సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కొన్ని చోట్ల స్పల్ప ఘటనలు మినహా తెలంగాణ వ్యాప్యంగా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సాధారణ ప్రజలతోపాటు రాజకీయ నాయకులు, సినీతారలు పోలింగ్ కేంద్రాల వద్దకు తరలివస్తున్నారు. ఓటేసేందుకు ఉదయం నుంచే ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు
ఇక గురువారం మధ్యాహ్నం ఒంటి గంట వరకూ రాష్ట్రవ్యాప్తంగా 36.68 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా మెదక్ జిల్లాలో 50.80 శాతం నమోదు అయ్యింది. మహబూబ్‌నగర్‌లో 45 శాతం, కరీంనగర్ 40.73, ఆదిలాబాద్ 41.88, గద్వాల్ 49.29, ఖమ్మం 42 శాతం, మంచిర్యాల 42.74 శాతం, మహబూబాబాద్ 48 శాతం, కామారెడ్డి 41 శాతం పోలింగ్ నమోదైంది. ఇక హైదరాబాద్‌లో అత్యల్పంగా కేవలం 20.79 శాతం పోలింగ్ నమోదవడం ఓటింగ్‌పై నగర ఓటర్ నిరాసక్తతను వెల్లడిస్తోంది.
ఓటింగ్‌పై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో)వికాస్‌రాజ్ మాట్లాడుతూ.. ఓటర్ల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తిన కొన్ని చోట్ల ఈవీఎంలు మార్చినట్లు చెప్పారు. అర్బన్ ఏరియాల్లో పోలింగ్ నెమ్మదిగా కొనసాగుతోందని తెలిపారు. నగర ఓటరు ఇండ్లను వీడి పోలింగ్ కేంద్రాలకు తరలిరావాలని సూచించారు. మధ్యాహ్నం నుంచి వేగం పెరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. కొన్నిచోట్ల నేతలు చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు వచ్చాయని వాటిపై విచారణ చేపట్టి కేసులు నమోదు చేస్తామన్నారు.
చదవండి: తెలంగాణ ఎన్నికల పోలింగ్.. లైవ్ అప్‌డేట్స్
Comments
Please login to add a commentAdd a comment