సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లో ఖాళీగా ఉన్న ప్రధాన పోస్టుల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా సీఈసీ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ అదనపు కేంద్ర ఎన్నికల ప్రధానాధికారిగా లోకేష్ కుమార్‌ను నియమించింది.
తాజాగా దీనికి సంబంధించి తెలంగాణ గవర్నర్ తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, లోకేష్ కుమార్ ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కొత్త కమిషనర్‌గా 2006 బ్యాచ్‌కు చెందిన IAS అధికారి రోనాల్డ్ రోస్ నియమితులయ్యారు. అలాగే ఎక్సైజ్ శాఖ కమిషనర్‌గా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్‌ను సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారిగా నియమితులయ్యారు. 2014 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి Md. ముషారఫ్ అలీ ఫరూఖీకి ప్రొహిబిషన్ & ఎక్సైజ్ డైరెక్టర్ పదవిని కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment