ల జూబ్లీహిల్స్, పంజగుట్టల నుంచి గచ్చిబౌలి మీదుగా పటాన్చెరు కోకాపేట్, నార్సింగి, అంతర్జాతీయ విమానాశ్రయం వరకు వెళ్లేందుకు.. అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జూబ్లీహిల్స్, పంజాగుట్ట, కూకట్పల్లి, మాదాపూర్ తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు సాఫీ ప్రయాణం సాధ్యం కానుందని పేర్కొన్నారు. -
బల్దియా బడ్జెట్ రూ.6150 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రహదారుల మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యమిస్తూ వాటికే ఎక్కువ నిధులు కేటాయిస్తూ మొత్తం రూ.6150 కోట్లతో జీహెచ్ఎంసీ 2022–23 బడ్జెట్‌ను ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీంగా ఆమోదించారు. ఏ, బీలుగా బడ్జెట్‌ను రూపొందించినప్పటికీ, కేవలం ‘ఏ’లోని జీహెచ్ఎంసీకి చెందిన నిధులనే సమావేశంలో ప్రస్తావించి ఆమోదం తెలిపారు. అభివృద్ధి, మౌలికవసతులకు ప్రాధాన్యమిచ్చినట్లు బడ్జెట్ ప్రసంగంలో మేయర్ విజయలక్ష్మి తెలిపారు. వరద నివారణ పనులకు రూ.540 కోట్లు ఖర్చు చేయనున్నారు. . మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్లు, వైకుంఠ ధామాలు, ఎప్ఓబీలు, మోడర్న్ మార్కెట్లు, థీమ్‌పార్కులు తదితరమైన వాటికి ప్రాధాన్యమిచ్చారు. కమిషనర్ లోకేశ్‌కుమార్ సభ్యుల ప్రశ్నలకు సమాధానంగా ఎస్సార్డీపీ పనులతోపాటు ఇంజినీరింగ్ మెయింటెనెన్స్ పనులకు సైతం ఎక్కువ నిధులే చెల్లించామన్నారు. 70 వేల డబుల్ బెడ్రూం ఇళ్లు పూర్తయ్యాయని, ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాగానే లబ్ధిదారులకు కేటాయిస్తామన్నారు. సొంత స్థలాల్లో ఇళ్లు కట్టుకునేవారి కోసం రాష్ట్రబడ్జెట్లోని కేటాయింపుల్లో జీహెచ్ఎంసీకి దాదాపు రూ. 700 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఎస్ఎన్డీపీ పనులకు రూ. 400 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. (క్లిక్: బస్తీల వాసుల పాలిట శాపంగా కలుషిత జలాలు) -
18 ఏళ్లు నిండాయా? ఓటరుగా నమోదు చేయించుకోండి
సాక్షి, హైదరాబాద్: జనవరి 1, 2022 నాటికి 18 సంవత్సరాలు నిండే ప్రతి ఒక్కరూ ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ సూచించారు. ఓటరు జాబితాపై అభ్యంతరాలపై ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించే ప్రత్యేక ప్రచార కార్యక్రమం సందర్భంగా తెలియజేయవచ్చన్నారు. పేరు, చిరునామా వంటి వాటిల్లో పొరపాట్లుంటే సరిచేసుకునే వెసులుబాటు ఉందన్నారు. బుధవారం ఓటరు జాబితా సవరణపై స్వీప్ కమిటీ సభ్యులతో లోకేశ్‌కుమార్ వర్చువల్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటరుగా పేరు నమోదు, ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి చిరునామా మార్పుల కోసం సంబంధిత ఈఆర్ఓను సంప్రదించవచ్చని సూచించారు. ఓటరు నమోదు యాప్ ద్వారా కూడా పేరు నమోదు చేసుకోవచ్చన్నారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ (ఎన్నికలు) పంకజ పాల్గొన్నారు. చదవండి: ఎన్నారైనంటూ ప్రేమ, సహజీవనం.. ఆపై బ్లాక్‌మెయిలింగ్ -
‘వరద సాయం: మీసేవా కేంద్రాలకు వెళ్లద్దు’
సాక్షి, హైదరాబాద్: నగరంలో వరద సాయం రూ. 10 వేల కోసం బాధితులు సోమవారం ఉదయం నుంచి పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని పలు మీసేవా కేంద్రాల వద్ద బాధితులు బారులు తీరారు. ఈ క్రమంలో తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదంటూ మీసేవా కేంద్రాల నిర్వాహకులు తెలియాజేస్తున్నారు. వరద సాయం బాధితులు భారీగా రావడంతో నిర్వాహకులు మీసేవా కేంద్రాలకు తాళాలు వేశారు. దీంతో పెద్ద సంఖ్యలో మీసేవా కేంద్రాల వద్ద ఆందోళన నేలకొంది. మీసేవా కేంద్రాల వద్ద బాధితుల క్యూ పెరగడంతో జీహెచ్ఎంసీ కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ స్పందించారు. వరద సాయంపై ఆయన కీలక ప్రకటన చేశారు. వరద సాయం కోసం బాధితులు మీ సేవా కేంద్రాలకు వెళ్లవద్దని పేర్కొన్నారు. నగరంలో జీహెచ్ఎంసీ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని వెల్లడించారు. వరద సాయం కోసం బాధితుల వివరాలు సేకరిస్తారని తెలిపారు. బాధితుల వివరాలు, ఆధార్ నంబర్ ధ్రువీకరించిన తర్వాత వరద బాధితుల అకౌంట్లో డబ్బు జమఅవుతాయిని ఆయన వెల్లడించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో నగరంలో వరద బాధిత కుటుంబాలకు అందిస్తున్న సాయాన్ని వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా, సీఎం కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ.. డిసెంబర్ 7 నుంచి అర్హులైనవారందరికీ రూ.10వేల వరద సాయం అందజేస్తామన్న సంగతి తెలిసిందే. -
జీహెచ్ఎంసీ ఎన్నికలకు రంగం సిద్ధం
-
డిసెంబర్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు?
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. డిసెంబర్ మొదటివారంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ యోచిస్తోంది. అన్ని రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ గురువారం సమావేశమైంది. ఆయా పార్టీల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్న ఎస్ఈసీ... దీపావళి పండుగ అనంతరం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ పద్ధతిలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ ఎన్నికలను అధికార టీఆర్ఎస్తో పాటు విపక్షాలు సైతం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. చదవండి: జీహెచ్ఎంసీ ఎన్నికలపై పార్టీలతో భేటీ మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం మంత్రులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. దుబ్బాక ఉప ఎన్నిక ఓటమి, ఎమ్మెల్సీ, గ్రేటర్ ఎన్నికలపై చర్చించారు. ఈ సమావేశానికకి ఎంపీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. వార్డుల విభజనలో అవకతవకలు గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ పరిధిలో జరిగినట్లు ఫోరం ఫర్ గుడ్‌గవర్నెన్స్ సంస్థ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ లోపాలను సరిదిద్దాలని విజ్ఞప్తి చేసినట్లు సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. వార్డుల వారీగా ఈనెల 7న జారీచేసిన ఓటరు పట్టికలను పరిశీలిస్తే వార్డుల విభజన చట్టంలో పేర్కొన్న విధంగాలేదని ఆక్షేపించింది. ఈ సందర్భంగా గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి మాట్లాడుతూ.. కొన్ని వార్డుల్లో ప్రజలకు నష్టం, మరికొన్ని వార్డుల్లో ప్రజలకు లాభం కలుగుతుందని తెలిపారు. చట్టం ప్రకారం వార్డు వారీగా సగటు ఓట్లు 49,360 కాగా.. 140 వార్డుల్లో ఉండాల్సిన ఓటర్ల కంటే ఎక్కువగా లేదా తక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోందన్నారు. కేవలం పది వార్డుల్లో మాత్రమే చట్టం ప్రకారం ఓటర్లున్నారని సంఘం కార్యదర్శి పద్మనాభరెడ్డి తెలిపారు. చదవండి: ‘గ్రేటర్’ ఎన్నికలకు తొందరొద్దు వార్డుల విభజనలో అసమతుల్యం కారణంగా ఆయా వార్డులకు బడ్జెట్ కేటాయింపుల్లో వ్యత్యాసాలు భారీగా ఉండి ఆయా ప్రాంతాల ప్రజలకు అన్యాయం జరిగే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉదాహరణకు మైలార్‌దేవ్‌పల్లి(59)వార్డులో 79,290 మంది ఓటర్లుండగా.. రామచంద్రాపురం(112)లో 27,831 మంది ఓటర్లున్నారన్నారు. బాధ్యతారాహిత్యంగా వార్డుల విభజన చేపట్టడం వల్లే ఈ అక్రమాలు వెలుగుచూశాయన్నారు. వార్డుల విభజన సక్రమంగా చేసేందుకు 5 సంవత్సరాలు సమయం ఉన్నప్పటికీ జీహెచ్ఎంసీ ఏమి చేయలేక మళ్లీ అదే తప్పు చేస్తుందని ఆరోపించారు. జనాభా ప్రాతిపదికన వార్డుల విభజన జరగాలని కోరారు. వార్డుల వారీగా ఓటర్ల విభజన సరిచేయాలని మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశాలివ్వాలని ఫోరం ఫర్ గుడ్‌గవర్నెన్స్ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్లు తెలిపారు. -
ఆదరబాదరగా ఎన్నికలు నిర్వహించద్దు
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్(జీహెచ్ఎంసీ) ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి గురువారం సమావేశాలు నిర్వహించారు. ఎన్నికల కమిషనర్ రాజకీయ పార్టీలతో జరిపిన వరుస భేటీల్లో భాగంగా సీపీఐ, బీజేపీ నేతలు సమావేశం అయ్యారు. ఈ భేటీలో సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి, బీజేపీ నుంచి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చింతల, ఆంటోని రెడ్డిలు పాల్గొన్నారు. అన్నిపార్టీలతో గ్రేటర్ ఎన్నికల నిర్వహణపై కమిషనర్ చర్చించారు. కాగా ఈ భేటీలకు గుర్తింపు పొందిన 11 పార్టీలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆహ్వానించింది. ఒక్కో రాజకీయ పార్టీకి 15 నిమిషాల సమయం కేటాయించి, జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణపై సమాలోచనలు జరిపింది. భేటీ అనంతరం చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వరదల సాయం అందరికీ అందలేదన్నారు. ఒక్కో డిజవిన్లో జనాభా సంఖ్యలో చాలా తేడా ఉందని, లోపాలు సరిదిద్దుకుని ఎన్నికలకు వెళ్లాలని సూచించారు. బీసీలకు అన్యాయం జరుగుతోంది: కాంగ్రెస్ పార్టీ నేత మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. నవంబర్ 7వ తేదీ విడుదల చేసిన ఓటర్ల జాబితా వార్డుల వారిగా విడుదల చేశారని అది సరైన పద్ధతి కాదన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం న్యాయంగా ఎన్నికలు నిర్వహించాలన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో 25 శాతం పోలింగ్ కేంద్రాలను అదనంగా పెంచాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు సమయాన్ని మరో 15 రోజులు పెంచాలన్నారు. మున్సిపల్ సిబ్బంది ఇతర పనుల్లో బిజీగా ఉన్నారని, తూతూ మంత్రంగా ఎన్నికలు నిర్వహించొద్దన్నారు. ఎన్నికల ప్రక్రియకు అవసరం అయిన అన్నింటికీ మళ్లీ రీ షెడ్యూల్ ఇవ్వాలని కోరారు. సుప్రీం కోర్టు ఆదేశాలు ఉల్లంఘించకూడా రిజర్వేషన్లుఉండాలని, బీసీలకు అన్యాయం జరుగుతోందని తెలిపారు. ప్రస్తుతం 50 సీట్లు మాత్రమె కేటాయిస్తున్నారని, వాస్తవానికి 75 సీట్లు బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఎన్నికల్లో పోటీకి అనర్హులు అనే నిబంధన ఉందని, దాన్ని కొనసాగించాలన్నారు. ప్రకటనల విషయాల్లో అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాలన్నారు. ఎన్నికలకు భయపడటం లేదు: పీసీసీ నేత నిరంజన్ మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ ఎన్నికలను ఆదరబాదరగా నిర్వహించొద్దని తెలిపారు. తాము ఎన్నికలకు భయపడటం లేదని స్పష్టం చేశారు. గతంలో జరిగిన లోటుపాట్లు సరిచేయలని సూచించామని పేర్కొన్నారు. అభ్యర్థుల పేర్లు హిందీలో కూడా ప్రచురించాలని కోరినట్లు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించాలి: సమావేశం అనంతరం టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించేలా చూడాలని ఎస్ఈసీ కోరామని తెలిపారు. సెక్యూరిటీ డిపాజిట్, అభ్యర్థి ఖర్చును పెంచాలన్నారు. మాస్కులు తప్పనిసరి చేయాలన్నారు. విశాలమైన పోలింగ్ కేంద్రాలు గుర్తించాలని కోరినట్లు తెలిపారు. కోవిడ్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వికలాంగులకు, కోవిడ్ పాజిటివ్ కేసుల్లో పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశామన్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు భరత్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాపై నిఘా పెంచి, ఒక ప్రత్యేక సెల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేయాలన్నారు. సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాన్ని అరికట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఓటు హక్కు ఎలా ఇచ్చారు? ఎన్నికల కమిషన్‌తో సమావేశం ముగిసిన అనంతరం బీజేపీ నేతలు మాట్లాడుతూ... ‘ఓటరు జాబితాలో అవకతవకలను ఈసీ దృష్టికి తెచ్చాం. పోలింగ్ బూత్ వారీగా ఓటర్ జాబితా ఇవ్వాలని కోరాం. అధికారులు కార్పొరేటర్లతో కుమ్మక్కై బీజేపీ అనుకూల ఓట్లను తొలగించారు. జీహెచ్ఎంసీ అధికారులను ప్రిసైడింగ్ అధికారులుగా నియమించొద్దు. కేంద్ర ప్రభుత్వ సిబ్బందితో ఎన్నికలు నిర్వహించాలి. బీసీ రిజర్వేషన్లు ఇతర మున్సిపాలిటీల్లో ఒక రకంగా... జీహెచ్ఎంసీలో మరో రకంగా ఎలా కేటాయిస్తారు?. శాస్త్రీయ విధానంలో ఇంటి నెంబర్లు ఎందుకివ్వలేదు?. అనుమతి లేకుండా నిర్మించిన ఇళ్లలో ఉన్నవారికి ఓటు హక్కు ఎలా ఇచ్చారు?. డీలిమిటేషన్ లేదంటూనే ఓట్లను తారుమారు చేశారు’ అని ఆరోపించారు. -
కంటైన్మెంట్ జోన్లలో కేటీఆర్ పర్యటన
సాక్షి, హైదరాబాద్ : ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్‌తో కలిసి గురువారం జీహెచ్ఎంసీ పరిధిలోని కరోనా నియంత్రణ ప్రదేశాల్లో పర్యటించారు. హైదరాబాద్‌లో కరోనా విజృంభిస్తోన్న కారణంగా జీహెచ్ఎంసీ పరిధిలో 123 కంటైన్మెంట్ క్లస్టర్లు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా మంత్రి కేటీఆర్ కంటైన్మెంట్ ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడ తీసుకుంటున్న చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం కమిషనర్ లోకేష్‌కుమార్‌తో కలిసి ఖైరతాబాద్, విజయ్‌నగర్ కాలనీ, మల్లేపల్లిలో పర్యటించారు. నియత్రంణ ప్రదేశాల్లో ఉన్న వాళ్లను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నియంత్రణ ప్రదేశాల్లో ఉన్న ప్రజలకు నిత్యావసర సరుకులు, ఇతర వస్తువులను అందిస్తున్న విధానాన్ని లోకేష్ కుమార్ కేటీఆర్‌కు వివరించారు. కరోనాపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కంటైన్మెంట్ జోన్లలో నిత్యవసర వస్తువులు అందుబాటులో ఉంచామని కేటీఆర్ వెల్లడించారు. ప్రజలంతా ఇళ్లలోనే లాక్‌డౌన్‌కు సహకరించాలని కేటీఆర్ సూచించారు. -
‘జనతా కర్ఫ్యూలో భాగస్వామ్యం కావాలి’
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో పెరుగుతున్న కోవిడ్-19 కేసుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. శనివారం ‘సాక్షి’తో ఆయన మాట్లాడుతూ.. వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించామని పేర్కొన్నారు. జనతా కర్ఫ్యూలో స్వచ్ఛంగా పాల్గోనాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఐటి కంపెనీలకు, మతపెద్దలకు, ట్రాన్స్ పోర్టు వ్యాపారులకు తగుసూచనలు ఇచ్చామని వెల్లడించారు. రేపు(ఆదివారం) పోలీస్ సిబ్బంది విధుల్లో ఉంటారని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే కరోనా సోకిందని, కరోనా తీవ్ర స్థాయికి చేరకుండా ఉండాలంటే జనతా కర్ఫ్యూను అందరం పాటించాలని సూచించారు. విదేశాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్ చేశామని, ఇమిగ్రేషన్ సమాచారంతో గుర్తించిన 1300 మంది క్వారంటైన్‌లోనే ఉన్నారని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. (విదేశీ ప్రయాణ చరిత్ర లేని మహిళకు కరోనా..) మరోవైపు కరోనా వైరస్ కట్టడి చేసేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తెలిపారు. విదేశాల నుంచి వచ్చే వారి వివరాలు సేకరిస్తున్నామని, నగరంలో 13 వేల మంది విదేశాల నుంచి వచ్చారని అన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారికి క్వారైంటెన్ స్టాంప్స్ వేస్తామని, క్వారంటెన్ ఉన్నారా లేదా అనేది కూడా పరిశీలిస్తామని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారి ఏరియాలో శానిటేషన్ ఎక్కువ చేస్తున్నామని వెల్లడించారు. రేపు పారిశుద్ధ్య సిబ్బంది యథావిధిగా విధులు నిర్వహిస్తారన్నారు. నగర ప్రజలు జనతా కర్ఫ్యూలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. సోడియం, పైతో క్లోరైడ్‌తో స్ప్రేయింగ్ చేస్తున్నామని తెలిపారు. కరోనా లక్షణాలు ఉంటే 108 కాల్ చేయాలని, ప్రత్యేకంగా 108 వాహనాలతో వారిని ఆసుపత్రికి తరలిస్తామని లోకేష్ కుమార్ తెలిపారు. (హీరోయిన్‌కు కరోనా.. బ్రేకప్ చెప్పిన ప్రియుడు..!) కరోనా: ఐదేళ్ల ముందే చెప్పిన బిల్ గేట్స్! -
చెత్త గురించీ చెప్పలేరా?
సాక్షి, హైదరాబాద్: చెత్త తొలగింపునకు తీసుకున్న చర్యలు గురించి వివరిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ దాఖలు చేసిన అఫిడవిట్లో అరకొర సమాచారం ఉందని హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ దుర్గంధంగా మారి పరిసర ప్రాంతాలకు దుర్వాసన, దోమలు వ్యాప్తి చెందుతున్నాయని పత్రికలో వచ్చిన వార్తా కథనాన్ని నగరానికి చెందిన సీతారామరాజు లేఖ ద్వారా హైకోర్టు దృ ష్టికి తెచ్చారు. దీనిని ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణిం చి హైకోర్టు.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డి ధర్మాసనం ఇటీవల మరోసారి విచారణ జరిపింది. జ వహర్‌నగర్ నుంచి డంపింగ్ యార్డ్ తరలింపునకు మూడు ప్రత్యామ్నాయ స్థలాలను..గు ర్తించినా కదలిక లేదని వ్యాఖ్యానించింది. ‘పటాన్చెరు మండ లం లక్దారంలో 150 ఎకరాలను జీహెచ్ఎంసీ గుర్తిస్తే ఆ భూమిని రాజీవ్ గృహకల్పకు కేటాయించినట్లుగా కలెక్టర్ లేఖ రాశారు. గుమ్మడిదల మండల ప్యానానగర్‌లో జీహెచ్ఎంసీకి చెందిన 152 ఎకరాల భూమి ఉంది. అయితే రోడ్డు నిర్మాణం కోసం 2.12 ఎకరాల్ని కేటాయించాలని గత ఏడాది సెప్టెంబర్‌లో అటవీశాఖకు లేఖ రాస్తే ఇప్పటి వరకు అనుమ తి రాలేదు. తలకొండపల్లి మండలం ఖానాపూర్‌లో 42.22 ఎకరాలను జీహెచ్ఎంసీ గుర్తించినా దానిని స్వాధీనం చేసుకోలేదు’ అని కమిషనర్ అఫిడవిట్లో పేర్కొన్నారంటే ప్రత్యామ్నాయ స్థలాల్లో పనులేమీ మొదలు కాలేదని స్పష్టం అవుతోందని ధర్మాసనం పే ర్కొంది. హైకోర్టులో పిల్ దాఖలైన తర్వాత గత 8 నెలలుగా సమావేశం కాకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. చెత్తను తొలగించేందుకు 2,500 స్వచ్ఛ ఆటో టిప్పర్లను మంజూరు చేసినట్లు చెప్పారేగానీ వాటిని ఎ క్కడ వినియోగిస్తున్నారో, ఫలితాలెలా ఉన్నాయో చె ప్పలేదని తప్పుపట్టింది. తడి, పొడి చెత్తలకు విడివిడి గా డబ్బాలను ఏర్పాటు ఫలితాల గురించిగానీ, వాణిజ్య ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా చెత్త డబ్బాలను వినియోగించని వారు, వారికి విధించిన జ రిమానాల గురించి సమాచారం అస్పష్టంగా ఉందని అభిప్రాయపడింది. పర్యావరణ పరిరక్షణ శిక్షణ, పరిశోధన సంస్థ (ఈపీటీఆర్ఐ) నెలకు రెండుసార్లు జీహెచ్ఎంసీకి ఇచ్చే నివేదికలను అఫిడవిట్‌తో జత చేశా రని, అవి అర్ధమయ్యేలా లేవని పేర్కొంది. విచారణ ను ధర్మాసనం ఈ నెల 31కి వాయిదా వేసింది. -
ముఖ్యమైన కాల్స్ మాట్లాడండి.. కానీ
సాక్షి, సిటీబ్యూరో: ఆఫీసుల్లో కూర్చున్నప్పుడు సరే.. నగరంలో ప్రయాణిస్తున్నప్పుడైనా స్మార్ట్ ఫోన్లకు కాస్తా విరామమివ్వండి. ఫోన్ చూస్తూ వెళ్లే బదులు చుట్టుపక్కల కన్నేయండి. రోడ్లపై గుంతలు, పారిశుధ్యం, వాటర్ లీకేజీలు, లైటింగ్ తదితర సమస్యలను పరిశీలించండి. ఆయా ప్రాంతాల్లో ఏం జరుగుతోందో తెలుసుకోండి.. ముఖ్యమైన కాల్స్ వస్తే మాట్లాడండి. కానీ..అదేపనిగా ఫోన్లోనే మునిగిపోకండి. జరుగుతున్న అభివృద్ధి పనుల్నీ పరిశీలించండి..అంటూ జీహెచ్ంఎసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ అధికారులకు హితోపదేశం చేశారు. బుధవారం జీహెచ్ఎంసీలో అడిషనల్, జోనల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. సమస్యలెక్కడున్నాయో తెలిస్తే.. సంబంధిత అధికారులు పరిష్కారానికి కృషి చేయొచ్చునన్నారు. పునరావాస కేంద్రాలకు యాచకులు.. వివిధ జంక్షన్లు, ఆధ్యాత్మిక ప్రదేశాలతో పాటు ఆయా ప్రాంతాల్లోని యాచకులను మార్చి రెండోవారంలో పునరావాసకేంద్రాలకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఇందుకుగాను సర్కిల్, జోనల్ స్థాయిల్లో సంబంధిత ఏజెన్సీలు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న నైట్ షెల్టర్స్ లో తాత్కాలికంగా 24గంటల పాటు భోజన వసతి ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి వార్డుకు రెండు చొప్పున మొత్తం 300 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వం నిర్దేశించినట్లు కమిషనర్ పేర్కొన్నారు. ప్రస్తుతం నగరంలో 122 బస్తీ దవాఖానాలు నడుస్తున్నాయని, 40 బస్తీ దవాఖానాలను మౌలిక వసతులతో సిద్ధం చేసినట్లు తెలిపారు. 54 చోట్ల వసతుల కల్పన బాధ్యతలు జోనల్ కమిషనర్లకు అప్పగించామని, మరో 83 ప్రదేశాలను గుర్తించామన్నారు. ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా ప్రతి జోన్ కు 500 చొప్పున కొత్తగా 3వేల ఆధునిక పబ్లిక్ టాయ్లెట్ల నిర్మాణానికి ప్రయత్నాలు జరగుతున్నాయన్నారు. ఇప్పటి వరకు 1661 లొకేషన్స్ గుర్తించగా, మిగిలిన 1339 లొకేషన్లను గుర్తించాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు. నిర్మాణం, నిర్వహణ భారం కాకుండా బీ.ఓ.ఓ పద్ధతికి కృషి చేయాలన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 185 చెరువులను గుర్తించడం జరిగిందని, చెరువుల పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం మేరకు ఫెన్సింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. పారిశుధ్య చర్యల్లో భాగంగా తొలిదశలో షాపింగ్ కాంప్లెక్స్‌లు, వ్యాపార సంస్థల ముందు తప్పనిసరిగా రెండు చెత్త డబ్బాలను వారితోనే ఏర్పాటు చేయించాలని ఆదేశించారు. నగరంలోని 344 నాలాల్లో 50 నాలాల పూడికతీత ప్రారంభించినట్లు తెలిపారు. తొలగించిన పూడికను అదే రోజు తరలించాలని స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు కమిషనర్లు బి.సంతోష్, ప్రియాంక, జె.శంకరయ్య, జయరాజ్ కెనెడి, జోనల్ కమిషనర్లు ప్రావీణ్య, ఎన్.రవికిరణ్, వి.మమత, బి.శ్రీనివాస్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, అశోక్ సామ్రాట్, ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కాంపాటి, చీఫ్ ఇంజనీర్ జియా ఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
త్వరలో రోడ్డు ప్రైవేటీకరణ పనులు ప్రారంభం : జీహెచ్ఎంసీ
సాక్షి, హైదరాబాద్ : నగరంలో రోడ్డు ప్రైవేటీకరణ పనులు త్వరలో ప్రారంభం కానునట్లు జీహెజ్‌ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తెలిపారు. ఈ నెల 10నుంచి 709 కి. మీ మేరకు పనులు మొదలు పెడతామన్నారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్‌ను జనవరిలో ప్రారంభిస్తామన్నారు. ఫిబ్రవరి వరకు లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లను అందించే విధంగా పనులు చేపడుతున్నట్లు, దాదాపు తొమ్మిది వేల వరకు డబుల్ బెడ్ రూం ఇళ్ల పనులు పూర్తి అయ్యాయని తెలిపారు.ప్రధాన రహదారులపై ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు ప్రత్యామన్నాయ రోడ్ల కోసం భూసేకరణ చేస్తున్నామన్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు నేరుగా ఫోన్ లేదా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సమాచారం ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇక ఓపెన్ స్పేస్‌లలో పార్క్‌లను అభివృద్ధి చేస్తామని, మీడియన్.. జంక్షన్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ప్రతి జోన్లో స్కైవాక్ నిర్మించాలన్నారు. రోడ్డు మరమత్తు పనులు పూర్తి అవుతున్నాయని, చెత్త సేకరణ కోసం 60 ట్రాన్స్ఫర్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్ల వెల్లడించారు. సీ అండ్ డీ వేస్ట్ పరిశ్రయ త్వరలోనే మొదలు కానుందని, వీటిని కంపోస్ట్ అలాగే కరెంట్ ఉత్పాదన కోసం ఉపయోగిస్తామన్నారు. మూడు నెలల్లో 284 పనులకు అనుమతులిచ్చామని, వీడీసీసీ రోడ్డు పనులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. -
ఇంటి నిర్మాణం పూర్తికాగానే వసూలుకు చర్యలు
సాక్షి, హైదరాబాద్: బల్దియా ఆదాయం పెంపునకు కమిషనర్ లోకేష్‌కుమార్ చర్యలు ప్రారంభించారు. ఇకపై ప్రతి ఇంటి నిర్మాణదారుడి నుంచి కచ్చితంగా పన్ను వసూలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా భవన నిర్మాణం పూర్తికాగానే ఆటోమేటిక్‌గా అసెస్మెంట్తో పాటు ఆస్తిపన్ను చెల్లించాల్సిందిగా సదరు యజమానికి డిమాండ్ నోటీసు కూడా అందించనున్నారు. ఇందుకోసం టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ విభాగాలను అనుసంధానం చేయనున్నారు. -
‘తెలంగాణలో 2400 డెంగ్యూ కేసులు నమోదు’
సాక్షి, హైదరాబాద్ : నగరంలో రెండు మూడు వారాలుగా యాంటీ లార్వా ఆపరేషన్స్ చేస్తున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో నమోదవుతున్న డెంగ్యూ కేసుల వివరాలను ఎప్పటికపుడు వెబ్సైట్లో నమోదు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో మొత్తం 2400 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని, హైదరాబాద్ లో 845 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయని వెల్లడించారు. ఇప్పటి వరకు దాదాపు 86 వేల ఇళ్లలో స్ర్పే చేయించామని, పాఠశాలలను శుభ్రం చేసే విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామన్నారు. హైదరాబాద్ లో 410 అధిక ప్రమాదం గల ఏరియాలు ఉన్నాయని, డిసెంబర్ వరకు దోమల నివారణకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వారంలో రెండు రోజులు దోమల నియంత్రణ కోసం ఫాగింగ్ చేస్తున్నామని వెల్లడించారు. దోమల నియంత్రణ కోసం 1040 మిషన్లు ఉన్నాయన్నారు. అసలు దోమలు ఎపుడు ప్రభావంగా ఉంటున్నాయన్న అంశంపై పరిశోధన చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం విష జ్వరాల ప్రభావం తగ్గిందని కమిషనర్ తెలిపారు. -
కొత్త కమిషనర్‌కు సమస్యల స్వాగతం
జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఎవరున్నా అది కత్తిమీద సామే. ఓవైపు అధ్వానపు రహదారులు.. ఎంత చేసినా కనిపించని పారిశుధ్యం.. వీధుల్లో కనిపించే చెత్తకుప్పలు. ఇది ఒకవైపు దృశ్యం. మరోవైపు ఇప్పటికే చేపట్టిన భారీ ప్రాజెక్టులు. వాటికి అడుగడుగునా ఎదురవుతున్న ఆటంకాలు.. నిధుల లేమి.. పూర్తికాని భూసేకరణ.. యుటిలిటీస్ షిఫ్టింగ్. ఇంకోవైపు 150 మంది కార్పొరేటర్లతో సహా 200 మందికి పైగా వివిధ స్థాయిల్లోని ప్రజాప్రతినిధులు, వారి డిమాండ్లు. వీటన్నింటినీ క్రోడీకరించుకొని ఇబ్బందుల్లేకుండా పరిపాలన సాగించడం ఎవరికైనా కష్టమే. జీహెచ్ఎంసీకి కొత్త కమిషనర్‌గా మంగళవారం బాధ్యతలు చేపట్టిన లోకేశ్‌కుమార్ వీటిని ఎలా అధిగమిస్తారో చూడాల్సిందే. – 6లోu సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో ఉన్న మేజర్ ప్రాజెక్టు ఇప్పుడు ఎస్సార్డీపీ పథకం. దీని కింద చేయాల్సిన మొత్తం పనులు రూ.25 వేల కోట్లు కాగా, ప్రస్తుతం దాదాపు రూ.7 వేల కోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిల్లో భూసేకరణ క్లిష్ట సమస్యగా ఉంది. ప్రాజెక్టు పనులతో పాటు భూసేకరణకు అవసరమయ్యే నిధులు కూడా ఎక్కువే. అయినప్పటికీ, ఇప్పటి వరకు ఈ పనులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహకారం లేదు. వీటిని చేపట్టేప్పుడే ప్రభుత్వం కూడా ఆవిషయం స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీ నిధులతోనే వీటిని పూర్తిచేయాలి. అందుకుగాను అప్పులకు వెళ్తున్నారు. బాండ్ల ద్వారా ఇప్పటికే దాదాపు రూ.500 కోట్లు సేకరించారు. వీటి వడ్డీలు, అసలు చెల్లింపులతో ఖజానా పరిస్థితి దిగజారుతోంది. మరిన్ని అప్పులు చేయనిదే పనులు కదలవు. అప్పులు చేస్తే జీతాల చెల్లింపులు కూడా కష్టమయ్యే పరిస్థితి. పారిశుధ్యం.. ఎవరొచ్చినా.. ఎంత చేసినా పారిశుధ్యం మెరుగుపడటం లేదు. ఏటా దాదాపు రూ. 200 కోట్లు ఖర్చవుతున్నా ఫలితం కనిపించడంలేదు. ఈ పరిస్థితి నివారణకు దానకిశోర్ ఆస్కి సహకారంతో ‘సాఫ్ హైదరాబాద్– షాన్‌దార్ హైదరాబాద్’ పేరిట కొత్త ప్రణాళికలు రూపొందించారు. వార్డుల వారీగా పరిస్థితి మెరుగుపరచేందుకు సిద్ధమైనా కార్యక్రమం ఆరంభదశలోనే ఉంది. దాదాపు రూ. 50 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. అయినా ప్రజల్లో అవగాహన రానిదే ఎంత చేసినా ఫలితం కనిపించే పరిస్థితి లేదు. రోడ్లు అధ్వానం.. రోడ్లదీ అదే దుస్థితి. ఏటా రూ. 500 – 800 కోట్లు ఖర్చు చేస్తున్నా రోడ్లు మెరుగవడంలేవు. ప్రజలనుంచి విమర్శలు తప్పడం లేవు. వానొస్తే రోడ్లు చెరువులయ్యే పరిస్థితి నివారించేందుకు ఇటీవల జేఎన్టీయూ సహకారంతో ఇంజెక్షన్బోర్లు, తదితర చర్యలకు సిద్ధమయ్యారు. అవి కూడా ప్రారంభదశలోనే ఉన్నాయి. రోడ్లకు ఎప్పటికప్పుడు తాత్కాలిక ఉపశమన చర్యలకే ప్రాధాన్యం ఇస్తుండటంతో శాశ్వత పరిష్కారం లభించడం లేదు. శాశ్వతంగా పరిష్కరించాలంటే వేల కోట్లు కావాలి. అంత సొమ్ము జీహెచ్ఎంసీ వద్ద లేదు. ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదు. నాలాలదీ అదే పరిస్థితి నాలాల ఆధునీకరణకు అడుగడుగునా అడ్డంకులు. వానొస్తే విస్తరించాలనే ప్రజాప్రతినిధులే ఆ తర్వాత విస్తరణ పనులకు అడ్డుపడుతున్నారు. గడచిన ఐదేళ్లలో దాదాపు రూ. 450 కోట్ల పనులుచేశారు. మరో రూ. 150 కోట్ల పనులు పురోగతిలోఉన్నాయి. భూసేకరణ జరగకపోవడం.. ప్రజాప్రతినిధులు అడ్డుపడుతుండటం తదితర కారణాలతో ఈ పనులను తమనుంచి తప్పించాల్సిందిగా సంబంధిత విభాగం కమిషనర్‌కు వినతి చేసుకుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలా వివిధ సమస్యలతో ప్రాజెక్టులు కుంటుతుండగా, మ్యుటేషన్లు, ఎక్కువ ఆస్తిపన్ను విధింపు, వీధికుక్కల బెడద, భవననిర్మాణ అనుమతుల్లో అవినీతి వంటి ప్రజాసమస్యలు నిత్యకృత్యంగా మారాయి. వీటిని పరిష్కరించేందుకు జీహెచ్ఎంసీ వద్ద తగిన యంత్రాంగం కానీ, అవసరమైన నిధులుకానీ లేవు. పనుల పర్యవేక్షణ విషయంలోనూ లోపాలున్నాయి. ఈ నేపథ్యంలో లోకేశ్‌కుమార్ ఎలా నెగ్గుకురాగలరోననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు.. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పురోగతిలో ఉన్నా నిధుల లేమితో జాప్యం జరుగుతోంది. మరోవైపు పూర్తయిన దాదాపు పదివేల ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేయక వాటికి కాపలా కాయడం కూడా కష్టమవుతోంది. ఇప్పటి వరకు వీటికోసం దాదాపు రూ. 4300 కోట్లు ఖర్చు కాగా, దాదాపు రూ. 400 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. -
జీహెచ్ఎంసీ కమిషనర్‌గా లోకేష్ కుమార్
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) కమిషనర్‌గా డీఎస్ లోకేష్‌కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుతంజీహెచ్ఎంసీ కమిషనర్‌గా, జలమండలి ఎండీగా పూర్తిస్థాయి అదనపుబాధ్యతలు నిర్వర్తిస్తున్నఎం.దానకిశోర్‌ను జలమండలి ఎండీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దానకిశోర్ స్థానంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న లోకేష్‌కుమార్‌ను బదిలీ చేసింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన లోకేష్‌కుమార్ గతంలో కృష్ణా జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌గా, పాడేరు సబ్ కలెక్టర్‌గా, హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ ఆఫీసర్‌గా, నేషనల్ రూరల్ హెల్త్‌మిషన్ డైరెక్టర్గాపనిచేయడంతోపాటు ఖమ్మం, అనంతపురం జిల్లాలకలెక్టర్గా కూడా పనిచేశారు. పనిచేసిన అన్నిచోట్లా మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. బల్దియాలో దానకిశోర్ ముద్ర జీహెచ్ఎంసీ కమిషనర్‌గా గత సంవత్సరం ఆగస్ట్ 25న బాధ్యతలు చేపట్టిన దానకిశోర్ సరిగ్గా సంవత్సరం పూర్తయ్యాక బదిలీ కావడం యాధృచ్ఛికమే అయినా ఏడాది కాలంలో ఆయన చేయగలిగినన్ని పనులు చేయడంతోపాటు పలు వినూత్న కార్యక్రమాలతోనూ తనదైన ముద్ర వేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్‌కే ఎన్నికల విధులు కూడా ఉండటంతో ఆయన వచ్చినప్పటి నుంచి అసెంబ్లీ, లోక్‌సభలతో సహ వివిధ ఎన్నికలు రావడంతో జిల్లా ఎన్నికల అధికారి బాధ్యతలతోపాటు జీహెచ్ఎంసీ కమిషనర్‌గానూ సమాంతరంగా పనులు చేశారు. ఓటర్ల జాబితాల నుంచి ఎన్నికల అధికారుల శిక్షణ దాకా ఎన్నో పనులున్నప్పటికీ, నగర ప్రజల సమస్యలకే తొలిప్రాధాన్యతనిచ్చారు. ఇల్లు బాగుండాలంటే ఇల్లాలితోనే సాధ్యమన్నట్లుగా నగర సమస్యల పరిష్కారంలోనూ మహిళలు కీలకపోత్ర పోషించాలని భావించారు. సెల్ఫ్‌హెల్ప్‌గ్రూపులకు ఎంతో ప్రాధాన్యతనిచ్చి అన్ని కార్యక్రమాల్లోనూ వారి భాగస్వామ్యం పెంచడంతోపాటు వారిద్వారా అందే ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం లభించాలని ఆశించారు. సాధారణంగా అధికారులు తమకంటే ముందున్న అధికారులు ప్రవేశపెట్టిన పథకాలను అటకెక్కించడం రివాజు అయినప్పటికీ, దానకిశోర్ మాత్రం గత కమిషనర్ జనార్దన్‌రెడ్డి ప్రారంభించిన కార్యక్రమాలను కొనసాగిస్తూనే తనదైన శైలిలో మరిన్ని కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నగరంలో రోడ్లు, డ్రైనేజీ, ట్రాఫిక్ తదితర సమ్యలకు సంబంధిత విభాగాలన్నీ పరస్పర సమన్వయంతో పనిచేసినప్పుడే సమస్యలు పరిష్కారమవుతాయని గ్రహించి ఆ దిశగా కృషి చేశారు. స్వచ్ఛ నగరం కోసం గత కమిషనర్లు కూడా కృషి చేసినప్పటికీ, ‘సాఫ్‌హైదరాబాద్–షాన్‌దార్ హైదరాబాద్’ పేరిట వార్డు స్థాయి వరకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి పనులు చేపట్టారు. వానొస్తే నగర రోడ్లు చెరువులుగా మారుతున్న దుస్థితిని తప్పించేందుకు క్షేత్రస్థాయిలో ఇంజినీర్లతో కలిసి పర్యటించి సమస్య పరిష్కార చర్యల్లో భాగంగా ఇంజెక్షన్ బోర్‌వెల్స్ నిర్మాణం ప్రారంభించారు. చెత్త సమస్యల పరిష్కారంలో భాగంగా సాయంత్రం వేళల్లోనూ చెత్త తరలించేందుకు అదనపు వాహనాలను సమకూర్చారు. నిర్మాణ వ్యర్థాల తొలగింపునకు ప్రత్యేక వాహనాలను కేటాయించడంతో పాటు వీధివ్యాపారులు తప్పనిసరిగా రెండు చెత్తడబ్బాలు ఏర్పాటుచేసుకునేలా చర్యలు చేపట్టారు. పారిశుధ్యకార్మికులందరికీ బీమా సదుపాయం కల్పించారు. ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న జీహెచ్ఎంసీ రెగ్యులర్ ఉద్యోగులకుహెల్త్కార్డుల చొరవ చూపడంతో త్వరలోనే అవి జారీ అయ్యే దశకు వచ్చాయి. ప్రజావాణికి అధికారులు హాజరుకాని పరిస్థితినుంచి తప్పనిసరిగా హాజరయ్యేలా చర్యలు తీసుకున్నారు. తాను కూడా హాజరవుతూ ప్రజల సమస్యలకు ప్రాధాన్యం ఇచ్చారు. సాయంత్రం వేళల్లోనూ సందర్శకుల ఫిర్యాదులకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి వారు వరండాల్లో నిలబడకుండా కూర్చునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి, స్వయంగా దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభించారు. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యతనిచ్చేందుకు ఎప్పటికప్పుడు అధికారులను హెచ్చరించేవారు. ఇటీవలి భారీవర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు తక్షణ మరమ్మతులు చేయించగలిగారు.దోమల నివారణకు రికార్డుస్థాయిలో ఇప్పటికే 1100 మెడికల్ క్యాంపులు నిర్వహించడంతోపాటు మరో 600 క్యాంపులకు ప్రణాళికలు సిద్ధం చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా పనిచేయడం సంతృప్తినిచ్చిందని, నగరంలో చేపట్టిన కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసించిందని దానకిశోర్ పేర్కొన్నారు. -
జీహెచ్ఎంసీ కమిషనర్‌గా లోకేశ్ కుమార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి కలెక్టర్‌గా పని చేస్తున్న లోకేష్ కుమార్‌ను జీహెచ్ఎంసీ కమిషనర్‌గా నియమించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. దానకిషోర్‌ను జలమండలి కమిషనర్‌గా నియామస్తున్నట్టుగా నిర్ణయం తీసుకుంది. ఇక రంగారెడ్డి జాయింట్ కలెక్టర్‌గా పని చేస్తున్న హరీష్ ఇకమీదట రంగారెడ్డి కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కాగా దానకిషోర్ సంవత్సరంపాటు జీహెచ్ఎంసీ కమిషనర్‌గా సేవలందించారు. -
ఎన్నికలకు రెడీ..
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఎన్నికల నిర్వహణకు సమాయత్తమవుతున్నాం. ఓటర్ల తుది జాబితా విడుదలతో కీలకఘట్టం ముగిసింది. ఇక ఎన్నికల నిర్వహణపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించాం అని జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ లోకేశ్‌కుమార్ చెప్పారు. మంగళవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జాయింట్ కలెక్టర్ హరీశ్, డీఆర్ఓ ఉషారాణితో కలిసి మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 27.12 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, డిసెంబర్లో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఇప్పటికే 3,073 పోలింగ్ స్టేషన్లను గుర్తించామన్నారు. తాజాగా పెరిగిన ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా కొత్తగా మరో 150 కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిపారు. నామినేషన్ల దాఖలు నాటికి ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు వెసులుబాటు ఉన్నందున.. వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. పకడ్బందీగా ఏర్పాట్లు ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ లోకేశ్‌కుమార్ తెలిపారు. ఇప్పటికే ఓటర్ల జాబితాపై రాజకీయపక్షాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించామని, ఈవీఎంల పనితీరుపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించామని చెప్పారు. ప్రతి ఈవీఎంను నిశితంగా పరిశీలించి.. పనితీరును రూఢీ చేసుకున్నామన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించకుండా పర్యవేక్షణా బృందాలను నియమించినట్లు తెలిపారు. ఇబ్రహీంపట్నంలో రూ.27 లక్షల నగదును పట్టుకున్నామని, ఈ నగదుపై ఆదాయపన్ను శాఖ అధికారులకు సమాచారం అందించామని చెప్పారు. ఎన్నికల ధన ప్రవాహం నియంత్రించేందుకు ప్రత్యేక సంచార బృందాలను కూడా రంగంలోకి దించామని తెలిపారు. కోడ్ ధిక్కరించినట్లు తేలినా ప్రచార వ్యయం అడ్డగోలుగా చేస్తున్నా తక్షణమే సంబంధిత అభ్యర్థులకు నోటీసులు జారీచేస్తామని చెప్పారు. ఒకేచోట కౌంటింగ్ కేంద్రాలు జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఓట్ల లెక్కింపును ఒకే కేంద్రంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు కలెక్టర్ తెలిపారు. ఎన్నికల విధులకు సుమారు 14వేల మంది సిబ్బంది అవసరమని గుర్తించగా, ఇప్పటివరకు 12వేల మందిని ఎంపిక చేశామని, వీరికి దశలవారీగా శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. అక్రమంగా 340 రోహింగ్యాల ఓట్లు మయాన్మార్‌కు చెందిన 340 మంది రోహింగ్యాలు అక్రమంగా ఓటర్లుగా నమోదు చేసుకున్నట్లు గుర్తించామని కలెక్టర్ లోకేశ్‌కుమార్ తెలిపారు. కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు గుర్తించిన పేర్లను జాబితా నుంచి తొలగించినట్లు చెప్పారు. ఇదిలావుండగా, జిల్లావ్యాప్తంగా 140 మంది శతాధిక ఓటర్లు ఉన్నారని ఆయన చెప్పారు. జాబితా ముసాయిదా ప్రచురించేనాటికి 896 మంది ఉండగా ఇందులో 47 మంది చనిపోయారని, 709 మంది వయస్సును సరిదిద్దడంతో కేవలం 140 మంది మాత్రమే శతాధిక వృద్ధులున్నట్లు తేలిందని వివరించారు. కొత్తగా 48వేల దరఖాస్తులు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ గత నెల 25వ తేదీతో ముగిసినా కొత్త ఓటర్ల నమోదుకు ఇంకా గడువు ఉన్నదని, ఇప్పటివరకు 48వేల మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వాస్తవానికి నామినేషన్ల రోజు వరకు నమోదు వీలున్నప్పటికీ పాలనాపరమైన సౌలభ్యం దృష్ట్యా పది రోజుల ముందే దరఖాస్తు చేసుకోవడం మంచిదని ఆయన సూచించారు. తద్వారా దరఖాస్తులను సులువుగా పరిష్కరించే వీలు కలుగుతుందని చెప్పారు. -
సంక్షేమం సమర్థతకు సమ ప్రాధాన్యం
‘తొలి ప్రాధాన్యత.. మలి ప్రాధాన్యత అంటూ లేదు. ప్రభుత్వ పథకాలన్నీ ప్రాధాన్యాలే. కాకపోతే ఫ్లాగ్షిప్ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారిస్తా’ అని కలెక్టర్ లోకేశ్‌కుమార్ స్పష్టం చేశారు. విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని తెలిపారు. సర్కారు భూములను కబ్జా చేసే వారిపై ఉక్కుపాదం మోపుతామని ఆయన హెచ్చరించారు. రంగారెడ్డి విశిష్టత కలిగిన పెద్ద జిల్లా అని, ఇతర జిల్లాలతో దీనిని పోల్చలేమని, ఇక్కడ సగం సమస్యలు రెవెన్యూ అంశాలకు సంబంధించినవే ఉంటాయన్నారు. దీంతో కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందన్నారు. జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన లోకేశ్‌కుమార్ బుధవారం ‘సాక్షి’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. –సాక్షి, రంగారెడ్డి: జిల్లా ప్రతినిధి ఇక్కడ ప్రధాన సమస్య రెవెన్యూ వివాదాలు. నగరీకరణతో ప్రభుత్వ భూములను కాపాడటం కత్తిమీద సాములాంటిది. మొన్నటి వరకు పనిచేసిన ఖమ్మం జిల్లాలో వంద కేసుల్లో కేవలం పదింటిపైనే న్యాయపరమైన చిక్కులుండేవి. 90శాతం జిల్లా స్థాయిలోనే పరిష్కారం అయ్యేవి. ఇదే రంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే వంద శాతం కోర్టుకెక్కుతున్నాయి. విలువైన భూములు కబ్జా కాకుండా రెవెన్యూ యంత్రాంగం పకడ్బందీగా వ్యవహరించాల్సిన అవసరముంది. అక్రమార్కులు న్యాయస్థానం మెట్లెక్కకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తే సగం కేసులకు కళ్లెం వేయవచ్చు. ప్రజల దరికి సంక్షేమ ఫలాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలు చేయడం కలెక్టర్‌గా నా బాధ్యత. విధులను సక్రమంగా నిర్వర్తిస్తూనే.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా (ఫ్లాగ్షిప్) భావించే కార్యక్రమాలకు పెద్దపీట వేస్తాం. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కంటి వెలుగు, రైతు బంధు, రైతు బీమా తదితర కార్యక్రమాలు నిర్ణీత గడువులోగా లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకుంటా. ఉత్తీర్ణతా శాతం పెంపుపై ప్రత్యేక డ్రైవ్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా పనితీరు మెరుగుపరుచుకోవాల్సిందే.. ప్రతి ఉద్యోగికీ అంకితభావం, జవాబుదారీతనం ముఖ్యం. వృత్తిలో రాణించాలంటే ఎప్పటికప్పుడు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాల్సిందే. బాగా పనిచేసే వారిని ప్రోత్సహిస్తాం.. వెనుకబడ్డవారిని మెరుగు పరుచుకోవాలని సూచిస్తాం. అయినా, పనితీరు సంతృప్తికరంగా లేకపోతే చర్యలకు వెనుకాడం. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదు. ఉద్యోగుల పనితీరును స్వయంగా తెలుసుకునేందుకు ఆకస్మిక తనిఖీలు చేస్తాం. పమాణాలను మెరుగుపరిచేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తా. ఈ నెలాఖరు నుంచే పదో తరగతిలో ఉత్తీర్ణతా శాతం పెంచే అంశంపై ఉపాధ్యాయులకు లక్ష్యాలను నిర్దేశిస్తా. నిరంతరం సమీక్షిస్తా. కేవలం చదువేగాకుండా.. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, స్కూలు దుస్తులు, పుస్తకాల పంపిణీలో అవకతవకలు చోటుచేసుకుండా చర్యలు తీసుకుంటా. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు చేసుకునేలా ప్రోత్సహిస్తూ కార్పొరేట్ తరహాలో మౌలిక సదుపాయాలు కల్పిస్తా. ప్రసూతి కేంద్రాలను పెంచడమేగాకుండా.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు అందుబాటులో ఉండేలా చొరవ చూపుతా. -
కొత్త కలెక్టర్‌గా లోకేష్ కుమార్
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జిల్లా నూతన కలెక్టర్‌గా డీఎస్ లోకేష్ కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. సుదీర్ఘకాలం మన జిల్లాలో కలెక్టర్‌గా పనిచేసిన ఎం.రఘునందన్‌రావు హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. లోకేష్ కుమార్ ప్రస్తుతం ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. 2003 బ్యాచ్‌కు చెందిన ఈయన స్వస్థలం కర్ణాటక రాష్ట్రం. భార్య విజయేంద్ర కూడా ఐఏఎస్ అధికారే. ప్రస్తుతం ఆమె రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. నూతన కలెక్టర్‌గా లోకేష్ కుమార్ రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. కాగా, 2015 జనవరి 12న జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన రఘునందన్‌రావు మూడున్నరేళ్లపాటు పనిచేశారు. జిల్లాలో అత్యధిక కాలం పనిచేసిన కలెక్టర్‌గా రికార్డు నెలకొల్పారు. ప్రభుత్వ విధానపర నిర్ణయాల్లోనూ ఆయన కీలక భూమిక పోషించారు. సంతృప్తితో వెళ్తున్నా.. హైదరాబాద్ కలెక్టర్‌గా పోస్టింగ్ పొందిన రఘునందన్‌రావు ఉన్నత విద్యాభ్యాసం కోసం వచ్చే జనవరిలో అమెరికాకు వెళ్లనున్నారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. జిల్లాలో తాను సంతృప్తిగా పనిచేశానని చెప్పారు. ‘కలెక్టర్‌గా జిల్లాలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా. విలువైన ప్రభుత్వ భూములను కాపాడడం ఎనలేని సంతృప్తినిచ్చింది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు పూర్తిస్థాయిలో చేపట్టాను. ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా ప్రతినిధుల నుంచి మంచి సహకారం లభించింది. క్లిష్ట సమయాల్లో అండగా నిలిచారు’ అని రఘునందన్‌రావు తెలిపారు. -
‘రైతుబంధు’ బావుందా..?
కొణిజర్ల : ‘ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం ఎలా ఉంది.. రైతులందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చాయా.. పెట్టుబడి చెక్కులు బ్యాంకు నుంచి మార్చుకున్నారా.. ఆ డబ్బులు ఏం చేస్తున్నారు..’ అంటూ రైతుబంధు పథకం జిల్లా ప్రత్యేకాధికారి, పంచాయతీరాజ్ కమిషనర్ నీతూ ప్రసాద్ రైతులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం తీరుతెన్నులను మండలంలోని అమ్మపాలెం గ్రామంలో మంగళవారం ఆమె పరిశీలించారు. గ్రామంలో ఎంత మంది రైతులు ఉన్నారు.. ఎన్ని పట్టాలు.. చెక్కులు ఎన్ని ఇచ్చారని రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొందరికి చెక్కులు ఇవ్వనట్లుగా రికార్డుల్లో నమోదు చేయగా.. దానిపై కారణాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎన్ఆర్ఐ రైతుల వివరాలపై ఆరా తీశారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు వారికి పట్టాలు పంపిణీ చేయాలన్నారు. అనంతరం ఆమె రైతులతో మాట్లాడారు. గ్రామంలో అసైన్డ్ భూమి కొనుగోలు చేసి అనుభవదారులుగా ఉంటున్న తమకు పట్టాలు ఇవ్వాలని పలువురు రైతులు కోరారు. జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వకూడదని నిర్ణయించామని కలెక్టర్ లోకేష్‌కుమార్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ భూములను అలాగే ఉంచామన్నారు. ఆ భూములకు సంబంధించి ఏవైనా సమస్యలుంటే తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అనంతరం ఆమె ఉపాధిహామీ పథకం గురించి రైతులకు వివరించారు. పొలాల్లో నీటి గుంటలు తీసుకోవాలని, పాడైపోయిన బోర్లు బాగు చేయించుకోవడానికి ఈజీఎస్‌లో రూ.20వేల వరకు ఇచ్చే అవకాశం ఉందన్నారు. ఉపాధిహామీ పథకం కింద బావి పూడిక కూడా తీయించుకోవచ్చన్నారు. అయితే దీని గురించి ఈజీఎస్ సిబ్బంది తమకు చెప్పలేదని రైతులు ఆమె దృష్టికి తెచ్చారు. ఆవులు, మేకలు, గొర్రెలు ఉన్న వారికి షెడ్ల నిర్మాణానికి రూ.55వేలు ఇస్తామన్నారు. శ్మశాన వాటికల అభివృద్ధికి రూ.10లక్షలు ఇస్తామన్నారు. మూడున్నర ఎకరాల గ్రామకంఠం భూమి గ్రామంలో ఉందని, దానిని శ్మశాన వాటిక కోసం కేటాయించాలని స్థానికులు కోరగా.. పరిశీలిస్తానని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో ఖమ్మం ఆర్డీఓ టి.పూర్ణచంద్ర, డీపీఓ శ్రీనివాసరెడ్డి, డీఆర్డీఓ ఇందుమతి, తహసీల్దార్ ఎం.శైలజ, ఎంపీడీఓ పి.శ్రీనివాసరావు, సర్పంచ్ జ్యోతి, జెడ్పీటీసీ సభ్యుడు సోమ్లా, ఈఓపీఆర్డీ కె.జమలారెడ్డి, ఏఓ టి.అరుణజ్యోతి, ఏపీఓ సరిత, ఆర్ఐ కొండలరావు, వీఆర్ఓ ఎస్.రామారావు, ఏఈఓ జగదీష్ పాల్గొన్నారు. ‘పెట్టుబడి’కే వినియోగించాలి.. చింతకాని : రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం కింద అందజేసిన పెట్టుబడి సాయాన్ని ఇతర ఖర్చులకు కాకుండా వ్యవసాయానికే వినియోగించుకోవాలని నీతూ ప్రసాద్ తెలిపారు. చినమండవ, లచ్చగూడెం గ్రామాల్లో రైతుబంధు పథకం అమలు తీరును పరిశీలించారు. పట్టాదారు పాసుపుస్తకాల్లో ఫొటోలు, పేర్లు, విస్తీర్ణాలు, ఆధార్ నంబర్లు, కులం పేర్లు తప్పుగా నమోదయ్యాయని కొంతమంది రైతులు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. తమకు చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాలు రాలేదని మరికొందరు చెప్పారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అన్ని సమస్యలూ పరిష్కరిస్తామని, ఎవరూ అధైర్య పడవద్దని సూచించారు. పాసుపుస్తకాల్లో దొర్లిన తప్పులను వెంటనే సరిచేయాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. అనంతరం చినమండవ, లచ్చగూడెం గ్రామాల్లో ఉపాధి కూలీలతో మాట్లాడి పనులపై ఆరా తీశారు. పనిచేసినా వేతనాలు రావటం లేదని కొంతమంది కూలీలు తెలిపారు. వేతనాలు రాని కూలీల వివరాలను పంపిస్తే వారం రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని ఆమె తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ ఇందుమతి, స్థానిక తహసీల్దార్ కారుమంచి శ్రీనివాసరావు, ఎంపీడీఓ ఎండీ నవాబ్‌పాషా, ఏఓ కాసర అనిల్‌కుమార్ పాల్గొన్నారు. -
రైతు సమగ్ర సర్వేను అమలు చేయాలి
► జిల్లాలో 6,05,674 ఎకరాల్లో 2.48 లక్షల మంది రైతులుగా గుర్తించాం ► 10వ తేదీలోగా ప్రక్రియను పూర్తి చేయాలి ► వ్యవసాయాధికారుల సమావేశంలో జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ ఖమ్మం: రైతు సమగ్ర సర్వేలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పక్కాగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ వ్యవసాయాధికారులను ఆదేశించారు. బుధవారం టీటీడీసీ సమావేశ మందిరంలో వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులతో జిల్లాలో చేపట్టిన రైతు సమగ్ర సర్వే వివరాలపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు నిర్వహించిన సర్వే వివరాలను మండలాల వారీగా అడిగి తెలుసుకున్నారు. రైతు సమగ్ర సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా 6,05,674 ఎకరాల్లో 2,00,048 మంది రైతులు సాగు చేస్తున్నట్లుగా గుర్తించినట్లు తెలిపారు. వారిలో అర్హులైన ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా వారి సమాచార వివరాలను నమోదు చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక ద్వారా ముందుకు వెళ్లాలని అన్నారు. వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో రైతు సమగ్ర సర్వే ప్రక్రియలో సేకరించిన వివరాలతో వ్యత్యాసాలు రాకుండా పక్కాగా రూపొందించాలన్నారు. సర్వే నిర్వహించిన వివరాలను పునః పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని గ్రామాల్లో రీవెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసి ఈ నెల 10వ తేదీ నాటికి సమగ్ర నివేదిక రూపొందించాలని, ప్రతిరోజు రీవెరిఫికేషన్ చేసిన వివరాలను వెంటవెంటనే కంప్యూటరీకరించేందుకు సత్వర చర్యలు చేపట్టాని సూచించారు. భూసేకరణ కింద సేకరించిన ప్రభుత్వ భూముల వివరాలను రైతు సమగ్ర సర్వేలో నమోదుగాకుండా చూడాలన్నారు. సమావేశంలో ఖమ్మం జిల్లా వ్యవసాయాధికారి విజయనిర్మల, ఉద్యాన శాఖ జిల్లా అధికారి ఆర్.శ్రీనివాసరావు, వివిధ స్థాయిల వ్యవసాయాధికారులు పాల్గొన్నారు. -
టెట్‌కు ఏర్పాట్లు చేయండి
ఖమ్మంసహకారనగర్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఈ నెల 23వ తేదీన నిర్వహించనున్నారని, నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. టెట్ నిర్వహణపై బుధవారం కలెక్టర్ తన చాంబర్లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ టెట్‌ను సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని చెప్పారు. పేపర్–1 23న ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుందని, పేపర్–2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందన్నారు. ఈ పరీక్షకు మొత్తం 31,759 మంది హాజరుకానుండగా 95 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఎలాం టి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించా రు. పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి అంతరా యం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద వైద్య శిబిరాలను అందుబాటులో ఉంచాలని, సకాలంలో ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో డీఈఓ విజయలక్ష్మీబాయి, డిప్యూటీ డీఈఓ మురళీధర్, జిల్లా పరీక్షల నిర్వహణ అసిస్టెంట్ కమిషనర్ కె.శ్రీనివాస్, ఏసీపీ గణేష్, ఆర్టీసీ ఆర్ఎం జగన్, సూపరింటెండెంట్ పవన్ తదితరులు పాల్గొన్నారు. -
ఖమ్మం కలెక్టర్‌గా మళ్లీ లోకేశ్‌కుమార్
హైదరాబాద్: ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా లోకేశ్కుమార్ను తిరిగి నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. పాలేరు ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల సంఘం లోకేశ్ కుమార్‌ను బదిలీ చేసిన విషయం విదితమే. ఈ ఉప ఎన్నిక పూర్తయ్యాయి...ఫలితాలు వెల్లువడ్డాయి. దీంతో లోకేశ్ కుమార్‌ను తిరిగి ఖమ్మం కలెక్టర్‌గా నియమితులయ్యారు. అయితే ఇప్పటి వరకు ఆ పదవిలో ఉన్న దానకిషోర్ తిరిగి హెచ్ఎంసడబ్యూఎస్ఎస్కు బదిలీ చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
పాలేరులో ఎన్నికల పరిశీలకుల పర్యటన
ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల పరిశీలకులు బుధవారం పలు ప్రాంతాల్లో పర్యటించారు. నియోజకవర్గం పరిధిలోని దానవాయిగూడెం, రామన్నపేట, కైకొండాయిగూడెం తదితర ప్రాంతాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. వీరికి కలెక్టర్ లోకేశ్‌కుమార్(తాజాగా బదిలీ అయిన) ఆహ్వానం పలికారు. పరిశీలకుల వెంట జిల్లా జాయింట్ కలెక్టర్ దివ్య, ఆర్డీవో వినయకృష్ణరెడ్డి తదితర అధికారులు ఉన్నారు. -
ఏడాదికే బదిలీ
సాక్షి, అనంతపురం : జిల్లాలో పాలనను గాడిలో పెట్టడంతో పాటు స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించి ప్రజల మన్ననలు పొందిన కలెక్టర్ డీ ఎస్ లోకేష్‌కుమార్‌కు అధికార పార్టీ నేతలు బదిలీని కానుకగా ఇచ్చారు. తాము చెప్పినట్లు వినకపోతే ఎవరికైనా ఇదే పరిస్థితి వస్తుందని పరోక్షంగా సంకేతాలు పంపారు. లోకేష్‌కుమార్ జిల్లాకు వచ్చిన ఏడాదికే బదిలీ చేయడం విమర్శలకు తావిస్తోంది. ఆయన్ను సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డెరైక్టర్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో విశాఖపట్నం కలెక్టర్‌గా ఉన్న సాల్మన్ ఆరోఖ్యరాజ్‌ను నియమించింది. లోకేష్ కుమార్ 2013 జూన్ 13న జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ 13 నెలల్లోనే జిల్లా పాలనలో తనదైన ముద్ర వేశారు. మృధుస్వభావి అయిన ఆయన ఏ అధికారిని, ఉద్యోగిని నొప్పించిన దాఖలాలు లేవు. ప్రజలతో మమేకం కావడంలో భాగంగా ప్రజావాణి కార్యక్రమాన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాలకు విస్తరించారు. స్థానిక, సార్వత్రిక ఎన్నికల్లో ఫలానా పార్టీకీ అనుకూలంగా పనిచేశారనే ఆరోపణలకు తావులేకుండా యంత్రాంగాన్ని ముందుకు నడిపించారు. ఇది జిల్లాలోని టీడీపీ నాయకులకు అగ్రహాన్ని తెప్పించింది. ప్రస్తుతం ఆ పార్టీ అధికారంలోకి రావడంతో కలెక్టర్ బదిలీ కోసం సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఒత్తిడి చేసినట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా తనను ఎలాగైనా గెలిపించేలా చూడాలని ఉరవకొండ టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ కలెక్టర్‌ను కోరినట్లు విమర్శలున్నాయి. అందుకు ఆయన ససేమిరా అనడంతో కేశవ్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోయినట్లు తెలిసింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు వద్దకు వెళ్లి తనకు పదవిని దూరం చేసిన లోకేష్‌కుమార్‌ను జిల్లా నుంచి బదిలీ చేయాలని మొర పెట్టుకున్నట్లు తెలిసింది. మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత కూడా కలెక్టర్ బదిలీకి పట్టుబట్టినట్లు తెలుస్తోంది. జిల్లాలోని తాత్కాలిక డీలర్లందర్నీ తొలగించి తాము చెప్పిన వారిని నియమించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు కలెక్టర్‌పై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అయితే రోష్టర్ పాటించకపోతే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందనికలెక్టర్ ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలిసింది. ఈ క్రమంలో అప్పటికే జారీ చేసిన నియామకపు నోటిఫికేషన్లను సైతం వాయిదా వేశారు. ఇది మంత్రుల ఆగ్రహానికి కారణమైంది. కలెక్టర్ చురుగ్గా వ్యవహరించరనే ఫిర్యాదుతో మూకుమ్మడిగా సీఎంపై ఒత్తిడి తెచ్చి బదిలీ చేయించినట్లు సమాచారం. కలెక్టర్ బాటలోనే జిల్లాపరిషత్ సీఈఓ విజయేందిర, ఎస్పీ సెంథిల్‌కుమార్, అడిషనల్ ఎస్పీ రాంప్రసాద్‌లపై కూడా బదిలీ వేటు పడనున్నట్లు తెలిసింది. ఆ తరువాత డీఎస్పీలు, ఆర్డీఓలు, సీఐలపైనా వరుసగా బదిలీల వేటు పడనుందనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ మార్కుతో పోస్టింగ్లలోకి వచ్చిన వారందర్నీ తప్పించాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. కాగా హైదరాబాద్‌కు బదిలీ అయిన కలెక్టర్ లోకేష్‌కుమార్ గురువారం రిలీవ్ కానున్నారు. జాయింట్ కలెక్టర్ సత్యనారాయణకు బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిసింది. కొత్త కలెక్టర్ విధుల్లో చేరేవరకు జేసీ ఇన్చార్జ్ కలెక్టర్‌గా కొనసాగుతారు. ‘అనంత’లో పనిచేయడం మంచి అనుభూతి అనంతపురం జిల్లాలో ఏడాది పాటు పని చేయడం మంచి అనుభూతినిచ్చిందని కలెక్టర్ లోకేష్‌కుమార్ అన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో జేసీ సత్యనారాయణ అధ్యక్షతన కలెక్టర్‌కు వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్‌కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలో ఏడాది పాటు పనిచేసినా, నిన్న వచ్చి.. వెంటనే వెళ్లిపోతున్నట్లు ఉందన్నారు. బదిలీపై జిల్లాకు వచ్చినప్పుడు కార్యాలయానికి రాగానే.. ఇక్కడ ఉన్న చెట్లు.. చేమలు తనను ఎంతగానో కట్టిపడేశాయన్నారు. ఆ అనుభూతుల్ని వెంటనే తన కుటుంబ సభ్యులతో పంచుకున్నానని చెప్పారు. విధుల్లో చే రినప్పటి నుంచి తాను రెండు రోజుల సెలవు పెట్టిన దాఖలాలు అసలు లేవన్నారు. ఎందుకంటే.. ప్రజాసేవకు ఎక్కడ దూరమవుతానోనన్న బాధ తనను వెంటాడేదన్నారు. తాను ఎక్కడ పనిచేసినా నెగిటివ్ అంశాలను ఎక్కువగా గుర్తు పెట్టుకునేవాడినని, అలాంటిది ఇక్కడ ఎలాంటి నెగిటివ్ అంశాలూ మదిలో లేకుండా వెళుతున్నానని చెప్పారు. జిల్లాలోని ఉద్యోగులందరి సహకారంతోనే అన్ని అంశాల్లో విజయం సాధించామన్నారు. స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికల్లో టీం వర్క్ చేయడం వల్లే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించగలిగామన్నారు. గ్రీవెన్స్‌కు, ఇతర కార్యక్రమాల నిమిత్తం గ్రామీణ ప్రాంతాలకు వెళ్లినప్పుడు ప్రజలు చూపించిన ఆదరాభిమానాలు మరచిపోలేనన్నారు. విధి నిర్వహణలో ఏ ఒక్కర్ని నొప్పించినా.. ఆ తరువాత తానే బాధపడతానని చెబుతూ ఉద్యోగుల పట్ల అభిమానాన్ని చాటుకున్నారు. ఎక్కడ పనిచేసినా బదిలీ అయిన వెంటనే రిలీవ్ కావడం తనకు అలవాటన్నారు. - కలెక్టర్ లోకేష్‌కుమార్ -
జీడిపల్లి ఘటనపై విచారణకు ఆదేశించిన కలెక్టర్
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం జీడిపల్లిలో సంభవించిన భూ ప్రకంపనలపై జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్ స్పందించారు. భూ ప్రకంపనలపై విచారణ జరపాలని కల్యాణదుర్గం ఆర్దీవోను ఆదేశించారు. విచారణ జరిపి నివేదికను సాధ్యమైనంత త్వరగా అందజేయాలని కలెక్టర్ జారీ చేసిన ఆదేశాలలో ఆర్డీవోకు సూచించారు. జీడిపల్లి పరిసర ప్రాంతాలలో ఆదివారం ఉదయం భూ ప్రకంపనలు సంభవించడంతోపాటు భారీ శబ్దాలు వెలువడ్డాయి. దాంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురై ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే హంద్రీ నీవా కాల్వ పనులలో భాగంగా కాంట్రాక్టర్ భారీగా మందుగుండు సామాగ్రి పేల్చారని అందువల్లే భూమి కంపించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దాంతో భూ ప్రకంపనలపై వెంటనే నివేదిక అందజేయాలని కల్యాణదుర్గం ఆర్డీవోను కలెకర్ట్ లోకేష్ కుమార్ ఆదేశించారు. -
ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
సాక్షి ప్రతినిధి, అనంతపురం : సాధారణ ఎన్నికల ఏర్పాట్లను జిల్లా అధికార యంత్రాంగం శరవేగంగా చేస్తోంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల జాబితాను సిద్ధం చేశారు. లోక్‌సభ, శాసనసభ స్థానాల ఓటర్ల జాబితా, పోలింగ్ బూత్‌లు, ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని గుర్తించారు. ఎన్నికల నిర్వహణకు అయ్యే వ్యయాన్ని అంచనా వేశారు. ఈ నివేదికను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌కు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ పంపారు. లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలకు జూన్ ఒకటిలోగా ఎన్నికలు నిర్వహించి, కొత్త ప్రభుత్వాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మరో మూడు వారాల్లోగా ఎన్నికల షెడ్యూలును విడుదల చేయనున్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఓటరు జాబితాను జనవరి 31న కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ విడుదల చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకూ ఓటరు జాబితాలో మార్పులు చేర్పులు నిర్విరామంగా చేస్తారు. నోటిఫికేషన్ వెలువడే రోజున తుది ఓటరు జాబితాను ప్రకటిస్తారు. అదే జాబితాతో ఎన్నికలు నిర్వహిస్తారు. ఎన్నికల ఏర్పాట్లపై బుధవారం హైదరాబాద్‌లో కేంద్ర ఎన్నికల సంఘం డెరైక్టర్ జనరల్ పీకే దాస్, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ నేతృత్వంలో జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాల వారీగా ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. అధికారవర్గాలు వెల్లడించిన సమాచారం మేరకు.. జిల్లాలో అనంతపురం, హిందూపురం లోక్‌సభ స్థానాలు, 14 శాసనసభ స్థానాల పరిధిలో 3,310 పోలింగ్ బూత్‌లను గుర్తించారు. పోలింగ్ నిర్వహణకు 7,282 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు అవసరమని తేల్చారు. ఎన్నికల నిర్వహణకు 14,240 మంది సిబ్బంది అవసరం అవుతారని అంచనా వేశారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు రూ.45 కోట్లతో అంచనాలను రూపొందించారు. ఆ మేరకు నివేదికను కేంద్ర ఎన్నికల సంఘం డెరైక్టర్ జనరల్ పీకే దాస్, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌కు కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ నివేదించినట్లు సమాచారం. ఈ సమావేశంలోనే లోక్‌సభ, శాసనసభ స్థానాల రిటర్నింగ్ అధికారుల జాబితాను కూడా ఎన్నికల సంఘానికి కలెక్టర్ అందజేశారు. ఈ జాబితాపై ఎన్నికల సంఘం ఆమోదముద్ర వేశాక రిటర్నింగ్ అధికారులను అధికారికంగా ప్రకటిస్తారు. -
ఘనతంత్రం
ఆదివారం వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. గణతంత్ర వేడుకలు అంబరాన్ని తాకాయి. రొద్దంలో 1200 అడుగుల జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. జిల్లా కేంద్రంలోని పోలీసుపరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకల్లో ఉత్తమ సేవలకు గాను 240 మంది అధికారులు, ఉద్యోగులకు కలెక్టర్ ప్రశంసాపత్రాలు అందజేశారు. స్టాల్లో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ ప్రతిమ ఆకట్టుకుంది. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఘనంగా జరిగాయి. ఉదయం తొమ్మిది గంటలకు జిల్లా కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. అనంతరం వందేమాతరం, జనగణమన గీతాలాపన గావించారు. తరువాత డీఐజీ బాలకృష్ణ, ఎస్పీ సెంథిల్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసుల నుంచి కలెక్టర్ గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్య్ర సమరయోధులు సాంబమూర్తి, గంగిరెడ్డిలను ఘనంగా సన్మానించారు. 9.15 నుంచి 9.40 గంటల వరకు తన సందేశాన్ని వినిపించారు. వివిధ పథకాల ప్రగతి తెలియజేశారు. దేశభక్తి చాటుతూ సమష్టి కృషితో జిల్లాను అభివృద్ధి దిశగా నడిపించడానికి అందరం సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు... ఈ ఏడాది ఖరీఫ్, రబీలో 10.89 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేశారు. వర్షాభావం వల్ల వేరుశనగ దిగుబడి తగ్గిపోయింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 59 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌సబ్సిడీ ఇచ్చేందుకు వీలుగా పంట నష్టం అంచనా వేసి త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం. ఈ ఏడాది ఖరీఫ్, రబీలో పంట రుణాల కింద రూ.3,127 కోట్లకు గాను రూ.2,896 కోట్లు ఇచ్చాం. తద్వారా 6.40 లక్షల మందికి లబ్ధిచేకూర్చాం. రైతులు సకాలంలో రుణాలు చెల్లించి వంద శాతం వడ్డీరాయితీ పొందాలి. 2012లో దెబ్బతిన్న పంటలకు సంబంధించి రూ.648.88 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ మంజూరైంది. అందులో తొలివిడతగా రూ.407 కోట్లు విడుదల చేయగా... రూ.390 కోట్లు 3.79 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేశాం. రెండో విడతగా వారంలోగా 2.09 లక్షల మంది రైతులకు రూ.221 కోట్లు పంపిణీ చేస్తాం. అలాగే 2011కు సంబంధించి 67,010 మందికి రూ.42.27 కోట్లు వారంలోగా ఇస్తాం. జిల్లా రైతాంగాన్ని శాశ్వతంగా ఆదుకోవాలనే ఆశయంతో ఐసీఏఆర్ సిఫారసులో రూ.7,676 కోట్లతో ‘ప్రాజెక్టు అనంత’ అమలుకు శ్రీకారం చుట్టాం. ఈ ఏడాది రూ.100 కోట్లతో 14 గ్రామాల్లో ప్రాజెక్టు అమలు చేస్తాం. వేరుశనగ స్థానంలో కినోవా పంటను ప్రయోగాత్మకంగా సాగు చేయిస్తాం. ఏపీఎంఐపీ ద్వారా రూ.68.34 కోట్లతో 11 వేల హెక్టార్లకు డ్రిప్ పరికరాలు అందజేస్తాం. ఉద్యానశాఖ ద్వారా రూ.12 కోట్లు ఖర్చు చేసి పండ్లతోటల రైతులను ఆదుకుంటాం. పశుక్రాంతి పథకం కింద 25 శాతం రాయితీతో 238 మినీ డెయిరీలు, ఆరు మోడల్ డెయిరీల ఏర్పాటు, సునందిని పథకం కింద రూ.1.20 కోట్లతో దూడల సంరక్షణకు చర్యలు చేపడుతున్నాం. జలయజ్ఞం కింద రూ.6,850 కోట్లతో చేపట్టిన హంద్రీ-నీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్) మొదటి దశపూర్తి చేసి జీడిపల్లి రిజర్వాయర్‌కు 1.68 టీఎంసీల నీళ్లు ఇచ్చాం. అలాగే పీఏబీఆర్‌కు 0.30 టీ ఎంసీలు, గుంతకల్లు ప్రాంతంలోని మూడు చెరువులకు 0.60 టీఎంసీలు ఇచ్చాం. 10వ పంప్‌హౌస్ నుం చి పేరూరు బ్రాంచ్ కెనాల్ ద్వారా నాలుగు వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి చర్యలు చేపడుతున్నాం. పీఏబీఆర్ కుడికాలువ ద్వారా 49 చెరువులకు నీళ్లు ఇస్తున్నాం. శ్రీరామరెడ్డి, జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకాల కింద 15 సమగ్ర మంచినీటి పథకాల పను లు వేగంగా సాగుతున్నాయి. కొత్తగా రూ.34.71 కోట్లతో 210 గ్రామాలకు నీటి సదుపాయం కల్పిస్తున్నాం. త్వరలో కొత్తగా 600 అంగన్వాడీ కార్యకర్తల నియామకాలు చేపడతాం ఏడో విడత భూపంపిణీలో 6,253 మందికి 11,088 ఎకరాలు పంపిణీ చేశాం. మొత్తమ్మీద ఇప్పటివరకు 34,750 మందికి 79,027 ఎకరాలు పంపిణీ చేశాం. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి త్వరలోనే మూడో విడత రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తాం. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. ఆర్వీఎం ద్వారా 1,202 పాఠశాలల్లో రూ.147 కోట్లతో 2,487 అదనపు గదుల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నాం. తొలివిడత పల్స్‌పోలియో 102 శాతం విజయవం తం చేశాం. త్వరలో రెండో విడత కార్యక్రమం ఉం టుంది. ఆడపిల్లల భ్రూణహత్యల నివారణకు పీసీ-పీఎస్‌డీటీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తాం. బీఆర్జీఎఫ్ కింద రూ.37.22 కోట్లతో 1,833 పనులు చేపడతాం. 178 రోడ్లు, వంతెనల నిర్మాణానికి రూ.151 కోట్లు కేటాయించాం. రూ.23.74 కోట్లతో 1,003 గ్రామ పంచాయతీల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తాం. రూ.4.84 కోట్లతో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో 28.86 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి. గణతంత్ర వేడుకల్లో అనంతపురం ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యేలు బి.గురునాథరెడ్డి, కొట్రికె మధుసూదన్‌గుప్తా, పల్లె రఘునాథ్‌రెడ్డితో పాటు పుర ప్రముఖులు పాల్గొన్నారు. -
బదిలీ(ల)లు!
