సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఎన్నికల లెక్కింపు ఫలితాల వెల్లడిలో గందరగోళ పరిస్థితి నెలకొంది. కౌంటింగ్ ఆలస్యంపై టీఆర్‌ఎస్, బీజేపీ విమర్శలకు దిగుతున్నాయి. కౌంటింగ్‌లో ఇంత గోప్యత ఎందుకు అని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు లక్ష్మణ్ ప్రశ్నించారు. సీఈవో వైఖరి ఏకపక్షంగా ఉందన్నారు. ఒకేసారి 4 రౌండ్లు ఎందుకు అప్‌డేట్ చేశారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో ఈసీవో పనిచేస్తున్నారని విమర్శలు గుప్పించారు.
చదవండి: ఎన్నికల ప్రధానాధికారి తీరుపై బీజేపీ సీరియస్
బీజేపీకి లీడ్ వచ్చే రౌండ్లలోనే ఫలితాలను అప్ డేట్ చేయడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల మొదటి రోజు నుండి కౌంటింగ్ దాకా సీఈవో పనితీరు అనుమానాస్పదమేనన్నారు. పోలింగ్ రోజు టీఆర్ఎస్ స్థానికేతర నాయకులు మునుగోడులో మకాం వేస్తే.. ఎవరూ లేరని సీఈవో చెప్పడం హాస్యాస్పదం అన్నారు. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఫిర్యాదు చేసిన తర్వాత కూడా చర్యలు ఎందుకు తీసుకోలేదని లక్ష్మణ్ మండిపడ్డారు.
ఐదో రౌండ్ ఆలస్యానికి కారణమేంటి?: రఘునందన్‌రావు
ఫలితాల వెల్లడిలో ఆలస్యం అనుమానాలకు తావిస్తోందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. ఎన్నికల అధికారి నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. ఐదో రౌండ్ ఆలస్యానికి కారణమేంటి? అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment