Chief Election Officer
-
హైదరాబాద్‌లో మందకొడిగా పోలింగ్.. సీఈవో వికాస్‌రాజ్ ఏమన్నారంటే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కొన్ని చోట్ల స్పల్ప ఘటనలు మినహా తెలంగాణ వ్యాప్యంగా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సాధారణ ప్రజలతోపాటు రాజకీయ నాయకులు, సినీతారలు పోలింగ్ కేంద్రాల వద్దకు తరలివస్తున్నారు. ఓటేసేందుకు ఉదయం నుంచే ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు ఇక గురువారం మధ్యాహ్నం ఒంటి గంట వరకూ రాష్ట్రవ్యాప్తంగా 36.68 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా మెదక్ జిల్లాలో 50.80 శాతం నమోదు అయ్యింది. మహబూబ్‌నగర్‌లో 45 శాతం, కరీంనగర్ 40.73, ఆదిలాబాద్ 41.88, గద్వాల్ 49.29, ఖమ్మం 42 శాతం, మంచిర్యాల 42.74 శాతం, మహబూబాబాద్ 48 శాతం, కామారెడ్డి 41 శాతం పోలింగ్ నమోదైంది. ఇక హైదరాబాద్‌లో అత్యల్పంగా కేవలం 20.79 శాతం పోలింగ్ నమోదవడం ఓటింగ్‌పై నగర ఓటర్ నిరాసక్తతను వెల్లడిస్తోంది. ఓటింగ్‌పై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో)వికాస్‌రాజ్ మాట్లాడుతూ.. ఓటర్ల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తిన కొన్ని చోట్ల ఈవీఎంలు మార్చినట్లు చెప్పారు. అర్బన్ ఏరియాల్లో పోలింగ్ నెమ్మదిగా కొనసాగుతోందని తెలిపారు. నగర ఓటరు ఇండ్లను వీడి పోలింగ్ కేంద్రాలకు తరలిరావాలని సూచించారు. మధ్యాహ్నం నుంచి వేగం పెరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. కొన్నిచోట్ల నేతలు చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు వచ్చాయని వాటిపై విచారణ చేపట్టి కేసులు నమోదు చేస్తామన్నారు. చదవండి: తెలంగాణ ఎన్నికల పోలింగ్.. లైవ్ అప్డేట్స్ -
AP: ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాని వైఎస్సార్సీపీ నేతలు బుధవారం కలిశారు. ఓటర్ల జాబితా అవకతవకలు, టీడీపీ నేతల అక్రమాలపై ఫిర్యాదు చేశారు. ఎలక్ట్రోరల్ ఆఫీసర్ని కలిసిన వారిలో మంత్రులు మేరుగ నాగార్జున, జోగి రమేష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉన్నారు. -
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక భేటీ నిర్వహిస్తోంది. బుధవారం తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) వికాస్ రాజ్ అన్ని జిల్లాల ఎస్పీలు, సీపీలతో బూర్గుల రామకృష్ణారావు భవన్లో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి డీజీపీ, అడిషనల్ డీజీ, ఇతర ఉన్నతాధికారులు సైతం హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎన్నికలకు సంబంధించి.. పోలింగ్ నిర్వహణ, లా అండ్ ఆర్డర్‌పై శిక్షణ ఇవ్వనున్నారు. ఇక ఇప్పటికే ముసాయిదా ఓటర్ల జాబితా సిద్ధం చేసింది ఎన్నికల సంఘం. ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే రెండుసార్లు ఆర్వో, ఏఆర్వోలకు శిక్షణ ఇచ్చారు. అక్టోబర్‌లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. బోగస్ ఓట్ల తొలగింపు ఇలా.. ఇదిలా ఉంటే.. తెలంగాణలో 10 లక్షల బోగస్ ఓటర్లను తొలగించినట్లు సీఈవో వికాజ్‌రాజ్ తాజాగా వెల్లడించారు. ఇందులో సగానికిపైగా గ్రేటర్ హైదరాబాద్, చుట్టుపక్కల నియోజకవర్గాల్లోనే ఉన్నాయి. ఒకే వ్యక్తికి రెండు.. అంతకు మించి ఓట్లు ఉండడం, డూప్లికేట్ ఎంట్రీలు, వ్యక్తులు, అధికారులు, రాజకీయ పార్టీల నేతల ద్వారా నివేదించబడిన నమోదులు తదితర కారణాలతో బోగస్ ఓట్లు తొలగించినట్లు తెలిపారు. అలాగే ఫాం-8 ద్వారా చిరునామా మార్చుకున్నప్పుడు పాత చిరునామాలో ఉన్న పేర్లను తొలగింపు ఉంటుందన్నారు. అలాగే ఓటరు సదరు చిరునామాలో నివసించనట్లు తెలిస్తే ఓటు డిలీట్ అవుతుందన్నారు. డూప్లికేట్ ఓట్ల తొలగింపుపై విధివిధానాలు పాటించామని సీఈవో తెలిపారు. సీరియస్‌గా ఉండండి రాబోయే ఎన్నికలకు సంబంధించిన ప్రతీ ప్రతి ఫిర్యాదును జిల్లాల ఎన్నికల అధికారులు సీరియస్‌గా తీసుకోవాలని సీఈవో వికాస్ రాజ్ ఆదేశించారు. అలాగే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికలను సమర్పించాలని పేర్కొన్నారు. ఓటరు భాగస్వామ్యాన్ని పెంపొందించడంతోపాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని మెరుగు పరిచేందుకు మార్గాలు అన్వేషించాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను ఆదేశించారు. సీఈఓ కార్యాలయం, ఈసీ ద్వారా అందే ఫిర్యాదులను వెంటనే పరిశీలించి వాస్తవ నివేదికలను ఆలస్యం చేయకుండా సీఈవో కార్యాలయానికి పంపాలని డీఈవోలను ఆదేశించారు. -
తెలంగాణ ఎన్నికల అదనపు కమిషనర్‌గా లోకేష్ కుమార్ బదిలీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లో ఖాళీగా ఉన్న ప్రధాన పోస్టుల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా సీఈసీ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ అదనపు కేంద్ర ఎన్నికల ప్రధానాధికారిగా లోకేష్ కుమార్‌ను నియమించింది. తాజాగా దీనికి సంబంధించి తెలంగాణ గవర్నర్ తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, లోకేష్ కుమార్ ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కొత్త కమిషనర్‌గా 2006 బ్యాచ్‌కు చెందిన IAS అధికారి రోనాల్డ్ రోస్ నియమితులయ్యారు. అలాగే ఎక్సైజ్ శాఖ కమిషనర్‌గా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్‌ను సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారిగా నియమితులయ్యారు. 2014 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి Md. ముషారఫ్ అలీ ఫరూఖీకి ప్రొహిబిషన్ & ఎక్సైజ్ డైరెక్టర్ పదవిని కేటాయించారు. చదవండి: తెలంగాణ బీజేపీ చీఫ్ పదవికి బండి సంజయ్ రాజీనామా -
నిబంధనల ప్రకారమే మునుగోడు ఉపఎన్నిక
సాక్షి, హైదరాబాద్: దేశం దృష్టిని ఆకర్షించిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్ రాజ్ ప్రకటించారు. నిబంధనల ప్రకారమే ఎన్నిక నిర్వహించామని స్పష్టం చేశారు. ఉప ఎన్నిక ఫలితాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓ రిటర్నింగ్ అధికారి సస్పెండ్ కావడం దేశ చరిత్రలో తొలిసారిగా మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా జరిగిందన్న ఆరోపణలపై ఆయన స్పందించారు. వ్యక్తిగత స్థాయిలో కొందరు పొరపాట్లు చేసి దాని పర్యవసాలను అనుభవిస్తారన్నారు. 8న మునుగోడు ఉప ఎన్నిక కోడ్ ముగుస్తుందన్నారు. బీజేపీ ఆరోపణలు.. సీఈఓ వివరణ.. ఉప ఎన్నిక ఓట్లను 15 రౌండ్లలో లెక్కించగా, రౌండ్లవారీగా ఫలితాల ప్రకటనను కావాలనే జాప్యం చేస్తున్నారని బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఈ విషయమై సీఈఓ వికాస్‌రాజ్‌కు ఫోన్ చేసి రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో ఆలస్యంపై ప్రశ్నించారు. దీనిపై సీఈఓ వికాస్‌రాజ్ స్పందించారు. అధిక సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేయడం వల్లే ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనకు అధిక సమయం పట్టిందన్నారు. ఒక్కో రౌండ్లో ఓట్లను లెక్కించిన తర్వాత వాటిని చెక్చేయాల్సి ఉంటుందని, అభ్యర్థుల ఏజెంట్ల నుంచి అంగీకారం తర్వాత కౌంటింగ్ అబ్జర్వర్ నుంచి ఆమోదంతో రిటర్నింగ్ అధికారి ఫలితాలను ప్రకటిస్తారని తెలిపారు. చదవండి: మునుగోడులో కాంగ్రెస్ ఘోర పరాభవం.. రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే.. -
‘కౌంటింగ్‌లో ఇంత గోప్యత ఎందుకు.. మునుగోడులో ఏం జరుగుతోంది?’
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఎన్నికల లెక్కింపు ఫలితాల వెల్లడిలో గందరగోళ పరిస్థితి నెలకొంది. కౌంటింగ్ ఆలస్యంపై టీఆర్ఎస్, బీజేపీ విమర్శలకు దిగుతున్నాయి. కౌంటింగ్‌లో ఇంత గోప్యత ఎందుకు అని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు లక్ష్మణ్ ప్రశ్నించారు. సీఈవో వైఖరి ఏకపక్షంగా ఉందన్నారు. ఒకేసారి 4 రౌండ్లు ఎందుకు అప్డేట్ చేశారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో ఈసీవో పనిచేస్తున్నారని విమర్శలు గుప్పించారు. చదవండి: ఎన్నికల ప్రధానాధికారి తీరుపై బీజేపీ సీరియస్ బీజేపీకి లీడ్ వచ్చే రౌండ్లలోనే ఫలితాలను అప్ డేట్ చేయడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల మొదటి రోజు నుండి కౌంటింగ్ దాకా సీఈవో పనితీరు అనుమానాస్పదమేనన్నారు. పోలింగ్ రోజు టీఆర్ఎస్ స్థానికేతర నాయకులు మునుగోడులో మకాం వేస్తే.. ఎవరూ లేరని సీఈవో చెప్పడం హాస్యాస్పదం అన్నారు. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఫిర్యాదు చేసిన తర్వాత కూడా చర్యలు ఎందుకు తీసుకోలేదని లక్ష్మణ్ మండిపడ్డారు. ఐదో రౌండ్ ఆలస్యానికి కారణమేంటి?: రఘునందన్‌రావు ఫలితాల వెల్లడిలో ఆలస్యం అనుమానాలకు తావిస్తోందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. ఎన్నికల అధికారి నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. ఐదో రౌండ్ ఆలస్యానికి కారణమేంటి? అని ప్రశ్నించారు. -
Munugode Results: ఎన్నికల ప్రధానాధికారి తీరుపై బీజేపీ సీరియస్
సాక్షి, హైదరాబాద్/నల్గొండ: మునుగోడు వార్ కొనసాగుతోంది. కౌంటింగ్ మందకొడిగా సాగడంలో బీజేపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. రౌండ్ల వారీగా మునుగోడు ఉపఎన్నిక ఫలితాల వెల్లడిలో జాప్యంపై బీజేపీ సీరియస్ అయ్యింది. ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఫోన్ చేశారు. రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఎప్పటికప్పుడు ఎందుకు వెల్లడించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈసీ తీరు అనుమానాస్పదం.. ఈసీ తీరు అనుమానాస్పదంగా ఉందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ ఆధిక్యాన్ని వెల్లడించడం లేదంటూ ఆరోపించారు. ఫలితాల్లో ఆలస్యం జరుగుతోంది. జాప్యానికి కారణలేంటో ఈసీ చెప్పాలని బండి సంజయ్ అన్నారు. టీఆర్ఎస్కు లీడ్ వస్తే తప్ప ఫలితాలు చెప్పరా? అంటూ మండిపడ్డారు. ఫలితాల వెల్లడిలో ఏ పొరపాటు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు. సీఈవో విఫలం రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో సీఈవో విఫలం అయ్యిందని డీకే అరుణ అన్నారు. సీఈవో తీరు అనుమానాలకు తావిస్తోందన్నారు. ప్రచార సమయంలో చూపిన పక్షపాతమే ఫలితాల్లో చూపిస్తున్నారన్నారు. మీడియా ప్రతినిధులు ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. -
వీవీ ప్యాట్ల అంశంపై సమగ్ర వివరణకు సీఈవో ఆదేశం
హైదరాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా వీవీ ప్యాట్లు తారుమారయ్యాయని బీజేపీ నాయకులు రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్ గోయల్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. సీఈవో శశాంక్ గోయల్ ఎన్నికల అధికారులతో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. వీవీ ప్యాట్ల అంశంపై సమగ్ర వివరణ ఇవ్వాలని కలెక్టర్, వీఆర్వోలకు ఆదేశాలు జారీచేశారు. రేపు (సోమవారం) అన్ని పార్టీల నేతలతో సీఈవో శశాంక్ గోయల్ భేటీకానున్నారు. చదవండి: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే స్వయంగా డబ్బు పంచారు: ఈటల -
2024 లోక్‌సభ ఎన్నికల నాటికి రిమోట్ ఓటింగ్!
న్యూఢిల్లీ: దేశ ఎన్నికల వ్యవస్థలో రిమోట్ ఓటింగ్ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నామని కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి సునీల్ ఆరోరా వెల్లడించారు. వచ్చే రెండు, మూడు నెలల్లో దీనికి సంబంధించిన పైలెట్ ప్రాజెక్టు మొదలవుతుందని, 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి ఇది కార్యరూపం దాల్చే అవకాశాలున్నాయని అన్నారు. రిమోట్ ఓటింగ్‌కు సంబంధించిన అధ్యయనాన్ని ఈ ఏడాది మొదట్లో ప్రారంభించామని చెప్పారు. ఐఐటీ మద్రాసుతో పాటు దేశంలోని ఇతర ఐఐటీల్లోని సాంకేతిక నిపుణుల సహకారంతో దీనిపై కసరత్తు చేస్తున్నట్టుగా అరోరా చెప్పారు. రిమోట్ ఓటింగ్ అంటే ఆన్లైన్ ఓటింగ్ కాదని, ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకోవడం కూడా కాదని సీఈసీ స్పష్టం చేశారు. ఎన్నికల వ్యవస్థకి మరింత విశ్వసనీయత తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా ఈ విధానాన్ని రూపొందిస్తున్నట్టుగా చెప్పారు. త్వరలోనే దీనికి తుదిరూపు రేఖ వస్తాయని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు సహా అన్ని వర్గాల వారితో దీనిపై సంప్రదింపులు జరపవలసి ఉందని అన్నారు. గతంలో మాజీ డిప్యూటీ ఎన్నికల అధికారి సందేప్ సక్సేనా ఈ ప్రాజెక్టుని ‘‘బ్లాక్‌చైన్’’టెక్నాలజీ ద్వారా రూపొందిస్తున్నట్టుగా చెప్పారు. టూ–వే ఎలక్ట్రానిక్ ఓటింగ్ వ్యవస్థ కలిగి ఉండే ఈ విధానంలో వైట్ లిస్ట్‌లో ఉండే ఐపీ పరికరాలు, వెబ్ కెమెరాలు, బయోమెట్రిక్ డివైస్‌లు వంటివన్నీ ఉంటాయన్నారు. రిమోట్ ఓటింగ్ సదుపాయాన్ని వినియోగించుకోవాలనుకునే ఓటర్లు ముందుగా నిర్ణయించిన సమయానికి, నిర్దేశిత ప్రాంతానికి రావల్సి ఉంటుందని అప్పట్లో సక్సేనా వెల్లడించారు. (చదవండి: ఏప్రిల్ 17న తిరుపతి ఉప ఎన్నిక) -
ఆ వీడియోలు చంద్రగిరివి కాదు
సాక్షి, అమరావతి : సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియో ఫుటేజీలు చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గానివి కాదని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. రీపోలింగ్‌పై దాఖలైన పిటిషన్ విషయమై కోర్టులో ఎన్నికల సంఘం (ఈసీ) కౌంటర్ దాఖలు చేసిందని, కౌంటర్‌తోపాటు వీడియో ఫుటేజీలు అందించామని ఆయన శనివారం వెల్లడించారు. చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్ జరిగే ఏడుచోట్ల వీడియో ఆధారాలు లభించాయని, అందువల్లే ఎన్నికల సంఘం ఈ మేరకు చర్యలు తీసుకుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో 23వతేదీలోపు ఎప్పుడైనా రీపోలింగ్ చేయొచ్చన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రీపోలింగ్ సంబంధించిన లేఖను ఈసీకి పంపడంలో తప్పేమీ లేదని తెలిపారు. వీవీప్యాట్లలో మాక్ పోలింగ్ స్లిప్పులు తొలగించకుండా ఉంటే.. వాటిని లాటరీ నుంచి మినహాయిస్తామని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ల జారీలో ఎక్కడా అవకతవకలు జరగలేదన్నారు. మడకశిరలో రెండు ఓట్లు జారీ చేస్తే ఒక ఓటును వెనక్కి తీసుకున్నారని తెలిపారు. ఆకాశ రామన్న ఫిర్యాదులపై స్పందించొద్దని ఈసీ మార్గదర్శకాల్లో ఉందని, ఎవరైనా నేరుగా, లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే స్పందించాలని ఉందని తెలిపారు. కౌంటింగ్ రోజున ఫలితాలు వెల్లడించాల్సిన బాధ్యత ఆర్వో, అబ్జర్వర్లదేనని, సీఈసీ అనుమతించిన తర్వాతే ఆర్వోలు ఫలితాలను ప్రకటించాలని చెప్పారు. కౌంటింగ్‌కు సంబంధించిన నిర్ణయాధికారాలు ఆర్వో, అబ్జర్వర్లదేనని, రాష్ట్రంలో 200 మంది ఆర్వోలు, 200మంది అబ్జర్వర్లు కౌంటింగ్ విధుల్లో ఉంటారని తెలిపారు. రీపోలింగ్‌కు సంబంధించి అన్నిఏర్పాట్లు పూర్తి చేశామని, ఏడు చోట్ల 1800 మంది పోలీసులతో భద్రత ఏర్పాటుచేశామని, స్వేచ్ఛాయుత వాతావరణంలో రీపోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఎండల దృష్ట్యా రీపోలింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించినట్టు చెప్పారు. -
ఓటరు కార్డు లేకున్నా.. ఇవుంటే చాలు!
సాక్షి, హైదరాబాద్ : పోలింగ్ బూత్‌ల వారీగా ఓటర్లకు ఓటర్ స్లిప్పులు పంపిణీ చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) రజత్ కుమార్ తెలిపారు. అదేవిధంగా తెలంగాణ ఎన్నికలకు సర్వంసిద్దమని వివరించారు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రతీ ఓటరు వారి ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారని వివరించారు. ఓటరు గర్తింపు కార్డు లేని వారు12 రకాల ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డులతో ఓటు వేసే అవకాశాన్ని కల్పించామన్నారు. గురువారం జరిగిన మీడియా సమావేశంలో పలు అంశాలపై ఆయన చర్చించారు. ఓటరు కార్డు లేదని, ఓటరు స్లిప్పులు రాలేదని ఓటర్లు గందరగోళానికి గురికావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. 12 రకాల ఇతర ఫోటో గుర్తింపు కార్డులతో ఓటు వేయవచ్చని ఆయన తెలిపారు. వీటిలో ఏదో ఒకటి తమ వెంట తీసుకెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవచ్చని తెలిపారు. 12 రకాల ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డులు.. పాస్‌పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగులకు జారీచేసిన గుర్తింపు కార్డులు బ్యాంకులు, పోస్టాఫీసులు ఫొటోలతో జారీ చేసిన పాస్‌పుస్తకాలు పాన్ కార్డు ఆధార్‌కార్డు ఎన్ఆర్ఈజీఎస్ జాబ్‌కార్డ్ కార్మిక శాఖ జారీ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్ ఫొటోతో ఉన్న పెన్షన్ ధ్రువీకరణ పత్రం ఎన్నికల యంత్రాంగం జారీ చేసిన ఫొటో ఓటర్ స్లిప్ ఎంపీ, ఎంఎల్ఏ, ఎంఎల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు ఎన్‌పీఆర్‌కింద ఆర్జీఐ జారీ చేసిన స్మార్ట్‌కార్డ్ -
ముందస్తుపై ఎన్నికల ప్రధానాధికారి క్లారిటీ..!
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. వీటన్నిటి మధ్య తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌తో అఖిలపక్ష నాయకులతో సచివాలయంలో బుధవారం సమావేశం జరిగింది. ఎన్నికల నేపథ్యంలోనే ఈ సమావేశం జరిగిఉండొచ్చని అంతా భావిస్తున్నారు. అయితే, ముందస్తు ఎన్నికలపై తమకు ఎలాంటి సమాచారం లేదని సీఈఓ రజత్‌కుమార్ స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా ముసాయిదాపై మాత్రమే చర్చలు జరగాయని తెలిపారు. ఇది సాధారణ సమావేశం మాత్రమేనన్నారు. ఎన్నికల కమిషన్‌ను సంప్రదించిన తర్వాతే ఎన్నికలకు వెళ్తారని తెలిపారు. ఒకవేళ టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు పిలుపునిచ్చినా తాము సిద్దమేనని వెల్లడించారు. బ్యాలెట్ మిషన్లు, వివి పాట్ మిషన్లు నవంబరు కల్లా సిద్ధంగా ఉంటాయని తెలిపారు. ఎన్నికలు ముందస్తుగా వచ్చినా 2018 జనవరి ఓటర్స్ లిస్ట్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. నామినేషన్లకు పది రోజుల ముందువరకు ఓటర్ల నమోదుకు అవకాశం ఉంటుందనీ, 2019 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటు హక్కు పొందొచ్చని తెలిపారు. సీఈఓ కార్యాలయానికి అవసరమైన సిబ్బందిని ఇప్పుడిప్పుడే ఇస్తున్నారని చెప్పారు. సమావేశంలో పాల్గొన్న పలువురు నాయకులు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ సీనియర్‌నేత మర్రి శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు వెళ్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ కూడా ముందస్తు ఎన్నికలకు సిద్ధమేనని అన్నారు. అక్రమ ఓటర్లను తొలగించాలని ఈసీని కోరామని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా దంతాలపల్లిలో టీఆర్ఎస్ మద్దతుదారులు కాకుండా మిగిలిన వారి ఓట్లు తొలగించారని ఆరోపించారు. బదిలీ చేసిన 7 మండలాల్లోని ప్రజలు ఇంకా తెలంగాణ ఓటర్లుగానే ఉన్నారు. ఇవన్నీ పక్కనపెట్టి ముందస్తు ఎన్నికలకు వెళ్తారని అనుకోవడం లేదని శశిధర్ రెడ్డి అన్నారు. జూలై 28న ఇచ్చిన ఓటర్ల జాబితా ముసాయిదాపై అభ్యంతరాలు చెప్పమన్నారని బీజేపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి అన్నారు. ముందస్తు ఎన్నికలపై సీఈఓను అడగగా తమకు ఎలాంటి సమాచారం లేదని చెప్పినట్టు ఆయన వెల్లడించారు. సమావేశంలో టీడీపీ అధికార ప్రతినిధి రావుల చంద్రశేఖర్, టీఆర్ఎస్ అధికార ప్రతినిధి గట్టు రామచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికలు.. చివరిరోజు నామినేషన్ల వరద
సాక్షి, కోహిమ: నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల దాఖలకు చివరి తేదీ దగ్గర పడుతున్నా ఉలుకు పలుకూ లేకుండా ఉన్న నేతలు చివరి రోజు మాత్రం నామినేషన్ వేశారు. బుధవారం (ఫిబ్రవరి 7) చివరిరోజు కాగా.. అదే రోజు నాగా పీపుల్స్ ఫ్రంట్, నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, స్వతంత్రులు కలిపి 253 మంది నేతలు తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి 27న నాగాలాండ్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించనున్నారు. మంగళవారం అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్ తొలి నామినేషన్ దాఖలు చేయగా, అదేరోజు సీఎం టీఆర్ జెలియాంగ్ తన నామినేషన్ పత్రాలు సమర్పించినట్లు సమాచారం. నాగాల తిరుగుబాటు గ్రూపులు గ్రేటర్ నాగాలాండ్ లేదా నాగాలిమ్ కోసం చేస్తున్న డిమాండ్లు, చర్చల కారణంగా మెజార్టీ నేతలు చివరిరోజు వరకూ నామినేషన్ వేయలేదని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అభిజిత్ సిన్హా తెలిపారు. నామినేషన్ పత్రాలను గురువారం పరిశీలించనుండగా, ఉపసంహరణకు ఫిబ్రవరి 12 చివరితేదీ అని చెప్పారు. ఉన్నతాధికారులతో నాగాలాండ్ సీఎం టీఆర్ జెలియాంగ్ నాగాలాండ్, మేఘాలయాల్లో ఫిబ్రవరి 27న, త్రిపురలో ఫిబ్రవరి 18న ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లోనూ మార్చి 3న ఎన్నికల లెక్కింపు జరుగుతుంది. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయాల్లో ఒక్కో రాష్ట్రంలో 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ఎన్నికల్లో ఈవీఎంలకు వీవీ ప్యాట్ మిషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ అచల్ కుమార్ జ్యోతి ఇదివరకే స్పష్టం చేశారు. -
నృసింహుని సన్నిధిలో భన్వర్‌లాల్ దంపతులు
కదిరి : రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ దంపతులు సోమవారం ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వారు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామిని దర్శించుకొన్నారు. నారసింహుని దర్శనం తన పూర్వజన్మ సుకృతమని భన్వర్‌లాల్ అన్నారు. అనంతరం ఆయన మంత్రాలయం బయలుదేరి వెళ్లారు.