సాక్షి ప్రతినిధి, అనంతపురం : ఎన్నికలు ముంచుకొస్తోన్న వేళ కాంగ్రెస్ ‘మార్క్’ రాజకీయాలకు తెరలేచింది. మూడేళ్లకు మించి జిల్లాలో పనిచేస్తోన్న (ఎన్నికలను ప్రభావితం చేసే స్థాయి ఉన్న) అధికారులను సరిహద్దులు దాటించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. జిల్లాలో పాతుకుపోయిన కొందరు అధికారులు తమను లూప్‌లైన్ పోస్టులకు బదిలీ చేయించి.. సరిహద్దులు దాటించకుండా చూడాలని మంత్రులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇదే అదునుగా తీసుకున్న మంత్రులు ఎన్నికల్లో తమకు సహకరిస్తామని పూర్తి స్థాయిలో హామీ ఇస్తే బదిలీ కాకుండా చూసుకుంటామని ప్రతిపాదిస్తున్నారు. ఆ ప్రతిపాదనకు అంగీకరించిన అధికారులను బదిలీ చేయొద్దంటూ కలెక్టర్ డీఎస్ లోకేష్కుమార్పై ఇద్దరు మంత్రులు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. సాధారణ ఎన్నికల ఏర్పాట్లకు తెరతీసింది. ఆర్డీవో, తహశీల్దార్, ఎమ్పీడీవో, సీఐ, ఎస్ఐ స్థాయి అధికారులు ఎన్నికలను ప్రభావితం చేస్తారని ఎన్నికల సంఘం భావిస్తోంది. మూడేళ్లకు మించి పనిచేస్తోన్న అధికారులను జిల్లా సరిహద్దులు దాటించాలని కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్, ఎస్పీ సెంథిల్‌కుమార్‌ను ఆదేశించింది. ఈ ప్రక్రియను ఫిబ్రవరి 10 నాటికి పూర్తి చేయాలని సూచించింది. జిల్లాలో మూడేళ్లకు మించి పనిచేస్తోన్న ఆర్డీవో స్థాయి అధికారులు నలుగురు, తహశీల్దార్లు 61 మంది, ఎమ్పీడీవోలు 51 మంది, సీఐలు 31 మంది ఉన్నారు. మూడేళ్లకు మించి జిల్లాలో పనిచేస్తోన్న 61 మంది ఎస్ఐలకు పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే స్థానభ్రంశం కల్పించారు. సీఐల బదిలీల ఉత్తర్వులను రాయలసీమ ఐజీ రాజీవ్ రతన్ సోమవారం జారీ చేసే అవకాశం ఉంది. మంత్రులకు నమ్మినబంట్లుగా మారిన కొందరు సీఐలు సరిహద్దులు దాటడానికి మొరాయిస్తున్నారు. తమను పోలీసు ట్రైనింగ్ కళాశాలకు గానీ.. డీసీఆర్‌బీకీ గానీ.. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు గానీ బదిలీ చేయించాలని మంత్రులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులు, 11 మంది తహశీల్దార్లు, ఎనిమిది మంది ఎమ్పీడీవోలు ఇదే రీతిలో మంత్రులపై ఒత్తిడి తెస్తున్నారు. తమ బదిలీలు ఆపించాలంటూ మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇదే అదునుగా భావించిన మంత్రులు మనసులోని మాటను బయటపెట్టారు. ఎన్నికల వేళ తమకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని హామీ ఇస్తే ఎలాగోలా బదిలీలను అడ్డుకుంటామని హామీ ఇచ్చేస్తున్నారు. ఆ ప్రతిపాదనకు అధిక శాతం మంది అధికారులు అంగీకరించడంతో.. ఓ జాబితా ఇచ్చి ఆ బదిలీలను ఆపాలని కలెక్టర్, డీఐజీ, ఎస్పీలపై తీవ్రస్థాయిలో అమాత్యులు ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో కీలక బాధ్యతలు నిర్వహిస్తోన్న ఓ ఆర్డీవో స్థాయి అధికారిని ఓ ప్రధాన శాఖలో అప్రాధాన్య పోస్టుకు సీనియర్ మంత్రి బదిలీ చేయించారు. మరో ఆర్డీవో స్థాయి అధికారిని కూడా ఇదే రీతిలో అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేయించడానికి ఆ మంత్రే చక్రం తిప్పుతున్నారు. తనకు అత్యంత నమ్మకస్తులైన నలుగురు సీఐలకు స్థానభ్రంశం కల్పించకుండా చూడాలంటూ రాయలసీమ ఐజీ రాజీవ్ రతన్‌పై జూనియర్ మంత్రి ఒత్తిడి తెస్తున్నారు. అస్మదీయ తహశీల్దార్లు, ఎమ్పీడీవోల బదిలీల విషయంలో ఇద్దరు మంత్రులు కలెక్టర్ డీఎస్ లోకేష్కుమార్పై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. మంత్రుల ఒత్తిళ్లకు తలొగ్గితే ఎన్నికల సంఘం ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని కలెక్టర్ ఆందోళన చెందుతున్నారు. ఇదే అంశాన్ని కలెక్టర్ వివరించినా మంత్రులు వెనక్కు తగ్గడం లేదని అధికారవర్గాలు వెల్లడించాయి. 27, 29 తేదీల్లో హెచ్ఎంల సమావేశాలు అనంతపురం ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : ఉన్నత పాఠశాలల హెచ్ఎంలతో ఈ నెల 27, 29 తేదీల్లో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి మధుసూదన్‌రావు ఓ ప్రకటనలో తెలిపారు. 27న అనంతపురం, గుత్తి డివిజన్ల హెచ్ఎంలకు అనంతపురం కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సమావేశం ఉంటుందన్నారు. 29న ధర్మవరం డివిజన్ పరిధిలోని హెచ్ఎంలకు ధర్మవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పెనుకొండ డివిజన్ పరిధిలోని పెనుకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పదో తరగతి విద్యార్థులకు సంబంధించి గ్రేడింగ్, సబ్జెక్టు టీచర్లు, ఇన్స్పైర్ ప్రపోజల్స్, 9వ తరగతి ఎస్సీ, ఎస్టీ బాలికల వివరాలు, అనంత విద్యార్థీ మేలుకో కార్యక్రమంలో భాగంగా సందర్శన రిపోర్టులు తీసుకురావాలని ఆదేశించారు. అనంతపురం, ధర్మవరం డివిజన్లకు ఉదయం, గుత్తి, పెనుకొండ డివిజన్లకు మధ్యాహ్నం సమావేశం ఉంటుందని వివరించారు. -
రెండు చుక్కలే శ్రీరామరక్ష
అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : ప్రతి చిన్నారికి రెండు పోలియో చుక్కలే శ్రీరామరక్షలా నిలుస్తాయని జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ అన్నారు. ఐదేళ్లలోపు పిల్లలు పోలియో వ్యాధి బారిన పడకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యాక్సిన్ వేయించాలని విజ్ఞప్తి చేశారు. శనివారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పల్స్‌పోలియోపై అవగాహన కల్పించేందుకు నగరంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల వద్ద ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అక్కడి నుంచి టవర్‌క్లాక్ మీదుగా సప్తగిరి సర్కిల్ వరకూ కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 19 నుంచి 21 వరకూ జరిగే పల్స్‌పోలియోను ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. 19న బూత్‌స్థాయిలో, 20,21 తేదీల్లో ఇంటింటికీ తిరిగి పిల్లలకు పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, ప్రార్థన స్థలాలు, పార్కులు, జన సంచారం ఉన్న అన్ని ప్రదేశాల్లో పోలియో చుక్కలు వేసేలా చూస్తున్నామన్నారు. జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లలు సుమారు 4.37 లక్షల మంది ఉన్నారని, వీరికి 3849 కేంద్రాల్లో పోలియో చుక్కలు వేస్తామని వెల్లడించారు. జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ సంచార జాతులు, వలస కుటుంబాలు, మురికివాడలు, శివారు ప్రాంతాల్లోని చిన్నారులకు కూడా పోలియో వ్యాక్సిన్ అందేలా చూడాలని సిబ్బం దిని ఆదేశించారు. పల్స్ పోలియోను విజయవంతం చేస్తామని అందరితోప్రతిజ్ఞ చేయించా రు. కార్యక్రమంలో డీఎంఅండ్‌హెచ్‌ఓ రామసుబ్బారావు, అడిషనల్ డీఎంఅండ్‌హెచ్‌ఓ వెంకటరమణ, డీఐఓ డేవిడ్ దామోదరం, నారాయణస్వామి, నగర పాలక సంస్థ కమిషనర్ రంగయ్య, డాక్టర్ అక్బర్ సాహెబ్, రోటరీ క్లబ్ అధ్యక్షుడు పెరుమాళ్ పాల్గొన్నారు. -
నీటి లెక్కలు.. ఎన్నో చిక్కులు
సాక్షి ప్రతినిధి, అనంతపురం : నీటిపారుదల సలహా మండలి(ఐఏబీ)ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందా? ఐఏబీని సంప్రదించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా నీటి కేటాయింపులు చేయడం జలయుద్ధాలకు దారితీస్తుందా? రాజకీయ ఆధిపత్యం కోసం ఆరాటపడుతోన్న ప్రజాప్రతినిధులు ప్రజాభ్యుదయాన్ని విస్మరిస్తున్నారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నాయి అధికారవర్గాలు. పభుత్వం ఐఏబీని డమ్మీని చేస్తోందంటూ కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ శనివారం నిర్వేదం వ్యక్తం చేయడం అందుకు బలం చేకూర్చుతోంది. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (సీబీఆర్) నుంచి పులివెందుల బ్రాంచ్ కెనాల్(పీబీసీ)కు నీటి విడుదలను మరికొన్ని రోజులు పొడిగించాలని కోరిన వైఎస్సార్ జిల్లా వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డితో జిల్లా కలెక్టర్ ఆ విధంగా వ్యాఖ్యానించారు. వివరాల్లోకి వెళితే.. 2013 జూన్ 24న టీబీ బోర్డు సమావేశంలో హెచ్చెల్సీ(తుంగభద్ర ఎగువ కాలువ)కి 22.995 టీఎంసీలు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో తాగునీటికి 5.715 టీఎంసీలు, నీటి ప్రవాహ, ఆవిరి రూపంలో 7.535 టీఎంసీల జలాలు వృథా అవుతాయని లెక్కకట్టిన హెచ్చెల్సీ అధికారులు 9.745 టీఎంసీలతో 90 వేల ఎకరాలకు నీళ్లందించాలని ప్రతిపాదించారు. ఆ మేరకు ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. అక్టోబరు 18న మరోసారి సమావేశమైన టీబీ బోర్డు.. డ్యామ్‌లో నీటి లభ్యత 150 టీఎంసీల నుంచి 133 టీఎంసీలకు తగ్గిందని సాకు చూపి, తొలుత కేటాయించిన నీటిలోనే 0.99 టీఎంసీలు కోత వేశారు. నీటి లభ్యత పూర్తిగా తగ్గిపోయిన నేపథ్యంలో ఆయకట్టుకు నీళ్లందించడం సవాల్‌గా మారింది. హెచ్చెల్సీ అధికారులు తీవ్ర ఒత్తిళ్లకు గురయ్యారు. పెన్న అహోబిలం రిజర్వాయర్(పీఏబీఆర్) కోటా విడుదలైతే గానీ జిల్లా ప్రజల దాహార్తి తీర్చలేమని కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ అనేక సందర్భాల్లో ప్రభుత్వానికి నివేదికలు పంపారు. టీబీ డ్యామ్‌లో కేసీ కెనాల్ కోటా పది టీఎంసీలను రివర్సబుల్ డైవర్షన్ పద్ధతిలో పీఏబీఆర్‌కు కేటాయిస్తూ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. ఈ కోటా కింద ఈ ఏడాది 6.7 టీఎంసీలను విడుదల చేయడానికి బోర్డు అంగీకరించింది. కానీ.. ఆ నీటిని కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకరించలేదు. ఈ అంశంపై కలెక్టర్ పదే పదే లేఖలు రాయడంతో ఎట్టకేలకే ప్రభుత్వం స్పందించింది. తొలుత రెండు టీఎంసీలు.. రెండు రోజుల క్రితం మరో రెండు టీఎంసీలు విడుదల చేయడానికి అంగీకరించింది. ఈ కోటా ఈ నెల 11తో పూర్తికానుంది. అందుబాటులో ఉన్న నీటిని అంచనా వేసుకున్న కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్.. ఆయకట్టుకు నీళ్లందిస్తూ తాగునీటికీ ప్రాధాన్యమిస్తూ వచ్చారు. తాడిపత్రి బ్రాంచ్ కెనాల్, పులివెందుల బ్రాంచ్ కెనాల్ ఆయకట్టుకు మరో పది రోజులు నీళ్లందిస్తే పంటలు పూర్తవుతాయి. నాలుగు నెలలకే తాగునీళ్లు.. ప్రస్తుతం పీఏబీఆర్‌లో రెండు టీఎంసీలు, సీబీఆర్‌లో 1.28 టీఎంసీలు, మిడ్ పెన్నార్‌లో 1.06 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లోని ప్రజల దాహార్తి తీర్చడానికి కనీసం 5.715 టీఎంసీల జలాలు అవసరం. కానీ.. ఆ మేరకు జలాలు అందుబాటులో లేని దుస్థితి నెలకొంది. తాగునీటి కోసం ప్రతి రోజూ సగటున 400 క్యూసెక్కుల నీటిని సరఫరా చేయాల్సి ఉంది. అంటే.. నెలకు 1.2 టీఎంసీల జలాలు తాగునీటికి అవసరం. ఈ లెక్కన ప్రస్తుతం అందుబాటులో ఉన్న జలాలు నాలుగు నెలలకు కూడా సరిపోవు. హంద్రీ-నీవా ద్వారా ఎత్తిపోసిన జలాల్లో జీడిపల్లి రిజర్వాయర్‌లో 1.6 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. జీడిపల్లి, పీఏబీఆర్, ఎంపీఆర్, సీబీఆర్ల్లో 5.94 టీఎంసీలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ జలాలు తాగునీటి కోసం సరిపోతాయి. కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ ఐఏబీ చైర్మన్ హోదాలో ఇదే అభిప్రాయాన్ని ప్రభుత్వానికి నివేదించారు. కానీ.. ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోలేదు. ప్రజాప్రతినిధుల్లో చిత్తశుద్ధి ఏదీ? నీటి లెక్కలు పట్టని ప్రజాప్రతినిధులు ఆధిపత్యం కోసం ఆరాటపడ్డారు. ఆ క్రమంలోనే ఐఏబీ చైర్మన్ అభిప్రాయంతో నిమిత్తం లేకుండా చాగల్లు రిజర్వాయర్‌కు 1.5 టీఎంసీలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మిడ్ పెన్నార్ డ్యామ్ నుంచి నది ద్వారా చాగల్లుకు నీళ్లందించాల్సి ఉంటుంది. కానీ.. ఆ మేరకు జలాలు అందుబాటులో లేవని అధికారులు స్పష్టీకరిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమ ప్రాంత ప్రజల మన్ననలు పొందేందుకు ప్రజాప్రతినిధులు పోరాడుతోన్న క్రమంలో.. జిల్లాకు అదనపు కేటాయింపులు సాధించుకోవడంలో విఫలమవుతున్నారు. ఫలితంగా కేటాయింపులు చేసినా.. నీటిని సరఫరా చేయలేని దుస్థితి నెలకొంది. పీఏబీఆర్‌కు కేటాయించిన నాలుగు టీఎంసీల్లో కుడి కాలువ ద్వారా 49 చెరువులకు నీళ్లందించాల్సి ఉంది. 49 చెరువులకు పూర్తిస్తాయిలో నీళ్లందించాలంటే 2.50 టీఎంసీలు అవసరమని హెచ్చెల్సీ అధికారులు తేల్చిచెబుతున్నారు. అదే జరిగితే తాగునీటికి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయి. నీటి లభ్యత లేదనే సాకు చూపి 49 చెరువులకు నీటిని విడుదల చేయకపోతే వాటి ఆయకట్టు రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరిస్తున్నారు. పోనీ.. హంద్రీ-నీవా ద్వారా జిల్లాకు అదనంగా కేటాయించిన నాలుగు టీఎంసీల జలాలనైనా రప్పించడంపై ప్రజాప్రతినిధులు శ్రద్ధ చూపుతారా అంటే అదీ లేదు. కర్నూలు జిల్లా ప్రజాప్రతినిధులు హంద్రీ-నీవాకు నీటిని ఎత్తిపోయనివ్వకూండా రోజూ అడ్డుకుంటున్నారు. కానీ.. ఇది ఇక్కడి ప్రజాప్రతినిధులకు పట్టడం లేదు. -
పీబీసీ రైతులను ఆదుకోండి
పులివెందుల, న్యూస్‌లైన్: పులివెందుల బ్రాంచ్ కాలువ ఆయకట్టు రైతులకు నీరందించి ఆదుకోవాలని.. మూడు, నాలుగేళ్లుగా నీరు రాక.. ఆయకట్టు పరిధిలో చీనీచెట్లు ఎండిపోయి రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని వైఎస్ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ అనంతపురం కలెక్టర్ లోకేష్‌కుమార్‌కు లేఖ రాశారు. ఈ లేఖను వైఎస్ఆర్ సీపీ జిల్లా యువజన విభాగపు నాయకులు, పులివెందుల సమన్వయకర్త వైఎస్ అవినాష్‌రెడ్డి, సింహాద్రిపురం మండల కన్వీనర్ పోరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆయకట్టుదారుల సంఘం నాయకులు చప్పిడి రమణారెడ్డిలతోపాటు పలువురు రైతులు శనివారం సాయంత్రం అనంతపురం కలెక్టర్‌కు అందజేశారు. లేఖలోని సారాంశం.. పీబీసీ ఆయకట్టు స్థిరీకరణ కోసం చిత్రావతి బ్యాలెన్సిం గ్ రిజర్వాయర్‌ను ప్రభుత్వం నిర్మించిందని.. పులి వెందుల తాగునీటి అవసరాలతోపాటు అనంతపురం జిల్లాలోని వివిధ ప్రాంతాల తాగునీటిని అందించేందుకు 2.83టీఎంసీల నీరు వినియోగమయ్యే పథకాలను ప్రభుత్వం ఏర్పాటు చేసి నీటిని డ్యాం నుంచి తరలిస్తున్నారని పేర్కొన్నారు. సీబీఆర్ ప్రాజెక్టు నుంచి 75శాతం అనంతపురం జిల్లా నీటి పథకాలే ఉన్నాయని లేఖలో విజయమ్మ గుర్తు చేశారు. ఐఏబీ కేటాయింపులు బాగానే ఉన్నా..పారదర్శకంగా అమలు చేయడంతో అధికారులు పూర్తిస్థాయిలో విఫలమవుతున్నారని అం దులో పేర్కొన్నారు. దీంతో పీబీసీ కాలువ పరిధిలోని ఆయకట్టుదారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లుగా ఐఏబీలో పీబీసీకి నీటిని కేటాయిస్తున్నా.. పీబీసీ ఆయకట్టుకు నీరు ఇవ్వలేని పరి స్థితి నెలకొందని.. మూడేళ్లుగా వస్తున్న అరకొర నీటితో చివరకు పులివెందులకు తాగునీటికి కూడా అందించలేకపోయిన విషయాన్ని విజయమ్మ గుర్తు చేశారు. దీనికి ప్రధాన కారణం సీబీఆర్‌లో ఉన్న తాగునీటి అవసరాలు 2.83 టీఎంసీలయితే.. అధికారికంగా 2టీఎంసీలే ఇవ్వ గా.. 0.83టీఎంసీల నీరు తాగునీటి అవసరాలకు లోటుగా భావించాలి. ఇదంతకూడా ఐఏబీలో అవగాహనారాహిత్యంగా జరుగుతున్న తతంగమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మిడ్ పెన్నార్ నుంచి తుం పెర వరకు నీరు ప్రవహించే సమయంలో 15శాతం నీటిని.. అలాగే తుంపెర నుంచి సీబీఆర్కి చేరే సమయంలో జరిగే నీటి నష్టాన్ని 20శాతం లాసెస్ కింద నష్టం జరుగుతోందని అధికారులు రికార్డులలో చూపిస్తున్నారని.. ఈ లెక్కన 2టీఎంసీల నీటిలో 35శాతం లాసెస్ కింద పోగా.. సీబీఆర్‌కు 1.40 టీఎంసీల నీరు చేరుతోందని విజయమ్మ పేర్కొన్నారు. మరోవైపు పీబీసీ రైతులకు చుక్కనీరు అందక.. బోర్లల్లో భూగర్భజలాలు అడుగంటి పులివెందుల ప్రాంత రైతులు చీనీ చెట్లను నరికివేసుకున్నారని వివరించారు. ఈ ఏడాది ఐఏబీ సమావేశంలో కేటాయింపుల అమలు తీరు మీకు వివరించాలనుకున్నామని.. ఈ ఏడాది ఐఏబీలో సీబీ ఆర్‌లోని తాగునీటికి 2 టీఎంసీలను.. పీబీసీ సేద్యపు నీటి అవసరాలకు 1.23టీఎంసీల నీటిని కేటాయించారు. తొలి విడత కింద తాగునీటి కోటాను సీబీఆర్‌కు ఆగస్ట్‌లో ఇచ్చారన్నారు. హెచ్ఎల్సీ అధికారుల లెక్కల ప్రకారం 2.33టీఎంసీలు ఇచ్చినట్లు వారు నివేదికలో చూపించారని.. వాస్తవానికి సీబీ ఆర్కు చేరింది ఒక టీఎంసీ నీరు మాత్రమేనని.. ప్రస్తు తం పీబీసీకి కేటాయించిన సేద్యపు నీటి కోటా కింద 1.23టీఎంసీల నీరు ఇస్తున్నారని.. ప్రస్తుతం తుంపెర వద్ద ఇస్తున్న రీడింగ్ ఇదే విధంగా అమలు చేస్తే ఈనెల 10వ తేదీకి సేద్యపు నీటి కోటా ముగుస్తుందని అధికారు లు చెబుతున్నారని వివరించారు. ఒకవేళ అధికారుల లెక్కల ప్రకారమే ఇస్తున్నారనుకున్నా.. తుంగభద్ర డ్యా ం నుంచి హెచ్ఎల్సీకి అదనంగా కేటాయించిన 2టీఎం సీలలో దామాషా కింద పీబీసీకి 12.62శాతం రావాలి. అంటే సుమారు 0.25టీఎంసీల నీరు పీబీసీకి రావాల్సి ఉంది కదా అని ఆమె ప్రశ్నించారు. మీరు పీబీసీ రైతాంగ దీన స్థితిని అర్థం చేసుకొని ఈనెల చివరకు నీటిని విడుదల చేయాలని ఎమ్మెల్యే విజయమ్మ లేఖలో కోరారు. -
ఇచ్చీ.. ఇచ్చీ.. సాలైంది..
