సాక్షి, హైదరాబాద్: దేశం దృష్టిని ఆకర్షించిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్ రాజ్ ప్రకటించారు. నిబంధనల ప్రకారమే ఎన్నిక నిర్వహించామని స్పష్టం చేశారు. ఉప ఎన్నిక ఫలితాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఓ రిటర్నింగ్ అధికారి సస్పెండ్ కావడం దేశ చరిత్రలో తొలిసారిగా మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా జరిగిందన్న ఆరోపణలపై ఆయన స్పందించారు. వ్యక్తిగత స్థాయిలో కొందరు పొరపాట్లు చేసి దాని పర్యవసాలను అనుభవిస్తారన్నారు. 8న మునుగోడు ఉప ఎన్నిక కోడ్ ముగుస్తుందన్నారు.
బీజేపీ ఆరోపణలు.. సీఈఓ వివరణ..
ఉప ఎన్నిక ఓట్లను 15 రౌండ్లలో లెక్కించగా, రౌండ్లవారీగా ఫలితాల ప్రకటనను కావాలనే జాప్యం చేస్తున్నారని బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఈ విషయమై సీఈఓ వికాస్‌రాజ్‌కు ఫోన్ చేసి రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో ఆలస్యంపై ప్రశ్నించారు. దీనిపై సీఈఓ వికాస్‌రాజ్ స్పందించారు.
అధిక సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేయడం వల్లే ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనకు అధిక సమయం పట్టిందన్నారు. ఒక్కో రౌండ్‌లో ఓట్లను లెక్కించిన తర్వాత వాటిని చెక్‌చేయాల్సి ఉంటుందని, అభ్యర్థుల ఏజెంట్ల నుంచి అంగీకారం తర్వాత కౌంటింగ్ అబ్జర్వర్ నుంచి ఆమోదంతో రిటర్నింగ్ అధికారి ఫలితాలను ప్రకటిస్తారని తెలిపారు.
చదవండి: మునుగోడులో కాంగ్రెస్ ఘోర పరాభవం.. రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే..
Comments
Please login to add a commentAdd a comment