అనంతపురం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : వందలాది మంది ప్రజలు సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ‘ప్రజావాణి’ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఇసుమంతైనా ఫలితం ఉండటం లేదు. ఇచ్చిన సమస్యలపైనే మళ్లీ మళ్లీ అర్జీలు ఇస్తున్నారు. కనీసం ఆ అర్జీలు ఏ దశలో ఉన్నాయో కూడా చెప్పే పరిస్థితి లేదు. జిల్లా ఉన్నతాధికారులు అర్భాటంగా ప్రజల నుంచి ప్రతివారం వినతి పత్రాలు స్వీకరిస్తున్నారే కానీ వాటి పరిష్కారానికి స్పష్టమైన ప్రణాళిక రూపొందించుకోవడంలో దారుణంగా విఫలమయ్యారు. ఒక సమస్యపైనే వినతిపత్రాలు ఇచ్చేవారు 80-100 మంది దాకా ఉంటున్నారు. అర్జీదారులకు వ్యయాప్రయాసలు మినహా ఎలాంటి ఉపయోగం లేదు. గ్రీవెన్స్ వైపు చూడని అధికారులు.. రెవెన్యూ భవన్లో నిర్వహిస్తున్న ‘ప్రజావాణి’కి కలెక్టర్, జేసీ, జెడ్పీ సీఈఓ, డీఆర్వో తదితర ఉన్నతాధికారులంతా హాజరై ప్రతి సోమవారం అర్జీలు స్వీకరిస్తున్నారు. ప్రభుత్వ శాఖల అధికారుల్లో చాలా మంది ప్రజావాణికి డుమ్మా కొడుతున్నారు. మరి కొన్ని శాఖల అధికారులు కింది స్థాయి అధికారులను పంపుతూ కాలం వెళ్లదీస్తున్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణికి అగ్నిమాపక శాఖ, పంచాయతీరాజ్, ఆర్అండ్బీఈఈ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ హెచ్ఎన్ఎస్ఎస్ అనంతపురం, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సీబీఆర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ హెచ్ఎన్ఎస్ఎస్ గుంతకల్లు, ఏడీసీసీ బ్యాంకు తదితర శాఖల అధికారులు అటు వైపు కన్నెత్తి చూడలేదు. డీఆర్డీఏ, డ్వామా, ఐసీడీఎస్ పీడీ, ఆర్డబ్ల్యూఎస్, డీపీఓ తదితర శాఖల అధికారులు కింది స్థాయి సిబ్బందిని పంపి చేతులు దులుపుకున్నారు. పెండింగ్‌లో 1930 అర్జీలు.. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను కేటగిరి -ఏ, బీ, సీ,డీ,ఈ,ఎఫ్, జీలుగా విభజిస్తారు. ఇప్పటిదాకా ఈ ఏడాదిలో ప్రజావాణిలో 27,974 అర్జీలు వచ్చాయి. వీటిలో 25,674 అర్జీలు పరిష్కరించినట్లు అధికారుల గణాంకాలు సూచిస్తున్నాయి. కేటగిరి-ఏలో 6,717 అర్జీలు రాగా, 6011 పరిష్కరించినట్లు చెబుతున్నారు. పెండింగ్‌లో 706 అర్జీలు ఉన్నాయి. బీ-కేటగిరిలో 5,515 అర్జీలు రాగా 4,797 అర్జీలు పరిష్కారం కాగా 354 పెండింగ్‌లో ఉన్నాయి. సీ-కేటగిరిలో 11,360 అర్జీలు రాగా 10,853 అర్జీలు పరిష్కరించారు. 501 పెండింగ్‌లో ఉన్నాయి. డీ-కేటగిరిలో 2,706 అర్జీలు రాగా 2,547 పరిష్కరించారు. 159 పెండింగ్‌లో ఉన్నాయి. ఈ-కేటగిరిలో 1,622 రాగా 1431 పరిష్కరించారు. 191 పెండింగ్‌లో ఉన్నాయి. జీ-కేటగిరిలో 54 రాగా 35 పరిష్కారించగా 19 పెండింగ్‌లో ఉన్నాయి. అధికారులు పరిష్కారమయ్యాయని చెబుతున్న వాటిలో వాస్తవంగా సగానికి సగం ఆయా విభాగాలకు పంపి పరిష్కారమైనట్లు రికార్డుల్లో రాస్తున్నట్లు తెలుస్తోంది. వికలాంగుల బాధలు వర్ణనాతీతం ప్రజావాణిలో సకలాంగుల సమస్యలపై వచ్చే అర్జీలను తీసుకునేందుకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు. వికలాంగుల అర్జీలు తీసుకునేందుకు రెవెన్యూ భవన్ కిందనే ఏర్పాటు చేసినా అక్కడ ఉన్నతాధికారులు ఎవరూ లేకపోవడంతో వికలాంగులు అష్టకష్టాలు పడి ర్యాంప్ ఎక్కి రెవెన్యూభవన్‌లో వినతులు సమర్పిస్తున్నారు. -
తెల్లారిన బతుకులు
‘కేకలు.. ఆరుపులు.. కాపాడండంటూ ఆర్తనాదాలు.. ఏం జరిగిందో అర్థం కాలేదు.. టాయ్‌లెట్ వాకిలి తెరిచి బయటకు తొంగిచూస్తే పొగ గుప్పుమంది.. ఏదో జరగరానిది జరిగిందని భయపడుతూ అడుగు బయటకు పెట్టాను.. ఆలోచించడానికే సమయం లేదు.. ఏదో ఒకటి చేయాలి.. లేదంటే ఇక్కడే సజీవ సమాధి ఖాయం.. వాకిలి తెరుచుకోలేదు.. తిరిగి టాయ్లెట్లోకి వెళ్లి కిటికీని గట్టిగా కాలితో నాలుగు తన్నులు తన్నాను.. అద్దం పగిలిపోయింది.. బోగీ లోపల మంటలు ఎగిసిపడుతూ మీదకొస్తున్నాయి.. అందరూ ఇటు రండంటూ గట్టిగా కేకలు వేశా.. అప్పటికే ఎవరో చైన్ లాగడంతో రైలు ఆగిపోయింది.. కిటికీలోంచి దూకేయండంటూ పురమాయించాను.. వేడిమి భరించడం వీలుకాక నేనూ బయటకు దూకేశాను’ అంటూ కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన శరణ్ బసవ బెంగళూరు - నాందేడ్ రైలు బోగీ దగ్ధమైన ఘటనను భయం భయంగా వివరించారు. ఈ ఘటనలో ఆయన తన భార్య, మామను మాత్రం కాపాడుకోలేకపోయాడు. సంఘటన స్థలం మరుభూమిగా మారింది. మృతదేహాలు ఒక్కోటి బయటకు తీస్తుంటే స్థానికుల ఒళ్లు జలదరించింది. దేవుడా.. ఇక ఆ బోగీలో మృతదేహాలు ఉండకూడదంటూ ప్రార్థించారు. కొత్తచెరువు/పుట్టపర్తిటౌన్, న్యూస్‌లైన్ : శనివారం తెల్లవారుజాము.. అప్పుడప్పుడే తొలి కోడి కూసింది.. రైతు కుటుంబాల వారు నిద్రలేస్తున్నారు. అంతలోనే రైలు బోగీ అంటుకుందన్న వార్తతో కొత్తచెరువు, పుట్టపర్తి వాసులు ఉలిక్కి పడ్డారు. పరుగు పరుగున సంఘటన స్థలానికి తరలివెళ్లారు. బోగీ మంటల్లో తగలబడుతూ కనిపించింది. ఎవరికి చేతనైంది వారు చేసి ప్రయాణికులను కాపాడటానికి ఉపక్రమించారు. శుక్రవారం రాత్రి 11 గంటలకు బెంగళూరులో బయలు దేరిన నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలులోని బీ1 ఏసీ బోగీ ఇక్కడ తగలబడిన సంఘటనలో 26 మంది మృతి చెందారని తెలియగానే జిల్లాలోని ప్రముఖులందరూ తరలివచ్చారు. కాసేపటికి రైల్వే అధికారులూ వచ్చారు. ఉదయం 11 గంటల సమయానికి ఆ రైలులో ప్రయాణించిన వారి బంధులు సైతం కొందరు తరలివచ్చారు. జిల్లా కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్, డీఐజీ బాలకృష్ణ, ఎస్పీ సెంథిల్‌కుమార్, ధర్మవరం ఏఎస్పీ అభిషేక్ మహంతి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మొత్తం 26మంది మరణించినట్లు కలెక్టర్ తెలిపారు. క్షతగాత్రులను పుట్టపర్తి, ధర్మవరం, అనంతపురం ఆస్పత్రులకు తరలించారు. అనంతరం వారిని మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తీసుకెళ్లారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రామసుబ్బారావు ఆధ్వర్యంలో సంఘటన స్థలిలోనే వైద్య శిబిరం ఏర్పాటు చే సి స్వల్పంగా గాయపడిన వారికి చికిత్స చేయించారు. మధ్యాహ్నం రైల్వే శాఖ మంత్రులు మల్లిఖార్జున ఖర్గే, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, ఎంపీలు అనంత వెంకట్రామిరెడ్డి, నిమ్మల కిష్టప్ప, మంత్రి రఘువీరా, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు గురునాథ్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, స్థానిక వైఎస్ఆర్సీపీ నేత హరికృష్ణ తదితరులు సంఘటన స్థలిని పరిశీలించారు. వైఎస్ఆర్సీపీ అధినేత వై.ఎస్ జగన్మోహన్రెడ్డి సంఘటన స్థలికి చేరుకుని కాలిపోయిన రైలు బోగీని పరిశీలించి.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై నిప్పులు చెరిగారు. కాగా, మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది. అనంతపురం నగరం నీలిమీ థియేటర్ సమీపంలోని డోర్ నెంబర్ 1-333 ఇంట్లో ఉంటున్న పోస్టల్ కరస్పాండెంట్ క్లర్క్ చంద్రశేఖర్, అనసూయ కుమారుడు శ్రీనివాస్ (28), కోడలు (26) శ్రీలత బెంగళూరులోని ప్రెవేట్ కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. ఆరు నెలల క్రితమే వీరికి వివాహమైంది. మంత్రాలయం వెళ్లాలనుకుని ఈ రైలులో బయలుదేరారు. ఇపుడు వారి ఆచూకీ తెలియడం లేదు. ఇద్దరి ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. వారి బంధువులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. -
నేటి నుంచి రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన
నార్పల, న్యూస్‌లైన్ : నార్పలలోని ప్రభుత్వ బాలికలు, బాలుర ఉన్నత పాఠశాలల్లో శుక్రవారం నుంచి రాష్ర్టస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన (ఇన్స్పైర్)-2013 నిర్వహించనున్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ ప్రదర్శనను రాష్ర్ట రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి, ప్రాథమిక విద్యాశాఖ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి, జిల్లా ఇన్చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభిస్తారు. తొలిరోజు సాయంత్రం నాలుగు గంటలకు విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ఉంటాయి. 29వ తేదీ వరకూ ప్రతి రోజూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాట్లను కలెక్టర్ లోకేష్‌కుమార్ గురువారం పర్యవేక్షించారు. 12 జిల్లాల నుంచి వస్తున్న విద్యార్ధులు, వారి కేర్ టేకర్ల కోసం ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రెవేట్ పాఠశాలలను పరిశీలించారు. అనంతరం అధికారులు, ఉపాధ్యాయులతో చర్చించారు. విద్యార్థులను తల్లిదండ్రులతోపాటు ఉపాధ్యాయబృందంతో వచ్చేలా ప్రోత్సహించి వైజ్ఞానిక ప్రదర్శనను విజయవంతం చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్వీఎం పీఓ రామారావు, డీఈఓ మధుసూదన్‌రావు, సైన్స్ మ్యూజియం క్యూరేటర్ రాఘవయ్య, కోఆర్డినేటర్ ఆనందభాస్కర్‌రెడ్డి ఉన్నారు. -
పారని జేసీ పాచిక!
సాక్షి ప్రతినిధి, అనంతపురం : కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి పాచిక పారలేదు. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ రచ్చబండలో ముఖ్యమంత్రితో ‘చాగల్లు’ రిజర్వాయర్‌ను జాతికి అంకితం చేయించి.. పునర్వైభవం సాధించాలని ఆరాటపడ్డారు. తాడిపత్రిలో పర్యటిస్తే.. తాము బహిష్కరిస్తామని మంత్రులు రఘువీరారెడ్డి, శైలజానాథ్ తెగేసి చెప్పడంతో సీఎం వెనక్కి తగ్గారు. మరోసారి శింగనమల నియోజకవర్గంలోనే రచ్చబండ నిర్వహించేందుకు ముఖ్యమంత్రి సిద్ధమయ్యారు. రెండేళ్లుగా సీఎంను రప్పించుకునేందుకు జేసీ విఫలయత్నం చేస్తున్నారు. ప్రతి సందర్భంలోనూ మంత్రులే పైచేయి సాధిస్తున్నారు. ముఖ్యమంత్రి ఈనెల 11 నుంచి 26 వరకు మూడో విడత ‘రచ్చబండ’ నిర్వహిస్తోన్న విషయం విదితమే. జిల్లాలో 19 లేదా 24 తేదీల్లో రచ్చబండ నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని సీఎం కార్యాలయం కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్‌ను కోరింది. ఇది పసిగట్టిన జేసీ దివాకర్‌రెడ్డి రచ్చబండలో భాగంగా తన నియోజకవర్గంలో పర్యటించాలని కోరారు. ఇందుకు సీఎం అంగీకరించారు కూడా. సీఎం చేతుల మీదుగా చాగల్లు రిజర్వాయర్‌ను జాతికి అంకితం చేయడంతోపాటు తాడిపత్రిలో మున్సిపల్ కార్యాలయం, కాంప్లెక్స్‌లను ప్రారంభింపజేసి, నియోజకవర్గంపై పట్టు సాధించాలని జేసీ ఆరాటపడ్డారు. ఈ క్రమంలోనే చాగల్లుకు హంద్రీ-నీవా నీటిని తరలించేందుకు నవంబర్ 30న ప్రయత్నించారు. కానీ.. ఇందుకు అనుమతి లేకపోవడంతో అధికారులు నీటి విడుదల ఆపేశారు. తాడిపత్రిలో పర్యటించేందుకు సీఎం అంగీకరించడాన్ని తెలుసుకున్న మంత్రులు రఘువీరా, శైలజానాథ్ మండిపడ్డారు. తాడిపత్రిలో పర్యటిస్తే.. తాము బహిష్కరిస్తామని సీఎంకు స్పష్టం చేశారు. దాంతో.. సీఎం వెనక్కి తగ్గారు. తన నియోజకవర్గంలో పర్యటించాలని శైలజానాథ్ పట్టుబట్టారు. గతంలో నిర్దేశించిన షెడ్యూల్‌తో నిమిత్తం లేకుండా ఈ నెల 22న శింగనమలలో పర్యటించాలని కోరారు. ఇందుకు సీఎం అంగీకరించారు. ఆ మేరకు శింగనమలలో రచ్చబండ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం కిరణ్ 2011లో నిర్వహించిన తొలి విడత రచ్చబండలో శింగనమల నియోజకవర్గంలోని గార్లదిన్నె మండలంలో పర్యటించారు. మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి, మంత్రులు రఘువీరా, శైలజానాథ్ మధ్య ఆధిపత్య పోరుతో రెండో విడత రచ్చబండ పర్యటనను గతేడాది సీఎం కిరణ్ జిల్లాలో రద్దు చేసుకున్నారు. రెండో విడత రచ్చబండ సమయంలోనూ తాడిపత్రి నియోజకవర్గంలో పర్యటించాలంటూ సీఎంను జేసీ పట్టుపట్టారు. అక్కడ పర్యటిస్తే.. తాము బహిష్కరిస్తామని మంత్రులు చెప్పడంతో అప్పట్లో ఏకంగా రచ్చబండ పర్యటననే జిల్లాలో రద్దుచేసుకోవడం గమనార్హం. కాగా సీఎం సభను తొలుత ఈ నెల 24 నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ నెల 23న సత్యసాయి జయంతి వేడుకలు ఉన్నందున.. పోలీసు సిబ్బంది అంతా అక్కడకు వెళ్తారని పోలీసు అధికారులు సెలవిచ్చారు. దీంతో శైలజానాథ్ కల్పించుకుని.. ముఖ్యమంత్రి పర్యటన కంటే ఉత్సవాలు అంత ముఖ్యమా అని వ్యాఖ్యానించడంతో ‘రచ్చబండ’ను ఈ నెల 22న నిర్వహించాలని ఖరారు చేశారు. -
అనంతను ఆదుకోండి
అనంతపురం సిటీ, న్యూస్‌లైన్ : కరువు జిల్లా అయిన అనంతలో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, వారిని ఆదుకోవాలని జిల్లా ప్రత్యేకాధికారి, రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వైవీ అనూరాధను కలెక్టర్ లోకేష్‌కుమార్ కోరారు. సోమవారం రాత్రి స్థానిక డ్వామా హాలులో జిల్లాలో వేరుశనగ పంట పరిస్థితి, వర్షాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్, అధికారులు పలు సమస్యలను తెలియజేశారు. జిల్లాలో సకాలంలో వర్షాలు కురవక, కొన్ని రోజుల క్రితం అధిక వర్షాల వల్ల వేరుశనగ దిగుబడి గణనీయంగా తగ్గిపోయిందని, కట్టె కూడా మేతకు పనికిరాకుండా పోయిందని కలెక్టర్ వివరించారు. 2011-12కు సంబంధించి ‘మిస్ మ్యాచింగ్’ వల్ల రూ.65 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ రైతులకు అందలేదన్నారు. 2012-13కు సంబంధించి రూ.644 కోట్లకు గాను రూ.230 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ రావాల్సి ఉందన్నారు. టీబీ డ్యామ్ నుంచి జిల్లాకు రావాల్సిన 18 టీఎంసీల నీటిలో ఇప్పటి వరకు 13 టీఎంసీలు మాత్రమే వచ్చిందన్నారు. దీనివల్ల రైతులు ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పీఏబీఆర్‌లో 1.34 టీఎంసీలు, ఎంపీఆర్‌లో 1.15 టీఎంసీల నీరు ఉందన్నారు. హెచ్ఎల్సీ ద్వారా 1,800 క్యూసెక్కుల నీరు వస్తోందన్నారు. ఓడీ చెరువు, అమడగూరు, పుట్లూరు, యల్లనూరు మండలాల పరిధిలోని 80 గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉండడంతో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో నాన్ సీఆర్ఎఫ్ కింద నిధులు మంజూరు చేయించాలని కలెక్టర్‌తో పాటు ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ప్రభాకర్ కోరారు. 1.34 లక్షల హెక్టార్లలో పండ్ల తోటలు ఉన్నాయని, మల్చింగ్, ఫారం పాండ్స్‌కు నిధులు అధికంగా ఇప్పించాలని కోరారు. ప్రత్యేకాధికారి అనురాధ స్పందిస్తూ రైతులకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు ఇవ్వాలని, ఇన్పుట్ సబ్సిడీ మొత్తాన్ని రుణాలకు జమ చేయకుండా చూడాలని నాబార్డు ఏజీఎం రవీంద్రను ఆదేశించారు. వచ్చే వేసవిలో తాగు నీటి ఎద్దడి నివారణకు పీఏబీఆర్‌లో రెండు టీఎంసీల నీటిని నిల్వ ఉంచుకోవాలన్నారు. గడ్డి కొరత ఏర్పడకుండా కణేకల్లు తదితర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి నిల్వ ఉంచాలని పశుసంవర్ధక శాఖ జేడీ శ్యాంమోహన రావుకు సూచించారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని డీఆర్డీఏ పీడీ నీలకంఠారెడ్డికి సూచించారు. మార్పు పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేయాలని, గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం ఇచ్చిన నిధులు ఇతర పథకాలకు మళ్లిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో డ్వామా పీడీ సంజయ్ ప్రభాకర్, సిరికల్చర్ జేడీ అరుణకుమారి, సీపీఓ సుదర్శన్ పాల్గొన్నారు.